కోల్‌కత్తా: దేశంలో ఎన్నికల పోరు తుది దశకు చేరుకుంది. దేశవ్యాప్తంగా రేపు(మంగళవారం) ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇక, ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్‌పోల్స్ రిలీజ్ అయ్యాయి. కాగా, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన కామెంట్స్ చేశారు. ఈ ఎగ్జిట్‌పోల్స్‌ను రెండు నెలల క్రితమే ‘ఇంట్లో తయారు చేశారు’ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.
కాగా, ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలపై మమతా బెనర్జీ ఆదివారం స్పందించారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ.. ఎన్నికల ఎగ్జిట్‌పోల్స్ వాస్తవ పరిస్థితికి అనుగుణంగా లేవు. వీటిని రెండు నెలల క్రితమే ఇంట్లో కూర్చుని తయారు చేసినట్టు అనిపిస్తోంది. బెంగాల్‌లో 2016, 2019, 2021లో ఎగ్జిట్ పోల్స్ ఎలా చేశారో అందరూ చూశారు. వారి అంచనాలేవీ నిజం కాలేదు. ఎన్నికల ప్రచార ర్యాలీల్లో ప్రజా స్పందన ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను ధ్రువీకరించడం లేదు అంటూ కామెంట్స్ చేశారు.
అలాగే, ఇండియా కూటమికి సంబంధించి కూడా మమత కీలక వ్యాఖ్యలు చేశారు. అఖిలేశ్ యాదవ్, తేజస్వీ యాదవ్, స్టాలిన్‌తో పాటు అన్నిచోట్లా ప్రాంతీయ పార్టీలు మెరుగైన పనితీరు కనబరుస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు. దీంతో, ఆమె వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
"Exit polls were 'manufactured at home' two months ago", claims Mamata Banerjee
"The way BJP tried to polarise and spread false information that Muslims were taking away quotas of SC, ST and OBCs, I don't think Muslims will vote for BJP
And, I think the CPI(M) and Congress… pic.twitter.com/JiL76naHAI— Ashish Kumar (@BaapofOption) June 2, 2024
ఇదిలా ఉండగా.. ఎన్నికలకు సంబంధించి దాదాపు ఎగ్జిట్‌పోల్స్ అన్నీ ఎన్డీయే కూటమికి అనుకూలంగా వచ్చిన విషయం తెలిసిందే. మోదీనే మరోసారి ప్రధాని అవుతారని ఫలితాలను వెల్లడించాయి. ఇండియా కూటమికి భారీ ఓటమి తప్పదని తేల్చేశాయి. అయితే, అటు కూటమి నేతలు కూడా ఎగ్జిట్‌పోల్స్ ఫేక్ అంటూ కొట్టిపారేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment