కోల్‌కత్తా: కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఎక్కువ కాలం పాలన కొనసాగించలేదు.. త్వరలోనే పడిపోతుందని జోస్యం చెప్పారు సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, ఎంపీ అఖిలేష్ యాదవ్. మతం పేరిట రాజకీయాలు ఎన్నో రోజులు నిలబడవు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కాగా, అఖిలేష్ యాదవ్ ప్రస్తుతం బెంగాల్‌లో ఉన్నాఉ. ఈ సందర్బంగా అఖిలేష్ ఆదివారం బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నేతృత్వం జరిగిన ‘ధర్మతల ర్యాలీ’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ..‘మతం పేరిట దేశాన్ని విభజించేందుకు కుట్రలు పన్నుతున్న శక్తులు తాత్కిలికంగా విజయం సాధించవచ్చు. కానీ, అంతిమంగా ఓడిపోతాయి. పశ్చిమ బెంగాల్ ప్రజలు బీజేపీని ఓడించారు. అధికారంలోకి వచ్చిన వారు చుట్టం చూపుగానే ఉంటారు.
ఇదే సమయంలో బెంగాల్ ప్రజలు బీజేపీతో పోరాడారని, ఉత్తర్ ప్రదేశ్‌లో కూడా ఇదే జరిగిందని చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వంలో కూర్చున్న వ్యక్తులు కొద్ది రోజులు మాత్రమే అధికారంలో ఉంటారని, వారిది నడిచే సర్కార్ కాదని, పడిపోయే సర్కార్’ అని ఆసక్తికర కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
ఇదిలా ఉండగా.. కేంద్రంపై అఖిలేష్ చేసిన వ్యాఖ్యలకు మమతా మద్దతు ఇచ్చారు. కేంద్రంలోని ప్రభుత్వం బెదిరింపుల ద్వారా ఏర్పడిందని, అది ఎక్కువ కాలం నిలవదని అన్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ కనబరిచిన ఫలితాలను సీఎం మమతా బెనర్జీ ప్రశంసించారు. యూపీ ప్రభుత్వం కేంద్ర ఏజెన్సీలను, ఇతర మార్గాలను దుర్వినియోగం చేస్తూ అధికారంలో కొనసాగుతోందని మండిపడ్డారు. ర్యాలీకి హాజరైన అఖిలేష్ యాదవ్‌కు మమతా బెనర్జీ కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment