gadapa gadapa ku ysrcp program
-
175కి 175 సీట్లు కచ్చితంగా గెలవాలి: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: గడప గడపకు మన ప్రభుత్వంపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, కో-ఆర్డినేటర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు. క్షేత్ర స్థాయిలో సమస్యలు పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. జగనన్న సురక్ష తర్వాత మరో కార్యక్రమం ఉంటుందన్నారు. ‘‘గడప గడపకు కార్యక్రమం అత్యంత కీలకం. ఈ కార్యక్రమాన్ని సీరియస్గా తీసుకోవాలి. చాలా ఉపయోగపడే కార్యక్రమం. వచ్చే 9 నెలలు అత్యంత కీలకం. 175కి 175 సీట్లు కచ్చితంగా గెలవాలి. పనితీరు బాగుంటే ఎమ్మెల్యేలను కొనసాగిస్తాం. కొన్ని కోట్ల మంది మనపై ఆధారపడి ఉన్నారు. కోట్ల మంది పేదలకు మంచి జరుగుతోంది’’ అని సీఎం అన్నారు. ‘‘కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేకపోతే కొనసాగించడం వల్ల వారికీ నష్టం, పార్టీకి నష్టం. సర్వే చేసినప్పుడు మీమీ గ్రాఫ్లు బలంగా ఉండాలి. దీని కోసం గడపగడపకు కార్యక్రమం ఉపయోగపడుతుంది. ప్రజలకు చేరువగా ఉండేందుకు చాలా ఉపయోగపడుతుంది. దీనివల్ల మీ గ్రాఫ్ పెరుగుతుంది. పార్టీకి మేలు జరుగుతుంది. అలా జరగకపోతే మార్చక తప్పని పరిస్థితి వస్తుంది’’ అని సీఎం జగన్ స్పష్టం చేశారు. ‘‘ఇకపై గడపగడపకు కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలి. పనితీరు బాగులేక టికెట్లు రాకుంటే నన్ను బాధ్యుడిని చేయొద్దు. గతంలో ఎన్నడూ జరగని విధంగా నాలుగేళ్లలో రాష్ట్రంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చాం. నెగిటివ్ మీడియా ద్వారా మారీచుల్లా మనపై యుద్ధం చేస్తున్నారు. గత ప్రభుత్వ పాలన, మన ప్రభుత్వంలో జరిగిన కార్యక్రమాలను నాడు-నేడు ద్వారా ప్రజల వద్దకు చేర్చాలి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 నెగిటివ్ స్టోరీలపై ఫ్యాక్ట్ చెక్ ఇస్తున్నాం. ఇందులో అంశాలపై అవగాహన పెంచుకోవాలి’’ అని సీఎం పేర్కొన్నారు. ‘‘సోషల్ మీడియా కూడా చాలా ముఖ్యం. ప్రభుత్వం చేస్తున్న మంచిని సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలి. సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకోవాలి. అబద్ధాలు, విష ప్రచారాలను పూర్తిస్థాయిలో తిప్పికొట్టాలి’’ అని సీఎం జగన్ పిలుపునిచ్చారు. ఇదీ చదవండి: జగనన్న సురక్ష.. జులై1 నుంచి సచివాలయాల వద్ద ప్రత్యేక క్యాంపులు -
రాష్ట్ర ప్రభుత్వ పథకాల పై హర్షం వ్యక్తం చేస్తోన్న ప్రజలు
-
‘సంక్షేమ’ సారథి సీఎం జగన్
కృష్ణా (కైకలూరు): రాష్ట్రంలో సంక్షేమ పథకాల సారథిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిత్యం పని చేస్తున్నారని ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) చెప్పారు. పెంచికలమర్రులో సర్పంచ్ జయమంగళ కాసులు, ఎంపీటీసీ సభ్యుడు సాధు కొండయ్య ఆధ్వర్యంలో శుక్రవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే డీఎన్నార్ ప్రతి కుటుంబానికి ప్రభుత్వం నుంచి మూడేళ్లలో పొందిన లబ్ధిని వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. డీఎన్నార్ మాట్లాడుతూ సచివాలయ పరిధిలో అభివృద్ధి పనులకు సీఎం జగన్ రూ.20లక్షలు కేటాయించారన్నారు. కొల్లేరు గ్రామాల ప్రజలకు గత ప్రభుత్వాల్లో జరగని అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. అందుకే నియోజకవర్గంలో కైకలూరు, మండవల్లి మండలాల్లో పలు గ్రామాలను సంపూర్ణ వైఎస్సార్ జగనన్న విలేజ్లుగా ప్రకటించుకుంటున్నారని చెప్పారు. కొల్లేరు గ్రామాలను అనుసంధానం చేసే పెద్దింట్లమ్మ వారధి గత ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోలేదని గుర్తు చేశారు. వారధిని ఏడాది చివరి కి పూర్తి చేసేలా పని చేయిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి సుదీర్ఘ పాదయాత్రలో కొల్లేరు ప్రజల చిరకాల వాంఛగా ఉన్న రెగ్యులేటర్లను నిర్మిస్తామని ప్రకటించారన్నారు. త్వరలో సీఎం శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు. కొల్లేరు లంక గ్రామాల ప్రజలందరూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ అడవి కృష్ణ, వివిధ గ్రామాల సర్పంచ్లు చెరుకువాడ బలరామరాజు, భట్రాజు శివాజీ, నాయకులు బలే నాగరాజు, ముంగర గోపాల కృష్ణ, శేషావతారం, నిమ్మల సాయి, సైదు వెంకటేశ్వరరావు, శాఖమూరి అమ్మనరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ సీఎం వైఎస్ జగన్ దిశా నిర్దేశం
-
ప్రభుత్వ వైఫల్యాలపై ఇంటింటి ప్రచారం
గడపగడపకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని విజయవంతం చేయాలి సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర విజయనగరం: మహానేత, దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకొని ఈ నెల 8వ తేదీ నుంచి చేపడుతున్న గడపగడపకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విజయవంతం చేయాలని సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర పిలునిచ్చారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని కోరారు. మండలంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడారు. అమలు కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం.. ప్రజలను నిలువునా మోసం చేసిందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ శొంఠ్యాన సింహాచలమమ్మ, వైఎస్సార్ సీపీ మండల యువజన అధ్యక్షుడు రాయిపల్లి రామారావు, పోరాం ఎంపీటీసీ సభ్యులు చెల్లూరి లక్ష్మణరావు, పెదమేడపల్లి సర్పంచ్ యడ్ల అప్పలనాయుడు, గజపతినగరం ఏఎంసీ మాజీ చైర్మన్ పొరిపిరెడ్డి అప్పలనాయుడు, నాయకులు దాట్ల హనుమంతురాజు, కిలపర్తి మధు, చిన్నారావు తదితరలు పాల్గొన్నారు.