బాబు పాలనలో రక్షణ లేదు: రాజన్నదొర
బాబు పాలనలో రక్షణ లేదు: రాజన్నదొర
Published Fri, Feb 12 2016 2:40 PM | Last Updated on Tue, May 29 2018 4:26 PM
సాలూరు రూరల్: గిరిజన బాలికపై సామూహిక అత్యాచారం చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రాజన్నదొర డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా మెంతాడ మండలం కొండలింగాలవలస గ్రామ పంచాయతీ పరిధిలోని మూలపాడులో ఓ గిరిజన బాలికపై గురువారం ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసిన విషయం తెలిసిందే.
నిందితులపై నిర్భయచట్టం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసులు పెట్టాలని ఎమ్మెల్యే కోరారు. చికిత్స పొందుతున్న బాధిత గిరిజన బాలికకు మెరుగైన వైద్య సేవలు అందేలా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బాధ్యతలు తీసుకోవాలన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యాచారాలు పెరిగిపోయాయని, గిరిజనులకు రక్షణ లేకుండా పోయిందన్నారు.
Advertisement
Advertisement