కోల్‌కతా: ఇండియా కూటమిపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. టీఎంసీతో పొత్తు కావాలంటే సీపీఎంతో తెగదెంపులు చేసుకోవాలని అన్నారు. సీట్ల పంపకాల్లో రెండు సీట్ల ప్రతిపాదనను కాంగ్రెస్ తీరస్కరించింది.. కానీ ఇప్పుడు ఒక్క సీటు కూడా ఇవ్వనని తెగేసి చెప్పారు.
'గతంలోనూ పలు సందర్భాల్లో సీపీఎం నాపై భౌతిక దాడి చేసింది. నన్ను నిర్దాక్షిణ్యంగా కొట్టారు. నా శ్రేయోభిలాషుల ఆశీస్సుల వల్లే బతికి ఉన్నాను. వామపక్షాలను ఎప్పటికీ క్షమించలేను. సీపీఎంను క్షమించలేను. కాబట్టి ఈరోజు సీపీఎంతో ఉన్నవాళ్లు బీజేపీతో కూడా ఉండొచ్చు. నేను వారిని క్షమించను.' అని మమతా బెనర్జీ మాల్డాలో ఏర్పాటు చేసిన సభలో అన్నారు.
'అసెంబ్లీలో కాంగ్రెస్‌కు ఒక్క ఎమ్మెల్యే కూడా లేరని కాంగ్రెస్‌కు చెప్పాను. రెండు పార్లమెంట్ స్థానాలు ఇస్తాం. మీ అభ్యర్థులను మేమే గెలిపించుకుంటాం అని చెప్పాం. కానీ వారికి ఎక్కువ సీట్లు కావాలి. నేను కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా ఇవ్వను. మీరు వామపక్షాలను విడిచిపెట్టే వరకు మా వద్దకు రాకండి" అని మమతా బెనర్జీ అన్నారు.
తృణమూల్‌తో పొత్తు ఉండబోదని సీపీఎం గతంలోనే తేల్చి చెప్పింది. బెంగాల్‌లో బీజేపీ, టీఎంసీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్, సీపీఎం ఉంటాయని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి అన్నారు. అటు.. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌధరి కూడా మమతా బెనర్జీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. టీఎంసీతో పొత్తు ఉండబోదని చెప్పారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్, టీఎంసీ మధ్య పొత్తు కుదిరే పరిస్థితులు లేకుండా పోయాయి.
ఇదీ చదవండి: భారత్ జోడో న్యాయ్ యాత్రలో రాహుల్ గాంధీ కారు అద్దాలు ధ్వంసం
Comments
Please login to add a commentAdd a comment