
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ గిరిజనశాఖ మంత్రి రాజన్నదొర కేంద్ర గిరిజనశాఖ మంత్రి అర్జున్ ముండాను కలిశారు. గిరిజన సంక్షేమ పథకాలు, ఏపీ రాష్ట్రానికి నిధుల కేటాయింపుపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గిరిజనులు, వెనుకబడిన వారిపట్ల నిబద్ధతో విద్య, ఆరోగ్యం, వ్యవసాయం మొదలైన వాటిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని కేంద్రమంత్రి ప్రశంసించారు.
గిరిజన ప్రాంతంలో రోడ్ల ఏర్పాటుకు నిధులు కేటాయించాలని, గిరిజన గ్రామాలకు తాగునీరు అందించాలని విజ్ఞప్తి చేశారు. కేరళ రాష్ట్రంలో రబ్బర్ ప్లాంటేషన్ కోసం అనుమతించిన విధంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కాఫీ ప్లాంటేషన్లకు పనులను విస్తరించాలని కోరారు.
చదవండి: (కాల్వకు 'జేసీబీ'తో బ్రేక్.. ఈసారి టికెట్ ఆయనకేనా?)
Comments
Please login to add a commentAdd a comment