
ప్రతీకాత్మక చిత్రం
సాలూరు (విజయనగరం): అప్పుడే పుట్టింది.. ఇంకా కళ్లు కూడా తెరవలేదు.. కన్నపేగు వసివాడ లేదు.. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన పసిపాప నడిరోడ్డుపై విగతజీవిగా కనిపించిన దృశ్యం విజయనగరం జిల్లా సాలూరు పట్టణ వాసులను మంగళవారం కంటతడి పెట్టించింది. సాలూరు ఎస్‌ఐ ఫకృద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ) వెనుక ఉన్న సీసీ రోడ్డు సమీపంలో ఓ చిన్నారి రోడ్డుపై మరణించి ఉందని సమాచారం అందడంతో పోలీసులు వెళ్లి చూశారు.
అప్పుడే పుట్టినట్టుగా గుర్తించారు. సీహెచ్‌సీ వెనుక కవరులో కప్పి పడవేయగా.. ఏదైనా వాహనం ఆ కవరును రోడ్డుపైకి ఈడ్చుకొచ్చి ఉంటుందని పోలీసులు, స్థానికులు అనుమానిస్తున్నారు. పాపకు సంబంధించిన వివరాలు వెల్లడి కాలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment