కోల్‌కత్తా: ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం మాత్రం కొనసాగుతూనే ఉంది. తాజాగా మమతపై జార్ఖండ్ సీఎం రఘువర దాస్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బెంగాల్‌ను పాకిస్తాన్‌లో విలీనం చేయాలని ఆమె ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అందుకే జై శ్రీరాం అనే వారందరిని అరెస్ట్ చేసి రాష్ట్రంలో నిర్బంధం విధిస్తున్నారని విమర్శించారు. జైశ్రీ రాం అంటే తప్పేంటని.. మనం భారతదేశంలో కాదా నివసించేదని దాస్ ప్రశ్నించారు. ఆమె వింత ప్రవర్తనతో ప్రజలు విసిగిపోయారని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బెంగాల్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్నారు.
మోదీ నాయకత్వాన్ని ఆ రాష్ట్ర ప్రజలంతా విశ్వసిస్తున్నారని.. లోక్‌సభ ఎన్నికల ఫలితాలే దానికి నిదర్శనమన్నారు. జై శ్రీరాం నినాదాలు చేసిన బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసినందుకు జై శ్రీరాం నినాదాలతో కూడిన పది లక్షల పోస్టు కార్డులను పంపాలని బీజేపీ నిర్ణయించిన విషయం తెలిసిందే. మరోవైపు మమతా బెనర్జీ కాన్వాయ్ ఎదుట బీజేపీ కార్యకర్తలు జై శ్రీరాం నినాదాలతో హోరెత్తించడం పట్ల దీదీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment