MLA Rajanna Dora
-
54 కిలోల కేక్‌ను కట్ చేసిన రాజన్నదొర
సాలూరు: ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు పీడిక రాజన్నదొర పుట్టిన రోజును కార్యకర్తలు, అభిమానులు శుక్రవారం వేడుకగా జరుపుకున్నారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న ఇండోర్ స్టేడియం ప్రాంగణంలోని వేదికపై అభిమానులు ఏర్పాటు చేసిన 54 కిలోల కేక్‌ను ఎమ్మెల్యే కట్ చేశారు. అభిమానులు, కుటుంబ సభ్యులకు పంచిపెట్టారు. పార్టీ రాష్ట్రనాయకుడు జరజాపు ఈశ్వరరావు పర్యవేక్షణలో, పార్టీ పట్టణ అధ్యక్షుడు జరజాపు సూరిబాబు ఆధ్వర్యంలో సాగిన వేడుకల్లో సాలూరు పట్టణంతోపాటు సాలూరు, పాచిపెంట, మక్కువ, మెంటాడ, రామభద్రపురం, కురుపాం, గుమ్మలక్ష్మీపురం తదితర మండలాల పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. రాజన్నదొరకు శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్సార్ సీపీ విజయనగరం జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్, పార్వతీపురం నియోజకవర్గం నాయకుడు జమ్మాన ప్రసన్నకుమార్, సాలూరు మండలం, పాచిపెంట, మెంటాడ మండలాల పార్టీ అధ్యక్షులు సువ్వాడ రమణ, గొట్టాపు ముత్యాలునాయుడు, రెడ్డి సన్యాసినాయుడు, సాలూరు జెడ్పీటీసీ, పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు రెడ్డి పద్మావతి, పాచిపెంట మండల జెడ్పీటీసీ సలాది అనురాధ, మెంటాడ మండల ఎంపీపీ సింహాచలమమ్మ, రాష్ట్ర ఎస్టీ విభాగం నాయకుడు అప్పారావు, పార్టీ రాష్ట్ర నాయకులు ముగడ గంగమ్మ, సలాది అప్పలనాయుడు, జిల్లానాయకులు బాబ్జి, జైహింద్‌కుమార్, శ్రీను, త్రినాథ, డీసీసీబీ సభ్యుడు సురేష్, జిల్లా ట్రేడ్‌యూనియన్ అధ్యక్షుడు బుల్లెట్‌రాజు, మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ గిరి రఘు, జగం, రవి, మక్కువ మం డల నాయకుడు తిరుపతినాయుడు, వర్క్చార్జ్డ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు డీజీ ప్రసాద్, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, మున్సిపల్ ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు. సాలూరు సాహితీమిత్రబృందం అధ్యక్ష, కార్యదర్శులు జేబీ తిరుమలాచార్యులు, కిలపర్తి దాలినాయుడు వ్యాఖ్యానంతో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు వేడుకలు సందడిగా సాగాయి. -
ప్రత్యేక హోదాతోనే ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి
సాలూరు: దేశంలోని ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి చెందాయంటే అందుకు కారణం ప్రత్యేక హోదాయేనని ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర అన్నారు. బుధవారం ఆయన సిక్కిం రాష్ట్రం నుంచి విలేకరులతో ఫోన్లో మాట్లాడారు. అంచనాల కమిటీ సభ్యులుగా కమిటీ చైర్మన్ ఎం.వేణుగోపాలరెడ్డి ఆద్వర్యంలో స్టడీ టూర్ నిమిత్తం పశ్చిమబెంగాల్, సిక్కిం, త్రిపుర రాష్ట్రాలలో పర్యటిస్తున్నట్టు తెలిపారు. ఈ టూర్ ద్వారా ఆయా రాష్ట్రాలు అభివృద్ధి నిధుల కేటాయింపు, ఖర్చు చేస్తోన్న తీరుతెన్నులను పరిశీలిస్తున్నామన్నారు. ఈశాన్య రాష్ట్రాలు కేవలం ప్రత్యేక హోదా రాష్ట్రాలు కావడంతోనే అభివృద్ధి సాధ్యమౌతోందన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకహోదాతో ఏం ఒరుగుతుందని ప్రశ్నించారని, ఆయన ఆయా రాష్ట్రాలను చూస్తే ఏం ఒరుగుతుందో తెలుస్తుందన్నారు. కొండప్రాంతమైనా ఎంతగానో అభివృద్ధి చెందాయని తెలిపారు. పశ్చిమబెంగాల్లో గిరిజనుల అభివృద్దికి హిల్ కౌన్సిల్ ఏర్పాటుతో అక్కడి గిరిజనులు అభివృద్ధి చెందుతున్నారని, ఆ తరహాలో మన రాష్ట్రంలో గిరిజన ప్రాంత అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరనున్నామని తెలిపారు. ఈ తరహాలోనే సాలూరు ఏజెన్సీ ప్రాంతలోనున్న కొఠియా గ్రామాల అభివృద్ధికి నిధులు సమకూరాయన్నారు. దాదాపు 180కోట్ల రూపాయలను ఒడిశా ప్రభుత్వం కేటాయించిందని పేర్కొన్నారు. సిక్కిం రాష్ట్రంలో సాగవుతున్న టీ, కాఫీ తోటలలో 95శాతం విదేశాలకు ఎగుమతులవుతున్నాయని చెప్పారు. తమ టూర్ ద్వారా ఆయా రాష్ట్రాలు అభివృద్ధికి దోహదపడిన అంశాలను రాష్ట్ర ప్రభుత్వానికి కమిటీ ద్వారా నివేదించనున్నామని తెలిపారు. -
టీడీపీ ప్రజాప్రతినిధుల్ని నిలదీయండి
సాలూరు: ఎస్టీ జాబితాలో బోయలను చేర్చాలని నిర్ణయించిన టీడీపీ ప్రభుత్వానికి సహకరిస్తున్న టీడీపీ గిరిజన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను గిరిజనులు, గిరిజన సంఘాలు అడుగడుగునా నిలదీయాలని సాలూరు ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పీడిక రాజన్నదొర కోరారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ గుజరాత్ రాష్ట్రంలో మాదిరిగా లేని సమస్యను మన రాష్ట్రంలో ప్రభుత్వం కోరి తెచ్చి పెడుతోందన్నారు. కాపుల రిజర్వేషన్ల కోసం ముద్రగడ ప్రజా పోరాటంతోపాటు న్యాయపోరాటం చేస్తున్నారన్నారు. గిరిజనులు నిరక్షరాస్యులు, పేదవాళ్లు, అమాయకులు కావడంతో ఆ స్థాయిలో పోరాటం చేయడం లేదన్నారు. కానీ గిరిజనులు ఆ స్థాయిలో పోరాడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాదేనని సూచించారు. బోయ సామాజిక వర్గాన్ని ఓటు బ్యాంకుగా మార్చుకోడానికి ఎస్టీ జాబితాలో చేర్చేందుకు క్యాబినెట్ ఆమోదంతో పాటు అసెంబ్లీలో తీర్మానం చేయడం దుర్మార్గమన్నారు. ప్రస్తుతం ఎస్టీల జనాభా 26 లక్షలుంటే బోయ కులస్తుల జనాభా 30 లక్షలకు పైగా ఉందన్నారు. మైదాన ప్రాంతంలో అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన బోయలను ఎస్టీ జాబితాలో చేర్చడం ఎస్టీ కులంపై సామాజిక దాడి చేయించడమేన్నారు. వారిపై నిజంగా ప్రేమే ఉంటే ఓబీసీ, ఈబీసీ జాబితాలో చేర్చుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. జనరల్ సీట్లలో పోటీ చేశారా.. రాష్ట్రంలో ఒక్క జనరల్ సీట్లోనైనా పోటీ చేసి గెలిచిన గిరిజనుడున్నాడా? అని రాజన్నదొర ప్రశ్నించారు. బోయ కులస్తులు మాత్రం జనరల్ సీట్లలో పోటీచేసి, గెలుపొందారని, దానికి నిదర్శనం ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన కాల్వ శ్రీనివాసులేనని గుర్తు చేశారు. అగ్రవర్ణాలతో పోటీ పడుతున్న కులాన్ని అన్ని విధాలుగా వెనుకబడ్డ గిరిజనుల్లో చేర్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో లేని సమయంలో ప్రభుత్వం తీర్మానం చేసిందన్నారు. ఆ సమయంలో సభలోని టీడీపీ ఎమ్మెల్యేలు, శాసనమండలిలో ఎమ్మెల్సీలు కనీసం అభ్యంతరం కూడా తెలపకుండా ద్రోహం చేశారన్నారు. అందుకే గ్రామాలకు వచ్చే టీడీపీ గిరిజన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను నిలదీయాలని కోరారు. -
ప్రభుత్వ వైఫల్యాలపై ఇంటింటి ప్రచారం
గడపగడపకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని విజయవంతం చేయాలి సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర విజయనగరం: మహానేత, దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకొని ఈ నెల 8వ తేదీ నుంచి చేపడుతున్న గడపగడపకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విజయవంతం చేయాలని సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర పిలునిచ్చారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని కోరారు. మండలంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడారు. అమలు కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం.. ప్రజలను నిలువునా మోసం చేసిందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ శొంఠ్యాన సింహాచలమమ్మ, వైఎస్సార్ సీపీ మండల యువజన అధ్యక్షుడు రాయిపల్లి రామారావు, పోరాం ఎంపీటీసీ సభ్యులు చెల్లూరి లక్ష్మణరావు, పెదమేడపల్లి సర్పంచ్ యడ్ల అప్పలనాయుడు, గజపతినగరం ఏఎంసీ మాజీ చైర్మన్ పొరిపిరెడ్డి అప్పలనాయుడు, నాయకులు దాట్ల హనుమంతురాజు, కిలపర్తి మధు, చిన్నారావు తదితరలు పాల్గొన్నారు. -
'దొంగ సర్టిఫికేట్లతో లబ్ధిపొందుతున్నారు'
పార్వతీపురం : విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయం వద్ద వైఎస్ఆర్ సీపీ నాయకులు సోమవారం ధర్నాకు దిగారు. సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర, మాజీ ఎమ్మెల్యేలు నిమ్మక జయరాజ్, పాలక లక్ష్మణమూర్తి తదితరులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. కొంతమంది రాజకీయ నేతలు గిరిజనులని దొంగ సర్టిఫికేట్ తెచ్చుకుని రాజకీయంగా, ఉద్యోగాల పరంగా లబ్ధిపొందుతున్నారని విమర్శించారు. అలాంటి నకిలీ గిరిజనులను వెంటనే తొలగించారని కోరారు. కేసును సీబీఐకి అప్పగించి పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దొంగ సర్టిఫికేట్ లు జారీ చేసిన సబ్ కలెక్టర్ శ్వేతామహంతిపై విచారణ చేయించాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఖర్చు చేయకుండా అంకెల గారడీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వం గిరిజనులను నమ్మించి మోసం చేస్తున్నదని ఎమ్మెల్యే రాజన్న విమర్శించారు. -
గిరిజనులపై నేరాలు.. పట్టించుకోరా?
ఎస్సీ ఎస్టీలపై జరిగే నేరాలు తగ్గినట్లు హోం మంత్రి చెబుతున్నారు గానీ విజయనగరం జిల్లాలో గిరిజనుల మీద నేరాలు ఏమాత్రం తగ్గకపోగా పెరుగుతున్నాయని సాలూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రాజన్నదొర అన్నారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో భాగంగా మంగళవారం జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. సాలూరులో జనవరిలో ఇద్దరు గిరిజనులను సజీవ దహనం చేశారని, ఫిబ్రవరిలో సాలూరు నియోజకవర్గ పరిధిలోని మెంటాడ మండలంలో గిరిజన మహిళపై లైంగిక దాడి జరిగిందని, మార్చి 19న ఓ గిరిజనుడిని హత్య చేశారని ఆయన చెప్పారు. దళితులు, గిరిజనులపై నేరాలు పదే పదే జరుగుతున్నాయని, అందువల్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని తెలిపారు. బాధితులను ఆర్థికంగా కూడా ఆదుకోవాలని సూచించారు. నిందితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద కేసులు పెట్టి బాధితులకు, ముఖ్యంగా మహిళలకు న్యాయం చేయాలని రాజన్నదొర డిమాండ్ చేశారు. బాధితులలో అమ్మాయిలకు కనీసం ఉపాధి కల్పించాలన్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అత్యాచార బాధితురాలికి పరిహారంగా కేవలం రూ. 50 వేలు ఇచ్చి చేతులు దులుపుకొన్నారని, గిరిజినులు, దళితులపై జరిగే నేరాల్లో బాధితులను ఆర్థికంగా, సామాజికంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని ఆయన చెప్పారు. -
విశ్వసనీయతకు చిరునామా రాజన్న
సాలూరుః నీచ రాజకీయాలు రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో విలువలు, విశ్వనీయతే పరమావదిగా రాజకీయాలు చేస్తోన్న గొప్పవ్యక్తి ఎమ్మెల్యే రాజన్నదోర అని స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు స్పష్టం చే శారు. మంగళవారం ఎమ్మెల్యే ఇంటివద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వంగపండు అప్పలనాయుడు మాట్లాడుతూ టీడీపీ నాయకులను ధనబలం, అధికార బలంతో తన వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోందన్నారు. కానీ అలాంటి ప్రలోభాలకు లోంగక ప్రజల తీర్పును శిరసావహించి, పార్టీ మనుగడ కోసం, తాను కష్టాల్ని ఎదుర్కొవడానికి సిద్ధమైన గొప్పనాయకుడు మన రాజన్న అని కొనియాడారు. వైఎస్సార్ సీపీ మండలాధ్యక్షడు సువ్వాడ రమణ మాట్లాడుతూ తమ ఎమ్మెల్యే ఆస్తి, అంతస్థుల్లో పేదవాడైనా వ్యక్తిత్వంలో ధనికుడన్నారు. వైఎస్సార్ నాయకత్వంలో పనిచేసిన తమ ఎమ్మెల్యే ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంపై కూడా పూర్తి విశ్వాసం చూపిస్తున్నారన్నారు. టీడీపీ చేస్తున్న కుట్రపూరిత రాజకీయాలు రాజన్న వ్యక్తిత్వాన్ని దెబ్బతీయలేవన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రజల కష్టాలు రెట్టింపైనట్లు ఆరోపించారు. పింఛన్లు పొందేందుకు అర్హులు కోర్టుల్ని ఆశ్రయించాల్సిన అగత్యం ఏర్పడిందంటే పరిస్థితి ఎంతగా దిగజారిందో అర్థం చేసుకోవచ్చన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా నాయకుడు మేడిశెట్టి అప్పలనాయుడు, రాష్ట్ర యువజన విభాగం నాయకుడు యశోదకృష్ణ, కౌన్సిలర్లు బోను అప్పారావు, మజ్జి అప్పారావు, కొంకి అప్పారావు, జరజాపు శ్రీను, పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి గొర్లె వెంకటరమణ, మాజీ వైస్ ఎంపీపీ సువ్వాడ రామకృష్ణ, కొలకోటి రమేష్, యడ్ల శంకరరావు తదితరులు పాల్గొన్నారు. -
సారా తప్ప నీరు దొరకదు
ఎంఎల్ఏ రాజన్నదొర సాలూరురూరల్: నియోజకవర్గంలో సారా దొరుకుతుంది కానీ తాగునీరు దొరకడం కష్టంగా మారిందని సాలూరు ఎంఎల్ఏ రాజన్నదొర అన్నారు. నియోజకవర్గం లోని పలువురు ఎంపీటీసీలు, వైఎస్సార్సీపీ నాయకులు సోమవారం ఆయనను కలిసి గ్రామాల్లో ప్రజలు నాటుసారాకు బానిసలుగా మారుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. దీనిపై ఎఎల్ఏ మాట్లాడుతూ ఒడిశా ఆంధ్ర సరిహద్దు గ్రామాల్లో సారా అధికంగా లభ్యమవుతోందన్నారు. ఒడిశా నుంచి అధికంగా సారాప్యాకెట్లు దిగుమతి అవుతున్నాయన్నారు. యథేచ్ఛగా నాటుసారా లభ్యమవుతుండడం వెనుక ఉన్నవారిని అధికారులు ఎందుకు పట్టుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. ఎక్సైజ్ అధికారులు తూతూమంత్రంగా సారాబట్టీలపై దాడులు నిర్వహిస్తున్నారని, చిత్తశుద్ధితో పనిచేయకపోవడం వల్లనే సారా మహమ్మారి గ్రామాల్లో ప్రబలుతోందని ఆందోళన వెలిబుచ్చారు. ఈ విషయంపై జెడ్పీ సమావేశంలో, శాసనసభ లో కూడా తప్పకుండా ప్రశ్నిస్తానని చెప్పారు. ఇకనైనా ఎక్సైజ్ అధికారులు నిద్రమత్తును వీడి సారాను అరికట్టడానికి కృషిచేయాలని కోరారు. -
బాబు పాలనలో రక్షణ లేదు: రాజన్నదొర
సాలూరు రూరల్: గిరిజన బాలికపై సామూహిక అత్యాచారం చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాజన్నదొర డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా మెంతాడ మండలం కొండలింగాలవలస గ్రామ పంచాయతీ పరిధిలోని మూలపాడులో ఓ గిరిజన బాలికపై గురువారం ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. నిందితులపై నిర్భయచట్టం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసులు పెట్టాలని ఎమ్మెల్యే కోరారు. చికిత్స పొందుతున్న బాధిత గిరిజన బాలికకు మెరుగైన వైద్య సేవలు అందేలా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బాధ్యతలు తీసుకోవాలన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యాచారాలు పెరిగిపోయాయని, గిరిజనులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. -
చిన్న ఉద్యోగులపై చర్యలా ?
ఎమ్మెల్యే రాజన్నదొర మెంటాడ : మండల ఇన్చార్జి తహశీల్దార్ పి. రామకృష్ణ, మండల పరిషత్ సూపరింటిండెంట్ గంట వెంకటరావులను సస్పెండ్ చేయూలని స్వయూనా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలెక్టర్‌ను ఆదేశించడం ఎంతవరకు సమంజసమని ఎమ్మెల్యే పి. రాజన్నదొర ప్రశ్నించారు. కుంటినవలస లో ఆదివారం జరిగిన ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడు తూ, వీడియో కాన్ఫరెన్స్‌లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో చిన్న ఉద్యోగులను టార్గెట్ చేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాల్లో ఎన్నో పొరపాట్లు జరుగుతున్నాయని, అలాంటప్పుడు సంబంధిత ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులను ఎందుకు సస్పెండ్ చేయరని ప్రశ్నించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల రుణాలు అర్హులకు అందడం లేదని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎవ్వరికీ ఇళ్ల స్థలాలు గాని కొత్త ఇళ్లు కాని మంజూరు చేయలేదన్నా రు. పాత ఇళ్లకే నేటి వరకు బిల్లులు చెల్లించలేదని చెప్పారు. జన్మభూమిలో ప్రజలు అందజేసిన దరఖాస్తులను నేటి వరకూ ఆన్లైన్లో పొందుపరచలేదన్నారు. ఇలాంటప్పుడు మరికొద్ది రోజుల్లో జన్మభూమి కార్యక్రమం ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. జన్మభూమి కార్యక్రమాల్లో పాల్గొనబోయే పాలకులను నిలదీయూలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్ష, ఉపాధ్యక్షులు రెడ్డి సన్యాసినాయుడు, సిరిపురపు తిరుపతి, ఎంపీపీ శొంఠ్యాన సింహాచలమమ్మ, కుంటినవలస, పెదమేడపల్లి సర్పంచ్‌లు యర్రా సింహాచలం, యడ్ల అప్పలనాయుడు, పోరాం ఎంపీటీసీ సభ్యుడు చెల్లూరు లక్ష్మణరావు, నాయకులు దాట్ల హనుమంతురాజు, కిలపర్తి మధు, బాయి అప్పారావు, ఎం.సింహాచలం, సాలూరు నాయకులు మద్దెల గోవింద, మజ్జి అప్పారావు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. -
'బాబు పాలనలో మహిళలకు రక్షణ లేదు'
పార్వతీపురం (విజయనగరం) : చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర అన్నారు. టీడీపీ నాయకులు, వారి బంధువులు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని అన్నారు. రెండు రోజుల క్రితం సాలూరులో మునిసిపల్ ఉద్యోగినిపై ఓ టీడీపీ కౌన్సిలర్ అత్యాచారయత్నం చేసిన ఘటనపై శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే రాజన్న దొర మీడియాతో మాట్లాడారు. ఈ అంశాన్ని శాసనసభలో లేవనెత్తుతామని చెప్పారు. ఈ ఘటనపై మహిళా డీఎస్పీతో విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
'వైఎస్ జగన్‌ను చంపేందుకు సర్కార్ కుట్ర'
సాలూరు : రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని చంపేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందనే అనుమానం కలుగుతోందిని విజయనగరం జిల్లా సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర అన్నారు. ఆయన సోమవారం ఇక్కడ మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాలను ఆశించి దీక్షకు దిగిన జగన్మోహన్రెడ్డిని మంత్రులు కామినేని, ప్రత్తిపాటి హేళన చేయడం దుర్మార్గమని చెప్పారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు మంత్రుల దిష్టిబొమ్మలను దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దిష్టిబొమ్మలను లాక్కోవడంతో పోలీసులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యాతారహితంగా మాట్లాడిన మంత్రులను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. -
వేసవికి ముందే తాగునీటి ఎద్దడి
గిరిజన గ్రామాల్లో పరిస్థితి దారుణం తక్షణమే అధికారులు స్పందించాలి సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర మిర్తివలస (పాచిపెంట) : వేసవి పూర్తిగా రాకముందే గిరిజన గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నెలకొందని సాలూరు ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు పీడిక రాజన్నదొర అన్నారు. బుధవారం ఆయన మిర్తివలస గ్రామంలో విలేకరులతో మాట్లాడారు. సాలూరు నియోజకవర్గంలో చాలా గిరిజన గ్రామాలు తాగు నీటికి అల్లాడుతున్నాయని చెప్పారు. పాచిపెంట మండలంలోని పద్మాపురం పంచాయతీ రొడ్డవలస గిరిజన గ్రామానికి ఏటా ట్యాంకర్ల ద్వారా రక్షిత నీరు సరఫరా చేస్తున్నామని, అయితే ఈ ఏడాది పూర్తిగా వేసవి రాక ముందే గ్రామస్తులు తాగునీటికి ఇబ్బందు లు పడుతున్నారని చెప్పారు. తక్షణమే కలెక్టర్ స్పందించి ఆర్డబ్ల్యూఎస్, ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి, తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే వేసవిలో కొన్ని గ్రామాల్లో తాగునీరు కలుషితమవుతుందని, దీని వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం గురువారం నుంచి తలపెట్టిన నీరు-చెట్టు కార్యక్రమం వేసవిలో ఎలా చేస్తారని ప్రశ్నించారు. వర్షాకాలంలోనే చెట్టకు నీరు పోసే నాథుడు లేకపోవడంతో వందలాది చెట్లు చనిపోతున్నాయని, వేసవిలో వాటికి ఎవరు బాధ్యత వహిస్తారన్నారు. ఈ కార్యక్రమం వల్ల ప్రజాధనం వృథా తప్ప ప్ర యోజనం ఉందని చెప్పారు. ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి జన్మభూమి కమిటీ ఏర్పాటు చేశారని, చెట్ల సంరక్షణ కూడా వారికే అప్పగించాలని సూచించారు. ఆయనతో పాటు వైస్ ఎంపీపీ టి. గౌరీశ్వరరావు, మోసూరు పీఏసీఎస్ అధ్యక్షుడు ఎక్కుడు శివ, వైఎస్ఆర్ మండల నాయకులు బి. అప్పలనాయుడు, బోను మురళీ, ముఖీ ఉమా, మాజీ సర్పంచ్ డోకల సన్యాసినాయుడు, సర్పంచులు తవిటిరాజు, సింహాచలం, తదితరులు పాల్గొన్నారు. -
అప్పుడు ఎన్నికల్లో హామీలు గుప్పించి...
హైదరాబాద్ : బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల్లో హామీలు గుప్పించి... చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగిస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సర్వేశ్వరరావు, రాజన్నదొర మండిపడ్డారు. వైఎస్ఆర్ హయాంలో ఉద్యోగాలు పొందారని... వారిని రెగ్యులర్ చేయకపోవడం చాలా దారుణమన్నారు. అసెంబ్లీ పది నిమిషాల పాటు వాయిదా అనంతరం వారు మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం ఇచ్చిన హామీలన్నీ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ హయాంలో ఉద్యోగాలు పొందారని వారిని క్రమబద్దీకరించకపోవటం దుర్మార్గం అన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో ఎక్కువ శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందినవారేనని ఎమ్మెల్యేలు తెలిపారు. అంగన్వాడీ, ఐకేపీ ఉద్యోగుల సమస్యలు, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించాల్సిందేనని డిమాండ్ చేశారు. -
అప్పుడు ఎన్నికల్లో హామీలు గుప్పించి...
-
కాంగ్రెస్‌కు షాక్..
సాక్షి ప్రతినిధి, విజయనగరం: కొన్నినెలలుగా స్తబ్ధుగా ఉన్న జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆదివారం చేరారు. పెద్ద సంఖ్య లో సాలూరు నియోజక వర్గ కాంగ్రెస్ కార్యకర్తలు, తన అనుచరులతో హైదరాబాద్ వెళ్లిన ఆయన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వాస్తవానికి రాజన్నదొర చాలా రోజుల కిందటే వైఎస్ఆర్సీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. అయితే సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణలు తక్షణ మే రంగంలోకి దిగి ఆయన్ను బుజ్జగించి కాంగ్రెస్‌లోనే కొనసాగేలా చేశారు. అంతేకాకుండా గిరిజన సంక్షేమానికి సంబంధించి శాసన సభా కమిటీకి ఆయనను చైర్మన్‌గా నియమించారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో ఆయన కాంగ్రెస్‌లో కొనసాగారు. అయితే దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డితో మంచి సాన్నిహిత్యం ఉన్న రాజన్నదొర ఎప్పటికైనా వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగు జాడల్లో నడవడం తథ్యమని ఆ నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పూర్తి నమ్మకంతో ఉండేవారు. ఇదే విషయమై ఆయనపై ఒత్తిడి తీసుకొస్తూ ఉండేవారు. కార్యకర్తల అభీష్టం మేరకు రాజన్న దొరతోబాటు సాలూరు మున్సిపల్ మాజీ చైర్మన్ జరజాపు ఈశ్వరరావు కూడా పార్టీలో చేరారు. సుజయ్ కృష్ణ చాణక్యం... వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త సుజయ్ కృష్ణ రంగారావు రాజ కీయ చాణక్యాన్ని ప్రదర్శించి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలేలా చేశారు. మంత్రి బొత్స సత్తిబాబు ఎత్తులను ఎదుర్కొంటూనే రాజన్న దొరను పార్టీలోకి తీసుకురావడానికి ఆయన తెరవెనుక మంత్రాంగం నడిపారు. చివరకు తాను అనుకున్నట్లుగానే దొరను తీసుకెళ్లి పార్టీలో చేర్చి తన పెద్దరికాన్ని నిరూపించుకున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రాన్ని నిలువుగా చీల్చిన కాంగ్రెస్ పార్టీకి సీమాంధ్ర జిల్లాల్లో పుట్టగతులుండవని కాంగ్రెస్ కార్యకర్తలు బాహాటంగానే అంగీకరిస్తున్నా రు. ఇలాంటి తరుణంలో సమైక్యాంధ్రకు కట్టుబడి అవిశ్రాంతంగా పోరాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయ భవిష్యత్‌ను కాపాడుకోవాలని పలువురు ఆరాట పడుతున్నారు.