సాలూరుః నీచ రాజకీయాలు రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో విలువలు, విశ్వనీయతే పరమావదిగా రాజకీయాలు చేస్తోన్న గొప్పవ్యక్తి ఎమ్మెల్యే రాజన్నదోర అని స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు స్పష్టం చే శారు. మంగళవారం ఎమ్మెల్యే ఇంటివద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వంగపండు అప్పలనాయుడు మాట్లాడుతూ టీడీపీ నాయకులను ధనబలం, అధికార బలంతో తన వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోందన్నారు.
కానీ అలాంటి ప్రలోభాలకు లోంగక ప్రజల తీర్పును శిరసావహించి, పార్టీ మనుగడ కోసం, తాను కష్టాల్ని ఎదుర్కొవడానికి సిద్ధమైన గొప్పనాయకుడు మన రాజన్న అని కొనియాడారు. వైఎస్సార్ సీపీ మండలాధ్యక్షడు సువ్వాడ రమణ మాట్లాడుతూ తమ ఎమ్మెల్యే ఆస్తి, అంతస్థుల్లో పేదవాడైనా వ్యక్తిత్వంలో ధనికుడన్నారు. వైఎస్సార్ నాయకత్వంలో పనిచేసిన తమ ఎమ్మెల్యే ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంపై కూడా పూర్తి విశ్వాసం చూపిస్తున్నారన్నారు. టీడీపీ చేస్తున్న కుట్రపూరిత రాజకీయాలు రాజన్న వ్యక్తిత్వాన్ని దెబ్బతీయలేవన్నారు.
టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రజల కష్టాలు రెట్టింపైనట్లు ఆరోపించారు. పింఛన్లు పొందేందుకు అర్హులు కోర్టుల్ని ఆశ్రయించాల్సిన అగత్యం ఏర్పడిందంటే పరిస్థితి ఎంతగా దిగజారిందో అర్థం చేసుకోవచ్చన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా నాయకుడు మేడిశెట్టి అప్పలనాయుడు, రాష్ట్ర యువజన విభాగం నాయకుడు యశోదకృష్ణ, కౌన్సిలర్లు బోను అప్పారావు, మజ్జి అప్పారావు, కొంకి అప్పారావు, జరజాపు శ్రీను, పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి గొర్లె వెంకటరమణ, మాజీ వైస్ ఎంపీపీ సువ్వాడ రామకృష్ణ, కొలకోటి రమేష్, యడ్ల శంకరరావు తదితరులు పాల్గొన్నారు.
విశ్వసనీయతకు చిరునామా రాజన్న
Published Tue, Feb 23 2016 11:55 PM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
Advertisement
Advertisement