ఎమ్మెల్యే రాజన్నదొర
మెంటాడ : మండల ఇన్‌చార్జి తహశీల్దార్ పి. రామకృష్ణ, మండల పరిషత్ సూపరింటిండెంట్ గంట వెంకటరావులను సస్పెండ్ చేయూలని స్వయూనా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలెక్టర్‌ను ఆదేశించడం ఎంతవరకు సమంజసమని ఎమ్మెల్యే పి. రాజన్నదొర ప్రశ్నించారు. కుంటినవలస లో ఆదివారం జరిగిన ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడు తూ, వీడియో కాన్ఫరెన్స్‌లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో చిన్న ఉద్యోగులను టార్గెట్ చేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు.
ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాల్లో ఎన్నో పొరపాట్లు జరుగుతున్నాయని, అలాంటప్పుడు సంబంధిత ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులను ఎందుకు సస్పెండ్ చేయరని ప్రశ్నించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల రుణాలు అర్హులకు అందడం లేదని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎవ్వరికీ ఇళ్ల స్థలాలు గాని కొత్త ఇళ్లు కాని మంజూరు చేయలేదన్నా రు. పాత ఇళ్లకే నేటి వరకు బిల్లులు చెల్లించలేదని చెప్పారు. జన్మభూమిలో ప్రజలు అందజేసిన దరఖాస్తులను నేటి వరకూ ఆన్‌లైన్‌లో పొందుపరచలేదన్నారు.
ఇలాంటప్పుడు మరికొద్ది రోజుల్లో జన్మభూమి కార్యక్రమం ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. జన్మభూమి కార్యక్రమాల్లో పాల్గొనబోయే పాలకులను నిలదీయూలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్ష, ఉపాధ్యక్షులు రెడ్డి సన్యాసినాయుడు, సిరిపురపు తిరుపతి, ఎంపీపీ శొంఠ్యాన సింహాచలమమ్మ, కుంటినవలస, పెదమేడపల్లి సర్పంచ్‌లు యర్రా సింహాచలం, యడ్ల అప్పలనాయుడు, పోరాం ఎంపీటీసీ సభ్యుడు చెల్లూరు లక్ష్మణరావు, నాయకులు దాట్ల హనుమంతురాజు, కిలపర్తి మధు, బాయి అప్పారావు, ఎం.సింహాచలం, సాలూరు నాయకులు మద్దెల గోవింద, మజ్జి అప్పారావు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
చిన్న ఉద్యోగులపై చర్యలా ?
Published Sun, Dec 27 2015 11:29 PM | Last Updated on Tue, May 29 2018 4:23 PM
Advertisement