గిరిజన గ్రామాల్లో పరిస్థితి దారుణం
తక్షణమే అధికారులు స్పందించాలి
సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర
మిర్తివలస (పాచిపెంట) : వేసవి పూర్తిగా రాకముందే గిరిజన గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నెలకొందని సాలూరు ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు పీడిక రాజన్నదొర అన్నారు. బుధవారం ఆయన మిర్తివలస గ్రామంలో విలేకరులతో మాట్లాడారు. సాలూరు నియోజకవర్గంలో చాలా గిరిజన గ్రామాలు తాగు నీటికి అల్లాడుతున్నాయని చెప్పారు. పాచిపెంట మండలంలోని పద్మాపురం పంచాయతీ రొడ్డవలస గిరిజన గ్రామానికి ఏటా ట్యాంకర్ల ద్వారా రక్షిత నీరు సరఫరా చేస్తున్నామని, అయితే ఈ ఏడాది పూర్తిగా వేసవి రాక ముందే గ్రామస్తులు తాగునీటికి ఇబ్బందు లు పడుతున్నారని చెప్పారు.
తక్షణమే కలెక్టర్ స్పందించి ఆర్‌డబ్ల్యూఎస్, ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి, తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే వేసవిలో కొన్ని గ్రామాల్లో తాగునీరు కలుషితమవుతుందని, దీని వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం గురువారం నుంచి తలపెట్టిన నీరు-చెట్టు కార్యక్రమం వేసవిలో ఎలా చేస్తారని ప్రశ్నించారు. వర్షాకాలంలోనే చెట్టకు నీరు పోసే నాథుడు లేకపోవడంతో వందలాది చెట్లు చనిపోతున్నాయని, వేసవిలో వాటికి ఎవరు బాధ్యత వహిస్తారన్నారు.
ఈ కార్యక్రమం వల్ల ప్రజాధనం వృథా తప్ప ప్ర యోజనం ఉందని చెప్పారు. ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి జన్మభూమి కమిటీ ఏర్పాటు చేశారని, చెట్ల సంరక్షణ కూడా వారికే అప్పగించాలని సూచించారు. ఆయనతో పాటు వైస్ ఎంపీపీ టి. గౌరీశ్వరరావు, మోసూరు పీఏసీఎస్ అధ్యక్షుడు ఎక్కుడు శివ, వైఎస్‌ఆర్ మండల నాయకులు బి. అప్పలనాయుడు, బోను మురళీ, ముఖీ ఉమా, మాజీ సర్పంచ్ డోకల సన్యాసినాయుడు, సర్పంచులు తవిటిరాజు, సింహాచలం, తదితరులు పాల్గొన్నారు.
వేసవికి ముందే తాగునీటి ఎద్దడి
Published Thu, Feb 19 2015 12:51 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM
Advertisement