Saluru
-
నడిరోడ్డుపై విగతజీవిగా పసిపాప
సాలూరు (విజయనగరం): అప్పుడే పుట్టింది.. ఇంకా కళ్లు కూడా తెరవలేదు.. కన్నపేగు వసివాడ లేదు.. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన పసిపాప నడిరోడ్డుపై విగతజీవిగా కనిపించిన దృశ్యం విజయనగరం జిల్లా సాలూరు పట్టణ వాసులను మంగళవారం కంటతడి పెట్టించింది. సాలూరు ఎస్ఐ ఫకృద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ) వెనుక ఉన్న సీసీ రోడ్డు సమీపంలో ఓ చిన్నారి రోడ్డుపై మరణించి ఉందని సమాచారం అందడంతో పోలీసులు వెళ్లి చూశారు. అప్పుడే పుట్టినట్టుగా గుర్తించారు. సీహెచ్‌సీ వెనుక కవరులో కప్పి పడవేయగా.. ఏదైనా వాహనం ఆ కవరును రోడ్డుపైకి ఈడ్చుకొచ్చి ఉంటుందని పోలీసులు, స్థానికులు అనుమానిస్తున్నారు. పాపకు సంబంధించిన వివరాలు వెల్లడి కాలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
మేమేమి పాపం చేశాం ...నాన్న!
మీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు.. ప్రేమ వివాహం చేసుకున్నారు.. ఇష్టంగా దగ్గరయ్యారు.. మాకు జన్మనిచ్చారు. చిటికన వేలి అందజేసి లోకమంతా చూపించాల్సిన మీరు.. మాపై లింగత్వ పరీక్ష పెట్టి కక్ష పెంచుకోవడం తగునా ‘నాన్నా’.. మీరు కోరుకుంటేనే కదా భూమి మీదకు వచ్చాం.. ఇప్పుడు ప్రాణమే లేకుండా చేశారంటూ చిన్నారి ఆత్మఘోషిస్తోంది. సాలూరు మండలం జోడుమామిడివలసలో శుక్రవారం రాత్రి నిద్రపోతున్న రెండేళ్ల చిన్నారిని సొంత తండ్రే కర్కశంగా హతమార్చడం మానవ బంధాలను ప్రశ్నిస్తోంది. సాక్షి,విజయనగరం(సాలూరు): ముద్దులొలికే ఇద్దరు ఆడపిల్లలను చూసి మురిసిపోవాల్సిన తండ్రి.. వారిపై కక్ష పెట్టుకున్నాడు. మద్యానికి బానిసై భార్య, పిల్లలను వేధించడం మొదలెట్టాడు. భర్త రాక్షసత్వాన్ని గమనించిన భార్య.. ప్రాణాలు కాపాడుకునేందుకు పిల్లలను తీసుకుని కన్నవారింటికి వెళ్లినా విడిచిపెట్టలేదు. భార్యతో పాటు ఇద్దరి పిల్లలను హతమార్చే ప్రయ త్నం చేశాడు. చివరకు ఒక కుమార్తెను పొట్టన పెట్టుకున్నాడు. మరో కుమార్తెను తీవ్రంగా గాయపరిచిన విషాదకర ఘటన సాలూరు మండలం తుండ పంచాయతీ జోడుమామిడివలసలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కొమరాడ మండలం ఉలిపిరికి చెందిన కొలికి ప్రసాద్ తొలిభార్య మరణించింది. సాలూరు మండలం జోడుమామిడివలసకు చెందిన లక్ష్మిని ప్రేమించి రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఐదేళ్లు, రెండేళ్ల వయసు ఉన్న సిరి, ప్రణవి కుమార్తెలు ఉన్నారు. ఇద్దరూ ఆడపిల్లలే పుట్టారని, మగ పిల్లలకు జన్మనివ్వలేదంటూ భార్య లక్ష్మిని నిత్యం వేధించేవాడు. కుమార్తెలను అసహ్యించుకునేవాడు. భర్త వక్రబుద్ధిని గమనించిన లక్ష్మి పిల్లలను తీసుకుని కన్నవారు నివసిస్తున్న జోడుమామిడివలసకు వారం రోజుల కిందట వచ్చేసింది. అప్పటికీ భర్త వేధింపులు ఆపలేదు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు లక్ష్మివద్దకు వచ్చాడు. గొడవ పడ్డాడు. పూటుగా మద్యం సేవించి రాత్రి పది గంటల సమయంలో దాడికి తెగబడ్డాడు. మంచంపై నిద్రపోతున్న ప్రణవి కాళ్లుచేతులు పట్టుకుని రోడ్డుకు కొట్టేశాడు. అంతే చిన్నారి అక్కడికక్కడే విగతజీవిగా మారింది. పెద్దపాప సిరిని సైతం తీవ్రంగా గాయపరిచాడు. స్థానికులు అడ్డుకోవడంతో కొన ఊపిరితో బయటపడింది. పాపను 108లో ముందుగా సాలూరు సీహెచ్‌సీకి, అనంతరం విజయనగరం కేంద్రాస్పత్రికి అక్క డి నుంచి విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. బాలిక ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. భర్త దాడికి భయపడి లక్ష్మి దూరంగా పారిపోవడంతో ప్రాణాలతో బయటపడింది. చిన్నారిని బలితీసుకున్న ప్రసాద్‌ను స్థానికులు తాళ్లతో బంధించి పోలీసులకు అప్పగించారు. ప్రసాద్ మొదటి భార్య మరణంపైనా స్థానికులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. సీఐ అప్పలనాయుడు కేసు నమోదు చేశారు. -
టీడీపీలో టికెట్ బేరాలు
సాలూరు: ‘పార్టీలో కష్టపడి పనిచేసే తనకు కాకుండా డబ్బులకు అమ్ముడుపోయి ఇంకెవరికో టికెట్టు ఎలా ఇస్తారు..’ అని ప్రశ్నించిన ఓ టీడీపీ మహిళా నేతను చేయి పట్టుకుని ఓ మాజీ ఎమ్మెల్యే గెంటేసిన ఉదంతం బుధవారం విజయనగరం జిల్లా సాలూరులో చర్చనీయాంశంగా మారింది. టికెట్ ఇస్తామని నియోజకవర్గ నాయకులు హామీ ఇవ్వడంతో సాలూరు మున్సిపాలిటీలో బంగారమ్మపేట 25వ వార్డు నుంచి టీడీపీ అభ్యర్థిగా కొయ్యాన లక్ష్మి నామినేషన్ వేశారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన బుధవారం టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే ఆర్.పి.భంజ్‌దేవ్ ఇంటికి రమ్మని చెప్పడంతో లక్ష్మి, ఆమె భర్త, మద్దతుదారులతో కలిసి వెళ్లారు. ‘నీవు ఎంత ఖర్చు పెడతావ్, టికెట్‌కు రూ.5 లక్షలు ఇవ్వాలి. నీవు ఎంత ఇవ్వగలవు’ అని భంజ్‌దేవ్ అడుగగా, రూ.4 లక్షలు ఇవ్వగలమని తెలిపారు. అక్కడే ఉన్న మరో అభ్యర్థి ఇంకా ఎక్కువ ఇస్తాననడంతో సీన్ రివర్స్ అయింది. దీంతో లక్ష్మికి బీ–ఫారం ఇవ్వబోమని చెప్పారు. ‘ఇన్నేళ్లుగా పార్టీని నమ్ముకున్న మమ్మల్ని కాదని వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి డబ్బులు తీసుకుని టికెట్ ఇవ్వడం ఎంతవరకు న్యాయం’ అని లక్ష్మి, ఆమె భర్త మాజీ ఎమ్మెల్యే భంజ్‌దేవ్‌ను ప్రశ్నించారు. దీంతో అసహనానికి గురైన భంజ్‌దేవ్.. లక్ష్మి చేయి పట్టుకుని బయటకు పొమ్మంటూ నెట్టేశారు. ‘నాకు నచ్చిన వారికే టికెట్ ఇస్తా, చేతనైంది చేసుకో..’ అంటూ దురుసుగా ప్రవర్తించారు. ఈ సంఘటనను అక్కడున్నవారు సెల్ఫోన్లో చిత్రీకరించడంతో ఇది స్థానికంగా వైరల్ అయింది. భంజ్‌దేవ్ టికెట్ అమ్ముకున్నారని లక్ష్మి కంటతడిపెట్టారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలుస్తానని పేర్కొన్నారు. -
నీటిని నిలిపి.. పొలాలు తడిపి..
కష్టాలు ఆలోచనలకు పదునుపెట్టాయి. ఒక ఆలోచన దిశ చూపింది. సంకల్పం చేతులు కలిపింది. పొలం తడిసింది. జలం జీవం పోసింది. పంట పండింది. గ్రామస్తుల దశ మారింది. కళ్లముందే నీరున్నా పొలానికి అందక ఏళ్ల తరబడి ఇబ్బందులు పడిన ఆ గ్రామస్తులు ఇప్పుడు రెండు పంటలు పండిస్తున్నారు. నిరంతరం పారే నీటికి చిన్న అడ్డుకట్ట వేసి పొలాలకు మళ్లించారు. నీటి ఎద్దడే లేదు. వంద ఎకరాలు సస్యశ్యామలమయ్యాయి. నీరు లేక పంటలు పండించే అవకాశంలేక అటవీ ఉత్పత్తులు సేకరించి జీవనం గడిపిన వారు ఇప్పుడు స్వయంగా పంటలు పండించుకుంటూ ఆనందంగా జీవిస్తున్నారు. ఈ ఘనత సాధించిన విజయనగరం జిల్లా మక్కువ మండలంలోని గుంటబద్ర గ్రామస్తులు.. అందరికీ ఆదర్శంగా నిలిచారు. మక్కువ (సాలూరు): గుంటబద్ర గ్రామంలో సుమారు వంద గిరిజన కుటుంబాలున్నాయి. గ్రామం పక్కనే ప్రవహించే అడారు గెడ్డ ఉంది. ఒడిశా రాష్ట్రంలోని కొండలపైనుంచి నిరంతరం వచ్చే నీటితో ఈ గెడ్డ ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ పొలాలకు నీరందించే లక్ష్యంతో చేపట్టిన అదనపు ఆనకట్ట పనులు ఆగిపోవడంతో వరుణుడు కరుణిస్తేనే పంట పండేది. ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలా అని అందరూ చర్చించుకున్నారు. అడారు గెడ్డ నీటిని ఎలా మళ్లించాలా అని ఆలోచించారు. గెడ్డకు అడ్డంగా రాళ్లు వేసి ప్రవాహాన్ని కొంత అయినా అడ్డుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా అందరూ కలిసి రాళ్లను సేకరించి అడారు గెడ్డ మధ్యలో గట్టులా వేశారు. అక్కడ ఆగిన నీరు పొలాలకు వెళ్లేలా కాలువ తవ్వారు. రాళ్ల మధ్య నుంచి కిందకు వెళ్లేనీరు పోగా కాలువకు వస్తున్న నీటితో వంద ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు. ఖరీఫ్‌లో వందెకరాల్లో వరి పండించిన ఈ గ్రామస్తులు రబీ సీజన్లో 70 ఎకరాల్లో మొక్కజొన్న, 30 ఎకరాల్లో చిరుధాన్యాలు సాగు చేస్తున్నారు. అటవీ అభ్యంతరాలతో ఆగిన అదనపు ఆనకట్ట నిర్మాణం మక్కువ, పార్వతీపురం, సాలూరు మండలాలకు చెందిన 1,876 ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో మకు్కవ మండలం పనసబద్ర పంచాయతీ మూలవలస గ్రామ సమీపంలో 1955లో సురాపాడు చెక్‌డ్యాం నిర్మించారు. చెక్‌డ్యాం శిథిలావస్థకు చేరడం, కాలువల్లో పూడిక పేరుకోవడంతో ప్రస్తుతం వెయ్యి ఎకరాలకు కూడా నీరందడం లేదు. ఎగువనున్న కొండలపై నుంచి అడారుగెడ్డ ద్వారా వచ్చిననీరు వచ్చినట్లు వృథాగా పోతోంది. అడారుగెడ్డపై నుంచి వచ్చిన నీటిని నిల్వ చేసేందుకు సురాపాడు ప్రాజెక్టు దిగువన 2,500 ఎకరాలకు సాగు నీరందించేలా అదనపు ఆనకట్ట (మినీ రిజర్వాయర్) నిర్మించాలని దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తలపెట్టారు. ఇందుకోసం రూ.1.2 కోట్లు మంజూరుచేశారు. 2006 మే 28న అప్పటి రాష్ట్ర అటవీ పర్యావరణశాఖ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు శంకుస్థాపన చేశారు. పనులు ప్రారంభించిన ఆరు నెలలకే అటవీ శాఖాధికారులు అడ్డుకోవడంతో ఆగిపోయాయి. దీంతో మక్కువ మండలంలోని మూలవలస, ఆలగురువు, గుంటబద్ర, చెక్కవలస, నగుళ్లు, పార్వతీపురం మండలంలోని అడారు గ్రామాల పొలాలకు నీరందక ఏటా గిరిజన రైతులు నష్టపోతున్నారు. నీటి సమస్య తీరింది గ్రామస్తులమంతా ఏకమై అడారు గెడ్డ మధ్యలో రాళ్లను గట్టులా వేశాం. కొంతమేర కిందకు వెళ్లగా మిగిలిన నీటిని కాలువ ఏర్పాటుచేసి పొలాలకు మళ్లిస్తున్నాం. మా పంటపొలాలకు నీరు సక్రమంగా అందుతోంది. పంటలు పండించుకుంటున్నాం. - సీదరపు లాండు, గుంటబద్ర, రైతు పంటలు పండించుకుంటున్నాం ఏటా వరుణదేవుడిపై ఆధారపడి పంటలు సాగుచేస్తూ నష్టపోతూనే ఉండేవాళ్లం. ఇప్పుడు అడారు గెడ్డ మధ్యలో రాళ్లతో గట్టుకట్టి నీటిని పొలాలకు మళ్లించుకున్నాం. పంటలు పండించుకుంటున్నాం. సంతోషంగా ఉంది. - కర్రా రామారావు, గుంటబద్ర, రైతు కోర్టులో కేసు ఉంది సురాపాడు ప్రాజెక్టు సమీపంలో 2006లో అదనపు ఆనకట్ట నిర్మాణ పనులు ప్రారంభించిన ప్రదేశం రిజర్వ్‌ఫారెస్ట్ ఏరియాలో ఉంది. అందువల్ల అటవీ శాఖ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టులో కేసు వేసింది. ఇంతవరకు ఎటువంటి ఉత్తర్వులు అందలేదు. అందువల్ల పనులు అలాగే నిలిచిపోయాయి. -కె.నారాయణరావు, అటవీ అధికారి, మక్కువ -
గిరిజనుల రహదారి కల సాకారం
‘అక్షరం’ అనేక జీవితాలను నిలబెడుతుందని... చరిత్రను ‘కలం’ తిరగరాస్తుందని... మరోసారి రుజువైంది. శతాబ్దాలుగా రహదారులు లేక... అభివృద్ధికి నోచుకోక... కాలం వెళ్లదీస్తున్న గిరిజనుల కష్టాలను, కన్నీళ్లను కళ్లకు కట్టినట్లు చూపించిన ‘అరణ్య రోదన’ కథనం అడవి బిడ్డల కలలను సాకారం చేస్తోంది. చేయీ.. చేయీ కలిపి చందాలు పోగేసి మొదలుపెట్టిన మట్టి రోడ్డు ఇప్పుడు ప్రధాన రహదారిగా రూపుదిద్దుకోనుంది. సాక్షి, విజయనగరం: సాలూరు మండలం కొదమ పంచాయతీ చింతామల గిరిశిఖర గ్రామ ప్రజలు, నూట ఇరవై ఐదు కుటుంబాలు కలిసి, బంగారం, భూమి తాకట్టు పెట్టి, ఆవులు, గేదెలు, మేకలను అమ్మి, అదీ చాలక షావుకారు వద్ద అప్పుచేసి, ఇంటికి రూ.7 వేలు చొప్పున చందాలు వేసుకున్నారు. మరికొంత రుణాలు తీసుకున్నారు. ఆ సొమ్ముతో ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒడిశా బారి జంక్షన్ వరకూ సొంతంగా రహదారి వేసుకున్నారు. దీనిపై సాక్షి ప్రధాన సంచికలో ఆగస్టు 14న కథనం ప్రచురితమైంది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. సీఎం కార్యాలయం జిల్లా అధికారులను వివరాలు కోరింది. మరోవైపు బాలీవుడ్ నటుడు సోనూసూద్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వుల్లో సాక్షి కథనం గురించి ప్రస్తావన గిరిజనులను అభినందించారు. త్వరలోనే వచ్చి కలుస్తానన్నారు. కదిలించిన సాక్షి కథనం ఈ క్రమంలోనే గిరిజనులు అనుభవిస్తున్న కష్టాలపై ‘అరణ్య రోదన’ శీర్షికతో ఆగస్టు 25న సాక్షి జిల్లా సంచికలో మరో కథనం ప్రచురించింది. ఆ కథనం అధికారులను కదిలించింది. స్పందించిన ఐటీడీఎ పీఓ ఆర్.కూర్మనాథ్ గిరిజన పల్లెల్లో ఆ మరునాడే పర్యటించా రు. మరోవైపు సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర ఇటు ఐటీడీఎ పీఓతోనూ, అటు అటవీ శాఖ జిల్లా అధికారి చేతన్‌తోనూ చర్చించారు. ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి సైతం స్పందించారు. గిరిజన గ్రామాల్లో రహదారులు, మౌలిక సదుపాయాల కల్పనకు యుద్ధప్రాతిపదికన చర్య లు చేపట్టాల్సిందిగా ఐటీడీఎ పీఓ కూర్మనాథ్‌ను ఆదేశించారు. ఉపాధి హామీ నిధులు విడుదల ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్, ఉపాధిహామీ పథకం జిల్లా కోఆర్డినేటర్ అయిన డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నిధులు మంజూరు చేశారు. సాక్షి కథనాన్ని తొలి రిఫరెన్స్‌గా తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. కలెక్టర్ తరఫున ఐటీడీఎ పీఓ కూర్మనాథ్ రూ.1.65 కోట్ల నిధుల విడుదలకు సంబంధించిన ఉత్తర్వులపై మంగళవారం సంతకం చేశారు. చింతామల గ్రామం నుంచి ఒడిశా సరిహద్దు వరకూ రహదారి నిర్మాణానికి బుధవారం శంకుస్తాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, పీఓ కూర్మనాథ్ ‘సాక్షి ప్రతినిధి’కి వెల్లడించారు. గిరిజన ప్రాంతాభివృద్ధిపై వైఎస్ ముద్ర దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి హయాంలో గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి నిధులు కేటాయించారు. ఆయన హఠాన్మరణం, తదితర కారణాలు వల్ల నిర్మాణం పూర్తికాలేదు. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మా ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించారు. అటవీ శాఖ కూడా అనుమతులు ఇచ్చే విషయంలో సానుకూలంగా ఉంది. దానికి నిదర్శనమే తాజాగా రూ.1.65 కోట్లు మంజూరు కావడం. ఈ రహదారితో పాటు గిరిజన ప్రాంతంలో మిగిలిన రోడ్లు పూర్తి చేసేందుకు కృషి చేస్తాం. – పీడిక రాజన్నదొర, ఎమ్మెల్యే, సాలూరు. రహదారుల కొరత తీరుస్తాం గిరిజనులు పడుతున్న ఇబ్బందు లను రహదారుల నిర్మాణంతో కొంతైనా తీర్చగలుగుతాం. ఈ విషయంలో ఎలాంటి తాత్సారానికీ తావివ్వకుండా అన్ని అనుమతులు తీసుకుంటున్నాం. మరో రూ.11.62 కోట్లతో పోనంగి రహదారి నిర్మాణానికి కూడా చర్యలు చేపడుతున్నాం. అటవీశాఖ నుంచి ఫారెస్ట్ క్లియరెన్స్‌లు కూడా వ స్తున్నాయి. అంతర్గత సీసీ రోడ్లు, చెక్ డ్యామ్‌ల నిర్మాణాలు కూడా పూర్తి చే స్తాం. ప్రభుత్వం నిధుల మంజూరుకు సిద్ధంగా ఉంది. – ఆర్.కూర్మనాథ్, ప్రాజెక్ట్ ఆఫీసర్, ఐటీడీఎ, పార్వతీపురం -
బొబ్బిలి వాడి.. పందెం కోడి
ఆ కోళ్లు బొబ్బిలి పౌరుషానికి ప్రతిరూపం. బరిలో దిగితే గెలుపు ఖాయం. అందుకే వాటికి మార్కెట్లో విపరీతమైన గిరాకీ ఉంది. పందెం రాయుళ్ల నుంచి విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. సాలూరు మండలం నెలిపర్తి ఎన్ఆర్ఆర్ అగ్రికల్చర్, హార్టికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో పెంచుతున్న పందెం కోళ్లు పౌరుషానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. – సాలూరు రూరల్ నెలిపర్తి ఎన్ఆర్ఆర్ అగ్రికల్చర్, హార్టికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో పెంచుతున్న పందెం కోళ్ల పెంపకంలో యాజమాన్యం తీసుకుంటున్న జాగ్రత్తలు, ఇచ్చే శిక్షణ ప్రత్యేకం. ప్రొటీన్లు సమకూరే ప్రత్యేక ఆహారాన్ని తయారు చేసి కోళ్లకు అందిస్తారు. కాలానికి అనుగుణంగా సమశీతోష్ణస్థితిని ఏర్పాటు చేస్తారు. పందాలకు అవసరమైన ప్రత్యేక శిక్షణను ఇస్తూ బోలెడన్ని మెలకువలు కూడా నేర్పిస్తారు. ప్రత్యేక గూళ్లలో పరుగు నేర్పిస్తారు. నాటు పడవుల్లో ఈత నేర్పుతారు. దీంతో అవి మరింత శక్తివంతంగా, ఆరోగ్యంగా పెరుగుతున్నాయి. కోళ్లుకు ఈత నేర్పే నాడు పడవ ఎన్నో రంగులు.. జాతులు సాలూరు, బొబ్బిలి, మక్కువ, మెంటాడ పరిసర ప్రాంతాలతో పాటు ఒడిశా సరిహద్దు గ్రామాల్లోని రకరకాల రంగులు, జాతుల కోళ్లను కొనుగోలు చేసి వాటికి ప్రోటీన్లు ఉండే ఆహారాన్ని అందిస్తున్నారు. ఎన్నోరకాల రంగులు, జాతుల కోళ్లకు ఇక్కడ శిక్షణ ఇచ్చి పందేనికి సిద్ధం చేస్తున్నారు. డేగ, కాకి పూల, పర్ల, కెక్కిరాయి, సీతువ. రసంగి, అబ్రాసు, నెమలి బరుల జాతుల కోళ్లకు ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. కోళ్లకు రన్నింగ్ నేర్పే గూడు ఇతర జిల్లాల నుంచి డిమాండ్ కోళ్లను మార్కెట్లో అమ్మేటప్పుడు బొబ్బిలి పులితో పోల్చుతారు. జిల్లా వాసులే కాకుండా ఇతర జిల్లాల నుంచి ఎక్కువగా వచ్చి కొనుగోలు చేస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కోళ్ల పందెం పోటీల కోసం అధిక సంఖ్యలో వచ్చి కొనుగోలు చేసుకొని వెళ్తున్నారు. ఒక్కొక్క కోడిని రూ.10 నుంచి రూ.15 వేల వరకు విక్రయిస్తుంటారు. శిక్షణ పొందిన కోళ్లు మార్కెట్లో మంచి గిరాకీ ఈ ప్రాంతంలో దొరికే కోళ్లనే కొని వాటికి బలమైన ఆహారం పెట్టి పందేనికి అనుగుణంగా తయారు చేస్తున్నాం. బొబ్బిలి పందెం కోళ్లుగా మార్కెట్లో విక్రయించడం వల్ల మంచి గిరాకీ ఉంది. పొరుగు జిల్లాల నుంచి అధికంగా వచ్చి కొనుగోలు చేసుకుంటారు. ప్రస్తుతం 5 వందల వరకు కోళ్ల పుంజులున్నాయి. – ఎన్.రామారావు, కోళ్ల పెంపకందారు, నెలిపర్తి -
నకిలీల ఆటకట్టు..
సాలూరు: పట్టణ పరిసర ప్రాంతాల్లో నకిలీ మావోయిస్టులు, నకిలీ పోలీసులు హల్చల్ చేస్తున్నారు. వర్తకులను లక్ష్యంగా చేసుకుని వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. పోలీసులమని, మావోయిస్టులమని బెదిరించి వారి నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితులకు అనుగుణంగా వేల నుంచి లక్షల రుపాయల వరకు ఈ డిమాండ్లు ఉంటున్నాయి. దీంతో ఈ నకిలీలలపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. చాకచక్యంగా దర్యాప్తు నిర్వహిస్తూ నకిలీలను పట్టుకుంటున్నారు. కొద్ది రోజుల కిందటే నకిలీ పోలీసులను పట్టుకున్న విషయం మరువకముందే తాజాగా పాచిపెంట మండలంలో నకిలీ మావోయిస్టులను పోలీసులు పట్టుకున్నారు. జరిగిన సంఘటనలు.. ►ఈ ఏడాది జూన్ 11న పాచిపెంట మండలం పారమ్మకొండ వద్ద మక్కువ మండలంనకు చెందిన నలుగురు నకిలీ మావోయిస్టులను పోలీసులు పట్టుకున్నారు. ►ముగ్గురు నకిలీ పోలీసులు సాలూరు మండలంనకు చెందిన ఓ వర్తకుడి నుంచి 27 వేల రుపాయల నగదు కాజేశారు. ఈ కేసును పోలీసులు ఛేదించి ముగ్గురులో ఇద్దరు నకిలీ పోలీసులను పట్టుకుని ఈ నెల 12న వారిని బొబ్బిలి కోర్టులో ప్రవేశపెట్టగా 26వ తేదీ వరకు రిమాండ్ విధించింది. ►పాచిపెంట మండలంలో ముగ్గురు నకిలీ మావోయిస్టులను తాజాగా పాచిపెంట పోలీసులు పట్టుకున్నారు. ప్రత్యేక దృష్టి సారించాం.. నకిలీ పోలీసులు, నకిలీ మావోయిస్టుల హల్చల్ చేస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. దీంతో అటువంటి నకిలీలపై ప్రత్యేక దృష్టి సారించాం. ఇటీవల సాలూరు పట్టణంలో నకిలీ పోలీసులను పట్టుకోగా... తాజాగా పాచిపెంట మండలంలో నకిలీ మావోయిస్టులను పట్టుకున్నాం. అసాంఘిక కార్యక్రమాలకు ఎవ్వరు పాల్పడినా చర్యలు తప్పవు. – సింహాద్రినాయుడు, సీఐ, సాలూరు -
‘గిరిజనులతో మైత్రిని కొనసాగిస్తాను’
సాక్షి, విజయనగరం: గిరిజనుల జీవన విధానాన్ని తను వ్యక్తిగతంగా చూశానని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు. వారితో మైత్రిని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తానని ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని పాచిపెంట మండలం అమ్మవలస ఆదివాసి గ్రామాన్ని గవర్నర్ బిశ్వభూషణ్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వైఎస్సార్ రైతు భరోసా కింద లబ్ధి పొందిన గిరిజన రైతులతో మాట్లాడారు. వాళ్ల బ్యాంకు ఖాతాలకు ఎంత సొమ్ము జమ అవుతుందో ఆరా తీశారు. ఈ క్రమంలో అమ్మవలస ఆదివాసి గిరిజన రైతులు సాగుచేస్తున్న ఉద్యానవన పంటలను సందర్శించి గిరిజన రైతులతో ముచ్చటించారు. అనంతరం ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేస్తున్న వరి , మొక్కజొన్న, అరటి, పత్తి, మామిడి, జీడిమామిడి తదితర పంటల సాగు వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అమ్మవలస ఆదివాసి గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీ వాణి, ఎమ్మెల్యే రాజన్న దొర కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగిస్తూ.. గిరిజనుల జీవన విధానాన్ని వ్యక్తిగతంగా చూసి, వారి సమస్యలు తెలుసుకున్నానని తెలిపారు. సమస్యల పరిష్కార చర్యలపై ప్రభుత్వానికి సూచిస్తానని పేర్కొన్నారు. సంస్కృతి, సంప్రదాయాలు వేల సంవత్సరాలు నుంచి వచ్చాయని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాటిని కాపాడటం సవాలుతో కూడుకున్న పని అని అన్నారు. ప్రస్తుతం విద్య, ఆరోగ్యం రెండు ప్రధాన అంశాలుగా ఉన్నాయని పేర్కొన్నారు. వాటిని నిర్వహించే క్రమంలో గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, ఏకలవ్య పాఠశాలలు ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. గిరిజనులు విద్యకు ప్రాధ్యాన్యత ఇచ్చి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఆరోగ్యానికి సంబంధించి ఏఎన్ఎం వ్యవస్థ, పీహెచ్‌సీలు ఏర్పాటు చేసినా భౌగోళికపరంగా సమస్యలు ఉన్నాయన్నారు. గిరిజన ప్రాంతాలకు వైద్యం అందుబాటులోకి తీసుకురావడం.. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. గిరిజన యువత ఉపాధి కోసం కొత్త రంగాలను ఎంచుకొని నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. పోటీ పరిక్షలకు సిద్ధం అవుతూ.. తమను తాము మార్చుకుని ప్రభుత్వం సహకారం పొందాలని వివరించారు. షెడ్యూల్ ప్రాంతాల్లో గిరిజన సమస్యలు తెలుసుకోవడంతో పాటు.. పరిష్కారం కోసం ఆ వివరాలను ప్రభుత్వానికి సూచించడం తన బాధ్యత అన్నారు. గిరిజనులతో మాట్లాడటం చాలా ఆనందంగా ఉందని.. ఈ మైత్రి బంధాన్ని భవిష్యత్‌లో కూడా కొనసాగిస్తాని అన్నారు. స్థానికంగా ఉన్న సమస్యలు తన దృష్టికి వచ్చాయని.. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ.. గిరిజనులకు ప్రభుత్వాభివృద్ధి ఫలాలు అందుతున్న తీరును పరిశీలించేందుకు గవర్నర్ రావడం శుభసూచకం అన్నారు. ప్రభుత్వం గిరిజనాభివృద్ధికి ఎంతో కృషి చేస్తోందని తెలిపారు. ఇంకా చాలా ప్రాంతాల్లో విద్య, వైద్యం అందాల్సి ఉందని గుర్తుచేశారు. పాడేరులో మెడికల్ కళాశాల, సాలూరులో గిరిజన విశ్వ విద్యాలయం రాబోతున్నాయని వెల్లడించారు. గిరిజన అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం అని శ్రీవాణి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కోటియా గ్రామాల సమస్యను ఎమ్మెల్యే రాజన్నదొర గవర్నర్ దృష్టికి తీసుకు వచ్చారు. అనంతరం రాజన్న దొర మాట్లాడుతూ.. కోటియా గ్రామాల గిరిజనులు సరిహద్దు సమస్యను ఎదుర్కొంటున్నారని తెలిపారు. అభివృద్ధిలో ఒడిషా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పోటీతత్వం ఏర్పడుతోందని పేర్కొన్నారు. ప్రజలు రెండు రాష్ట్రాల మధ్య నలిగిపోతున్నారని చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించాలని గవర్నర్‌కి విన్నవించినట్టు తెలిపారు. -
ఆ పెట్రోల్ బంక్‌లో డీజిల్‌కు బదులు నీరు..!
సాక్షి, సాలూరు: పెట్రోల్ బంక్‌లో డీజిల్ కొట్టించుకోవాలని వెళ్లిన ప్రయాణికులకు వింత పరిస్థితి ఎదురైంది. డీజిల్‌కు బదులు వర్షపు నీరు రావడంతో వాహన చోదకులకు ఇక్కట్లు తప్పలేదు. వివరాల్లోకి వెళితే.. పాచిపెంట మండలంలోని శ్యామలగౌరీపురం సమీపంలో జాతీయ రహదారికి పక్కనున్న ఓ బంక్‌లో డీజిల్‌కు బదులు వర్షపు నీరు వచ్చింది. శనివారం ఉదయం ఐదు గంటల సమయంలో ఓ కారు యజమాని బంక్‌కు వెళ్లి డీజిల్ కొట్టమని సిబ్బందిని కోరాడు. దీంతో సిబ్బంది కారు ట్యాంక్ ఓపెన్ చేసి డీజిల్ కొట్టారు. అయితే ఆ కారు కొంతదూరం వెళ్లాక ఆగిపోయింది. పరిశీలించి చూడగా.. ట్యాంక్‌లో డీజిల్‌కు బదులు వర్షపు నీరు ఉండడంతో కారు ఓనర్ అవాక్కయ్యాడు. వెంటనే ఓ ఆటో సహాయంతో కారును బంక్‌కు తీసుకువచ్చి సిబ్బందిని నిలదీశాడు. అయితే అప్పటికే కొంతమంది వాహనదారులు డీజిల్‌కు బదులు వర్షపునీరు కొట్టిన విషయం గుర్తించి సిబ్బందితో గొడవపడుతున్నారు. వాహనాలు ఆగిపోవడంతో కొంతమంది మెకానిక్‌లను సంప్రదించగా.. మరికొంతమంది వాహనాలను ఆయా షోరూమ్‌లకు తీసుకెళ్లారు. ఇదిలాఉంటే కంపెనీ వారు పదిహేను సంవత్సరాల కిందట పైపులు వేశారని.. అవి పాడవ్వడం వల్ల వర్షపునీరు కలిసిపోయి ఉంటుందని బంకు యజమాని సాధనాల గోపాల్ అన్నారు. ఈ విషయమై కంపెనీ వారికి సమాచారం ఇచ్చామని తెలిపారు. ఆటోకు తాడు కట్టి కారును తీసుకువస్తున్న దృశ్యం కొత్త వాహనం ఆగింది.. పదిహేను రోజుల కిందటే కారు కొన్నాను. అత్యవసరమైన పని మీద ఒడిశా వెళ్తూ బంక్‌లో ఆయిల్ కొట్టించాను. అయితే డీజిల్‌కు బదులు వర్షపునీరు రావడంతో వాహనం ఆగిపోయింది. వెంటనే ఆటో సహాయంతో కారును బంక్‌కు తీసుకువచ్చాను. కారు మరమ్మతులకు అయిన ఖర్చు ఇస్తామని బంకు యజమాని ఒప్పుకున్నారు. ఆటోలు, ద్విచక్ర వాహనాలు కూడా ఆగిపోవడంతో ఎంతోమంది ఇబ్బంది పడ్డారు. – యమరాపు ముత్యాలునాయుడు, కవిరిపల్లి, మక్కువ మండలం -
లారీలకు బ్రేక్‌లు
లారీ పరిశ్రమకు అటు విజయవాడ తరువాతి స్థానం సాలూరుదే. పట్టణంలో అడుగడుగునా లారీలు... వాటిపై ఆధారపడిన ఎన్నో గ్యారేజీలు... మరిన్ని మెకానిక్ షెడ్లు... మనకు దర్శనమిస్తాయి. అంటే ఈ పరిశ్రమ ఎంతోమందికి భుక్తి కలిగిస్తోందన్నమాట. ఇప్పటికే పెరిగిన డీజిల్‌ధరలు... జీఎస్టీలు... పెరిగిపోతున్న ముడిసరకుల ధరలతో పరిశ్రమ కాస్తా కుంటుపడింది. ఒకప్పుడు దర్జాగా బతికిన యజమానులు కాస్తా నష్టాలతో కష్టాలపాలయ్యారు. అయినా ఇంకా కొందరు దానిపైనే ఆధారపడి కాలం నెట్టుకొస్తున్నారు. తద్వారా కొందరు బడుగులకు జీవన భృతి కలుగుతోంది. కానీ తాజాగా వచ్చిన కొత్త వాహన చట్టం ఆ పరిశ్రమను మరింత నష్టాల్లోకి నెట్టేస్తోంది. భారీ జరిమానాలతో నడపలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. సాక్షి ప్రతినిధి, విజయనగరం: సాలూరు ప్రాంతం లారీలకు ప్రసిద్ధి.. ఇక్కడి నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలకు వందలాది లారీలు సరుకు రవాణా చేస్తుంటాయి. వేలాది మంది ఇక్కడి లారీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరంతా కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన మోటారు వెహికల్ చట్టంలోని నిబంధనల పుణ్యమాని నష్టాలు చవిచూస్తున్నారు. దీనికి నిరసనగా గురువారం దేశ వ్యాప్తం గా జరుగుతున్న లారీల బంద్‌లో పాలు పంచుకుం టున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ తరు వాత లారీలు అధికంగా సాలూరులోనే ఉన్నాయి. ఇక్కడ సుమారు 2500 లారీలుండగా వీటిలో సుమా రు 1500 లారీలు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాలకే గాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాలకు సరుకులను నిత్యం రవాణా చేస్తున్నాయి. ఈ లారీలను నడుపుతున్న డ్రైవర్లు, క్లీనర్లు, యజమానులు ఒక్క సాలూరు పట్టణంలోనే సుమా రు 10 వేలకుపైగా ఉన్నారు. దీనిపైనే ఆ కుటుంబా లు ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. వీరితో పాటు గ్రీజ్బాయ్లు, మెకానిక్‌లు తదితర మొత్తం 15 వేలకు పైగా కుటుంబాలు సైతం వీటి ఆధారంగానే జీవిస్తున్నాయి. ఇక్కడి లారీలనే ఇతర రాష్ట్రాల్లో అవసరాలకు కాంట్రాక్టర్లు, వినియోగదారులు తీసుకువెళుతుంటారు. ఈ లారీల ద్వారా బొగ్గు, బాయిల్డ్ రైస్, ఇనుము, మట్టి రవాణా అధికంగా ఉంటుంది. విశాఖపట్నంలోని గన్నవరం పోర్టు నుండి బొగ్గు రవాణా అధికంగా జరుగుతుంది. ఒక లారీ ఒక రోజు ఆగితే సుమారు రూ.6 వేల వరకు నష్టం ఉంటుందని లారీ యజమానులు చెబుతున్నారు. ఒక రోజు లారీ లు బంద్‌లోకి వెళితే సాలూరు పట్టణంలో అన్ని లారీలకు కలిపి సుమారు రూ.కోటికిపైగా నష్టం వాటిల్లుతుందంటున్నారు. వేధిస్తున్న కొత్త నిబంధనలు... కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త మోటారు వెహికల్ చట్టం వల్ల అధికంగా ఇబ్బందులు పడాల్సి వస్తోందని లారీ యజమానులు ఆందోళన బాట పట్టారు. ఈ లారీలు ఒడిశా, చత్తీస్‌గఢ్‌లకు వెళ్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్రాల్లో చిన్న చిన్న ఉల్లంఘనలకు కూడా కొత్త చట్టం ప్రకారం భారీగా జరిమానాలు విధిస్తుండటంతో లారీ యజమానులకు రానూపోనూ కిరాయి డబ్బులు ట్రాఫిక్ జరిమానాలకే సరిపోవడం లేదు. బీమా ప్రీమియం, జీఎస్టీలు వంటివి యజమానులకు ఇబ్బందులు కలుగజేస్తున్నాయనేది వారి వాదన. మోటారు వాహన చట్టంలో సవరణలు చేసి లారీలపై జరిమానాలు తగ్గించాలని, జీఎస్టీ మినహాయించాలనేది వారి ప్రధాన డిమాండ్. దానికోసం ఆలిండియా మోటారు ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్ దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ సమ్మెకు ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్ల అసోసియేషన్ మద్దతు తెలిపింది. ఫలితంగా జిల్లా నుంచి ఇతర ప్రాంతాలు, రాష్ట్రాలకు వెళ్లే లారీలన్నీ సాలూరులోనే నిలిచిపోనున్నాయి. బుధవారమే కొన్ని లారీలు నిలిచిపోయాయి. సాలూరు శివారులో రోడ్డు పక్కన, పట్టణ లారీ అసోసియేషన్ కార్యాలయ ఆవరణలో భారీగా లారీలు నిలిచాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలతో ఇబ్బందులు.. కేంద్ర ప్రభుత్వ విధానాలతో ఇబ్బందులు పడుతున్నాం. లారీలు నడపడం కష్టం గా మారింది. ట్రాఫిక్ చట్టాల పేరుతో భారీగా జ రిమానాలు వేస్తున్నారు. ఇలా అయితే మరీ నష్టాల్లో కూరుకుపోతాం. ఇంతకుముందు రూ.500 లోపు జరిమానాలు ఉండగా ఇప్పుడు రూ.2500 కు తక్కువ కాకుండా ఫైన్లు వేస్తున్నారు. – అక్కేన అప్పారావు, లారీ యజమాని, సాలూరు లారీ పరిశ్రమకు సడలింపునివ్వాలి.. కేంద్ర ప్రభుత్వం లారీ పరి శ్రమలకు కొన్ని సడలింపులివ్వాలి. లారీ లపై జరిమానాలు విధింపు తగ్గించాలి. జీఎస్టీ మినహాయింపులు ప్రకటించాలి. లేక పోతే అంతంత మాత్రంగా సాగుతున్న ఈ పరిశ్రమ మరింత కునారిల్లక తప్పదు. – కర్రి మహేష్, సాలూరు లారీ ఓనర్ల సంఘం మాజీ జాయింట్ సెక్రటరీ, లారీ యజమాని -
రాజకీయ హత్య..!
సాక్షి, సాలూరు: ప్రశాంతమైన సాలూరు నియోజకవర్గంలో హత్యా రాజకీయాలకు టీడీపీ నాయకులు తెరతీశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో తప్ప మిగిలిన అన్ని సమయాల్లోనూ సోదర భావంతో గడిపిన పల్లెల్లో రాజకీయ హత్యలకు పాల్పడడం కలకలం రేగుతోంది. పాచిపెంట మండలంలోని మోసూరు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ దళిత కార్యకర్త గండిపల్లి తవుడు (49) ఆదివారం రాత్రి హత్యకు గురైనట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో తవుడు వైఎస్సార్ సీపీ తరఫున చురుగ్గా పాల్గొనడం, టీడీపీ ఓటమి పాలవ్వడంతో గ్రామానికి చెంది న టీడీపీ నాయకులే హత్య చేశారని మృతుడి భార్య అచ్చమ్మ, కుమారుడు సామయ్య, కుమార్తె దేవి, గ్రామస్తుడు, స్థానిక వైఎస్సార్ సీసీ రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకుడు గండిపల్లి రాము ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పశువుల కాపరి అయిన తవుడు ఆదివారం సాయంత్రం ఆవులను కట్టిన తరువాత గ్రామంలోని బీసీ కాలనీలో నిర్వహిస్తున్న వినాయక నిమజ్జనోత్సవంలో పాల్గొన్నాడు. నిమజ్జనం తర్వాత తవుడు ఇంటికి చేరలేదు. దీంతో కుటుంబ సభ్యులు వెతికారు. ఆచూకీ లభ్యం కాలేదు. సోమవారం ఉదయం స్థానిక శివాలయం సమీపంలో విగత జీవిగా దర్శనమిచ్చాడు. మృతుడి కుడిచేయి విరిగి ఉండడం, మెడ నులిపేయడంతో వాపురావడంతో హత్య చేసినట్లుగా కుటుంబ సభ్యులు అనుమానించారు. పోలి సులకు సమాచారాన్ని అందించారు. దీంతో ఎస్ఐ గంగరాజు, సీఐ సింహాద్రినాయుడులు ఘటనా స్థలా న్ని పరిశీలించారు. దర్యాప్తు చేస్తామని తెలిపి శవపంచనామాకు సహకరించాలని కోరారు. నిందితులును పట్టుకునేంత వరకు మృతదేహాన్ని తరలించేందుకు అంగీకరించమని మృతుడి కుటుంబీకులు, స్థానిక నాయకులు స్పష్టం చేశారు. దీంతో పోలీసులు విజ యనగరం నుంచి క్లూస్ టీం, శ్రీకాకుళం నుంచి డాగ్‌స్క్వాడ్‌లు తెప్పించారు. ఓఎస్డీ రామ్మోహనరావు, ఏఎస్పీ సుమిత్‌గర్గ్‌లు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసుకు సంబంధించి అనుమానితులను విచారిస్తున్నట్టు సమాచారం. వైఎస్సార్ సీపీ నాయకుల పరామర్శ .. సమాచారం తెలియగానే ఘటనా స్థలానికి వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డోలబాబ్జి, పార్టీ మండలాధ్యక్షుడు గొట్టాపు ముత్యాలునాయుడు, పార్టీ రాష్ట్ర బీసీ సెల్ నాయకుడు సలాది అప్పలనాయుడు, మాజీ వైస్ ఎంపీపీ తట్టికాయల గౌరీశ్వరరావు, పార్టీ నియోజకవర్గ కన్వీనర్ మధుసూదనరావు, నాయకులు పెద్దిబాబు తదితరులు చేరుకున్నారు. బాధిత కుటుంబీకులను ఓదార్చారు. ఇది రాజకీయ హత్యగా అనుమానం వ్యక్తం చేస్తూ నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకుడు గండిపల్లి రాము డిమాండ్ చేశారు. నిందితులను పట్టుకోవాలి... ఈ ఘటనపై ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ఫోన్లైన్లో మాట్లాడుతూ ఇది రాజకీయ హత్యగానే అనుమానిస్తున్నామని, ఈ కోణంలో అధికారులు దర్యాప్తు చేపట్టాలని ఫోన్లో కలెక్టర్, ఎస్పీలను కోరారు. మృతుడి కుటుంబానికి పార్టీ పరంగా అండగా ఉంటామని స్పష్టం చేశారు. -
వృద్ధురాలి హత్య..!
సాక్షి, సాలూరు రూరల్: బంగారం కోసం వృద్ధురాలి ని హతమార్చిన సంఘటన ఆదివారం తెల్లవా రుఝామున సాలూరు పట్టణంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి స్థానికులు, పోలీ సులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని దాసరివీధిలో గెంబలి శకుంతల (68) ఒంటరిగా నివాసముంటోంది. ఈమెకు ఇద్దరు కుమారులున్నారు. ఒక కుమారుడు విశాఖలో ఆటోడ్రైవర్‌గా పనిచేస్తుండగా.. మరో కుమారు డు త్రినాథరావు సాలూరులోనే ఓ టైర్ల దుకా ణంలో పనిచేస్తున్నాడు. త్రినాథరావు సాలూరులో వేరేగా ఉంటుండడంతో శకుంతల ఒంటరి గా నివశిస్తోంది. ఇదిలా ఉంటే త్రినాథరావు కుమారుడు తేజవిజయ్ (17) ఆదివారం కావడంతో నాన్నమ్మను చూసేందుకు తెల్లవారు 6 గంటలకు ఇంటికెళ్లి తలుపుకొట్టాడు. నాన్న మ్మ స్పందించకపోవడంతో తలుపు తీసుకుని ఇంటిలోకి వెళ్లి చూడగా విగతజీవిగా పడి ఉంది. వెం టనే విజయ్ తండ్రికి ఫోన్ చేయగా.. త్రినాథరావు హుటాహుటిన ఇంటికి చేరుకుని వెంటనే విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. ఎస్పీ రాజకుమారి, ఏఎస్పీ గౌతమీశాలి సంఘటనా ప్రాంతానికి చేరుకుని వివరాలు సేకరించారు. బంగారం కోసమేనా..? బంగారం కోసమే దుండగులు వృద్ధురాలిని హత్యచేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ఒంటి మీద ఉండాల్సిన 8 తులాల ఆభరణాలు లేకపోవడంతో దోపిడీ, హత్య, తదితర కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్పీ రాజకుమారి తెలిపారు. అలాగే సమీపంలో ఉండే సీసీ పుటేజీలను పరిశీలించి నిందితులను పట్టుకుంటామన్నారు. వివరాల సేకరణలో క్లూస్‌టీమ్.. హంతకుల ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు క్లూస్ టీమ్ సభ్యులతో పాటు జాగిలాన్ని రంగంలోకి దించారు. జాగిలం హత్య జరిగిన ప్రదేశం నుంచి మెయిన్ రోడ్డు వరకు వెళ్లి ఆగిం ది. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కార్యక్రమంలో సీఐ సింహాద్రినాయుడు, పట్టణ ఎస్సై శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. -
రాఖీ కట్టేందుకు వచ్చి...
సాక్షి, పాచిపెంట(సాలూరు): సోదరుడికి రాఖీ కట్టేందుకు అత్తవారింటి నుంచి రాష్ట్రం దాటి వచ్చిన చెల్లెలు అన్న వద్దే అనారోగ్యంతో మృత్యు కౌగిలికి చేరుకుంది. మృతురాలి తోటికోడలు దమయంతి, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం... ఒడిశా రాష్ట్రం కల్హండి జిల్లా ముఖీగుండికు చెందిన సిల్ పార్వతి (32) తన అన్న గణేష్‌కు రాఖీ కట్టేందుకు సాలూరు పట్టణంలోని బోను మహంతివీధికి ఈ నెల 14న వచ్చింది. జ్వరంతో బాధపడుతున్న ఆమెను ఈ నెల 16, 21 తేదీలలో సాలూరు పట్టణంలోని రెండు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చూపించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో పార్వతిని విజయనగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి ఈ నెల 24న తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం పది గంటల సమయంలో మృతి చెందింది. వైరల్ ఫీవర్, డెంగీతో మరణించిందని దయయంతి, మృతురాలి సోదరుడు గణేష్ తెలిపారు. మృతురాలికి భర్త పవిత్రో, పిల్లలు హుస్సేన్, వైష్ణవి ఉన్నారు. మున్సిపల్ కమిషనర్ నూకేశ్వరరావు మాట్లాడుతూ, పార్వతి మృతికి సంబంధించి వైద్యుల నుంచి రిపోర్టులు తెప్పించుకుంటామని చెప్పారు. బిడ్డకు సైతం.. మృతురాలు పార్వతి కుమారుడు హుస్సేన్ (3) సైతం అనారోగ్యంతో బాధపడుతున్నాడు. పార్వతి మృతదేహాన్ని ఆదివారం ఖననం చేసి హుస్సేన్‌ను కుటుంబ సభ్యులు విజయనగరం ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆరు డెంగీ అనుమానిత కేసులు.. ఈ క్రమంలో సాలూరు సీహెచ్‌సీ నుంచి ఆరు డెంగీ అనుమానిత కేసులను విజయనగరం కేంద్రాస్పత్రికి రిఫర్ చేసినట్లు వైద్యాధికారి దిలీప్‌కుమార్ అన్నారు. సాలూరు పట్టణానికి చెందిన ఎస్.రమాదేవి, హుస్సేన్, పాచిపెంట, సాలూరు మండలాలకు చెందిన జి.రాధ, బి.శ్యామల, యు.సీతారాం, యు.పైడిరాజులను కేంద్రాస్పత్రికి పంపించామన్నారు. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. -
గాల్లో విమానం.. పడిపోయిన ఇంధన ట్యాంక్!
చెన్నై: భారత వైమానిక దళానికి చెందిన విమానం గాలిలో ఉండగానే ఇంధన ట్యాంక్ కింద పడిపోయిన ఘటన కలకలం రేపింది. తమిళనాడులోని ఓ పొలంలో జెట్ ఇంధన ట్యాంక్ పడిపోవడంతో అధికారులు విచారణకు ఆదేశించారు. ఈ ఘటన మంగళవారం ఉదయం కోయంబత్తూరులో చోటు చేసుకుంది. సులూరు వైమానిక దళానికి సమీపంలో ఉన్న పొలంలో ఇంధన ట్యాంక్ పడిపోవడం గమనించి వెంటనే అప్రమత్తమైన పైలట్.. దానిని సురక్షితంగా నేలపైకి దింపాడు. దీంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం గానీ, పేలుళ్లు గానీ సంభవించలేదని వైమానిక దళం అధికారులు వెల్లడించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపారు. కాగా ఐఏఎఫ్‌నకు చెందిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌ను పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. గాల్లోనే ఇంధనం నింపగలిగే సామర్థ్య పరీక్షను తేజస్ గతేడాది విజయవంతంగా పూర్తి చేసి అరుదైన ఘనత సాధించింది. -
విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
విజయనగరం : ఖరీఫ్ సీజన్ ప్రారంభవనున్న నేపథ్యంలో సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర రైతులకు ఆదివారం విత్తనాలు పంపిణీ చేశారు. సాలూరు మండల ఏవో కార్యాలయం ఆవరణలో విత్తనాల పంపిణీ అనంతరం మీడియాతో మాట్లాడారు. సీజన్ ప్రారంభం అవుతున్నందున ప్రభుత్వం విత్తనాల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని అన్నారు. మండలంలోని సుమారు ఏడువేల మంది రైతులకు గాను 60 టన్నుల వరి విత్తనాల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారని వెల్లడించారు. రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పారు. వైఎస్సార్ రైతుభరోసా పథకం కింద ప్రతియేడు మే నెల వచ్చేనాటికి రూ.12,500 రైతుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే బండుకొండ అప్పలనాయుడు పూసపాటిరేట, భోగాపురం మండలాల రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. వేతనాలు పెంచండి.. ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణిని గోపాలమిత్ర యూనియన్ నాయకులు జియ్యమ్మవలస మండలం చినమేరంగిలో కలిశారు. తమకు వేతనాలు పెంచాలని వినతిపత్రం సమర్పించారు. -
రీపోలింగ్ నిర్వహించాలి
సాలూరు: సాలూరు మండల పరిధిలోని కొఠియా వివాదాస్పద గ్రామాల గిరిజనులను ఓటేయకుండా అడ్డుకుని తిప్పిపంపిన ఎన్నికల అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోపాటు రీపోలింగ్ నిర్వహించాలని ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థి పీడిక రాజన్నదొర డిమాండ్ చేశారు. గురువారం సాయంత్రం నేరెళ్లవలస పోలింగ్ కేంద్రంలో తమను ఓటేయనీయకుండా అడ్డుకుని, ఎన్ని కల అధికారులు తిప్పి పంపించారని ఎమ్మెల్యేకు పలువురు గిరిజనులు ఫిర్యాదు చేశారు. మాజీ సర్పంచ్ బీసు ఆధ్వర్యంలో కలిసి తమ వేదన వినిపించారు. స్పందించిన ఎమ్మెల్యే వారితో కలిసి కాలినడకన తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడున్న ఎన్నికల సహాయ రిటర్నింగ్ అధికారి కనకారావుకు విషయాన్ని వివరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఒకరిద్దరు ఒడిశాలో ఓటేసినవారు పోలింగ్ కేంద్రాలకు వస్తే, అందర్నీ తిప్పి పంపించడం దారుణమన్నారు. గతంలో జరిగి న ఎన్నికల్లో ఒడిశాలో ఓటేసి, ఇక్కడ ఓటేసేందుకు వచ్చేవారని, అలాగే ఇక్కడ ఓటేసి, అక్కడకు కూడా గిరిజనులు వెళ్లేవారన్నారు. ఓటరు స్లిప్పులు, గుర్తింపు కార్డులతో వెళ్లినా ప్రిసైడింగ్ అధికారులు ఓటేయనీయకుండా అడ్డుకోవడం ఓటరు ప్రాథమిక హక్కును హరించడమేనన్నారు. టీడీపీ నాయకులతో కుమ్మక్కై కుట్ర చేశారని, బాధ్యులపై చర్యలు తీసుకోవడంతోపాటు రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేకుంటే సుప్రీంకోర్టుకు వెళతామని హెచ్చరించారు. విషయాన్ని రిటర్నింగ్ అధికారి సుబ్బారావుకు తెలిపేందుకు ఫోన్ చేస్తే ఆయన అందుబాటులోకి రాకపోవడంతో జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేయగా స్విచ్ఆఫ్ వస్తోం దన్నారు. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్‌కు ఫోన్ చేసినా స్పందన లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరురాష్ట్రాల వివాదం కారణంగా నలి గిపోతున్న అమాయక గిరిజనుల విషయంలో ఇలా వ్యవహరించడం తగదన్నారు. రాజన్నదొర వెంట పార్టీ రాష్ట్ర నాయకుడు జరజాపు ఈశ్వరరావు, పార్టీ పట్టణ అధ్యక్షుడు సూరిబా బు, అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ పువ్వల నాగేశ్వరరావు తదితరులున్నారు. -
విలువలు, విశ్వసనీయతకు పట్టం కట్టాలి : వైఎస్ విజయమ్మ
-
విలువలు, విశ్వసనీయతకు పట్టం కట్టాలి : వైఎస్ విజయమ్మ
సాక్షి, విజయనగరం : ఈ ఎన్నికలు న్యాయానికి అన్యాయానికి, దర్మానికి అధర్మానికి, అవకాశవాదానికి.. మాటమీద నిలబడేవారికి మధ్య జరగుతోందని, విలువలకు విశ్వసనీయతకు పట్టం కట్టాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రజలను కోరారు. సాలూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. ‘మన అనుబంధం దాదాపు 40 ఏళ్లది. రాజశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశారు. ఆయన అధికారంలోకి వచ్చిన తరువాత.. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలనుకున్నారు. కుల మత ప్రాంతాలకు అతీతంగా అందరికీ సంక్షేమా పథకాలు అందాలనుకున్నారు. ఆయన పాలనలో ఒక్క పైసా పన్ను కూడా పెరగలేదు’అని అన్నారు. విజయమ్మ మాట్లాడుతూ.. ‘ప్రస్తుత పాలనలో అక్రమం, దౌర్జన్యం, మోసం మాత్రమే ఉన్నాయి. ఆనాడు వృద్దుల కోసం ఫించను తీసుకొచ్చారు. రైతే రాజు కావాలని, వ్యవసాయం పండగ చేయాలని జలయజ్ఞం తీసుకొచ్చారు. మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్‌పై పెట్టారు. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు మొదలు పెట్టిన ప్రాజెక్ట్‌లే.. ఇంకా పూర్తి చేయలేకపోయారు. డ్వాక్రా మహిళలను ఆదుకున్నారు. ఆరోగ్య శ్రీ, 108 పథకాలు ఎంతో మంది ప్రాణాలు కాపాడాయి. ప్రతీ పేదవాడి పిల్లలు చదువుకోవాలని ఫీరీయింబర్స్మెంట్ తీసుకొచ్చారు. ఆనాడు కేంద్రప్రభుత్వం గ్యాస్‌పై రూ.50 పెంచితే.. ప్రభుత్వమే భరించింది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఒక్క ప్రాజెక్ట్‌కూడా పూర్తి కాలేద’ని విమర్శించారు. ‘ఆ ప్రభుత్వాన్ని చూసి అన్నివర్గాల వారు సంతోషంగా ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి గారు లేకపోవడం వల్ల నాకు వచ్చిన నష్టం కంటే.. మీకు కలిగిన నష్టమే ఎక్కువ అని అనిపిస్తూ ఉంటుంది. ఆరోజు.. అసెంబ్లీ సమావేం అయింది. వర్షం ఎక్కువగా ఉంది.. ఈ సమయంలో వెళ్లడం అవసరమా అని అన్నాను. కానీ ఆయన వినలేదు. ప్రజలకు ఏం కావాలో తెలుసుకోవాలి అని బయల్దేరారు. ఆయన పోయాక అందరూ మమ్మల్ని వదిలివెళ్లారు.. కానీ మీరు మాత్రం వదల్లేదు. జగన్.. ఓదార్పు చేయడానికి వెళ్తే.. జగన్‌కే ఓదార్పు ఇచ్చారు.. అది నేను ఎప్పటికీ మరవలేన’ని అన్నారు. ‘ఆయనపై ప్రజలు ఇంత అభిమానం చూపటం కాంగ్రెస్‌కు నచ్చలేదు. ఆయన చనిపోయాక.. రాజకీయాల్లో రావాలని అనిపించలేదు.. మీరు చూపించే ప్రేమ కోసమే రాజకీయాల్లోకి రావాలని అనుకున్నాను. ఎన్ని రకాలుగా బాధలు పెట్టినా.. జగన్ కదల్లేదు.. స్థిరంగా ఉన్నాడు. ప్రత్యేక హోదా కోసం అనేక పోరాటాలు చేశారు. ఎక్కడ ఎవరికీ ఏ కష్టం వచ్చినా.. జగన్ వచ్చేవాడు. నా బిడ్డ మీ అందరికీ అండగా ఉంటాడు.. జగన్ బాబు ఏదైనా అనుకుంటే సాధిస్తాడు.. జగన్‌ను జైల్లో పెట్టినప్పుడు.. 18 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ వచ్చినప్పుడు.. ఆ రోజు మీముందుకు రావల్సిన పరిస్థితి వచ్చింది. నాటి ఎన్నికల్లో 16మంది భారీ మెజార్టీతో గెలిచారు. అవతలివారికి డిపాజిట్లు కూడా రాలేదు. మాకు సమస్య వచ్చినప్పుడు మీరున్నారు.. మీకు కష్టమొస్తే మేమున్నాము.. చంద్రబాబు నాలుగేళ్లు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌తో పెట్టుకున్నారు. అప్పుడు చంద్రబాబే.. తల్లి కాంగ్రెస్ పిల్లకాంగ్రెస్ అని అన్నాడు. చంద్రబాబే ఇప్పుడు కాంగ్రెస్‌తో ఉన్నాడు. జగన్ బీజేపీతో, కేసీఆర్‌తో ఉన్నారని ప్రచారం చేస్తున్నారు. జగన్ ఎప్పుడూ ఒక్కడే.. సింహం సింగిల్‌గానే వస్తుంది. జగన్‌కు పొత్తు ఏదైనా ఉంటే.. అది ఆంధ్ర ప్రజానికంతోనే’ అని అన్నారు. -
సంక్షేమపాలన జగన్‌తోనే సాధ్యం
సాక్షి, సాలూరు: ఫ్యాన్ గుర్తుకు ఓటేసి, జగనన్న సంక్షేమ పాలన తీసుకురావాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర కోరా రు. మంగళవారం రాత్రి పట్టణంలోని 8,9 వార్డులపరిధిలోని గాంధీనగర్, మెట్టువీధి, కొంకివీధి, మహంతివీధి, మత్రాసువీధులలో పార్టీ పట్టణ అధ్యక్షుడు జరజాపు సూరిబాబు ఆధ్వర్యంలో ఇం టింట ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే అమలుచేయనున్న నవరత్నాల పథకాలను వివరించారు. చంద్రబాబు గత ఎన్నికల్లో ఇచ్చిన 600 హామీలలో ఏఒక్కటీ అమలు చేయలేదని, ఇంటికో ఉద్యోగంఇస్తానని నమ్మించి మోసం చేశారన్నా రు. యువత నిరుద్యోగులుగా కాలక్షేపం చేస్తున్నారన్నారు. జగన్ సీఎం కాగానే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తారని, పిల్లలను బడికి పంపించే తల్లులకు నెలకు రూ.500 నుంచి రూ.2వేల వరకు అందిస్తారన్నారు. మాటతప్పని రాజశేఖరరెడ్డి బిడ్డగా జగన్ కూడా ఇచ్చిన మాటను నిలుపుకుంటారని, అమలుచేయలేని హామీలను ఆయన ఇవ్వరన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ప్రచారానికి వచ్చిన రాజన్నదొరకు మహిళలు హారతులు పట్టారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు జరజాపు ఈశ్వరరావు, అర్బన్బ్యాంక్ మాజీ చైర్మన్ పువ్వల నాగేశ్వరరావు, పట్టణ నాయకులు కొంకి అప్పారావు, గొర్లె జగం, హరి స్వామినాయుడు, మున్సిపల్ వైస్‌చైర్మన్ కాకి రం గ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వంగపండు అప్పలనాయుడు, మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ గిరి రఘు, కౌన్సిలర్ నాగార్జున తదితరులు పాల్గన్నారు. జగన్‌కి ఒక్క అవకాశం ఇచ్చి ఆశీర్వదించండి పాచిపెంట: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డికి ముఖ్యమంత్రిగా ఒక్క అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని ఆపార్టీ రాష్ట్ర బీసీసెల్ నాయకుడు సలాది అప్పలనాయుడు, నాయకుడు ఇజ్జాడ అప్పలనాయుడు ప్రజలను కోరారు. మండలంలోని కొటికిపెంట పంచాయతీ గోగాడవలస, కోడికాళ్లవలస, గరేళ్లవలస గ్రామాల్లో సలాది అప్పలనాయుడు, కొటికిపెంట,మోదుగ, గొట్టూ రు పంచాయతీల్లో ఇజ్జాడ అప్పలనాయుడు వేర్వేరుగా మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహిం చారు. రాష్ట్రాభివృద్ధి జగన్‌తోనే సాధ్యమని, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. నవరత్నాలతో నవశకానికి నాంది మెంటాడ: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రకటించిన నవరత్నాలు నవశకానికి నాంది పలకనున్నాయని ఆపార్టీ మండల అధ్యక్షుడు రెడ్డి సన్యాసినాయుడు అన్నారు. మండలంలోని గుర్ల గ్రామంలో పార్టీ నాయకులలో కలిసి మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన నవరత్నాల పథకాలను ప్రజలకు వివరించి..ప్యాన్గుర్తుకు ఓటేయాలని కోరారు. కార్యక్రమంలో యువజన విభాగం అధ్యక్షుడు రాయిపల్లి రామారావు, ప్రచార కన్వీనర్ కనిమెరక త్రినాథ, తిరుపతి, ఎంపీటీసీ చింతకాశీనాయుడు, దాట్ల హనుమంతురాజు, పల్లి అప్పలనాయుడు, పల్లి కన్నమ్మ, సతీష్, పుర్నాన అప్పలనాయుడు, డి.దేముడుబాబు, పుర్నాన రామునాయుడు పాల్గొన్నారు. -
మంత్రుల హామీలు.. నీటిమూటలు
సాక్షి, మెంటాడ: మండల కేంద్రంలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తామని నాలుగున్నరేళ్ల క్రితం టీడీపీ మంత్రులు, నియోజకవర్గానికి చెందిన ఆపార్టీ నాయకులు హామీ ఇచ్చారు. అయితే టీడీపీ ప్రభుత్వపాలనా కాలం పూర్తయినా కళాశాల ఏర్పాటుకు ఒక్క అడుగూ ముందుకు వేసిన పాపాన పోలేదు. మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో 2014 డిసెంబర్8న నిర్వహించిన జోన్–4 గ్రిగ్స్ క్రీడల ప్రారంభోత్సవానికి అతిథిగా హాజ రైన నాటి రాష్ట్ర గృహనిర్మాణ శాఖమంత్రి కిమిడి మృణాళిని, జిల్లా పరిషత్ చైర్పర్సన్ శోభాస్వాతిరాణికి మెంటాడలో బాలికలకు ప్రత్యేక హై స్కూల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరు చేయాలని కోరుతూ మండలవాసులు వినతిపత్రం అందజేశారు. అనంతరం మరోమారు మం డల కేంద్రంలో స్త్రీశక్తి భవనం ప్రారంభోత్సవం, చల్లపేటలో నిర్వహించిన స్వచ్ఛభారత్ కార్యక్రమానికి హాజరైన మృణాళిని, స్వాతిరాణి మాట్లాడుతూ జూనియర్ కళాశాల ఏర్పాటుకు నిధులు మంజూరు చేయించి పనులు పూర్తి చేయిస్తామని భరోసానిచ్చారు. మృణాళిని ఇచ్చిన హామీ అమలు కాకపోవడంతో టీడీపీ ఎమ్మెల్సీ గుమ్మడి సం ధ్యారాణి, మెంటాడ మాజీ వైస్ ఎంపీపీ, చల్లపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కమిటీ చైర్మన్ గెద్ద అన్నవరం, మండల టీడీపీ ప్రచార కన్వీనర్ రెడ్డిరాజగోపాల్ తదితరులు 2017 డిసెంబర్లో అమరావతిలో విద్య, మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావును కలిసి వినతిపత్రం అందజేశారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించి 2017–2018 విద్యాసంవత్సరం నుంచి జూనియ కాలేజ్ నిర్వహించే విధంగా ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వపాలనా కాలం ముగిసినా కళాశాల ఏర్పాటు కాకపోవడంపై మండల ప్రజలు మండిపడుతున్నారు. విద్యార్థులకు తప్పని అవస్థలు మెంటాడలో జూనియ కాలేజ్ ఏర్పాటు చేస్తే, మెంటాడ మండలంతో పాటు పక్కనే ఉన్న విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలానికి చెందిన 9 పంచాయతీలు, పాచిపెంట మండలంలోని పలుగిరిజన గ్రామాల విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. అనంతగిరి, పాచిపెంట, మెంటాడ మండలాల నుంచి ఏటా ఇంటర్‌విద్య కోసం సుమారు 12 వందల మంది విద్యార్థులు గజపతినగరం, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం, విశాఖపట్నం తదితర పట్టణాలకు వెళ్లి చదువుకుంటున్నారు. కొంతమంది విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లి చదువుకునే స్థోమత లేక మధ్యలోనే చదువుకు ఫుల్స్టాప్ పెడుతున్నారు. చదువులు మానుకోవాల్సి వస్తోంది మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ లేకపోవడంతో ఈప్రాంత పేదవిద్యార్థులు పదోతరగతి తర్వాత చదువుమానుకోవాల్సి వస్తోంది. నాయకులు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయారు. వందలమంది విద్యార్థులకు ఉపయోగపడుతుందని తెలిసి కూడి కళాశాల ఏర్పాటు చేయకపోవడం మంచిది కాదు. వచ్చే ప్రభుత్వమైనా కళాశాల ఏర్పాటు చేస్తే పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. –అగతాన త్రినాథ, మాజీ సర్పంచ్, లోతుగెడ్డ, మెంటాడ మండలం టీడీపీ ప్రభుత్వం విఫలమైంది మెంటాడలో జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైంది. నాటి, నేటి మంత్రులు మృణాళిని, గంటా శ్రీనివాసరావుతో పాటు ఈ ప్రాంత టీడీపీ నాయకులు ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి, జిల్లా పరిషత్ చైర్పర్స్న్ శోభా స్వాతిరాణి, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్.పి.భంజ్‌దేవ్ ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేకపోయారు. గిరిజనుల అభివృద్ధికి వీరు చేసింది శూన్యం. కనీసం విద్యార్థులు చదువుకునేందుకు కళాశాల కూడా ఏర్పాటు చేయలేకపోయారు. –అంజిలి పైడితల్లి, జీసీసీ మాజీ డైరెక్టర్, కొండపర్తి మెంటాడ మండలం -
బాబూ... ఇచ్చిన హామీలు గుర్తున్నాయా...!
గడిచిన ఎన్నికల సమయంలో సాలూరు వచ్చిన అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు తాము అధికారంలోకి వస్తే ఈ ప్రాంతవాసులకు ఏదేదో చేస్తామని హామీలు గుప్పించారు. ముఖ్యంగా లారీ పరిశ్రమకు పేరొందిన ఈ ప్రాంత లారీ యజమానులు, కార్మికుల సంక్షేమానికి కల్లబొల్లి హామీలన్నీ ఇచ్చేశారు. కానీ ఒక్క హామీ కూడా నెరవేర్చిన పాపాన పోలేదు. అదే సమయంలో ఈ ప్రాంత అభివృద్ధికి ఇచ్చిన హామీలు గాలిలో కలిసిపోయాయి. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఇదే ప్రాంతానికి గురువారం సీఎం హోదాలో చంద్రబాబు వస్తున్నారు. ఇప్పుడు మళ్లీ అవే హామీలిస్తారా! కొత్తవి ఇస్తారా! ఏమైనా ఇక బాబును నమ్మం బాబూ...అంటున్నారు. సాక్షి, సాలూరు: ప్రతిపక్ష నాయకుడిగా 2014 ఎన్నికల ప్రచారానికి సాలూరు వచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సాలూరు నియోజకవర్గం అభివృద్ధికి, ప్రధానంగా లారీ పరిశ్రమ, యజమానులు, కార్మికుల సంక్షేమానికి ఏవేవో చేసేస్తానని హామీలను గుప్పించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి అయిన తర్వాత వాటి ఊసే ఎత్తకుండా ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసేశారు. మళ్లీ ఎన్నికలు రావడంతో మాకే ఓట్లేయాలని ఎప్పటిలాగే ప్రచారానికి రోడ్ షో పేరుతో గురువారం సాలూరు పట్టణానికి సీఎం వచ్చేస్తున్నారు. ఇచ్చిన హామీలు ఆయనకు, ఆ పార్టీ నాయకులకు గుర్తున్నాయో... లేదోగానీ నియోజకవర్గం ప్రజలకు మాత్రం మదిలోనే మెదులుతున్నాయి. అప్పట్లో పట్టణంలోని బోసుబొమ్మ జంక్షన్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ సంక్షోభంలో వున్న లారీ పరిశ్రమను అన్ని విధాలుగా ఆదుకుంటానన్నారు. ఆటోలు, జీపులు, లారీల కొనుగోలుకు రాయితీపై రుణాలను మంజూరు చేస్తామన్నారు. లారీ పరిశ్రమకు అనుబంధ పరిశ్రమలను స్థాపించి, కార్మికులకు ఉపాధి కల్పిస్తామన్నారు. ఆటోనగర్‌ను అభివృద్ధి చేస్తామని ఆర్భాటంగా చెప్పారు. మోటారు పరిశ్రమపైనే ఆధారపడ్డ కుటుంబాలు సాలూరులో ఎక్కువుగా వున్నందున పదో తరగతి పాసవ్వకపోయినా డ్రైవింగ్ లైసెన్స్‌లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. 40ఏళ్లుగా సాలూరు పట్టణవాసులు కలగంటోన్న బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తి చేసి, దానిగుండానే సాలూరు వస్తానన్నారు. సంధ్యారాణి విజ్ఞప్తి మేరకు అరకు రహదారిని పూర్తి చేస్తామని ప్రకటించారు. వంద పడకల ఆస్పత్రిగా సాలూరు ప్రభుత్వ ఆస్పత్రిని మారుస్తామన్నారు. ఇచ్చిన హామీలను ఏ మేరకు అమలు చేసారో చంద్రబాబు చెప్పాలన్న డిమాండ్ వ్యక్తమౌతోంది. లారీ పరిశ్రమ అభివృద్ధికి ఒక్క ప్రయత్నం కూడా చేయలేదన్న వాదన వినవస్తోంది. అలాగే సాలూరు బైపాస్ రోడ్డుకు రైతులు ఆనందంగా భూములిచ్చినా, ఆపై రెండేళ్లుగా కదలిక లేకుండాపోయిందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆటోనగర్ పరిస్థితి కూడా మొండిగోడలు, అరకొర సౌకర్యాలతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఏమాత్రం పురోగతి లేకుండా మిగిలి వుంది. వంద పడకల ఆస్పత్రి హామీని మాత్రం ఎన్నికల కోడ్ నేడో, రేపో కూసేస్తుందన్న సమయంలో ప్రకటించారే తప్ప, ప్రజలపై అభిమానంతో కాదని స్థానికులు చర్చించుకుంటున్నారు. మళ్లీ చంద్రబాబు రోడ్‌షో పేరుతో అదే బోసుబొమ్మ జంక్షన్‌కు వస్తున్నందున మళ్లీ అవే హామీలు ఇస్తారా?, ఇంకేమైనా కొత్త హామీలు కురిపిస్తారా...! అన్న చర్చ జరుగుతోంది. హామీలు నీటి మూటలయ్యాయి... చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలు గానే మారాయి. విజయవాడ తర్వాత లారీ పరిశ్రమకు పెట్టింది పేరైన సాలూరులో లారీ పరిశ్రమను నమ్ముకుని జీవనం సాగిస్తున్న వారే ఎక్కువుగా వున్నారన్న విషయం తెలుసుకుని ఓట్లు కోసం గాలమేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల ఊసే పూర్తిగా మరిచిపోయారు. పట్టణ ప్రభుత్వ ఆస్పత్రిని వంద పడకల ఆస్పత్రిగా మారుస్తామన్న హామీని పదవీకాలం ముగుస్తోన్న తరుణంలో జీఓను ఇచ్చారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తునే వున్నారు. మళ్లీ కల్లబొల్లి కబుర్లు చెబితే నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. – జరజాపు సూరిబాబు, వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారు... ముఖ్యమంత్రి అయితే ఎంతో మేలు చేసేస్తానని నమ్మించి గత ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నారు. కానీ ఏమీ చేయలేదు. సాలూరు ప్రాంతవాసులను వంచించారు. మళ్లీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు దండుకోవడానికి వస్తున్నారు?. సాలూరు నియోజకవర్గం వాసులకు చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ గుర్తున్నాయి. హామీలను నెరవేర్చకుండా మళ్లీ ప్రజల ముందుకు రావడం ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి తగదు. – పువ్వల నాగేశ్వరరావు, వైఎస్సార్ సీపీ బీసీ విభాగం నియోజకవర్గ కన్వీనర్ -
సాహో..సాలూరు
ఒడిశాకు ఆనుకున్ని ఉన్న సాలూరు నియోజకవర్గానికి ఎంతో విశిష్టత ఉంది. రాష్ట్రంలో అతి పెద్ద లారీ పరిశ్రమ విజయవాడలో ఉండగా సాలూరు రెండో స్థానంలో ఉంది. సాలూరులో ఎక్కువ మంది గిరిజనులే ఉన్నా రాజకీయంగా చైతన్యవంతులనే చెప్పాలి. నమ్మితే అందలం ఎక్కించడం.. అపనమ్మకం కుదిరితే దించేయడం ఇక్కడ సర్వసాధారణం. పీడిక రాజన్నదొర, భంజ్‌దేవ్‌లు చెరో మూడుసార్లు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. ప్రస్తుత ఎన్నికల్లో కూడా వీరిద్దరే బరిలో ఉండగా.. సాలూరు వాసులు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాలి. సాక్షి ప్రతినిధి, విజయనగరం: సాలూరు నియోజకవర్గంలో రాజకీయ పోరు రసవత్తరంగా మారింది. గిరిజనులకు కేటాయించిన ఈ అసెంబ్లీ స్థానానికి వైఎస్సార్సీపీ, టీడీపీ నుంచి సీనియర్ నాయకులే ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. ఈ ఇద్దరూ ఈ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన వారే కావడం ఒక చిత్రమైతే.. అవినీతి, నిజాయితీలకు చెరొకరూ బ్రాండ్ అంబాసిడర్లు కావడం మరో విశేషం. అభ్యర్థుల బలాబలాలతో పాటు, ఆయా పార్టీలకు ప్రజల్లో ఉన్న ఆదరణ కూడా వారి గెలుపోటములను ప్రభావితం చేయనుంది. అవినీతి..వివాదాలు: అసలు సిసలు గిరిజనుడైన రాజన్నదొర సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేసినా ఎలాంటి అవినీతి మరక అంటించుకోలేదు. నీజాయితీపరుడిగా.. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే నాయకుడిగా పేరుతెచ్చుకున్నారు. భంజ్‌దేవ్ అసలైన గిరిజనుడు కాదన్న వివాదం నడుస్తూనే ఉంది. ఇటీవలే ప్రభుత్వం తమది కావడంతో తాను ఎస్టీ అంటూ జీఓ తెచ్చుకున్నారు భంజ్‌దేవ్. అయితే దానిని సవాల్ చేస్తూ రాజన్నదొర హైకోర్టుకు వెళ్లడంతో భంజ్‌దేవ్ కులవివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. తాను కొండరాజు కులానికి చెందినవాడినంటూ భంజ్‌దేవ్ వాదిస్తుండగా, అసలు భారత రాజ్యాంగంలో కొండరాజు పేరుతో ఎస్టీ జాబితాలో కులం లేదని రాజన్నదొర చెబుతున్నారు. చేపలచెరువులు, ప్రభుత్వ, గ్రామదేవత భూములను ఆక్రమించుకున్నారన్న ఆరోపణలు భంజ్‌దేవ్‌పై ఉన్నాయి. వాటిపై నెలకొన్న వివాదాలు కూడా ఆయన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు సాలూరు నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా ఉండేది. రాజన్నదొర కోర్టు తీర్పుతో ఎమ్మెల్యేగా పదవిని చేపట్టిన నాటి నుంచి టీడీపీ కోటకు బీటలువారాయి. తెలుగుదేశం పార్టీకి నియోజకవర్గంలో గడ్డుపరిస్థితి వచ్చేలా చేసింది రాజన్న దొర పనితీరు. ఓటర్ల మద్దతును కూడగట్టుకోవడంలో రాజన్నదొర విజయం సాధిస్తున్నారు. ఈసారి రాజన్నదొర జగన్‌కు ముఖ్యమంత్రిగా ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతూనే.. భంజ్‌దేవ్ అవినీతి, కులవివాదాన్ని తనకు అనుకూల అస్త్రాలుగా మార్చుకుంటున్నారు. భంజ్‌దేవ్ మాత్రం తనకు ఇవే చివరి ఎన్నికలంటూ ఎలాగైనా గెలవాలని నానా పాట్లు పడుతున్నారు. హ్యాట్రిక్ వీరులు.. భంజ్‌దేవ్ 1994లో తొలిసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి విక్రమచంద్ర సన్యాసిరాజుపై గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. మళ్లీ 1999లో జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణిపై పోటీచేసి గెలుపొందారు. ఆపై 2004 ఎన్నికల్లో పీడిక రాజన్నదొర (కాంగ్రెస్)పై గెలిచి హ్యట్రిక్ సాధించారు. అయితే ఆ ఎన్నికల్లో భంజ్‌దేవ్ గిరిజనుడు కాదంటూ ఎన్నికల పిటీషన్‌ను హైకోర్టులో రాజన్నదొర వేయడం, గెలవడంతో 2006లో రాజన్నదొర గెలిచినట్టుగా కోర్టు ప్రకటించింది. దీంతో తొలిసారి రాజన్నదొర ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. మళ్లీ 2009లో జరిగిన ఎన్నికల్లో రాజన్నదొర (కాంగ్రెస్) టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన సంధ్యారాణిపై గెలుపొందారు. 2014లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ భంజ్‌దేవ్ టీడీపీ అభ్యర్థిగా రాజన్నదొరతో తలపడ్డారు. భంజ్‌దేవ్ ఓటమిపాలవడంతో రాజన్నదొర కూడా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించారు. నాలుగోసారి వీరిద్దరూ పోటీ పడుతున్నారు. ఇద్దరి మధ్యే పోటీ.. సాలూరు అసెంబ్లీ నియోజకవకర్గంలో ఇద్దరు హ్యాట్రిక్ వీరులు తలపడుతుండడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర పోటీ చేస్తుండగా.. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆర్పీ భంజ్‌దేవ్ తలపడుతున్నారు. వీరిద్దరూ వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేలుగా పదవులను చేపట్టినవారే. ఇతర పార్టీల అభ్యర్థులు పోటీకి తలపడుతున్నా, వీరిద్దరి మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం(ఎస్టీ) మొత్తం ఓటర్లు 1,82,778 మహిళా ఓటర్లు 98,319 పురుష ఓటర్లు 89,456 ఇతరులు 3 మొత్తం జనాభా 2,50,983 -
సాలూరు టీడీపీలో మూడుముక్కలాట!
సాలూరులో తెలుగుదేశం పార్టీ రాజకీయం రసకందాయంలో పడింది. అక్కడ మొదటినుంచీ భంజ్‌దేవ్, సంధ్యారాణి మధ్య అంతర్గత పోరునడుస్తుండగా... కొత్తగా స్వాతిరాణి అక్కడ పాగా వేయడానికి తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈ వ్యవహారాలు అక్కడి కేడర్‌ను అయోమయంలో పడేస్తున్నాయి. ప్రతిసారీ దేవ్, సంధ్యల నడుమ ఆధిపత్యపోరు బహిర్గమవుతూనే ఉంది. అధిష్టానం ఆదేశించినా... వారి మధ్య అగాధం తగ్గలేదు సరికదా పెరుగుతూ వస్తోంది. ఇదే అదనుగా అక్కడ స్వాతిరాణి అడుగు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈమేరకు ఆమె భర్త పావులు కదుపుతున్నారు. సాక్షిప్రతినిధి, విజయనగరం: అధికారపార్టీని అంతర్గత విభేదాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఆధిపత్య పోరుతో ఆ పార్టీ మూడు ముక్కలైంది. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆర్.పి.భంజ్‌దేవ్, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ శోభా స్వాతిరాణిల మధ్య రాజకీయంగా మూడుముక్కలాట మొదలైంది. వీరెంత తన్నుకున్నా అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకు పెరుగుతున్న జనాదరణ మాత్రం తగ్గించలేకపోతున్నారన్నది స్పష్టమవుతోంది. 1951లో ఏర్పడ్డ సాలూరు నియోజకవర్గాన్ని షెడ్యూల్డు తెగలకు(ఎస్టి) రిజర్వ్ చేశారు. 2007–08లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తర్వాత సాలూరు, పాచిపెంట, మెంటాడ, మక్కువ మండలాలు ఈ నియోజకవర్గంలో భాగమయ్యాయి. ఇప్పటి వరకూ ఈ నియోజకవర్గంలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. 2004, 2009లో ఎమ్మెల్యేగా పనిచేసి 2014 ఎన్నికల్లో మరలా వైఎస్సార్సీపీ నుంచి గెలుపొందిన పీడిక రాజన్నదొర ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక వరుస పరాజయాలను చవిచూస్తున్న టీడీపీకి మాజీ ఎమ్మెల్యే రాజేంద్ర ప్రతాప్(ఆర్పి) భంజ్‌దేవ్, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి మాత్రమే పెద్దదిక్కుగా మిగిలారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సంధ్యారాణికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది. అదే అదనుగా నియోజకవర్గ టీడీపీలో పట్టు సాధించే ప్రయత్నాలను సంధ్యారాణి ముమ్మరం చేశారు. ఈ విషయాలు తెలుసుకున్న సీఎం చంద్రబాబు మాజీ ఎమ్మెల్యే భంజ్దేవ్నుటీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్గా నియమించారు. బహిర్గతమైన విభేదాలు ఈ పరిణామం తర్వాత సంధ్యారాణి బహిరంగంగానే తన అసంతృప్తిని వెళ్లగక్కారు. చివరికి పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా కూడా తాను వేరుకుంపటి అనే విషయాన్ని ఆమె స్పష్టం చేశారు. భంజ్‌దేవ్ ఆమెపై అధిష్టానానికి ఫిర్యాదు చేయగా... కొంతకాలం నియోజకవర్గ విషయాల్లో ప్రమేయం తగ్గించుకోమని అధిష్టానం పెద్దలు ఆమెను కట్టడిచేయడానికి చెప్పారు. కానీ పైకి తగ్గినట్లు కనిపిస్తూనే తెరవెనుక తన వర్గాన్ని ఆమె వృద్ధి చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇదే సందర్భంలో దేవ్ తనకే టిక్కెట్టు ఖరారైందంటూ ద్వితీయశ్రేణి నాయకులను నమ్మించి తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అతని ప్రయత్నాలకు పెద్దగా మద్ధతు లభించడం లేదు. మూడో ప్రత్యామ్నాయం భంజ్‌దేవ్ ఒడిశాకు చెందిన క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారని రికార్డులు చెబుతున్నాయి. ఆయన పూర్వీకులు సాలూరు వచ్చి స్థిరపడటంతో అతను ఎస్టీగా చెప్పుకుంటున్నారు. కానీ ఆయన ఎస్టీ కాదని రాజన్నదొర నిరూపించడంతో ఒకసారి ఎమ్మెల్యే పదవిని కూడా పోగొట్టుకున్నారు. మరోవైపు చేపల చెరువుల కోసం ప్రభుత్వ, దేవుడి భూముల ఆక్రమణ, పలు అవినీతి ఆరోపణలతో భంజ్‌దేవ్ ప్రతిష్ట మసకబారింది. అలాగే సంధ్యారాణికి నియోజకవర్గంలో అనుకూలమైన వర్గం ఉన్నప్పటికీ అది ఎన్నికల్లో విజయాన్నందించేంత పెద్దది కాదు. ఆమె సామర్ధ్యం కూగా ఎన్నికల్లో పార్టీకి విజయాన్ని చేకూర్చేంత గొప్పగా లేదు. ఈ నేపథ్యంలో సాలూరు టీడీపీకి మూడో ప్రత్యామ్నాయంగా మారవచ్చని జిల్లా పరిషత్ చైర్పర్సన్ శోభాస్వాతిరాణి రంగంలోకి దిగారు. పార్టీ టిక్కెట్టుకు యత్నాలు స్వాతిరాణి భర్త గణేష్‌కు సాలూరు సొంత నియోజకవర్గం కావడంతో తమ సామాజిక వర్గం, బంధుగణం ఓట్లతో గట్టెక్కేయొచ్చని భావించి పండుగలకు, పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు విరాళాలు గుప్పిస్తూ నియోజకవర్గ పార్టీలో ఎదగాలని చూస్తున్నారు.ఇవన్నీ సీటు కోసం చేస్తున్న గిమ్మిక్కులైనప్పటికీ భారీ ప్లెక్సీల ద్వారా లేని బలాన్ని ఉన్నట్లుగా అధిష్టానం పెద్దలకు చూపించుకోవడానికి స్వాతిరాణి వర్గం చేస్తున్న ప్రయత్నాలు భంజ్‌దేవ్‌కు నష్టం చేకూర్చేవిగానే ఉన్నాయి. అంతేగాదు చినబాబు మద్దతు కూడా స్వాతిరాణికే ఉందనే ప్రచారం జరుగుతోంది. నిజానికి జెడ్పీ చైర్‌పర్సన్‌గా చిన్నవయసులోనే పదవిలోకి వచ్చిన ఆమెకు సిట్టింగ్ ఎమ్మెల్యేను ఢీకొట్టేంత సామర్థ్యం లేదు. అధికారుల బదిలీలు, డెప్యుటేషన్ల విషయంలో కమీషన్లు తీసుకున్నారనే ఆరోపణలు ఆమెపైనా ఉన్నాయి. అయినా ఆమె భర్త గణేష్ వెనకుండి ఆమెను నడిపిస్తూ, తన సామాజిక వర్గం, ఆర్థిక వనరులను ప్రధానంగా నమ్ముకుని ఈసారి పార్టీ టిక్కెట్టు సాధించాలనుకుంటున్నారు. జనం మదిలే ఇప్పటికే ఓ ముద్ర సాలూరు నియోజకవర్గంలో మూడోసారి ఎమ్మెల్యే పదవి చేపట్టినా ఎలాంటి అవినీతి మరక తనపై పడకుండా ప్రజాబలమున్న నాయకుడిగా ఎదిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాజన్నదొరను ఢీ కొట్టే సామర్ధ్యం స్వాతిరాణికే కాదు ఈ ముగ్గురిలో ఏ ఒక్కరికీ పూర్తి స్థాయిలో లేదన్నది సుస్పష్టం. అయినప్పటికీ వీరిలో ఎవరో ఒకరికి టీడీపీ అధిష్టానం టిక్కెట్టు ఇవ్వాలనుకుంటే ఆ ఒక్కరూ ఎవరనే గందరగోళం టీడీపీ వర్గీయుల్లో నెలకొంది. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ అవ్వడంతోనే టిక్కెట్టు ఖరారైపోయిందనుకుంటున్న భంజ్‌దేవ్‌కు మాత్రం ఇద్దరు రాణుల కారణంగా చివరికి అతని సీటుకే ఎసరొస్తుందేమోనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
జనసందోహంగా వైఎస్ జగన్ పాదయాత్ర
సాక్షి, విజయనగరం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసకల్పయాత్ర సాలూరు నియోజకవర్గంలో విజయవంతంగా సాగుతోంది. హత్యయత్నం నుంచి తృటిలో బయటపడిన వైఎస్ జగన్‌ను చూడాలని ఆడపడుచులు, వృద్దులు, పిల్లలు పెద్ద ఎత్తున కదలివస్తున్నారు. దీంతో పాదయాత్ర జనసందోహంగా మారింది. జగన్‌తో నడిచి తన కష్టలను ఆయనతో పంచుకుంటున్నారు. ఆయనకు దేవుడి దీవెనలు ఉండాలని, ఎన్ని అవరోధాలు వచ్చిన తాము అండగా ఉన్నామనే భరోసాను జగన్‌కు ఇస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం తరువాత సాలూరు నియోజకర్గంలో పాదయాత్ర ముగించుకుని పార్వతీపురం నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. పింఛన్లు రావడం లేదు.. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నా ప్రభుత్వం మంజూరు చేయడం లేదని కొయ్యనపేటకు చెందిన మహిళ జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి తిరిగినా అధికారుల్లో స్పందన ఏమాత్రం లేదని తెలిపారు. తమ గ్రామంలో అంగన్వాడీ కేంద్రానికి సొంత భవనం కూడా లేకపోవడంతో గ్రామంలోని పిల్లలు ఇంటి వద్దనే ఉంటున్నారని కొయ్యనపేటకు చెందిన గ్రామస్తులు జగన్‌కు వివరించారు. పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్‌ను మక్కువ మండలం తూరుమామిడి గ్రామస్తులు కలిశారు. ఆంధ్రా ఒడిషా సరిహద్దుల్లో ఉన్న తమ గ్రామానికి ఏళ్ల తరబడి అడిగినా కనీసం రోడ్డు సౌకర్యం కూడా కల్పించలేక పోయారని గ్రామస్థులు జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కళాశాలలో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవని మక్కువ ప్రభుత్వం జూనియర్ కళాశాల విద్యార్ధినులు జగన్‌కు వినతి పత్రం సమర్పించారు. -
296వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర
సాక్షి, విజయనగరం : రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 296వ రోజు ప్రారంభమైంది. సాలూరు నియోజకవర్గం కొయ్యనపేట నుంచి ప్రారంభమైన పాదయాత్ర.. కంచేడువలస క్రాస్, వెంకటభైరిపురం, బగ్గందొర వలస గెడలుప్పి జంక్షన్ మీదుగా తామరఖండి వరకు నేడు సాగనుంది. ఇప్పటి వరకు వైఎస్ జగన్ 3,218.3 కి.మీ నడిచారు.