నేడే నాలుగోదశ పోలింగ్‌ | Fourth Phase Of Uttar Pradesh Polls | Sakshi
Sakshi News home page

నేడే నాలుగోదశ పోలింగ్‌

Published Thu, Feb 23 2017 3:08 AM | Last Updated on Tue, Aug 14 2018 5:02 PM

నేడే నాలుగోదశ పోలింగ్‌ - Sakshi

నేడే నాలుగోదశ పోలింగ్‌

లక్నో: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నేడు (గురువారం) నాలుగో దశ పోలింగ్‌ జరగనుంది. 12 జిల్లాల్లో ఉన్న 53 నియోజక వర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. వెనుకబడిన బుందేల్‌ఖండ్‌ ప్రాంతంతో పాటు, నెహ్రూ కుటుంబం కంచుకోట రాయ్‌బరేలీ సైతం ఈ జాబితాలో ఉన్నాయి. ప్రతాప్‌గఢ్, కౌశంబి, అలహాబాద్, జలౌన్, ఝాన్సీ, లలిత్‌పూర్, మహోబా, బందా, హమిర్‌పూర్, చిత్రకూట్, ఫతేపూర్‌. రాయ్‌బరేలీ జిల్లాల్లో నాలుగో దశలో పోలింగ్‌ జరగనుంది.

ఈ ఎన్నికల్లో 680 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఉత్తర అలహాబాద్‌ స్థానంలో అత్యధికంగా 26 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ 53 అసెంబ్లీ నియోజకవర్గాలకు 2012లో జరిగిన ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ 24 స్థానాలు గెలుచుకోగా, బీజేపీ–5, బహుజన్‌ సమాజ్‌ పార్టీ–15, కాంగ్రెస్‌–6, ఇతరులు 3 స్థానాల్లో గెలుపొందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement