saryu rai
-
బీజేపీ సర్కార్‌కు సొంతమంత్రి ఝలక్
రాయ్‌పూర్: 'ఏదో ఒక రోజు సీబీఐ వస్తుంది. విచారిస్తుంది. అక్రమాలు బయటపడితే జైలులో వేస్తారు. ఇది నాకిష్టం లేదు.. మీ ఇష్టం.. నేను వెళ్లిపోతా' అంటూ జార్ఖండ్ కేబినెట్ మీటింగ్‌కు సొంత పార్టీ మంత్రి ఝలక్ ఇచ్చారు. అందర్నీ విస్తుపోయేలా చేశారు. బీజేపీకి సొంత పార్టీలోని సీనియర్ నేత అయిన సరయురాయ్తో తలనొప్పులు మొదలయ్యాయి. ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని ఆయన ప్రత్యక్షంగా వ్యతిరేకించారు. ఆ నిర్ణయానికి మద్దతిస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందని, అది తనకు ఇష్టం లేదని చెప్పారు. సరయు రాయ్ పార్లమెంటరీ వ్యవహారాలు, ఆహార, పౌరసరఫరాల విభాగానికి ఇన్చార్జి మంత్రిగా పనిచేస్తున్నారు. అయితే, రాష్ట్రంలోని కంపెనీలకు మైనింగ్ హక్కులు పునరుద్ధరించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ సమావేశం కాగా ఆయన హాజరై మధ్యలో వెళ్లిపోయారు. కంపెనీలకు మైనింగ్ హక్కులు దారాదత్తం చేస్తే అవి అక్రమాలకు పాల్పడుతున్నాయని విచారణలో తేలిందని, ఈ విషయం కోర్టులో కూడా ఉండటంతోపాటు నిలుపుదల చేసినందున తాను ఈ నిర్ణయానికి మద్దతివ్వలేనని, అలా చేస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందని ఆయన కుండబద్ధలు కొట్టి వెళ్లిపోయారు. గతంలోనే ఈ అంశాన్ని ఆలోచించినప్పటికీ ఈ నిర్ణయాన్ని సవరించాలని, అలాగే మైనింగ్ శాఖ కచ్చితంగా న్యాయశాఖను కలిసి వివరాలు తెలుసుకోవాలని సరయు రాయ్ ప్రతిపాదించారు. ఇలా చేయకుంటే ఈ మొత్తం వ్యవహారంపై ఏదో ఒకరోజు సీబీఐ విచారణ చేస్తుందని, నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలిసి జైలుకు పంపిస్తుందని హెచ్చరించి మరీ వెళ్లారు. ఈ మంత్రికి గతంలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడే వ్యక్తిగా, బిహార్‌లో చోటు చేసుకున్న దాణా కుంభకోణాన్ని బయటపెట్టిన వ్యక్తిగా మంచి పేరుంది. అధికారంలోని మంత్రి ఇలా కేబినెట్ మీటింగ్ మధ్యలో వెళ్లిపోవడం ప్రతి పక్షాలకు మంచి ఊతం ఇచ్చినట్లు అవుతుందని అధికార బీజేపీ ఆవేదన చెందుతోంది. -
జార్ఖండ్ ముఖ్యమంత్రిగా రఘువర్ దాస్!
-
జార్ఖండ్ ముఖ్యమంత్రిగా రఘువర్ దాస్!
రాంచీ : జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా రుఘువర్ దాస్ పేరు దాదాపు ఖరారు అయ్యింది. బీజేపీ శాసనసభా పక్షం శుక్రవారం సమావేశం అయ్యింది. ఈ సమావేశంలో బీజేఎల్పీ నేతగా రఘువర్ దాస్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాగా జార్ఖండ్ ఏర్పడిన తొలిసారి గిరిజనేతర ముఖ్యమంత్రిగా రఘువర్ దాస్ సీఎం పీఠం ఎక్కబోతున్నారు. బీజేపీ మరికాసేపట్లో అధికారికంగా ప్రకటన చేయనుంది. మరోవైపు ఇప్పటివరకు సీఎం రేసులో ముందున్న మాజీ సీఎం అర్జున్‌ముండా ఎన్నికల్లో ఓటమి పాలైన విషయం తెలిసిందే. దీంతో పార్టీ ఉపాధ్యక్షుడు రఘువర్ దాస్ (జంషెడ్పూర్ ఈస్ట్ ఎమ్మెల్యే)కు ముఖ్యమంత్రి కుర్చీ దక్కింది. -
జార్ఖండ్ కు తొలి గిరిజనేతర సీఎం?
రాంచీ: జార్ఖండ్ లో తొలిసారిగా గిరిజనేతర నాయకుడు ముఖ్యమంత్రి పీఠం అధిష్టించే అవకాశాలు కన్పిస్తున్నాయి. గిరిజనేతర నాయకుడితో సహా పలువురు పేర్లను బీజేపీ అధిష్టానం పరిశీలిస్తోంది. ఇప్పటివరకు సీఎం రేసులో ముందున్న మాజీ సీఎం అర్జున్‌ముండా ఎన్నికల్లో ఓటమి పాలవడంతో వెనుకబడ్డారు. దీంతో పార్టీ ఉపాధ్యక్షుడు రఘువర్‌దాస్(జంషెడ్పూర్ ఈస్ట్ ఎమ్మెల్యే), పార్టీ సిద్ధాంతకర్త సరయూరాయ్(జంషెడ్పూర్ వెస్ట్ ఎమ్మెల్యే), మాజీ స్పీకర్ సీపీ సింగ్(రాంచీ ఎమ్మెల్యే) పేర్లు తెరపైకి వచ్చాయి. సీఎం రేసులో ఉన్నవారెవరూ పెదవి విప్పడం లేదు. ఎమ్మెల్యేనే సీఎం అవుతారని, ఎంపీ లేదా ఓడిపోయిన అభ్యర్థి ముఖ్యమంత్రి కాబోరని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. దీంతో అర్జున్ ముండాకు అవకాశం లేనట్టేనని అర్థమవుతోంది. అమిత్‌షాకు సన్నిహితుడు, ఆర్ఎస్ఎస్ మద్దతు ఉన్న రఘువర్‌దాస్ కే సీఎం పీఠం దక్కే ఛాన్స్ ఉంది.