జార్ఖండ్ సీఎం రఘుబర్ దాస్ (పాత ఫొటో)
రాంచి : నగరంలో జరిగిన సామూహిక వివాహ వేడుకకు హాజరైన ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్ గిరిజనులతో కలిసి డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకున్నారు. కేంద్రీయ సరానా సమితి(కేఎస్‌ఎస్) ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో 351 జంటలు వివాహ బంధంతో ఒక్కటయ్యాయి. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన రఘుబర్ దాస్ గిరిజనుల స్థితి గతుల గురించి మాట్లాడారు. సమాజంలో మార్పు రావాలంటే ముందు మనుషుల ఆలోచనా ధోరణిలో మార్పు రావాల్సిన ఆవశ్యకత ఉందని వ్యాఖ్యానించారు. గత 70 ఏళ్లుగా గిరిజనులను కేవలం ఓటు బ్యాంకుగానే పరిగణించడం దురదృష్టకరమన్నారు. గిరిజనుల పరిస్థితుల్లో మార్పు తీసుకువచ్చేందుకు, సమాజంలో వారికి సముచిత స్థానం కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. గిరిజన వర్గం నుంచి అత్యధిక మంది ఇంజనీర్లు, పోలీసు ఉన్నతాధికారులుగా ఎదిగితే చూడాలని ఉందన్నారు. ఫెలోషిప్ యోజన ద్వారా గిరిజన బాలలకు ఉన్నత విద్యావకాశాలు పెంపొందిస్తున్నామని.. అందుకోసం 10 కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment