Rajanna Dora Peedika
-
కేంద్ర గిరిజన మంత్రి అర్జున్ ముండాను కలిసిన రాజన్నదొర
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ గిరిజనశాఖ మంత్రి రాజన్నదొర కేంద్ర గిరిజనశాఖ మంత్రి అర్జున్ ముండాను కలిశారు. గిరిజన సంక్షేమ పథకాలు, ఏపీ రాష్ట్రానికి నిధుల కేటాయింపుపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గిరిజనులు, వెనుకబడిన వారిపట్ల నిబద్ధతో విద్య, ఆరోగ్యం, వ్యవసాయం మొదలైన వాటిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని కేంద్రమంత్రి ప్రశంసించారు. గిరిజన ప్రాంతంలో రోడ్ల ఏర్పాటుకు నిధులు కేటాయించాలని, గిరిజన గ్రామాలకు తాగునీరు అందించాలని విజ్ఞప్తి చేశారు. కేరళ రాష్ట్రంలో రబ్బర్ ప్లాంటేషన్ కోసం అనుమతించిన విధంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కాఫీ ప్లాంటేషన్లకు పనులను విస్తరించాలని కోరారు. చదవండి: (కాల్వకు 'జేసీబీ'తో బ్రేక్.. ఈసారి టికెట్ ఆయనకేనా?) -
గిరిజనుల అభ్యున్నతికి సీఎం కృషి
బీచ్ రోడ్డు (విశాఖ తూర్పు): గిరిజనుల అభ్యున్నతికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారని ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రాజన్న దొర చెప్పారు. గతంలో ఏ ముఖ్యమంత్రీ గిరిజనుల అభ్యున్నతిని పట్టించుకోలేదని, సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి వారి తలరాతలు మారాయని తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా విశాఖలో నేషనల్ ట్రైబల్ డ్యాన్స్ ఫెస్టివల్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాలను శుక్రవారం రాత్రి ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గిరిజనుల అభ్యున్నతికి పోరాడిన మహనీయుల చరిత్రతో కూడిన మ్యూజియాన్ని రూ.35 కోట్లతో లంబసింగిలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. పర్యాటకులకు సంస్కృతి, సంప్రదాయాలు తెలిపేలా కార్యక్రమాలు రూపకల్పన చేస్తున్నామన్నారు. దేశం నలు మూలల నుంచి 14 రాష్ట్రాల గిరిజనులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నట్లు చెప్పారు. గిరిజన ప్రాంతాలు వేరైనా అందరం ఒకటేనన్నారు. మూడు రోజులు పాటు సాగే ఈ ఫెస్టివల్లో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన గిరిజనులు వారి రాష్ట్రాల సంస్కృతీ, సంప్రదాయాలు తెలిపేలా నృత్యాలు ప్రదర్శించారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, కళావతి, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర, జీసీసీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి పాల్గొన్నారు. -
Rajanna Dora: ధ్యాసంతా గిరిజనంపైనే..
సాక్షి, విజయనగరం: గిరిజన బిడ్డగా, గిరిజన సహకార సంస్థ మాజీ అధికారిగా, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గం సాలూరు నుంచి వరుసగా నాలుగు సార్లు గెలిచిన సీనియర్ నాయకుడిగా పీడిక రాజన్నదొరకు గుర్తింపు. ఇప్పుడు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా, రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా బుధవారం ఆయన విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి ప్రతినిధి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. చదవండి: ఆరోగ్యయజ్ఞంలో దివ్యౌషధమవుతా: మంత్రి విడదల రజిని సాక్షి: గిరిజన సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖతో పాటు ఉపముఖ్యమంత్రి బాధ్యతలు కూడా మీకు రావడంపై మీ అభిప్రాయం? రాజన్నదొర: సాలూరు నియోజకవర్గం నుంచి నాలుగు దఫాలుగా ఎమ్మెల్యే అయ్యాను. మహిళల కు ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వం మాది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలిసారి తన మంత్రివర్గంలో మహిళలకు ప్రాధాన్యం ఇచ్చారు. అలా గిరిజన, ఎస్సీ, బీసీ మహిళలకు ఉన్నత స్థానం కల్పించారు. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గాన్ని మార్పు చేస్తానని సీఎం అప్పుడే చెప్పారు. రెండో దఫాలో నాకు అవకాశం ఇస్తానని నాడే హామీ ఇచ్చారు. అలా ఇప్పుడు నాకు మంత్రి పదవి ఇచ్చారు. ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. గిరిజనుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాకు పదవి రావడానికి పార్టీ పెద్దలు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుతో పాటు విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, శ్రేయోభిలాషులు, ప్రజల ఆశీస్సులు కారణం. వారికి సర్వదా కృతజ్ఞుడిని. సాక్షి: గిరిజన బిడ్డగా, వారి కష్టసుఖాలు తెలిసిన మీరు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా వారి సంక్షేమం కోసం ఎలా పనిచేస్తారు? రాజన్నదొర: రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో 31 తెగల గిరిజనులు ఉన్నారు. వారి సంక్షేమానికి ముఖ్యమంత్రి పెద్దపీట వేస్తున్నారు. ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తున్నారు. ఐటీడీఏ ప్రాజెక్టు డైరెక్టర్లు కూడా కాలానుగుణ పరిస్థితులను బట్టి ప్రణాళికలను రచించారు. గతంలో అటవీ ఉత్పత్తులే గిరిజనులకు ఆధారం కాబట్టి వాటికి మార్కెటింగ్, గిట్టుబాటు ధరలు కల్పించడానికి ప్రణాళికలు అమలు చేసేవారు. ఇప్పుడు వ్యవసాయం, ఉద్యాన పంటలపై కూడా ఆధారపడుతున్నారు. విద్య ప్రాధాన్యం తెలుసుకున్నారు. ఇప్పుడీ పరిస్థితులకు తగినట్లుగా, ప్రాంతాలకు అనుగుణంగా గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, గిరిజన ఎమ్మెల్యేలమంతా చర్చించి ప్రణాళికలను సిద్ధం చేస్తాం. అందుబాటులోనున్న నిధులను సది్వనియోగం చేసుకుంటూ గిరిజనులకు తక్షణమే లబ్ధి కలిగేలా చూస్తాను. సాక్షి: ఉమ్మడి విజయనగరం జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా మీరు గుర్తించిన సమస్యలను ఏవిధంగా పరిష్కరిస్తారు? రాజన్నదొర: గిరిజనులకు విద్య, వైద్య సౌకర్యాలు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలోనే మెరుగుపడ్డాయి. వారికి నాణ్యమైన విద్యను అందేలా నా వంతు ప్రయత్నం చేస్తాను. నాడు–నేడు కార్యక్రమంలో పాఠశాలల రూపురేఖలు మారాయి. కొన్నిచోట్ల హాస్టళ్లకు సొంత భవనాలు లేవు. అవన్నీ సమకూర్చుతాం. వైద్యం విషయానికొస్తే పార్వతీపురంలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి మంజూరైంది. నిర్మాణ పనులు వేగవంతం చేస్తాం. సీహెచ్‌సీల్లో వైద్య సౌకర్యాలు, మౌలిక వసతులు మెరుగుచేసే పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. గిరిశిఖర గ్రామాలకు రోడ్ల నిర్మాణంపై దృష్టి పెడతాను. ఒడిశాలో రహదారుల నిర్మాణానికి అటవీ శాఖ అధికారులు ఎలాంటి అభ్యంతరాలు చెప్పట్లేదు. ఇక్కడ మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారు. వాటన్నింటిపైనా ఆయా అధికారులతో చర్చించి రోడ్ల నిర్మాణ పనులు వేగవంతం చేస్తాం. సాక్షి: మంత్రి పదవితో మీ సేవలకు గుర్తింపు వచ్చిందని భావిస్తున్నారా? రాజన్నదొర: మహానాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంతో నాకు తొలి నుంచి సాన్నిహిత్యం ఉంది. దానితో పాటు నా కష్టం, పనితీరు, నిబద్ధత చూసే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాకు మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ఈ అవకాశాన్ని సది్వనియోగం చేసుకొని ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి, పారీ్టకి మంచిపేరు వచ్చేలా పనిచేస్తాను. సాక్షి: ఆంధ్రప్రదేశ్–ఒడిశా రాష్ట్రాల మధ్య దీర్ఘకాలంగానున్న కొటియా సమస్యపై ఏవిధంగా దృష్టి పెడతారు? రాజన్నదొర: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గత నవంబర్ 9న ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పటా్నయక్తో చర్చలు జరిపారు. అప్పటికే ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసింది. కొటియా ప్రజలు మాత్రం ఆంధ్రప్రదేశ్‌లోనే ఉండాలని బలంగా కోరుకుంటున్నారు. ఒడిశాలో సామాజిక పింఛన్ రూ.500 మాత్రమే ఇస్తున్నారు. మన రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ.2,500 చొప్పున ఇస్తోంది. అంతేకాదు ఇక్కడ అమలు జరుగుతున్నన్ని సంక్షేమ పథకాలు ఒడిశాలో లేవు. పేదలందరికీ ఇళ్లు, రైస్‌కార్డు, అమ్మ ఒడి, వైఎస్సార్ చేయూత, చేదోడు... నవరత్నాలన్నీ కొటియా గ్రామాల్లో అమలవుతున్నాయి. ఏదేమైనా అక్కడి ప్రజల మనోభావాలకు అనుగుణంగా సరిహద్దుపై నిర్ణయం తీసుకోవాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరతాను. -
అడవి బిడ్డలతో హరిచందన్
గవర్నర్ రాకతో మన్యం మురిసింది. గిరిజనం సంతసించింది. అడవిబిడ్డల కోసం ప్రత్యేకంగా వచ్చిన అతిథిని చూసి ఉప్పొంగిపోయింది. తమ సమస్యల గురించి ఆరా తీసినపుడు... బాగోగుల గురించి ప్రస్తావించినపుడు... తాము పండించిన పంటలను చూసి ప్రశంసించినపుడు... తమకు అందుతున్న సౌకర్యాల గురించి ప్రశ్నించినపుడు తమపై వారెంత బాధ్యతగా ఉన్నారో స్పష్టమైంది. సుమారు నాలుగైదు గంటలపాటు తమతో గడిపిన ఆ అతిథిని గర్వంగా సాగనంపింది. సాక్షిప్రతినిధి, విజయనగరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ జిల్లా పర్యటన విజయవంతమైంది. గిరిజనులకు అందుతున్న ప్రభుత్వ పథకాల గురించి, వారి జీవన విధానం గురించి తెలుసుకునేందుకు గవర్నర్ తన పర్యటనలో ప్రాధాన్యమిచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. మరింత మెరుగ్గా సౌకర్యాలు అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తన పర్యటనలో గర్భిణులు, రైతులు, విద్యార్థులతో మాట్లాడగా అందరూ గిరిజనులు కావడం పర్యటన ప్రాధాన్యత తెలియజేసింది. ఈ సందర్భంగా హరిత విజయనగరం సంకల్పంలో గవర్నర్ సైతం పాలుపంచుకున్నారు. మొక్కలు నాటి తన పర్యటనకు మొదలుపెట్టారు. అందరూ విరివిగా నాటాలని పిలుపునిచ్చారు. గిరిజన బాలికలతో సహపంక్తి భోజనం చేసి పర్యటన ముగించారు. నాలుగు గంటలు బిజీబిజీగా... రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ ఒక్కరోజు పర్యటనలో భాగంగా గురువారం సాలూరు డీగ్రీ కాలేజీ మైదానానికి ఉదయం 11.32 నిమిషాలకు హెలికాఫ్టర్‌లో చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో సాలూరు పట్టణంలో ఉన్న గుమడాం వద్ద గల యూత్ ట్రైనింగ్ సెంటర్‌కు చేరుకుని మొక్కలు నాటారు. అనంతరం గవర్నర్‌కు గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆర్.పి.సిసోడియా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పార్వతీపురం ఐటీడీఏ ఏర్పాటు గురించి వివరించారు. జిల్లా కలెక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ గవర్నర్‌కు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి, జిల్లాలో అమలు చేస్తున్న కంటివెలుగు, రైతుభరోసా, వాహనమిత్ర, తదితర పథకాలు గురించి సమగ్రంగా వివరించారు. అమ్మవలస సభకు హాజరైన గిరిజనులు గర్భిణుల ఆరోగ్యంపై ఆరా... వైటీసీలోని గిరిశిఖర గ్రామాల గర్భిణుల వసతి గృహాన్ని గవర్నర్ సందర్శించారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న గర్భిణులతో మాట్లాడుతూ యోగ క్షేమాలు తెలుసుకున్నారు. ఆరోగ్యం ఎలావుంది? మీరు ఏ గ్రామం నుంచి వచ్చారు? మీ ఊరు నుంచి ఎలా వచ్చారు? మీ గ్రామానికి రోడ్డు, బస్సు సౌకర్యం ఉన్నాయా? వసతిగృహంలో ఎటువంటి వైద్య సేవలు ఆందుతున్నాయని