54 కిలోల కేక్‌ను కట్‌ చేసిన రాజన్నదొర | Greatly MLA Rajanna Dora 54th Birthday Celebrations | Sakshi
Sakshi News home page

వేడుకగా ఎమ్మెల్యే రాజన్నదొర పుట్టినరోజు

Published Mon, Jul 2 2018 7:50 PM | Last Updated on Mon, Jul 2 2018 7:50 PM

Greatly MLA Rajanna Dora 54th Birthday Celebrations - Sakshi

పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్‌కట్‌ చేస్తున్న మ్మెల్యే రాజన్నదొర 

సాలూరు: ఎమ్మెల్యే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు పీడిక రాజన్నదొర పుట్టిన రోజును కార్యకర్తలు, అభిమానులు శుక్రవారం వేడుకగా జరుపుకున్నారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఎదురుగా ఉన్న ఇండోర్‌ స్టేడియం ప్రాంగణంలోని వేదికపై అభిమానులు ఏర్పాటు చేసిన 54 కిలోల కేక్‌ను ఎమ్మెల్యే కట్‌ చేశారు. అభిమానులు, కుటుంబ సభ్యులకు పంచిపెట్టారు. పార్టీ రాష్ట్రనాయకుడు జరజాపు ఈశ్వరరావు పర్యవేక్షణలో, పార్టీ పట్టణ అధ్యక్షుడు జరజాపు సూరిబాబు ఆధ్వర్యంలో సాగిన వేడుకల్లో సాలూరు పట్టణంతోపాటు సాలూరు, పాచిపెంట, మక్కువ, మెంటాడ, రామభద్రపురం, కురుపాం, గుమ్మలక్ష్మీపురం తదితర మండలాల పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. రాజన్నదొరకు శుభాకాంక్షలు తెలిపారు.

వైఎస్సార్‌ సీపీ విజయనగరం జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్, పార్వతీపురం నియోజకవర్గం నాయకుడు జమ్మాన ప్రసన్నకుమార్,  సాలూరు మండలం, పాచిపెంట, మెంటాడ మండలాల పార్టీ అధ్యక్షులు సువ్వాడ రమణ, గొట్టాపు ముత్యాలునాయుడు, రెడ్డి సన్యాసినాయుడు, సాలూరు జెడ్పీటీసీ, పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు రెడ్డి పద్మావతి, పాచిపెంట మండల జెడ్పీటీసీ సలాది అనురాధ, మెంటాడ మండల ఎంపీపీ  సింహాచలమమ్మ, రాష్ట్ర ఎస్టీ విభాగం నాయకుడు అప్పారావు, పార్టీ రాష్ట్ర నాయకులు ముగడ గంగమ్మ, సలాది అప్పలనాయుడు, జిల్లానాయకులు బాబ్జి, జైహింద్‌కుమార్,  శ్రీను, త్రినాథ, డీసీసీబీ సభ్యుడు సురేష్, జిల్లా ట్రేడ్‌యూనియన్‌ అధ్యక్షుడు బుల్లెట్‌రాజు, మున్సిపల్‌ మాజీ వైస్‌చైర్మన్‌ గిరి రఘు, జగం, రవి, మక్కువ మం డల నాయకుడు తిరుపతినాయుడు, వర్క్‌చార్జ్‌డ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు డీజీ ప్రసాద్, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, మున్సిపల్‌ ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు. సాలూరు సాహితీమిత్రబృందం అధ్యక్ష, కార్యదర్శులు జేబీ తిరుమలాచార్యులు, కిలపర్తి దాలినాయుడు వ్యాఖ్యానంతో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు వేడుకలు సందడిగా సాగాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement