రాంచీ: జార్ఖండ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుతీరనుంది. ఈ నెల 27న ముఖ్యమంత్రిగా జేఎంఎం చీఫ్ హేమంత్ సొరేన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం- కాంగ్రెస్- ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి 47 స్థానాలు కైవసం చేసుకుని అధికారం దక్కించుకుంది. ఈ నేపథ్యంలో కూటమి నాయకుడు హేమంత్ సీఎం పదవి చేపట్టనున్నారు. హేమంత్ ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్ అగ్రనేతలు హాజరయ్యే అవకాశం ఉంది. సంకీర్ణ ప్రభుత్వంలో కాంగ్రెస్‌కు స్పీకర్ పదవితోపాటు నాలుగు నుంచి ఐదు మంత్రి పదవులు దక్కనున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ జార్ఖండ్ ఇన్‌ఛార్జ్ ఆర్పీఎన్ సింగ్ కొత్తగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలతో రాంచీలో సమావేశమై చర్చలు జరిపారు.
Comments
Please login to add a commentAdd a comment