ప్రశ్నించారు. వసతిగృహంలో మౌలిక సదుపాయాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇక్కడ అన్ని రకాల మౌలిక సదుపాయాలు వున్నాయని, ప్రసవ సమయంలో గిరిశిఖర ప్రాంతాలనుంచి వైద్యం నిమిత్తం రావడం చాలా కష్టంగా వుండేదని పలువురు గర్భిణులు తెలిపారు. ఈ వసతిగృహం వల్ల గిరిజనులకు మంచి జరుగుతుందని వారు సంతోషాన్ని వ్యక్తం చేయడంతో గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రకృతి సేద్యానికి ప్రశంస అనంతరం గవర్నర్ బిశ్వభూషణ్ పాచిపెంట మండలం అమ్మవలస చేరుకున్నారు. అక్కడ గిరిజన రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్న వరి, మొక్కజొన్న, అరటి, పత్తి, కంద, మామిడి, జీడిమామిడి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ఏవిధంగా చేస్తున్నారన్న విషయం తెలుసుకున్నారు. వ్యవసాయ యాంత్రీకరణ, ఇతర వ్యవసాయ పద్ధతుల గురించి ఆరా తీశారు. ఈసందర్భంగా రైతులు వాటి గురించి గవర్నర్‌కు వివరించారు. అనంతరం ఆయన గ్రామసభలో పాల్గొన్నారు. సభలో రైతులతో మాట్లాడారు. రైతులకందుతున్న ప్రభుత్వ పథకాల గురించి రైతులను అడుగ్గా కె.విజయ్ అనే రైతు మాట్లాడుతూ రైతుభరోసా పథకం ద్వారా రాష్ట్ర ముఖ్యమంంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి రూ.7500లు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ పీఎం కిసాన్ యోజన పథకం ద్వారా రూ.2000 ఇచ్చారని, పంట సాగుకు పెట్టుబడికి సాయం అందించినట్టయిందని తెలిపారు. ఆరోగ్య కార్యకర్తలు తనిఖీలు, పౌష్టికాహారం పంపిణీ, మందులు సరఫరా గురించి గవర్నర్ అడుగ్గా క్రమ పద్ధతిలో తనిఖీ చేసి, పౌష్టికాహారం, మందులు సరఫరా చేస్తున్నారని గిరిజన మహిళ లక్ష్మి తెలిపారు. అనంతరం ఆయన పి.కోనవలస గిరిజన సంక్షేమ బాలికల జూనియర్ కాలేజీకి వెళ్లి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. విద్య, కాలేజీ, వసతిగృహంలో సౌకర్యాలు గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకల్లో పాల్గొని, గిరిజన బాలికలతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. వైద్యసదుపాయాలు మెరుగు: డిప్యూటీ సీఎం అమ్మవలస సభలో మాట్లాడిన డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ మంత్రి పాముల పుష్పశ్రీవాణి ఏజెన్సీలో వైద్యసదుపాయా ల మెరుగుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోం దని తెలిపారు. గిరిజనులు తక్కువగా ఉన్న కొత్తవలస ప్రాంతంలో పెట్టిన గిరిజన యూనివర్శిటీని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సాలూరు ప్రాంతంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారన్నారు. పాడేరులో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నారనీ, ఏడు ఐటీడీఏల పరిధిలో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. బాక్సైట్ తవ్వకాలు ముఖ్యమంత్రి రద్దు చేసిన విషయాన్ని తెలియజేశారు. సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి: ఎమ్మెల్యే రాజన్నదొర అమ్మవలసలో నిర్వహించిన సభలో సాలూరు ఎమ్మెల్యే పీడక రాజన్నదొర మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల సందర్శనకు గవర్నర్ రావడం సంతోషంగా ఉందనీ, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారనీ తెలిపారు. నవరత్నాల ద్వారా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. సాలూరు ప్రాంతంలో ధీర్ఘకాలికంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా మధ్య 21 కొఠియా గ్రామాల సమస్య నలుగుతోందనీ, వీరి సమస్య పరిష్కరించాలని కోరారు. గిరిజనులకు వైద్య సదుపాయాలు మెరుగుపరచాల్సి ఉందన్నారు. స్పందించిన గవర్నర్ వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. మధ్యాహ్నం 3.25 నిమిషాలకు హెలిప్యాడ్ వద్దకు చురుకున్న గవర్నర్ పర్యటన విజయవంతంపై జిల్లా అధికారులను అభినందించి, వారితో గ్రూఫ్ఫొటో దిగారు. అనంతరం గవర్నర్ విశాఖ బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో గిరిజన సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్.పి.సిసోడియా, గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్ రంజిత్ బాషా, బొబ్బిలి, పాడేరు ఎమ్మెల్యేలు శంబంగి చిన్న అప్పలనాయుడు, కె.భాగ్యలక్ష్మి, శాసనమండలి సభ్యులు గుమ్మడి సంధ్యారాణి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్, విశాఖ రేంజ్ డీఐజీ కాళిదాసు రంగారావు, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, పార్వతీపురం సబ్ కలెక్టర్ టి.ఎస్.చేతన్, జిల్లా ఎస్.పి.రాజకుమారి ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
పీఏసీ చైర్మన్‌గా పయ్యావుల కేశవ్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) (ఛైర్మన్ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ నియమితులయ్యారు. చైర్మన్‌గా పయ్యావుల కేశవ్‌తో పాటు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలను, అలాగే ఎస్టిమేట్స్ కమిటీకి చైర్మన్‌గా రాజన్న దొర, తొమ్మిది మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలను నియమించారు. పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీకి చైర్మన్‌గా చిర్ల జగ్గిరెడ్డితో పాటు సభ్యులుగా తొమ్మిది మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలను ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం గురువారం నియమించారు. పబ్లిక్ అకౌంట్ కమిటి సభ్యులుగా: 1. పయ్యావుల కేశవ్(చైర్మన్), 2. సంజీవయ్య కిలిబెటి, 3. కోలగట్ల వీరభద్ర స్వామి, 4. మేరుగు నాగార్జున, 5. భూమన కరుణాకర్‌రెడ్డి 6. కరణం ధర్మశ్రీ 7. జోగి రమేష్, 8. కెవి. ఉషశ్రీ చరణ్, 9.కాటసాని రాంభూపాల్ రెడ్డి, 10. బీద రవీచంద్ర, 11. డి. జగదీశ్వరరావు, 12. బాలసుబ్రమణ్యం, ఎస్టిమేట్ కమిటీ సభ్యులుగా: 1. రాజన్న దొర పీడిక(చైర్మన్), 2. అమర్నాథ్ గుడివాడ, 3. రామిరెడ్డి ప్రతాప్ కుమార్‌రెడ్డి, 4. కిరణ్ కుమార్ గొర్లె, 5. గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, 6. అనిల్ కుమార్ కైలే, 7. మదిశెట్టి వేణుగోపాల్, 8. మండలి గిరిధర రావు, 9. ఆదిరెడ్డి భవాని, 10. దువ్వారపు రామారావు, 11. పరుచూరి అశోక్‌బాబు, 12. వెన్నపూస గోపాల్‌రెడ్డి పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ సభ్యులుగా: 1. చిర్ల జగ్గిరెడ్డి(చైర్మన్) 2. గ్రంధి శ్రీనివాస్, 3. కిలారి వెంకటరోశయ్య, 4. జొన్నలగడ్డ పద్మావతి, 5. అన్నా రాంబాబు, 6. శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, 7. రవీంద్రనాథ్‌రెడ్డి, 8. చంద్రశేఖర్‌రెడ్డి, 9. వాసుపల్లి గణేష్ కుమార్10. వెంకట సత్యనారాయణ రాజు, 11. గుంజపాటి దీపక్‌రెడ్డి, 12. సోము వీర్రాజు -
విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
విజయనగరం : ఖరీఫ్ సీజన్ ప్రారంభవనున్న నేపథ్యంలో సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర రైతులకు ఆదివారం విత్తనాలు పంపిణీ చేశారు. సాలూరు మండల ఏవో కార్యాలయం ఆవరణలో విత్తనాల పంపిణీ అనంతరం మీడియాతో మాట్లాడారు. సీజన్ ప్రారంభం అవుతున్నందున ప్రభుత్వం విత్తనాల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని అన్నారు. మండలంలోని సుమారు ఏడువేల మంది రైతులకు గాను 60 టన్నుల వరి విత్తనాల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారని వెల్లడించారు. రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పారు. వైఎస్సార్ రైతుభరోసా పథకం కింద ప్రతియేడు మే నెల వచ్చేనాటికి రూ.12,500 రైతుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే బండుకొండ అప్పలనాయుడు పూసపాటిరేట, భోగాపురం మండలాల రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. వేతనాలు పెంచండి.. ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణిని గోపాలమిత్ర యూనియన్ నాయకులు జియ్యమ్మవలస మండలం చినమేరంగిలో కలిశారు. తమకు వేతనాలు పెంచాలని వినతిపత్రం సమర్పించారు. -
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చుట్టూ టీడీపీ నేతలు
సాలూరు (విజయనగరం) : తనను టీడీపీలో చేరాలంటూ ఆ పార్టీ నాయకులు ప్రలోభాలకు గురిచేస్తున్నారని సాలూరు ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు పీడిక రాజన్నదొర తెలిపారు. ఆదివారం తన స్వగృహంలో పలువురు పార్టీ నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇదివరకు కొంత మంది ఎమ్మెల్యేలను కొన్న టీడీపీ నాయకులు తనను కూడా కొనుగోలు చేయాలని నెలరోజులుగా తన ఇంటి చుట్టూ తిరుగుతున్నారని వెల్లడించారు. గత రాత్రి కూడా తనను సంప్రదించారని చెప్పారు. నేను చెప్పింది అవాస్తవమని టీడీపీ నాయకులు ఖండిస్తే బోసుబొమ్మ జంక్షన్లో బహిరంగంగా విషయాలన్నింటినీ వెల్లడిస్తానని స్పష్టం చేశారు. టీడీపీలో చేరిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంలో తప్పేముందని ఎమ్మెల్సీ సంధ్యారాణి వ్యాఖ్యానించడాన్ని రాజన్నదొర తప్పుబట్టారు. భారత రాజ్యాంగంపై అవగాహన లేకుండా, ప్రజాప్రాతినిథ్య చట్టం గురించి తెలియకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. -
గిరిజనులంటే చిన్నచూపు....
♦ టీడీపీకి ప్రజలే బుద్ధి చెబుతారు ♦ ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర సాలూరు: తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి గిరిజనులన్నా, గిరిజన ప్రజాప్రతినిధులన్నా చిన్నచూపని, అందుకే అడుగడుగునా అవమానపరుస్తూ, అన్యాయం చేస్తున్నారని సాలూరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు పీడిక రాజన్నదొర ఆరోపించారు. మండల కేంద్రంలోని ఆయన స్వగృహంలో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ, ప్రొటోకాల్ ప్రకారం ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులను సీనియర్ అధికారులతో గాని, స్థానిక అధికారులతో గాని ఆహ్వానించాల్సి ఉందన్నారు. అయితే గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణ కార్యక్రమానికి జిల్లాలో ఇద్దరు గిరిజన ఎమ్మెల్యేలున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. గిరిజన ప్రజాప్రతినిధులను గౌరవించలేని ప్రభుత్వం గిరిజనులను ఉద్దరిస్తుందా..? అని ప్రశ్నించారు. కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు పాచిపెంట మండలంలో తమ కుటుంబీకులకున్న భూములను ఉచితంగా ఇస్తామంటే కాదని, కొత్తవలస మండలంలో గిరిజనులు ముప్పై, నలబై ఏళ్లుగా సాగుచేసుకుంటున్న భూములను బలవంతంగా లాక్కొని నిర్మాణ పనులు చేపట్టడం తగదన్నారు. ఆయా భూములపై పూర్తి హక్కు కలిగిన గిరిజన రైతులకు పరిహారం ఇవ్వకుండా తీరని అన్యాయం చేస్తోందన్నారు. కేంద్రమంత్రి అశోక్ ఇస్తామన్న భూములు విమానాశ్రయానికి దూరంగా ఉండడం వల్లే గిరిజన విశ్వవిద్యాలయానికి తీసుకోలేదని ప్రభుత్వం చెబుతున్న మాటలు వాస్తవం కాదన్నారు. అలాంటప్పుడు విశాఖలోని ఆంధ్రా యూనివర్శిటీ విమానాశ్రమానికి ఎంతదూరంలో ఉందో ప్రభుత్వమే చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన లేదని, ప్రతిపక్ష ప్రజాప్రతినిధులను కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాకంఠక పాలన సాగిస్తున్న టీడీపీకి ప్రజల బుద్ధి చెబుతారన్నారు.