‘సంక్షేమ’ సారథి సీఎం జగన్‌ | Gadapa Gadapa Ku mana Prabhutvam In Krishna District | Sakshi
Sakshi News home page

‘సంక్షేమ’ సారథి సీఎం జగన్‌

Published Sat, Jul 23 2022 8:07 AM | Last Updated on Sat, Jul 23 2022 8:07 AM

Gadapa Gadapa Ku mana Prabhutvam In Krishna District - Sakshi

కృష్ణా (కైకలూరు): రాష్ట్రంలో సంక్షేమ పథకాల సారథిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిత్యం పని చేస్తున్నారని ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్‌) చెప్పారు. పెంచికలమర్రులో సర్పంచ్‌ జయమంగళ కాసులు, ఎంపీటీసీ సభ్యుడు సాధు కొండయ్య ఆధ్వర్యంలో శుక్రవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే డీఎన్నార్‌ ప్రతి కుటుంబానికి ప్రభుత్వం నుంచి మూడేళ్లలో పొందిన లబ్ధిని వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. డీఎన్నార్‌ మాట్లాడుతూ సచివాలయ పరిధిలో అభివృద్ధి పనులకు సీఎం జగన్‌ రూ.20లక్షలు కేటాయించారన్నారు. కొల్లేరు గ్రామాల ప్రజలకు గత ప్రభుత్వాల్లో జరగని అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. 

అందుకే నియోజకవర్గంలో కైకలూరు, మండవల్లి మండలాల్లో పలు గ్రామాలను సంపూర్ణ వైఎస్సార్‌ జగనన్న విలేజ్‌లుగా ప్రకటించుకుంటున్నారని చెప్పారు. కొల్లేరు గ్రామాలను అనుసంధానం చేసే పెద్దింట్లమ్మ వారధి గత ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోలేదని గుర్తు చేశారు. వారధిని ఏడాది చివరి కి పూర్తి చేసేలా పని చేయిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుదీర్ఘ పాదయాత్రలో కొల్లేరు ప్రజల చిరకాల వాంఛగా ఉన్న రెగ్యులేటర్లను నిర్మిస్తామని ప్రకటించారన్నారు. త్వరలో సీఎం శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు. కొల్లేరు లంక గ్రామాల ప్రజలందరూ వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ అడవి కృష్ణ, వివిధ గ్రామాల సర్పంచ్‌లు చెరుకువాడ బలరామరాజు, భట్రాజు శివాజీ, నాయకులు బలే నాగరాజు, ముంగర గోపాల కృష్ణ, శేషావతారం, నిమ్మల సాయి, సైదు వెంకటేశ్వరరావు, శాఖమూరి అమ్మనరాజు తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement