దారుణం... కళ్లెదుటే మహిళ బలవన్మరణం.. ఆస్తి తగాదాల కారణంగా నడిరోడ్డులో ఓ వివాహిత కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న మహిళ
ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి
దారుణం... కళ్లెదుటే మహిళ బలవన్మరణం.. ఆస్తి తగాదాల కారణంగా నడిరోడ్డులో ఓ వివాహిత కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటనతో సాలూరు పట్టణం అట్టుడుకిపోయింది.
సాలూరు: ఆస్తి తగాదాలు ఓ మహిళ బలవన్మరణానికి కారణమయ్యాయి. కోర్టు నోటీసులు పంపారని తీవ్ర వేదనకు గురై వీధిలోకి వచ్చి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకోవడం స్థానికంగా సంచలనం రేకెత్తించింది. వివరాలిలా ఉన్నారుు... పట్టణంలోని తెలగావీధిలో నివాసముంటున్న కూనిశెట్టి రాంబాబుకు సోదరుడు నానాజీతో ఆస్తి తగాదాలున్నారుు. ఈ నేపథ్యంలో నానాజీ తన సోదరుడైన రాంబాబుకు కోర్టు ద్వారా నోటీస్ పంపించాడు. దీంతో రాంబాబు భార్య వరలక్ష్మి (45) తీవ్ర మనస్థాపానికి గురై గురువారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో ఇంటిలోనుంచి బయటకు వచ్చి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది.
హఠాత్పరిణామానికి భీతిళ్లి న సమీప కుటుంబాలవారు క్షణాల్లో తేరుకుని మంటలను ఆర్పారు. అయితే అప్పటికే ఆమె పూర్తిగా కాలిపోయింది. 108 వాహనానికి సమాచారం అందించి పట్టణ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించడంతో అదే 108లో విజయనగరం తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూసింది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమార్తెలున్నారు. వీరిద్దరూ ఇంజినీరింగ్ చదువుతున్నారు. భార్య చనిపోవడంతో భర్త రాంబాబు, కుటుంబ సభ్యులు రోధన చూపరులను కలిచివేసింది. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.