
రాంచీ: జార్ఖండ్‌లో జరుగుతున్న తొలివిడత అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. పోలింగ్ 62.87 శాతం నమోదయింది. తొలివిడతలో ఈ రోజు జరిగిన 13 అసెంబ్లీ స్థానాలకు ఈసీ పోలింగ్ నిర్వహించింది. జార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు గాను ఇవాళ 13 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఎన్నికలకు నవంబర్ 1న నోటిఫికేషన్ జారీ చేయగా.. ఐదు విడతల్లో పోలింగ్ జరుగనుంది. ఐదు విడుతలుగా జరుగనున్న ఈ ఎన్నికలకు వేర్వేరు తేదీల్లో నోటిఫికేషన్, నామినేషన్ల స్వీకరణ, నామినేషన్ విత్‌డ్రా, పోలింగ్ తేదీలు ఉన్నాయి. కాగా.. తుది ఫలితాలు డిసెంబర్ 23న విడుదలవుతాయి.
(చదవండి : జార్ఖండ్: తుపాకీతో కాంగ్రెస్ అభ్యర్థి హల్‌చల్..!)