
సాక్షి, విజయనగరం : అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళపై కుక్కలు దాడి చేసి, ప్రాణాలు తీశాయి. ఈ హృదయ విదారక ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... సాలూరు మున్సిపాలిటీ పరిధిలో బంగారమ్మ కాలనీలో ఓ మహిళపై కుక్కలు దాడి చేసి చంపాయి. వెంకటాపురం గజలక్ష్మి గత కొద్దిరోజులగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఆమె కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంచం మీద కదలలేని స్ధితిలో ఉంది.
అయితే నిన్న రాత్రి (గురువారం) గజలక్ష్మి పై కుక్కల దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. కుక్కలు ఒళ్లంతా కొరకడంతో కదలలేని స్ధితిలో ఉన్న ఆమె ఈరోజు తెల్లావారేసరికి మృత్యువు పాలైంది. ఈ హృదయ విదారకర దృశ్యం స్థానికులును కలిచి వేసింది. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.