సాక్షి, హైదరాబాద్ : జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు బీజేపీ విధానాలకు చెంపపెట్టు అని ఏఐసీసీ కార్యర్శి సంపత్ విమర్శించారు. జార్ఖండ్ ఫలితాల సందర్భంగా గాంధీ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిందని దుయ్యబట్టారు. ఇప్పటికే బీజేపీ అయిదు రాష్ట్రాల్లో ఓడిపోయిందని, దేశంలో బీజేపీ లేకుండా పోయే రోజులు రాబోతున్నాయి అభిప్రాయపడ్డారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయమని ఆశాభావం వ్యక్తం చేశారు. వార్డుల విభజన అధికార పార్టీకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారని, వార్డుల విభజన శాస్త్రీయంగా జరగలేదని విమర్శించారు. అన్నివర్గాల ప్రజలు అధికారపార్టీకి దూరం అయ్యారన్నారు. అభ్యర్థుల ఎంపిక స్థానిక నాయకత్వానిదేనని, అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయం ఉంటుందని స్పష్టం చేశారు. (జార్ఖండ్ ఫలితాలపై స్పందించిన చిదంబరం)
సంబంధిత వార్తలు :
సాదాసీదా సొరెన్.. భార్యతో కాబోయే సీఎం!
Comments
Please login to add a commentAdd a comment