ఈవీఎంలో ఒక ఆప్షన్ ఉంటుంది. అదే నోటా... పైన తెలిపిన ఎవ్వరికీ నేను ఓటు వేయడం లేదు (నన్–ఆఫ్–ది ఎబవ్) అని తేల్చి చెప్పడమే ఈ నోటా అర్థం. 2014లో నోటా ఓట్ శాతం ఎంత ఉందో... 2019లోనూ ఆ శాతం దాదాపు అదే విధంగా ఉండడం ఇక్కడ గమనార్హం. ఎన్నికల సంఘం వెబ్‌సైట్ అందించిన గణాంకాల ప్రకారం... సంబంధిత అంశాన్ని క్లుప్తంగా చూస్తే...
► 2019లో పోలైన మొత్తం ఓట్లలో నోటా శాతం 1.04% . 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఈ శాతం 1.08% . లోక్‌సభ ఎన్నికల చరిత్రలోనే 2019లో అత్యధిక ఓట్లశాతం నమోదయిన సంగతి తెలిసిందే.
► ఈ నోటారాష్ట్రాల వారీగా చూస్తే, నోటా శాతాల్లో తీవ్ర వ్యత్యాసం ఉండడం మరో విశేషం. అస్సాం, బిహార్‌లలో అత్యధికంగా 2.08% నోటా ఓటు నమోదయ్యింది. సిక్కింలో ఈ శాతం 0.65 శాతంగా ఉంది.
► ఈ నోటాపీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాకు సంబంధించి ఒక కేసులో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 2013లో ఇచ్చిన ఒక తీర్పు నేపథ్యంలో దేశంలో నోటా విధానం ఆరంభమైంది.
► ఈ నోటాఛత్తీస్‌గఢ్, మిజోరం, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ 2013 అసెంబ్లీ ఎన్నికల్లో నోటా వినియోగం ప్రారంభమైంది. అప్పట్లో ఆయా రాష్ట్రాల్లో నోటా ఓటు 1.85 శాతంగా ఉంది.
ఆ నోటా ఈ నోటా
Published Fri, May 24 2019 5:48 AM | Last Updated on Thu, Jul 11 2019 8:26 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment