
విజయనగరం : ఖరీఫ్ సీజన్ ప్రారంభవనున్న నేపథ్యంలో సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర రైతులకు ఆదివారం విత్తనాలు పంపిణీ చేశారు. సాలూరు మండల ఏవో కార్యాలయం ఆవరణలో విత్తనాల పంపిణీ అనంతరం మీడియాతో మాట్లాడారు. సీజన్ ప్రారంభం అవుతున్నందున ప్రభుత్వం విత్తనాల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని అన్నారు. మండలంలోని సుమారు ఏడువేల మంది రైతులకు గాను 60 టన్నుల వరి విత్తనాల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారని వెల్లడించారు. రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పారు. వైఎస్సార్ రైతుభరోసా పథకం కింద ప్రతియేడు మే నెల వచ్చేనాటికి రూ.12,500 రైతుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే బండుకొండ అప్పలనాయుడు పూసపాటిరేట, భోగాపురం మండలాల రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు.
వేతనాలు పెంచండి..
ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణిని గోపాలమిత్ర యూనియన్ నాయకులు జియ్యమ్మవలస మండలం చినమేరంగిలో కలిశారు. తమకు వేతనాలు పెంచాలని వినతిపత్రం సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment