mass marriage
-
మా అమ్మకు పెళ్లి... నాక్కూడా..
ఉత్తరప్రదేశ్‌లో గోరఖ్‌పూర్‌లో మొన్నటి ఆదివారం (డిసెంబర్ 13) ‘ముఖ్యమంత్రి సామూహిక్ వివాహ్’ కార్యక్రమం జరిగింది. 63 జంటలు ఈ సందర్భంగా వివాహం చేసుకున్నాయి. అయితే వింత ఏముంది అనుకుంటున్నారా? ఈ జంటల్లో ఒక 27 ఏళ్ల కుమార్తె పెళ్లి చేసుకుంది. అలాగే ఆమె 53 ఏళ్ల తల్లి కూడా పెళ్లి చేసుకుంది. గతంలో ఏదో సినిమాలో తల్లి పెళ్లి కూతురు చేస్తుంది. అయితే ఇక్కడ కూతురు తాను చేసుకుంటూ తల్లికి కూడా చేసింది. అందుకే ఇది వైరల్ వార్త అయ్యింది. గోరఖ్‌పూర్ పీప్రోలికి చెందిన బేలి దేవి భర్త పాతికేళ్ల క్రితమే మరణించాడు. ఆమె ఒక్కతే తన ఇద్దరు కొడుకులను, కుమార్తెలను పెంచి పెద్ద చేసింది. కొడుకుల పెళ్లిళ్లు అయ్యాయి. ఒక కూతురు పెళ్లి కూడా అయ్యింది. చివరి కూతురు ఇందు పెళ్లి సందర్భంగా తల్లి భవిష్యత్తు గురించి చర్చ జరిగింది. ‘పిల్లలందరూ నేను పెళ్లి చేసుకోవడమే మంచిదన్నారు’ అంది బేలి దేవి. భర్త తమ్ముడు జగదీశ్ అన్న కుటుంబాన్ని చూసుకోవడానికి అవివాహితుడిగా మిగిలిపోయాడు. అతడే ఇన్నాళ్లు ఆ కుటుంబానికి అండా దండా. ‘అతణ్ణే పెళ్లి చేసుకోవడం మంచిది’ అని నేనూ, పిల్లలూ భావించాం అంది బేలి దేవి. ఇంకేముంది ఒకే వేదికలో కూతురి పెళ్లి, తల్లి పెళ్లి జరిగిపోయాయి. -
సామూహిక వివాహ వేడుకలో ముఖ్యమంత్రి డ్యాన్స్
-
వివాహ వేడుకలో సీఎం డ్యాన్స్...!!
రాంచి : నగరంలో జరిగిన సామూహిక వివాహ వేడుకకు హాజరైన ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్ గిరిజనులతో కలిసి డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకున్నారు. కేంద్రీయ సరానా సమితి(కేఎస్ఎస్) ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో 351 జంటలు వివాహ బంధంతో ఒక్కటయ్యాయి. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన రఘుబర్ దాస్ గిరిజనుల స్థితి గతుల గురించి మాట్లాడారు. సమాజంలో మార్పు రావాలంటే ముందు మనుషుల ఆలోచనా ధోరణిలో మార్పు రావాల్సిన ఆవశ్యకత ఉందని వ్యాఖ్యానించారు. గత 70 ఏళ్లుగా గిరిజనులను కేవలం ఓటు బ్యాంకుగానే పరిగణించడం దురదృష్టకరమన్నారు. గిరిజనుల పరిస్థితుల్లో మార్పు తీసుకువచ్చేందుకు, సమాజంలో వారికి సముచిత స్థానం కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. గిరిజన వర్గం నుంచి అత్యధిక మంది ఇంజనీర్లు, పోలీసు ఉన్నతాధికారులుగా ఎదిగితే చూడాలని ఉందన్నారు. ఫెలోషిప్ యోజన ద్వారా గిరిజన బాలలకు ఉన్నత విద్యావకాశాలు పెంపొందిస్తున్నామని.. అందుకోసం 10 కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నట్లు తెలిపారు. -
ఆ గ్రామంలో ఒకేసారి వంద పెళ్లిల్లు చేశారు
-
అన్నిదానాల్లో కన్యాదానం మిన్న: గవర్నర్
102 జంటలకు సామూహిక వివాహం నాగర్‌కర్నూల్: అన్నిదానాల్లో కన్నా కన్యాదానం గొప్పదని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూల్‌లో స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఎంజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక వివాహాల కార్యక్రమానికి ఆయన హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ఒక్కటైన వధూవరుల ముందు పెద్దబాధ్యత ఉందని, కష్టపడి పనిచేసి బాధ్యతగా మెలగాలని సూచించారు. భార్యాభర్తలు నిండునూరేళ్లు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం ప్రజలకు అన్నీ చేయాలంటే కష్టమని, ప్రజలు బాధ్యతతో రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఎమ్మెల్యేగా మర్రి జనార్దన్‌రెడ్డి ఎంజేఆర్ ట్రస్ట్ ద్వారా పెద్ద బాధ్యతను తీసుకోవడం అభినందనీయమని,102 జంటలకు వివాహం జరిపించడం గొప్ప కార్యమని కితాబిచ్చారు. అనంతరం అర్హులైన జంటలకు కల్యాణలక్ష్మీ పథకం ద్వారా మంజూరైన రూ.51 వేల చెక్కులను గవర్నర్ అందజేశారు. 102జంటలను గవర్నర్ నరసింహన్ ఆశీర్వదించారు. వేడుకల్లో మంత్రులు ఈటల రాజేందర్, జూపల్లి కృష్ణారావు, డాక్టర్ సి.లక్ష్మారెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సామూహిక వివాహాల్లో మంత్రి కుమార్తె పెళ్లి !
* సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఆంజనేయ నిర్ణయం సాక్షి, బెంగళూరు: సాధారణంగా మంత్రుల బిడ్డల వివాహ కార్యక్రమాలు అత్యంత ఆడంబరంగా, తమ వద్ద ఉన్న సంపదను చాటుకునేలా జరగడం సర్వసాధారణం. అయితే రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి మాత్రం ఇందుకు భిన్నంగా నిర్ణయం తీసుకున్నారు. తన కుమార్తె వివాహాన్ని సామూహిక వివాహాల్లో అత్యంత సాధారణంగా జరిపేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు ఆయన కుమార్తె కూడా అంగీకరించడంతో ఈ వివాహం ఓ వినూత్న ఆలోచనకు వేదికగా మారనుంది. ఇక ఈ నిర్ణయం తీసుకున్న వ్యక్తి మరెవరో కాదు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఆంజనేయ. అవును మంత్రి ఆంజనేయ పెద్ద కుమార్తె అనుపమ, రాష్ట్ర ప్రజాపనుల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శేఖరప్ప పెద్ద కుమారుడు శాశ్వత్ల వివాహం ఈనెల 19న జరగనుంది. చిత్రదుర్గలోని హోళల్కెరె శ్రీకొట్రెనంజప్ప కాలేజు మైదానంలో మొత్తం 96 మంది పేద యువతీ, యువకులు వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. ఇదే వేదికపై మంత్రి కుమార్తె అనుపమ వివాహం కూడా జరగనుంది. తన కుమార్తె వివాహానికి కేటాయించిన మొత్తంలోనే ఈ జంటలకు వివాహ వస్త్రాలు, తాళితో పాటు వారి జీవన ఉపాధికి అవసరమైన ఒక గేదె, ఒక కొబ్బరి మొక్కను సైతం మంత్రి ఆంజనేయ అందజేయనున్నారు. వివాహ కార్యక్రమాల కోసం అధిక మొత్తంలో ధనాన్ని వెచ్చించరాదనే ఆలోచనతోనే ఈ విధంగా తన కుమార్తె వివాహాన్ని జరిపేందుకు నిర్ణయించానని, ఇందుకు తన కుమార్తె అనుపమతో పాటు ఆమెకు కాబోయే భర్త శాశ్వత్ కూడా అంగీకారం తెలపడం తనకెంతో సంతోషాన్నిచ్చిందని మంత్రి ఆంజనేయ తెలిపారు.