ప్రభుత్వ వైఫల్యాలపై ఇంటింటి ప్రచారం | ysrcp mla rajanna dora speaks over gadapa gadapa ku ysrcp program | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ వైఫల్యాలపై ఇంటింటి ప్రచారం

Published Mon, Jul 4 2016 10:44 AM | Last Updated on Mon, Sep 4 2017 4:07 AM

ysrcp mla rajanna dora speaks over gadapa gadapa ku ysrcp program

గడపగడపకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని విజయవంతం చేయాలి
  సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర
విజయనగరం:
మహానేత, దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకొని ఈ నెల 8వ తేదీ నుంచి చేపడుతున్న గడపగడపకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విజయవంతం చేయాలని సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర పిలునిచ్చారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని కోరారు.

మండలంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడారు. అమలు కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం.. ప్రజలను నిలువునా మోసం చేసిందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ శొంఠ్యాన సింహాచలమమ్మ, వైఎస్సార్ సీపీ మండల యువజన అధ్యక్షుడు రాయిపల్లి రామారావు, పోరాం ఎంపీటీసీ సభ్యులు చెల్లూరి లక్ష్మణరావు, పెదమేడపల్లి సర్పంచ్ యడ్ల అప్పలనాయుడు, గజపతినగరం ఏఎంసీ మాజీ చైర్మన్ పొరిపిరెడ్డి అప్పలనాయుడు, నాయకులు దాట్ల హనుమంతురాజు, కిలపర్తి మధు, చిన్నారావు తదితరలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement