court notices
-
మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు
సిటీ కోర్టులు: మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. సినీ హీరో నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసు విచారణ గురువారం నాంపల్లిలోని స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజి్రస్టేట్, ఎక్సైజ్ కోర్టులో జరిగింది. హీరో నాగచైతన్య, సమంత విడాకుల అంశంపై మంత్రి కొండా సురేఖ అసంబద్ధమైన మాటలు మాట్లాడారని, ఆమె తమ కుటుంబ పరువు తీసేలా మాట్లాడినందుకు ఆమెపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని హీరో నాగార్జున మంత్రిపై పరువునష్టం కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే.అయితే గత విచారణలో ఫిర్యాదుదారు నాగార్జునతో పాటు మరో సాక్షి సుప్రియా వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసుకుంది. దీనిపై విచారణ చేపట్టిన స్పెషల్ జ్యుడీíÙయల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్, ఎక్సైజ్ కోర్టు జడ్జి ఎస్. శ్రీదేవి మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేస్తూ విచారణను ఈనెల 23కి వాయిదా వేసింది. ఆరోజు కొండా సురేఖ కోర్టుకి హాజరైతే ఆమె వాంగ్మూ లాన్ని కోర్టు నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఈ కేసు విచారణకు నాగార్జున తరఫున న్యాయ వాది అశోక్‌రెడ్డి, మంత్రి కొండా సురేఖ తరఫున న్యాయవాది, టీపీసీసీ లీగల్ సెల్ రాష్ట్ర వైస్ చైర్మన్ తిరుపతి వర్మ హాజరయ్యారు. మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం కేసు మంత్రి కొండా సురేఖపై మరో పరువు నష్టం కేసు దాఖలైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం నాంపల్లిలోని స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజి్రస్టేట్, ఎక్సైజ్ కోర్టులో సెక్షన్ 356 కింద పరువునష్టం కేసు దాఖలు చేశారు. మంత్రి పదవిలో ఉండి.. స్థాయిని మరచి దిగజారుడు వ్యాఖ్యలు చేశారని, తన ప్రతిష్ట దెబ్బతినేలా ఆమె మాట్లాడారని కేటీఆర్ ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం దురుద్దేశపూర్వకంగా, అడ్డగోలు వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. తనపై అసత్యపు ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖ ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని వారం రోజుల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే పరువునష్టం కేసు దాఖలు చేస్తామని లీగల్ నోటీసు కూడా జారీ చేశామని పేర్కొన్నారు.అయితే లీగల్ నోటీసు గడువు తీరినా ఆమె క్షమాపణ చెప్పలేదని, అందుకే ఆమెపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కేసు దాఖలు చేసినట్టు కేటీఆర్ పేర్కొన్నారు. కొండా సురేఖ గతంలో కూడా అసత్యపు ఆరోపణలు, అడ్డగోలు వ్యాఖ్యలు చేసినప్పుడు భారత ఎన్నికల సంఘం ఆమెకు చీవాట్లు పెట్టిందని, ఆమె తాజాగా చేసిన వ్యాఖ్యలు కేవలం రాజకీయపరమైన వ్యాఖ్యలు మాత్రమే కావని, తన పరువుకు భంగం కలిగించేలా ఉద్దేశపూర్వకంగా, ప్రణాళికా బద్ధంగా చేసిన కుట్రగా ఉన్నాయని ఆయన తెలిపారు. మంత్రి చేసిన వ్యాఖ్యలను, వాటి వెనుక ఉన్న నేరపూరిత దురుద్దేశాలను పరిగణనలోకి తీసుకొని ఆమెపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. కాగా, ఈ పిటిషన్ సోమవారం జడ్జి ముందుకు వచ్చే అవకాశం ఉంది. -
కేసీఆర్, హరీశ్‌రావుకు భూపాలపల్లి కోర్టు నోటీసులు
సాక్షి,భూపాలపల్లి: బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్‌కు భూపాలపల్లి కోర్టు సోమవారం(ఆగస్టు5) నోటీసులు జారీ చేసింది. కేసీఆర్‌తో పాటు మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, బీఆర్ఎస్ హయాంలో పనిచేసిన నీటిపారుదల శాఖ అధికారులు సెప్టెంబరు 5న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ మేరకు వారందరికి కోర్టు నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగడంపై రాజలింగమూర్తి అనే వ్యక్తి వేసిన పిటిషన్‌ను భూపాలపల్లి కోర్టు విచారించింది. అనంతరం కేసీఆర్, హరీశ్‌రావులకు నోటీసులిచ్చింది. -
వైజాగ్ మాల్యా.. వంశీ!
‘మీరు నిర్దేశించిన గడువులోగా తీసుకున్న అప్పు చెల్లించలేదు. కాబట్టి మీ ఆస్తుల్ని జప్తు చేస్తాం. ఇదిగో ఈ కోర్టు నోటీసులు తీసుకోండి.’ ఇది విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ తరచూ వినేమాట. మీకు మాల్యా తెలుసు కదా.. బ్యాంకుల నుంచి కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని ఎగ్గొట్టేసి విదేశాలకు చెక్కేశారు. కానీ.. మన వైజాగ్ మాల్యా వంశీకృష్ణ మాత్రం.. అప్పులు ఎగొట్టేందుకు ప్రయత్నించి.. కోర్టుల నుంచి మొట్టికాయలు తిని.. తిన్నదంతా కక్కిన ఘనుడు. ఫైనాన్స్ సంస్థల నుంచి అప్పు తీసుకోవడం.. వారు చెల్లించమని ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోకపోవడం.. రుణాలు ఎగ్గొట్టేందుకు ప్రయత్నించడం.. చివరికి కోర్టు నుంచి నోటీసులొస్తే.. మరో చోట అప్పోసొప్పో చేసి ఆ రుణం తీర్చడం.. మళ్లీ నోటీసులు.. మళ్లీ కోర్టు చుట్టూ ప్రదక్షిణలు.. ఇది వంశీకృష్ణకు హాబీగా మారిపోయింది. దాదాపు విశాఖలో ఉన్న సింహభాగం ఫైనాన్స్ కంపెనీల దగ్గర వంశీకృష్ణ.. ఓ డీఫాల్టర్ అనే ముద్ర పడిపోయింది. కేవలం అప్పుల విషయంలోనే కాదు.. రాజకీయాల్లోనూ వంశీ ఒక డీఫాల్టర్ అనే చెప్పుకోవాలి.సాక్షి, విశాఖపట్నం: వంశీకృష్ణ శ్రీనివాస్ పేరు చెబితే ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంకులు భయపడుతుంటాయి. అప్పు ఇస్తే.. తొలుత ఆయన చుట్టూ.. తర్వాత కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది బాబోయ్ అంటూ బ్యాంకర్లు తలలు పట్టుకుంటారు. షిప్పింగ్ కంపెనీని నడుపుతున్న వంశీ.. దాన్ని నడిపేందుకు పలు ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకుల వద్ద నుంచి రుణాలు తీసుకునేవారు. 2011 నుంచి వంశీకి ఇదే పని. ఏ ఫైనాన్స్ కంపెనీ కనిపిస్తే.. వారి దగ్గరికి వెళ్లడం.. అప్పులు చెయ్యడం.. ఆనక దాన్ని చెల్లించకుండా తప్పించుకు తిరగడమే అలవాటు మారిపోయింది. మార్గదర్శితో మొదలై... 2011లో రామోజీరావుకు చెందిన మార్గదర్శిలో చిట్ వేశారు. మధ్యలోనే ఆ చిట్ని పాడేసి డబ్బులు తీసుకున్నారు. మిగిలిన నెలల చిట్ డబ్బుల్ని చెల్లించకుండా ఎగ్గొట్టేందుకు ప్రయత్నించారు. నాలుగు నెలలు వరుసగా నోటీసులిచ్చినా స్పందించకపోవడంతో మార్గదర్శి కోర్టులో పిటిషన్ వేసి.. ఆ డబ్బులు ముక్కు పిండి మరీ వసూలు చేసుకుంది. మరోసారి చిట్ వేసేందుకు మార్గదర్శి అనుమతి ఇవ్వకపోవడంతో సంక్షేమ చిట్స్ అనే మరో సంస్థను పట్టుకొని.. అక్కడా డబ్బులు కొల్లగొట్టి సేమ్ సీన్ రిపీట్ చేశారు. ఫైనాన్స్ సంస్థలకూ శఠగోపం చిట్‌ఫండ్ సంస్థలకు ఎగనామం పెట్టిన వంశీ.. 2015 నుంచి వరుసగా దొరికిన ఫైనాన్స్ సంస్థ దగ్గర దొరికినంత రుణాల్ని తీసుకున్నారు. ఆ తరువాత ఫైనాన్స్ సంస్థలకు శఠగోపం పెట్టేశారు. కొన్ని సంస్థలు చివరికి కోర్టులను ఆశ్రయించి వంశీ దగ్గర నుంచి వసూలు చేసుకున్నాయి. మరికొన్నింటికి డబ్బులు చెల్లించలేని స్థితిలో ఉండటంతో ఆస్తుల్ని జప్తు చేసుకున్నాయి. కొంత మంది వ్యక్తుల దగ్గరా డబ్బులు తీసుకొని వారికి కూడా రిక్త హస్తాలు చూపించి డబ్బులు ఎగ్గొట్టాలనుకున్న ఘనుడు వంశీకృష్ణ. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 21 సార్లు డీఫాల్టర్‌గా బ్యాంకుల చుట్టూ తిరిగాడు మన వైజాగ్ మాల్యా. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా... ఎమ్మెల్యేగా గెలిచి.. ఫైనాన్స్ సంస్థలను బెదిరించి.. అప్పులు మాఫీ చేసుకోవాలనే కుయుక్తితో రాజకీయాల్లోకి అడుగు పెట్టిన వంశీ గురించి ప్రజలకు ముందే తెలిసిపోయింది. 2009లో రాజకీయ ఆరంగ్రేటం చేసి పీఆర్పీ తరఫున పోటీ చేసిన వంశీ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పారీ్టలో చేరారు. 2014 ఎన్నికల్లో యాదవ సామాజికవర్గం నుంచి శాసనసభకు ఒకర్ని పంపించాలన్న ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి తూర్పు టికెట్ కేటాయించారు. అప్పుడూ వంశీ రుణాల గోల గురించి తెలిసిన తూర్పు నియోజకవర్గ ప్రజలు ఈ వైజాగ్ మాల్యాని ఇంటికే పరిమితం చేశారు. వంశీ బుద్ధి తెలుసుకున్న పార్టీ 2019లో సీటు ఇవ్వకుండా పక్కనపెట్టింది. ఇక 2021లో 21వ వార్డులో కార్పొరేటర్‌గా అవకాశం కలి్పస్తే అతికష్టమ్మీద గట్టెక్కారు. వంశీ వక్రబుద్ధిని ప్రజలు ముందే గ్రహించి ప్రతి ఎన్నికలోనూ పాఠం నేర్పినా.. సదరు వైజాగ్ మాల్యా మాత్రం తన అప్పుల పరంపరని కొనసాగిస్తూ ఫైనాన్స్ సంస్థలకే కన్నం వేసేందుకు యత్నించారు.ఈ ఎన్నికల్లోనూ పరాభవం తప్పదా? తూర్పు ప్రజలకు తన రుణ స్వరూపం తెలిసిపోయిందని అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. కన్నతల్లిలా ఆదరించిన వైఎస్సార్సీపీని వదిలిపెట్టి.. జనసేనలోకి చేరారు. తూర్పులో ప్రజల నుంచి పరాభవం తప్పదని దక్షిణ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. వాస్తవానికి వంశీ యవ్వారం దక్షిణ ప్రజలకే ఎక్కువగా తెలుసు. ఎందుకంటే సదరు వంశీ షిప్పింగ్ సంస్థ ఎక్కువగా అక్కడే కార్యకలాపాలు నిర్వహించింది. దక్షిణలోనే విశాఖ పోర్టు కావడం.. సదరు వంశీ చేసిన అడ్డగోలు వ్యవహారాల గురించి ఆ నోటా ఈ నోటా అక్కడ ప్రజలు తెలుసుకున్నారు. అందుకే.. వంశీ ఓట్లు అడగడానికి వస్తుంటే.. తమని కూడా అప్పులు అడగడానికి వస్తున్నాడేమోనని ప్రజలు భయపడుతున్నారు. దీంతో 2024 ఎన్నికల్లోనూ వంశీకి పరాభవం తప్పదని సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. -
టీడీపీ నేత పట్టాభికి కోర్టు చీవాట్లు
తణుకు: టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాంకు పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణ పోలీసులు శనివారం 41(ఎ) నోటీసులిచ్చారు. న్యాయస్థానం చీవాట్లు పెట్టడంతో పట్టాభి ఎట్టకేలకు తణుకు పట్టణ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. శనివారం ఉదయం పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఆయనకు నోటీసులు అందజేసిన పోలీసులు సుమారు మూడు గంటల పాటు స్టేషన్లోనే విచారించారు. ఈ ఏడాది మే ఆరో తేదీన టీవీ–5 చానెల్లో డిబేట్లో పాల్గొన్న పట్టాభిరాం.. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావుతో పాటు రాష్ట్ర ప్రభుత్వంపైనా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై వైఎస్సార్సీపీ యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు వీరమల్లు ఫణీంద్రకుమార్ మే 8న పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై 153, 153(ఎ), 505(2), 504, 120(బి) రెడ్‌విత్ 34 ఐపీసీ సెక్షన్ల కింద అప్పటి పట్టణ సీఐ ముత్యాల సత్యనారాయణ కేసు నమోదు చేశారు. ఈ కేసులో పట్టాభిరాం ఎ–1 కాగా, యాంకర్ మూర్తి ఎ–2, టీవీ–5 యాజమాన్యం ఎ–3గా ఉన్నారు. అప్పట్లో ఎ–1 పట్టాభిరామ్‌కు 41(ఎ) నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నించినా స్పందించకపోగా తనను పోలీసులు వేధిస్తున్నారని పేర్కొంటూ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై తణుకు పోలీసులు స్థానిక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నోటీసులు తీసుకోకపోవడంతో పాటు సరైన సమాధానం ఇవ్వకపోవడం చట్టరీత్యా నేరమని పేర్కొంటూ తక్షణమే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి నోటీసులు తీసుకుని సమాధానం ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో శనివారం తణుకు పట్టణ పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన పట్టాభిరాంకు పోలీసులు నోటీసులు అందించారు. తాడేపల్లిగూడెం ఇన్చార్జి రూరల్ సీఐ మూర్తి నేతృత్వంలో తణుకు పట్టణ ఎస్ఐ కె.శ్రీనివాస్ నోటీసులిచ్చి వాంగ్మూలం తీసుకున్నారు. -
సీఎం కేసీఆర్‌కు ఊహించని షాక్.. హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: భూమి కేటాయింపు విషయంలో కేసీఆర్ సర్కార్‌కు షాక్ తగిలింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట సర్వే నంబర్ 239, 240లో అత్యంత విలువైన 11 ఎకరాల భూమిని భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)కు కేటాయించడంపై రాష్ట్ర ప్రభుత్వానికి, ఆ పార్టీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేబినెట్ అనుమతి లేకుండానే కేటాయించారా అని ప్రశ్నించింది. కేటాయింపుపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 16కు వాయిదా వేసింది. అయితే, బీఆర్ఎస్కు 11 ఎకరాల భూమి కేటాయింపును సవాల్ చేస్తూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎన్జీవో) కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఎకరం దాదాపు రూ.50 కోట్ల మార్కెట్ విలువైన స్థలాన్ని.. కేవలం రూ.3,41,25,000కే ప్రభుత్వం ముట్టజెప్పిందని.. అలా 11 ఎకరాలకు గానూ దాదాపు రూ.500 కోట్లు ప్రభుత్వానికి నష్టమని పేర్కొన్నారు. దీనిపై మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇంకా కేబినెట్ నిర్ణయం తీసుకోలేదన్న ప్రభుత్వం ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచందర్‌రావు వాదనలు వినిపిస్తూ.. కోకాపేట్‌లోని 11 ఎకరాల స్థలాన్ని బీఆర్ఎస్ కార్యాలయ నిర్మాణానికి కేటాయించడంపై కేబినెట్ ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రొసీడింగ్ కాపీని పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉంచుతామని చెప్పారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎలాంటి టెండర్లు లేకుండానే బీఆర్ఎస్ పార్టీకి అత్యంత విలువైన ప్రాంతంలో భూమిని ప్రభుత్వం కేటాయించిందన్నారు. భూమి కేటాయించి.. నిర్మాణం చేపట్టినా ఇప్పటివరకు పబ్లిక్ డొమైన్లో ఆ వివరాలను ఉంచలేదని సత్యంరెడ్డి వెల్లడించారు. దీనికి సంబంధించిన ప్రొసీడింగ్స్ కాపీని అందజేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండీఏ కమిషనర్, భూ పరిపాలన చీఫ్ కమిషనర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తో పాటు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. ఇది కూడా చదవండి: కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి గుడ్‌న్యూస్ -
ప్రముఖ నటుడికి కోర్టు నోటీసులు
తమిళ సినిమా: నటుడు ఆర్యకు అంబా సముద్రం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఏమిటి ఎలాంటి వివాదాల్లో చిక్కుకోని ఆర్యకు కోర్టు నోటీసులు ఇవ్వడం ఏమిటని ఆశ్చర్యంగా ఉందా? నటీనటులు వివాదాలు చిక్కుకుపోయినా వారు నటించిన చిత్రాలు వివాదాంశం కావచ్చు కదా! అదేవిధంగా 9 ఏళ్ల క్రితం ఆర్య నటించిన అవన్ ఇవన్ చిత్రం ఆయన్ని ఇప్పుడు కోర్టుకు లాగుతోంది. బాల దర్శకత్వంలో విశాల్, ఆర్య కలిసి నటించిన చిత్రం అవన్ ఇవన్. ఈ చిత్రంలో సింగంపట్టి జమీన్‌ను అవమానపరిచే సన్నివేశాలు చోటుచేసుకున్నాయంటూ నెల్లై జిల్లా, అంబాసముద్రం కోర్టులో అప్పట్లో పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్ శుక్రవారం కోర్టులో విచారణకు వచ్చింది. ఆర్య ఈ నెల 28న హాజరు కావాల్సిందిగా అంబాసముద్రం కోర్టు ఆయనకు నోటీసులు జారీ చేసింది. -
ఫడ్నవీస్‌కు కోర్టు నోటీసులు
నాగ్‌పూర్: మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్‌కు స్థానిక న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల అఫిడవిట్లో ఫడ్నవీస్ తనపై ఉన్న క్రిమినల్ కేసులను పేర్కొనలేదంటూ దాఖలైన ఫిర్యాదుపై కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు గురువారం ఆయనకు నోటీసులు అందజేశారు. నాగ్‌పూర్ ఎమ్మెల్యే అయిన ఫడ్నవీస్‌పై 1996, 1998లలో ఫోర్జరీ, చీటింగ్ కేసులు నమోదయ్యాయి. ఎన్నికల అఫిడవిట్లో ఈ రెండు కేసులను వెల్లడించనందున ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ నాగ్‌పూర్‌కు చెందిన న్యాయవాది సతీశ్ ఊకె కేసు వేశారు. దీనిపై స్థానిక న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. దీనిపై సతీశ్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. అత్యున్నత న్యాయస్థానం మేజిస్ట్రేట్ కోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. దీంతో స్థానిక న్యాయస్థానం జారీ చేసిన నోటీసులను గురువారం పోలీసులు ఆయన నివాసంలో అందజేశారు. -
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
-
డ్వాక్రా మహిళలకు కోర్టు నోటిసులు
-
బాబ్లీపై ఢిల్లీని ఢీకొన్నది వైఎస్సే
బాబ్లీ నిర్మాణం అన్ని దశలూ పూర్తయిన తర్వాత తెలుగుదేశం నేతలు కొంత మందిని తోడ్కొనిపోయి, ఎలాంటి అనుమతులు పొందకుండానే చంద్రబాబు ప్రాజెక్టు ప్రాంతానికి వెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో ధర్మాబాద్ వద్ద మహారాష్ట్ర పోలీసులు టీడీపీ దండును అరెస్ట్ చేశారు. ఆ సమయంలో పెటì ్టన కోర్టు కేసులే ‘కాశీ మజిలీ కథలు’గా నడుస్తూ ఉన్నాయి. అప్పుడే కోర్టు నోటీసులు అందుకోకుండా కాలయాపన చేశారు. ఫలితంగా ఇప్పటికి మొత్తం 37 సార్లు కేసు విచారణకు నోటీసులు జారీ అయ్యాయి. విచిత్రమేమంటే, 2009లో దివంగతుడైన వైఎస్ బాబ్లీ నిర్మాణానికి 2010లో అనుకూలుడని ఓ అపవాదు వేసి తప్పుకోవాలని చంద్రబాబు చూడటం! 2010లో నేను బాబ్లీ (మహారాష్ట్ర) ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే, ఆ రోజున బాబ్లీ కట్టడాన్ని మహారాష్ట్రకు అను కూలంగా నాటి వైఎస్ రాజశేఖరరెడ్డి సమర్థించారు. – ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, ‘జలసిరి’ బహిరంగసభలో (కర్నూలు జిల్లా)14–9–2018 చదవేస్తే ఉన్న మతి పోయిందన్న సామెత బహుశా చంద్రబాబు లాంటి పాలకుల్ని చూసి పుట్టి ఉంటుంది. అసలు 2010 నాటికి వైఎస్ రాజశేఖరరెడ్డి సజీవుడిగా ఉన్నట్టు ఏ దాఖలాలను బట్టి బాబు చెప్పడా నికి సాహసించారు? అప్పటికి ప్రతిపక్ష నాయకుని పాత్రలోనే ఉన్న బాబుకి 2009లోనే ముఖ్యమంత్రి హోదాలో ఉండగా హెలికాప్టర్ ప్రమా దంలో వైఎస్ దివంగతులైన విషయం తెలియదా? లేక ‘మతి తప్పిన మొదటి వేల్పుల’ జాబితాలోకి జారుకున్న బాబు అంతటి అబద్ధానికి పాల్పడ్డారా? ఇంతకీ అసలు పచ్చి అబద్ధం–బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని వైఎస్ సమర్ధించారన్నది. అందుకు తోడుదొంగగా ఒక తైనాతీ దిన పత్రికను ఆయన ఉదహరించడం! ఆదరా బాదరాగా చంద్రబాబు ఇన్ని అవాకులు, చవాకులు పేలడానికి అసలు కారణం తెలంగాణలో తక్షణం, ఆంధ్రప్రదేశ్‌లో మరికొన్ని మాసాల్లో జరగనున్న ఎన్నికలు. రెండు చోట్లా కునారిల్లిపోతున్న టీడీపీని బతికించుకునే దింపుడు కళ్లం ఆశకు గండి కొట్టే విధంగా మహారాష్ట్ర కోర్టు నుంచి నాన్ బెయిలబుల్ వారంట్ వచ్చిపడింది. మూడేళ్ల క్రితమే చంద్రబాబుకు, ఆయన పరివారానికి ఈ కేసులో వారంట్ వచ్చింది. అసలా సీరియస్ నోటీస్ ఎందుకు రావలసి వచ్చింది? తెలంగాణ, కోస్తా జిల్లాల జ లాధారాలకు, ప్రాజెక్టులకు గండి కొట్టే విధంగా మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం తల పెట్టడానికి నిరసనగా ఆనాటి టీడీపీ సహా కొన్ని ప్రతిపక్షాలు ఆందోళన తలపెట్టడంలో తప్పులేదు. కాని, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఎన్నో ప్రాజె క్టులకు, ప్రజాహిత పథకాలకు అంకురార్పణ చేసి, వాటిని విజయవం తంగా అమలు చేసిన రాజశేఖరరెడ్డిపై చంద్రబాబు అభాండం వేయడం మాత్రం క్షమించరాని నేరం. బాబ్లీ నిర్మాణాన్ని తలపెట్టింది మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కాగా, దానికి నిరసనగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమం త్రిగా వైఎస్ అఖిలపక్షానికి నాయకత్వం వహించి, ఈ ప్రాజెక్టు నిర్మాణం నిలిపివేయించేందుకు కేంద్రప్రభుత్వం వద్దకు వెళ్లారన్న విషయం మరచి పోకూడదు. వైఎస్ నాయకత్వాన ఢిల్లీ వెళ్లిన బృందంలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబూ ఉన్నారు. 1975లో ఒప్పందం 1969లో గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ ఏర్పడిన తర్వాత 1975లో గోదావరి జల వినియోగంపై మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ మధ్య ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం మేరకు శ్రీరాంసాగర్ (పోచంపాడు) నిర్మాణం వల్ల మహారాష్ట్రలోని ముంపు ప్రాంతాలకు నష్టపరిహారం చెల్లించడానికి ఏపీ అంగీకరించింది. చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉండగానే బాబ్లీ ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది. 2003 వరకు ఆ ప్రాజెక్టు పనులు సాగుతున్నా, బాబు ప్రభుత్వం మొద్దునిద్ర పోయింది. వైఎస్ అధికారంలోకి వచ్చాక, పోచంపాడు పరిధిలో బాబ్లీ బరాజ్ నిర్మాణం జరుగుతోందని 2005 మేలో తొలిసారిగా గుర్తించారు. ఈ విషయం తెలి సిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫలితంగానే కేంద్ర జలవనరుల శాఖ అనుమతి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి లేదని (మహారాష్ట్ర 1975 ఒప్పందాన్ని తిరగదోడదలచినప్పుడు) ఇంజనీర్ల బృందం ధ్రువీక రించింది. బాబ్లీ నిర్మాణం ఆపేయాలని కేంద్రం ఆదేశించింది. కాగా, ఈ సమస్యపై రెండు రాష్ట్రాల ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శుల సమావేశం జరగాల్సి ఉండగా మహారాష్ట్ర గైర్హాజరయింది. దీంతో మహారాష్ట్రకు బాబ్లీ నిర్మాణం ఆపేయాలని కేంద్ర ప్రభుత్వం 2006 జనవరి 7న స్పష్టం చేసింది. ఈ కుట్రనంతా బయటపెడుతూ తొలిసారిగా ఇక ‘‘బాబ్లీ కథ ముగిసింది’’ అనే పతాక శీర్షికతో ఓ దినపత్రికలో హెచ్. బాబ్జీ అనే విలేకరి ప్రత్యేక కథనంగా ప్రచురించడం జరిగింది. గతంలో ఆ పత్రికకు నేను ప్రధాన సంపాదకుడిగా వ్యవహరించాను. ఈ ప్రత్యేక కథనంలో బాబ్లీ నిర్మాణం రహస్యంగా మహారాష్ట్ర పూర్తి చేసుకున్న వైనాన్ని వివ రించడంతోపాటు ఏపీ ప్రజలను, రాజకీయపార్టీలను హెచ్చరించడం జరిగింది. అప్పటికే బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి ప్రారంభానికి ముస్తాబవుతోంది. ఈ దశలో ఏ ఒక్క ఇతర రాష్ట్రం పిట్టనూ ప్రాజెక్టు వైపునకు రానీయకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సమయంలో ఈ కథనం రాసిన విలేకరి మహారాష్ట్రలోని తన స్నేహితుని అండదండలతో ప్రాజెక్టు ఫోటోలను కెమెరాలో బంధించి జాగ్రత్తగా బయటపడ్డాడు. నిఘా సంస్థల కళ్లపడకుండా ఇంత సాహసం చేశాడు. గత నాలుగు దశాబ్దాలుగా సాగిన కుట్ర, కేంద్రం ఆదేశాలను తోసిపు చ్చిన మహారాష్ట్ర బరితెగింపు చర్యల ఫలితం ఇది. కేంద్ర జలవనరుల శాఖ ఆదేశాలను ధిక్కరించి బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణ పనులు కొనసాగుతున్న వైనంపై కేంద్రం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకువెళ్లి ఏపీ అభ్యం తరాన్ని వైఎస్ తెలపడమే గాక, మహారాష్ట్ర సీఎంకూ(2006 ఏప్రిల్ 4) నిరసన తెలిపారు. బాబ్లీ నిర్మాణం నిలిపివేయాల్సిన అవసరాన్ని సుప్రీం కోర్టు దృష్టికి తీసుకువెళుతూ కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కీ గౌడ్ రిట్ పిటిషన్ దాఖలు(2006 ఏప్రిల్ 10) చేశారు. గోదావరి జలవివాదాల ట్రిబ్యునల్ అవార్డును ఉల్లంఘించి నిర్మిస్తున్న బాబ్లీని నిలిపివేయాలన్న ఏపీ పిటిషన్‌పై సుప్రీం కోర్టు (2006 జులై 7) విచారణ చేపట్టింది. 8 వారాల్లోగా లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభు త్వాన్ని ఆదేశించింది. అయినా, మహారాష్ట్ర గుట్టుచప్పుడు కాకుండా 2.70 టీఎంసీల సామర్ధ్యంగల బాబ్లీ నిర్మాణాన్ని పూర్తిచేసింది. వైఎస్‌పై అపనింద వేసి తప్పుకోజూసిన బాబు! బాబ్లీ కథ తెరకెక్కిన తొలి రోజుల్లో ఈ సమస్యపై చంద్రబాబునాయుడు మహారాష్ట్ర సరిహద్దుల్లో ఒక నిరసన ప్రదర్శన పెట్టి చాలించుకున్నారు. కానీ, రెండోసారి బాబ్లీ నిర్మాణం అన్ని దశలూ పూర్తయిన తర్వాత తెలుగుదేశం నేతలు కొంత మందిని తోడ్కొనిపోయి, ఎలాంటి అను మతులు పొందకుండానే చంద్రబాబు ప్రాజెక్టు ప్రాంతానికి వెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో ధర్మాబాద్ వద్ద మహారాష్ట్ర పోలీసులు టీడీపీ దండును అరెస్ట్ చేసి, కొట్టి సుమారు 15 రోజుల పాటు ఓ స్కూలు ఆవరణలో ఉంచారు. ఆ సమయంలో పెటì ్టన కోర్టు కేసులే ‘కాశీ మజిలీ కథలు’గా నడుస్తూ ఉన్నాయి. అప్పుడే కోర్టు నోటీసులు అందుకోకుండా కాలయాపన చేశారు. ఫలితంగా ఇప్పటికి సమన్లు అందుకోనందుకు గాను మొత్తం 37 సార్లు కేసు విచారణకు నోటీసులు జారీ అయ్యాయి. 2013లో చంద్రబాబుపై ప్రారంభమైన విచారణ ఇలా సాగుతూనే ఉంది. ఎప్పటికి పూర్తవుతుందో తెలియడం లేదు. విచిత్రమేమంటే, 2009లో దివంగతుడైన వైఎస్ బాబ్లీ నిర్మాణానికి 2010లో అనుకూలు డని ఓ అపవాదు వేసి తప్పుకోవాలని చంద్రబాబు చూడడం! తెలం గాణ అసెంబ్లీ ఎన్నికలను సాకుగా చేసుకుని, తనపై బీజేపీ చేస్తున్న ‘కపట రాజకీయ దాడి’ని తిప్పికొట్టడానికి చంద్రబాబు మధ్యలో దివం గత నేత వైఎస్ పేరును అడ్డగోలుగా బాబ్లీ వివాదంలోకి లాగారు. 2010లో జీవించి లేని రాజశేఖరరెడ్డిపై నిందమోపడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. నిజానికి మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు ఒక్కటే కాదు, గోదావరిపై మరో నాలుగు ప్రాజెక్టులను నిర్మించింది. కేంద్ర ప్రభుత్వాన్ని ధిక్కరించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోనే బాబ్లీ నిర్మాణం పూర్తి చేసింది. ట్రిబ్యునల్ తీర్పునకు విరుద్ధంగా ఈ అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం వల్ల దిగువన ఉన్న ఉమ్మడి రాష్ట్రంలోని తెలంగాణ, కోస్తా ఆంధ్ర జిల్లాల భూములు బీడు పడిపోతాయి. సుప్రీంకోర్టు తీర్పు ఎలా వచ్చినా ‘మాకు ఫికరులేదని’ బాబ్లీ పరిరక్షణ సమితి సభ్యులు కొందరు దిలాసాగా ప్రక టించారు. తమ భూభాగంలోకి గోదావరిలోకి నీళ్లు చేరితే తమ లక్ష్యం పూర్తయినట్టేనని చెప్పారు. బాబ్లీతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎడారి కాగలదన్న భీతి ప్రజలలో ఇంకా పోలేదు. సింగూరు బ్యాలెన్సింగ్ రిజ ర్వాయరు, హైదరాబాద్ మంచి నీటి సరఫరాకు ఆటంకాలు ఇంకా తొలగలేదు. వైఎస్ తెలంగాణ సౌభాగ్యంలో భాగంగా తలపెట్టిన చేవెళ్ల–ప్రాణహిత, అలీసాగర్ ఎత్తిపోతల పథకాలకు నీరు అవసరం. ‘జలయజ్ఞాని’కి తలమానికంగా చెప్పుకున్న ఈ ఎత్తిపోతల పథకాలను బాబ్జీ ప్రాజెక్టు కబళించే పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే బాబ్లీ నిర్మా ణాన్ని ఆపవలసిందిగా మొదట్లో ఆదేశించిన సుప్రీంకోర్టు కూడా చివరికి మహారాష్ట్ర బాబ్లీ నిర్మాణానికే అనుకూలంగా తీర్పు చెప్పింది. ఈ రోజుల్లో ఏ లాబీ, ఎక్కడ, ఏ సంస్థలో పనిచేస్తోందో ప్రజలకు మాత్రం పాలుపోని స్థితి. ముఖ్యంగా ఎక్కడి సమస్యలు అక్కడనే ఉంచి ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టాన్ని అడ్డగోలుగా అమలు చేస్తున్నారు. ఉమ్మడి ఆస్తుల పంపిణీలో కుటుంబాలు ఎలా తన్నులాటలకు దిగుతాయో అలాగే రెండు తెలుగు రాష్ట్రాలు వ్యవహరిస్తున్నాయి. రాష్ట్ర విభజన సమ స్యలు తెలుగు వారిని వెన్నంటుతూనే ఉన్నాయి. 1969 గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ ఏర్పాటుతో బాబ్లీ కథ మొదలయింది. 2010లో దాని నిర్మాణం ఇంకాస్త రహస్యంగా ముగిసింది. రాష్ట్ర ప్రయోజనాల ముందు రాజకీయ ప్రయోజనాలు పనికి రావనే ఆరోగ్యకర భావన కొర వడితే రాజకీయ పార్టీలు (అది ఏ పక్షమైనా సరే) ప్రజల నమ్మకం కోల్పోక తప్పదని, రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తే అది ఆత్మహత్యా సదృశమేనని దేశాల చరిత్ర చెబుతోంది. వ్యాసకర్త: ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు abkprasad2006@ahoo.co.in -
కోర్టు నోటీసులతో ఎల్లో డ్రామా
-
నారావారి సాము ‘గరుడ’లు!
కాదేదీ కవితకనర్హం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. కాదేదీ ప్రచారానికనర్హం అంటున్నారు నారా చంద్రబాబునా యుడు. న్యాయవ్యవస్థ పనితీరు తెలిసినవారు ఎవరైనా రెండు రోజులుగా చంద్రబాబు, ఆయన సహచరులూ ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో మాట్లాడుతున్న తీరు చూస్తే వీళ్ళకి మతులు పోయాయని నిర్ధారించుకుంటారు. రాజ కీయం ఇంతగా దిగజారిపోయిందేమిటని బాధపడతారు. గోరంత విషయాన్ని కొండంత చేస్తున్నందుకు ఆగ్రహి స్తారు. న్యాయవ్యవహారాలు తెలియనివారు మాత్రం ప్రధాని నరేంద్రమోదీకీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికీ మధ్య భీకర సమరం సాగుతున్నదని భ్రమి స్తారు. మోదీ అన్ని పనులూ పక్కన పెట్టి, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాను పిలిపించుకొని గంటలకొద్దీ సమాలోచనలు జరిపి, ఇద్దరూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో మాట్లాడిన ట్టూ, ఫడ్నవీస్ నాందేడ్ జిల్లాలోని ధర్మాబాద్‌లో ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్‌తో కలిసి రాజకీయకుట్ర చేసి చంద్ర బాబును అరెస్టు చేయడానికి పన్నాగం పన్నినట్టూ, అందులో భాగంగానే నాన్‌బెయిలబుల్ వారెంటు పంపి నట్టూ అపార్థం చేసుకొని అనవసరంగా ఆవేశపడతారు. ఇటువంటì వారెంట్లకూ, అరెస్టులకూ తాను భయపడేది లేదని కర్నూలు జిల్లా సున్నిపెంటలో ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఉపముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి, మంత్రులు కళావెంకటరావు, యనమల రామకృష్ణుడు, నారాయణ, పత్తిపాటి పుల్లారావు, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతి రాజు, మాజీ ఎంపీ నామానాగేశ్వరరావు తక్కుంగల నేత లందరూ నాన్‌బెయిలబుల్ వారెంటు మోదీ పనేనంటూ ప్రకటించారు. తాను మరోసారి ప్రధాని కాకుండా చంద్ర బాబు అడ్డుకుంటారనే భయంతో మోదీ కుట్ర చేసి తమ నాయకుడిని వేధించాలని ప్రయత్నిస్తున్నారనీ, మోదీ ఆటలు సాగవనీ, అంతు చూస్తామనీ వారంతా ముక్తకం ఠంతో హెచ్చరించారు. అంతటితో ఆగకుండా, బాబ్లీ ప్రాజెక్టును వైఎస్ రాజశేఖరరెడ్డి సమర్థించారని చంద్ర బాబు ఆరోపించారు. వైఎస్ 2009లో దివంగతుడైన విష యం ముఖ్యమంత్రి మరచిపోయారు. మీడియా సహకారం చంద్రబాబుకు అరెస్టు వారెంట్ వార్తను మీడియా సమ ధికోత్సాహంతో పతాక శీర్షికలతో, పొలికేకలతో ప్రకటించి, ప్రసారం చేసి రెండు తెలుగు రాష్ట్రాలలో యుద్ధవాతా వరణం సృష్టించింది. చంద్రబాబును ఒక వైపు నరేంద్ర మోదీతోనూ, రెండో వైపు వైఎస్ జగన్మోహన్రెడ్డితోనూ, ఇంకోవైపు కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) తోనూ త్రిముఖంగా పోరాడుతున్న యోధానయోధుడుగా ప్రజలు గుర్తించి ఆయనను రాబోయే ఎన్నికలలో కూడా గెలిపిం చాలని బాబు మిత్రుల ఆకాంక్ష. అసలు విషయం ఏమి టంటే వడ్ల గింజలో బియ్యపు గింజ. పత్రికలూ, వార్తాచా నళ్ళూ నిర్వహించేవారికి నాన్బెయిలబుల్వారెంట్ (ఎన్బీ డబ్ల్యూ) కొత్తకాదు. నాకు అనేక సందర్భాలలో ఎన్బీ డబ్ల్యూ వచ్చింది. ఒకసారి ఇద్దరు పోలీసు అధికారులు సరాసరి మా కార్యాలయంలో నా గదిలోకి వచ్చి నాకు ఎదు రుగా కూర్చొని ఆశ్చర్యపరిచారు. ఎన్బీడబ్ల్యూ చూపిం చారు. మా లాయర్ నుంచి కానీ, రిపోర్టర్ నుంచి కానీ నాకు సమాచారం బొత్తిగా లేదు. మర్నాడు కోర్టుకు హాజ రవుతానని చెప్పి వారిని పంపించాను. కోర్టుకు హాజరై నాను. ఇతర సంపాదకులకూ, పత్రికాధిపతులకూ పరువు నష్టం దావాలలో కోర్టుకు హాజరు కాలేకపోయిన పరిస్థితు లలో ఎన్బీడబ్ల్యూ రావడం, దిరిమిలా కోర్టుకు హాజరు కావడం లేదా న్యాయవాదిచేత దరఖాస్తు చేయించడం, ఎన్బీడబ్ల్యూను ‘రీకాల్’ చేయించుకోవడం సర్వసాధా రణం. ఇది చాలా చిన్న విషయం. అటువంటి ఎన్బీడబ్ల్యూ ఒకటి చంద్రబాబుకీ, మరి కొంతమందికీ 37వ సారి వచ్చింది. ధర్మాబాద్ మెజిస్ట్రేట్ ఎన్ఆర్ గజఖియే జులై 5న తాజా వారెంట్ పంపించాలని ఆదేశించారు. దాని ప్రకారం ఆగస్టు 16 నిందితులు హాజరు కావాలి. కానీ తేదీని చేతితో కొట్టివేసి సెప్టెంబర్ 21న హాజరు కావాలని ఆదేశిస్తూ పంపిన తాఖీదు రెండు రోజుల కిందటే అందినట్టు ప్రచారం. 2010లో గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్టు నిర్మిస్తున్న సందర్భంలో అప్పుడు ప్రతి పక్షంలో ఉన్న చంద్రబాబు పార్టీ సహచరులతో వెళ్ళి ధర్నా చేశారు. మహారాష్ట్ర పోలీసులు టీడీపీ నాయకులను అరెస్టు చేసి పుణె జైలుకు తరలించారు. అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్‌లో దింపారు. భారత శిక్షాస్మృతి కింద మహా రాష్ట్ర పోలీసులు కేసులు పెట్టారు. విచారణ 2013 ఆగ స్టులో ప్రారంభమైంది. నిందితులు కోర్టుకు హాజరు కావడం లేదనే కారణంపైన 2015 సెప్టెం» ర్ 21 మొద టిసారి ఎన్బీడబ్ల్యూ జారీ చేశారు. ఆ తర్వాత 35 సార్లూ ఎన్బీడబ్ల్యూ జారీ చేస్తూ వచ్చింది ధర్మాబాద్ కోర్టు. ఎనిమిదేళ్ళుగా అదే కోర్టులో కేసు నలుగుతూ ఉన్నది. ఎన్బీడబ్ల్యూ జారీ చేయడమే కానీ దాన్ని అమలు చేసే ఉద్దేశం కోర్టుకు ఉన్నట్టు లేదు. మన న్యాయవ్యవస్థ పని తీరుకు ఇది ప్రబల నిదర్శనం. టీడీపీకి చెందిన ఇద్దరు మంత్రులు ఎన్డీఏ భాగస్వాములుగా ఉన్న కాలంలోనే 35 ఎన్బీడబ్ల్యూలు వచ్చాయి. బుట్టదాఖలైనాయి. కానీ 37వ ఎన్బీడబ్ల్యూని రాజకీయంగా వినియోగించుకోవాలనే మెరుపులాంటి ఆలోచన చంద్రబాబుకి వచ్చినట్టుంది. తెలంగాణ కోణం నరేంద్రమోదీపైన వ్యతిరేకత సృష్టించడం ఒక్కటే లక్ష్యం కాదు. తెలంగాణ ఎన్నికలలో ఈ అంశాన్ని తురుపు ముక్కగా ఉపయోగించుకోవాలని సంకల్పం. 1995లో ఎన్‌టి రామారావును గద్దె దింపడానికి వైస్రాయ్ హోట ల్లో జరిగిన నాటకంలో సహకరించిన శక్తులు ఇన్నేళ్ళు గడిచినా చంద్రబాబుతోనే మరింత అంకితభావంతో కొన సాగడం విశేషం. అందుకే ఆయనకు ఏ ఆలోచన వచ్చినా వెంటనే అమలు చేసి ఫలితాలు సాధించగలుగుతున్నారు. ఆయన ‘తందానా’ అంటే ‘తానతందనానా’ అంటూ దరువు వేయడానికీ, బృందగానం చేయడానికి వెరపులేని మీడియా సిద్ధంగా ఉంటుంది. న్యాయవ్యవస్థలో కార్యసా ధనకు అవసరమైన శక్తియుక్తులున్నాయి. టీడీపీలో ఆయన మాటకు ఎదురు చెప్పే చేవ ఉన్నవారు ఎవ్వరూ లేరు. నాయకుడు ఏ పాట పాడమంటే ఆ పాట పాడుతారు. ఏ ఆట ఆడమంటే ఆ ఆట ఆడతారు. తెలంగాణలో ఆధిక్యాన్ని ప్రదర్శించుకోవడానికి చంద్రబాబు మరో ప్రయత్నం చేస్తున్నారు. ‘ఓటుకు కోట్ల’ కేసు తర్వాత బతుకుజీవుడా అంటూ ఉమ్మడి రాజధాని వదిలి అమరావతికి మకాం మార్చిన బాబు ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారు. తనపైన కేసీఆర్‌ది పైచేయి అయింది. అందుకు ప్రతీకారంగా కేసీఆర్‌ని ఓడించేందుకు కాంగ్రె స్తో చేతులు కలపాలని నిర్ణయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు గడువు ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి కనుక ముందస్తు ఎన్నికలకు వెడుతున్న తెలంగాణలో మరోసారి కాలుమోపడానికి ప్రయత్నం చేయాలని ఆరా టపడుతున్నారు. అందుకే వారం రోజుల కిందట హైదరా బాద్‌లో టీఆర్ఎస్లోకి వలస పోగా మిగిలిన కొద్దిమంది టీడీపీ నాయకులతో సమాలోచనలు జరిపి కమిటీలు వేసి హడావిడి చేశారు. తెలంగాణ ఎన్నికలలో టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ కూటమికి తానే సారథ్యం వహిస్తున్నట్టు కనిపిం చడం చంద్రబాబు ఉద్దేశం. పెద్దపార్టీగా చొరవ తీసుకో వాలన్న అభిలాష ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి లేదు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు రమణకు బాధ్యతలు అప్పగించి చంద్ర బాబు అమరావతికి వెళ్ళిపోయారు. ఎందుకైనా పనికి వస్తుందని ఒక సైడ్షోను శివాజీ అనే నటుడితో ‘ఆపరేషన్ గరుడ’ అనే ఒకానొక ఊహాజనిత ప్రాయోజిత కార్యక్ర మాన్ని కొన్ని మాసాల కిందటే ఆరంభింపజేశారు. దాన్ని మహారాష్ట్ర కోర్టు నుంచి వచ్చిన ఎన్‌బీడబ్ల్యూకు ప్రచారం ఇవ్వడానికి వినియోగించుకున్నారు. ఈ విధంగా మేథోక్రీడ ఆడటం టీడీపీ అధినేతకు అలవాటే. అవే ఎత్తుగడలు, అవే వ్యూహాలు వైస్రాయ్ డ్రామాలో సైతం ఇదే రకమైన ఎత్తుగడలు అమలు పరిచారు. లేనిది ఉన్నట్టూ, ఉన్నది లేనట్టూ నమ్మించడం ఈ క్రీడలో ్రçపధానం. ఎన్టీఆర్‌ను భార్యా విధేయుడుగా, అసమర్థుడుగా, లక్ష్మీపార్వతిని దుష్టశక్తిగా నమ్మించడానికి వినియోగించిన తంత్రాన్నే ఇప్పుడు మోదీతో తాను యుద్ధం చేస్తున్నట్టు ప్రజలు విశ్వసించే విధంగా నాటకం రక్తికట్టించేందుకు యధాశక్తి ఉపయో గిస్తున్నారు. అన్నివేళలా వ్యూహాలు ఫలించవు. 1995లో ఫలించిన వ్యూహం 2004లోనూ, 2009లోనూ పారలేదు. 2014లో ఫలించి స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కడచిన నాలు గేళ్ళుగా ప్రజలు రకరకాల అనుభవాల నుంచి గుణ పాఠాలు నేర్చుకున్నారు. అందుకే ‘యాక్సిస్ మై ఇండియా’ ‘ఇండియాటుడే’ సంస్థ కోసం చేసిన సర్వేలో భావి ముఖ్య మంత్రి ఎవరనే ప్రశ్నకు 43 శాతం మంది వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని బదులిస్తే 38 శాతం మంది మాత్రమే చంద్రబాబు అని చెప్పారు. శనివారంనాడు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు నిర్వహించిన బహిరంగ సభకు గణనీయమైన సంఖ్యలో జనం హాజరు కావడం కూడా ప్రభుత్వ వ్యతిరేకత బలంగా ఉన్నదన డానికి నిదర్శనం. రాబోయే ఎన్నికల దృష్ట్యా బాబ్లీ బరాజ్ నిర్మాణం సమయంలో టీడీపీ చేసిన ధర్నాను తిరిగి ప్రజ లకు గుర్తు చేయడం అవసరమని చంద్రబాబు భావించి ఉంటారు. గోదావరిపైన మరో ప్రాజెక్టు వస్తే ఉత్తర తెలంగాణ బీడైపోతుందన్న ఆవేదనతో ఆ నాడు తాను మహారాష్ట్ర వెళ్ళి ఆందోళన చేశానని చెప్పుకోవడానికి ఎన్బీడబ్ల్యూ ఆయనకు ఒక సందర్భాన్ని ప్రసాదించింది. ఒక వైపు ఆపరేషన్ గరుడ, మరోవైపు ఆపరేషన్ ఎన్బీడబ్ల్యూ కొనసాగిస్తూనే ఇంకోవైపు ఆపరేషన్ ఇంటెలిజెన్స్‌కు తెరలేపారు. సిబ్బందితో సహా హైదరాబాద్‌లో మకాం వేసి ఏయే నియోజకవర్గాలలో టీడీపీ అభ్యర్థులు గెలిచే అవ కాశం ఉన్నదో పరిశీలించమని ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ విభాగం అధిపతి వెంకటేశ్వరరావుకు పురమాయించారు. టీడీపీ ఓటు బ్యాంకు 31 శాతం చెక్కు చెదరలేదంటూ మొన్న హైదరాబాద్ సందర్శన సందర్భంగా రమణ చేత ఒక ప్రకటన చేయించారు. కనీసం 50 నియోజకవర్గాలలో టీడీపీ అభ్యర్థులు గెలిచే అవకాశాలు కనిపిస్తాయంటూ వెంకటేశ్వరరావు చేత నివేదిక ఇప్పించుకుంటారు. ఈ రెండు అంశాలు ప్రాతి పదికగా కాంగ్రెస్‌తో సీట్ల బేరం పెడతారు. అమరుల ఆకాంక్షల ఆధారంగా ఎజెండా తయారు చేసుకొని కోదండరామ్ కూడా ఈ కూటమిలో భాగస్వామి కావ డానికి సిద్ధంగా ఉన్నట్టున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చినట్లయితే టీఆర్ఎస్కు గట్టిపోటీ ఇస్తాయి. ఈ పరి ణామాలను కేసీఆర్ చూస్తూ ఊరుకుంటారా? కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డిపైన, రేవంత్‌రెడ్డిపైన కేసులు తిరగ దోడటంలోని ఆంతర్యం ‘ఓటుకు కోట్ల’ కేసు గురించి చంద్రబాబుకి సంకేతం పంపడమేనని ఒక వాదన. ‘తెలం గాణలో నువ్వు వేలు పెడితే ఆంధ్రప్రదేశ్‌లో నేను కాలు పెడతా’ అంటూ ఇప్పటికే కేసీఆర్ చంద్రబాబుని హెచ్చ రించారంటూ రాజకీయవర్గాలలో చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ అధి ష్ఠానంలో కూడా రెండు రకాల అభిప్రాయాలు ఉన్నాయి. టీడీపీ ఎక్కువ సీట్లు అడిగితే ఇవ్వకూడదనీ, కాంగ్రెస్‌కి విజయావకాశాలు ఉన్న సీట్లను వదులు కోకూడదనీ మొన్న రాహుల్‌గాంధీ తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో స్పష్టంగా చెప్పారు. ఒక వేళ టీడీపీ పొత్తుకు నిరాకరిస్తే కాంగ్రెస్‌కి నష్టం లేదనీ, టీఆర్ఎస్కు వెళ్ళ వలసిన నాయకులందరూ వెళ్ళిపోయారనీ, మిగిలినవారు కాంగ్రె‹ Üలో చేరి కాంగ్రెస్ ఎన్నికల చిహ్నంపైన పోటీ చేయడమే మేలు అనే అభిప్రాయంలో ఉన్నారనీ కొందరు తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాహుల్‌తో చెప్పారు. తెలంగాణలో అస్తి త్వంకోసం, రెండు కళ్ళ సిద్ధాంతం కొనసాగించడంకోసం చంద్రబాబు తక్కువ స్థానాలతో సరిపెట్టుకుంటే కూట మిలో ఉండటానికి కాంగ్రెస్‌కి అభ్యంతరం ఉండదు. జాతీయ పార్టీ అయినప్పటికీ కాంగ్రెస్ బిహార్, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాలలో జూనియర్ భాగ స్వామిగా సర్దుకుపోతున్నది. తెలంగాణలో మిగిలిన ఇద్దరు టీడీపీ ఎంఎల్ఏలలో ఎల్బీనగర్ శాసనసభ్యుడు కృష్ణయ్య సొంత పార్టీ పెట్టుకుంటానంటున్నారు. సత్తుపల్లి ఎంఎల్ఏ సండ్రవెంకటవీరయ్య మాత్రమే మిగిలారు. ఆయన కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాబల్యంతో గెలిచారు. రక రకాల పనికిమాలిన ‘ఆపరేషన్లు’ నడిపిస్తూ అలవి కాని చోట అధికులమనడం అవివేకమని టీడీపీ అధినేత గుర్తిస్తే ఆయనకే మంచిది. -కె. రామచంద్రమూర్తి -
నోటీసులు కొత్తేమి కావు
-
చంద్రబాబు ఎన్ని పన్నాగాలు పన్నినా లాభం లేదు
-
కుష్బూ తప్పక కోర్టుకు హాజరుకావాలి
తమిళసినిమా : నటి కుష్బూకు మేటూర్ కోర్టు ఈ నెల 12వ తేదీన తప్పక హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్లితే 2005లో తమిళ మహిళల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి కుష్బూపై రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆ సంఘటన తీవ్ర దుమారాన్నే రేపింది. అంతే కాదు మురుగన్ అనే న్యాయవాది మెటూర్ మేజిస్ట్రేట్ నేర విభాగ కోర్టులో కుష్బూపై పిటిషన్ దాఖలు చేశారు. అప్పట్లో కేసు విచారణకు కుష్బూ కోర్టుకు హాజరు కాకపోవడంతో ఆమెపై అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయ్యింది. తరువాత కుష్బూ విచారణకు హాజరుకావడంతో అరెస్ట్ వారెంట్‌ను కోర్టు రద్దు చేసింది. కుష్బు న్యాయస్థానంలో హాజరవుతున్న సమయంలో కొందరు ఆమె కారుపై టామాటలు, కోడిగుడ్లు విసిరారు. దీనిపై మేటూర్ తాహసీల్దారు పయాస్ అహ్మద్‌ఖాన్, డీఎంకేకు చెందిన అరివళగన్ తదితర 41 మందిపై పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో కుష్బూ, అప్పటి పోలీస్‌ఇన్‌స్పెక్టర్ దినకరన్‌లను విచారించాలని కోరుతూ ప్రభుత్వ న్యాయవాది జగన్నాథన్ మేటూర్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు న్యాయమూర్తి రాజా సమక్షంలో విచారణలో ఉంది. నిందితుల తరఫున న్యాయవాది మురుగన్ వాదిస్తున్నారు. ఈ కేసు తాజాగా సోమవారం తుది విచారణకు వచ్చింది. న్యాయమూర్తి రాజా ఈ కేసు వ్యవహారంలో నటి కుష్బూ, ఇన్స్పెక్టర్ దినకరన్‌లు ఈ నెల 12వ తేదీన కోర్టుకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. -
ఆక్రమణదారులపై ‘ధిక్కార’ చర్యలు
106 షాపుల యజమానులకు కోర్టు ధిక్కార నోటీసులు సాక్షి, హైదరాబాద్: రాజధానిలోని సిద్దిఅంబర్బ జార్లో ఫుట్‌పాత్‌లు, రోడ్లను ఆక్రమించబోమంటూ హామీ ఇచ్చి, దానిని ఉల్లంఘించిన 106 షాపుల యజమానులపై ఉమ్మడి హైకోర్టు సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలకు ఉపక్రమించింది. హామీని ఉల్లంఘించినందుకు కోర్టు ధిక్కార చర్యలు ఎందుకు తీసుకోరాదో వివరించాలంటూ వారందరికీ మంగళవారం నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్‌రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. సిద్దిఅంబర్‌బజార్‌లో ఫుట్‌పాత్‌లు, రోడ్ల ఆక్రమణలు జరుగుతున్నా జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదంటూ లక్ష్మీనివాస్ అగర్వాల్ అనే వ్యక్తి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ క్రమంలో సిద్దిఅంబర్‌బజార్‌లో ఫుట్‌పాత్‌ల ఆక్రమణలకు పాల్పడుతున్న 106 షాపులను ధర్మాసనం ఇటీవల జప్తు చేయించింది. దీంతో ఆ షాపుల యజమానులు ఇకపై ఆక్రమణలకు పాల్పడబోమం టూ రాతపూర్వక హామీలివ్వడంతో, జప్తు చేసిన షాపులను తెరవాలని అధికారులకు ఆదేశాలిచ్చింది. అయినప్పటికీ ఆక్రమణలు మళ్లీ మొదలు కావడంతో వారిపై సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలకు ధర్మాసనం ఉపక్రమించింది. -
కబాలి నిర్మాతను అరెస్టు చేయండి: కోర్టు
తమిళనాడు: కబాలి చిత్ర నిర్మాత, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు కలైపులి ఎస్.థానును అరెస్ట్ చేయాలంటూ నాగర్‌కోవిల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల్లోకెళ్లితే నాగర్‌కోవిల్‌కు చెందిన క్యూ థియేటర్ యజమాని డేవిడ్నాగర్కోవిల్ కోర్టులో థానుపై పిటిషన్ దాఖలు చేశారు. అందులో ఆయన పేర్కొంటూ నిర్మాత థాను తనకు చెల్లించాల్సిన రెండు లక్షలు రూపాయలను తిరిగి ఇవ్వడం లేదంటూ పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను నాగర్ కోర్టు 2013 లోనే విచారించి వెంటనే థాను డేవిడ్‌కు ఇవ్వవలసిన డబ్బును తిరిగి చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయినా థాను ఇప్పటి వరకూ డేవిడ్‌కు ఆ డబ్బు చెల్లించకపోవడంతో ఆయన మరోసారి కోర్టును ఆశ్రయించారు. థానుకు డబ్బు వసతి ఉండి కూడా తనకు రావలసిన డబ్బు తిరిగి చెల్లించకుండా దాటవేత దోరణిని అవలంభిస్తున్నారని కోర్టుకు విన్నవించుకున్నారు. దాంతో నాగర్‌కోవిల్ కోర్టు ఈ నెల 28వ తేదీలోగా నిర్మాత థానును అరెస్ట్ చేయాలని మంగళవారం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. -
వెంకన్న ఆదాయంలో వాటాల గోల
-
నటుడు సంతానంకు కోర్టు నోటీసులు
తమిళసినిమా: దిల్లుక్కు దుడ్డు చిత్రంతో కథానాయకుడిగా మారిన హాస్యనటుడు సంతానంకు చెన్నై సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈయనతో పాటు చిత్ర దర్శకుడు రామ్‌బాలాకు కూడా నోటీసులు అందాయి. వివరాల్లోకెళితే పేపర్ ప్లైట్ చిత్ర నిర్మాణ సంస్థ అధినేత ముహమద్ మస్తాన్ సర్భూదిన్ చెన్నై 14వ సిటీ సివిల్‌కోర్టులో సంతానంపై పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ఆయన ఆవి పరక్క ఒరు కథ అనే పేరుతో తాను చిత్రం నిర్మించ తలపెట్టానని, దీనికి దర్శకుడిగా రామ్‌బాలాను ఎంపిక చేశానని పేర్కొన్నారు. అనంతరం రామ్‌బాలాకు రూ. 11 లక్షల పారితోషికం మాట్లాడి మూడు లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చినట్లు చెప్పారు. చిత్రానికి హీరోహీరోయిన్లుగా నటుడు శివ,నటి నందితలను ఎంపిక చేసి వారికీ కొంత అడ్వాన్స్ చెల్లించినట్లు పిటిషన్లో పేర్కొన్నారు. అయితే షూటింగ్‌కు సిద్ధమైన తరుణంలో దర్శకుడు రామ్‌బాలా తనకు ఎలాంటి కారణం చెప్పకుండా రాలేదని తెలిపారు. నటుడు సంతానం హీరోగా నటించిన దిల్లుక్కు దుడ్డు చిత్రానికి రామ్‌బాలా దర్శకత్వం వహిస్తున్నట్లు తెలిసిందన్నారు. తన కథతో ఆ చిత్రాన్ని తీశారనీ.. దీంతో తాను సంతానంకు ఫోన్ చేసి అడగ్గా చిత్రానికి రామ్‌బాలా దర్శకుడు కాదని చెప్పారన్నారు. కాగా ఇటీవల దిల్లుక్కు దుడ్డు చిత్ర ప్రచార పోస్టర్లలో దర్శకుడిగా రామ్‌బాలా పేరును వేశారని, ఈ విషయమై మళ్లీ సంతానంను అడగ్గా నువ్వు ఏమి చేసుకుంటావో చేసుకో అంటూ బెదిరించారని చెప్పారు. కాగా తాను తన చిత్రం కోసం రూ. 81 లక్షల వరకూ ఖర్చు చేశానని..దిల్లుక్కు దుడ్డు చిత్రం విడుదలైతే తాను చాలా నష్టపోతానని లేఖలో తెలిపారు. అందువల్ల చిత్ర విడుదలపై నిషేధం విధించాలని కోరారు. ఈ కేసును శుక్రవారం విచారించిన చెన్నై 14వ సిటీ సివిల్ న్యాయమూర్తి గణపతిస్వామి నటుడు సంతానం,దర్శకుడు రామ్‌బాలాలను ప్రత్యక్షంగా కోర్టుకు హాజరు కావలసిందిగా ఆదేశాలు జారీ చేసి కేసు విచారణను ఈ నెల 28కి వాయిదా వేశారు. -
‘నా భర్త నాకు కావాలి’
హిమాయత్నగర్ః అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న నా భర్త నాకు కావాలని, విడాకులు తీసుకోవడం నాకు ఇష్టం లేదని భర్తపై ఓ భార్య పోరాటం చేస్తుంది. వివరాల్లోకి వెళితే బాగ్‌లింగంపల్లిలోని ఇడబ్ల్యూఎస్ క్వార్టర్స్‌కు చెందిన కారు డ్రైవర్ సత్యనారాయణతో 1996 సంవత్సరంలో తనకు వివాహం అయ్యిందని మొదటి భార్య ఎస్.రాజేశ్వరీ ఆదివారం విలేకరులకు తెలిపింది. ప్రస్తుతం మా పెళ్లికి సాక్షిగా 18ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడంది. 1997లో బాబు పుట్టిన సందర్భంలో ఎవరికి పుట్టాడో అని చెప్పి తనని ఇంటికి రాకుండా చేశాడని తెలిపింది. అనంతరం కొద్ది రోజుల తరువాత విడాకులు ఇవ్వాలంటూ కోర్టు నోటీసులు పంపించాడన్నారు. నేను విడాకులకు నిరాకరించడంతో కోర్టు కూడా విడాకులను ఇవ్వలేదన్నారు. ఈ వ్యవహారం జరుగుతుండగానే 2002లో మౌనిక అనే యువతిని నాకు తెలియకుండా పెళ్లి చేసుకున్నాడని చెప్పింది. మౌనిక వైపు బంధువులంతా తనను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తక్షణం ప్రభుత్వం స్పందించి తనకు న్యాయం చేసి భర్తను అప్పచెప్పాలని కోరుతున్నారు. -
'శ్రీమంతుడి కథ నాదే.. కాపీ కొట్టారు'
హైదరాబాద్: తెలుగులో రికార్డులు సృష్టించిన శ్రీమంతుడు చిత్ర యూనిట్ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా తను రాసిన నవలను కాపీ కొట్టి తీశారని రచయిత శరత్ చంద్ర కోర్టులో పిటిషన్ వేశారు. దీనిని గురువారం సిటీ సివిల్ కోర్టు అడిషనల్ జడ్జి సింగారెడ్డి కేసు విచారించారు. 2012లో తాను రాసిన నవల స్వాతి మాస పత్రికలో ప్రచురితమైందని ఆ నవల కథనే మైత్రీ మూవీ మేకర్స్ 'శ్రీమంతుడు' చిత్రంగా నిర్మాణం చేసిందని పిటిషన్ దారు పేర్కొన్నారు. ఆయన తరుపున సీనియర్ న్యాయవాదులు వీఆర్ మాచవరం, పవని శివకుమార్ వాదిస్తున్నారు. చిత్ర దర్శకుడు కొరటాల శివతోపాటు ఎర్నినేని నవీన్, హృతిక్ రోషన్‌లను ప్రతివాదులుగా చేర్చారు. శ్రీమంతుడు చిత్రాన్ని హిందీ భాషలో తీయాలని కొరటాల శివ ప్రయత్నిస్తున్నారని, విచారణ పూర్తయ్యే వరకు వేరే భాషలోకి వెళ్లకుండా స్టే ఇవ్వాలని కోర్టును శరత్ చంద్ర కోరారు. దీంతో ప్రతివాదులకు అర్జంట్ నోటీసులను జారీ చేసిన కోర్టు.. విచారణ వచ్చే నెల 4కు వాయిదా వేసింది. -
గోవాడపై మరో మరక!
చక్కెర అమ్మకాల్లో గతంలో వెల్లువెత్తిన ఆరోపణలు వెంటాడుతున్న కోర్టు నోటీసులు తాజాగా పాలకవర్గంపై పోలీసు కేసులు చోడవరం: రాష్ట్ర సహకార రంగంలో అతిపెద్ద ఫ్యాక్టరీగా ఉన్న గోవాడ సుగర్స్ ప్రతిష్ట దెబ్బతీసే విధంగా ప్రస్తుత పరిణామాలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో ఎన్నో ఉత్తమ అవార్డులు అందుకున్న ఈ ఫ్యాక్టరీని అవకతవకలు, అవినీతి మరకలు కుదిపేస్తున్నాయి. తాజాగా ఫ్యాక్టరీ చైర్మన్, ఎండీలతోపాటు పాలకవర్గంపై గ్రీన్‌మింట్ కంపెనీ కోర్టు కెక్కి కేసులు పెట్టడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏటా సుమారు 5 లక్షల టన్నులకు పైబడి క్రషింగ్ చేస్తూ 24 వేల మంది రైతులకు ఆసరాగా ఉన్న ఈ ఫ్యాక్టరీలో టీడీపీ పాలకవర్గం వచ్చాక తరుచూ ఏదో అవినీతి ఆరోపణలు చోటుచేసుకుంటున్నాయి. 2014 అక్టోబర్‌లో వచ్చిన హుద్‌హుద్ తుఫాన్ ఈ ఫ్యాక్టరీకి అన్ని రకాలుగా నష్టాలు కలిగించింది. గొడౌన్ల పైకప్పుల ఎగిరిపోయి, పంచదార నిల్వలు తడిసిపోయి నష్టం కలగగా, మరో పక్క ఆ తడిసిన పంచదార అమ్మకాల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు, పోలీసు కేసులతో ప్రతిష్ట దిగజారిన పరిస్థితి నెలకొంది. వెల్లువెత్తిన ఆరోపణలు తడిసిన పంచదార అమ్మకాలు, ఇన్సూరెన్సు పరిహారం మంజూరులో కొంత హైడ్రామా నడిచినట్టు అప్పట్లో ఆరోపణలు వెళ్లువెత్తాయి. నష్టాలను బూచిగా చూపిస్తూనే మరో పక్క పాలకవర్గం, యాజమాన్యం కుమ్మక్కై రూ.కోట్లు అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు గుప్పుమన్నాయి. వైఎస్సార్సీపీ, ఇతర రాజకీయ పక్షాలు, రైతు సంఘాలు ఆందోళనలు చేశాయి. ఈ విషయమై అధికార పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే సైతం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. కశింకోట సీడబ్ల్యుసీ గొడౌన్లలో నిల్వ చేసిన లక్షా 19 వేల క్వింటాళ్ల తడిసిన పంచదార అమ్మకాల్లో గోల్మాల్ జరిగిందనే ఆరోపణలే ఇప్పుడు ఫ్యాక్టరీని కుదిపేస్తున్నాయి. తడిసిన పంచదారను టెండర్ల ద్వారా అమ్మే క్రమంలో హైదరాబాద్‌కు చెందిన గ్రీన్‌మింట్ ఇండియా అగ్రిటెక్ ప్రైవేటు కంపెనీ టెండర్లు దగ్గించుకుంది. తర్వాత ఫ్యాక్టరీ యాజమాన్యం మరో ట్రేడర్‌తో ఒప్పందం కుదుర్చుకొని సరకును అమ్మేయడం విమర్శలకు దారితీసింది. ఈ క్రమంలో సుమారు రూ.8 కోట్ల అవినీతి జరిగిందనే ఆరోపణలు వెళ్లువెత్తాయి. నేరుగా రంగంలోకి గ్రీన్‌మింట్ ఫ్యాక్టరీలో ఇంత భాగోతం జరుగుతోందని తెలుసుకున్న గ్రీన్‌మింట్ కంపెనీ నేరుగా రంగంలోకి దిగింది. తన కంపెనీ పేరున వేసిన టెండరు మేరకు సరకు అప్పగించాలని సంబంధిత కంపెనీ యజమాని, ఇన్సూరెన్సు సంస్థకు కోర్టు నోటీసులు కూడా ఇచ్చింది. మరోపక్క అవినీతి ఆరోపణలపై ప్రతిపక్షాలు ఆందోళనకు దిగడం, మహాజన సభలో సైతం నిరసన తెలియజేయడంతో ప్రభుత్వం అదనపు జాయింట్ కలెక్టర్‌తో చేయిస్తున్న విచారణ కూడా కొనసాగుతోంది. ఇంతలో గ్రీన్‌మింట్ కంపెనీ వేసిన కేసు కారణంగా కోర్టు ఉత్తర్వులు మేరకు చైర్మన్, ఎండీ, ఇన్సూరెన్సు కంపెనీతోపాటు పాలకర్గంలో కొందరు డైరక్టర్లపై చోడవరం పోలీసులు కేసు నమోదు చేయడంతో ఈ వ్యవహరం మరో మారు గుప్పుమంది. పాలకవర్గంపై కేసులు నమోదు కావడం ఫ్యాక్టరీ చరిత్రలో ఇదే మొదటిసారి కావడంతో సర్వత్రా రైతుల్లో, ఫ్యాక్టరీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సుగర్స్ పాలకవర్గాన్ని బర్తరఫ్ చేయాలి చోడవరం: గోవాడ సుగర్ ప్యాక్టరీ పాలకవర్గాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ చెరకు రైతు సంఘం డిమాండ్ చేసింది. ఏపీ చెరకు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కర్రి అప్పారావు, జిల్లా అధ్యక్షుడు యన్నంశెట్టి సీతారాం, జిల్లా కార్యదర్శి నాగిరెడ్డి సత్యనారాయణ బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. పారదర్శకతలేని పాలకవర్గం రైతులకు ఎటువంటి మేలు చేయదని, వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. పంచదార అమ్మకాల్లో అవినీతికి పాల్పడటమే కాకుండా పోలీసు కేసుల్లో ఇరుక్కున్న పాలకవర్గం ఫ్యాక్టరీని మరింత నాశనం చేసే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తంచేశారు. అవినీతి ఆరోపణలు నిగ్గుతేలే వరకు పాలవర్గం ఫ్యాక్టరీ పాలనలో దూరంగా ఉండాలన్నారు. తడిసిన పంచదార అమ్మకాల్లో జరిగిన అవినీతి ఆరోపణలపై వేసిన విచారణ కమిటీ నివేదిక వెంటనే బయటపెట్టాలని కోరారు. -
కోర్టు నోటీసులు పంపారని మహిళ మృతి
కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న మహిళ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి దారుణం... కళ్లెదుటే మహిళ బలవన్మరణం.. ఆస్తి తగాదాల కారణంగా నడిరోడ్డులో ఓ వివాహిత కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటనతో సాలూరు పట్టణం అట్టుడుకిపోయింది. సాలూరు: ఆస్తి తగాదాలు ఓ మహిళ బలవన్మరణానికి కారణమయ్యాయి. కోర్టు నోటీసులు పంపారని తీవ్ర వేదనకు గురై వీధిలోకి వచ్చి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకోవడం స్థానికంగా సంచలనం రేకెత్తించింది. వివరాలిలా ఉన్నారుు... పట్టణంలోని తెలగావీధిలో నివాసముంటున్న కూనిశెట్టి రాంబాబుకు సోదరుడు నానాజీతో ఆస్తి తగాదాలున్నారుు. ఈ నేపథ్యంలో నానాజీ తన సోదరుడైన రాంబాబుకు కోర్టు ద్వారా నోటీస్ పంపించాడు. దీంతో రాంబాబు భార్య వరలక్ష్మి (45) తీవ్ర మనస్థాపానికి గురై గురువారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో ఇంటిలోనుంచి బయటకు వచ్చి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. హఠాత్పరిణామానికి భీతిళ్లి న సమీప కుటుంబాలవారు క్షణాల్లో తేరుకుని మంటలను ఆర్పారు. అయితే అప్పటికే ఆమె పూర్తిగా కాలిపోయింది. 108 వాహనానికి సమాచారం అందించి పట్టణ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించడంతో అదే 108లో విజయనగరం తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూసింది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమార్తెలున్నారు. వీరిద్దరూ ఇంజినీరింగ్ చదువుతున్నారు. భార్య చనిపోవడంతో భర్త రాంబాబు, కుటుంబ సభ్యులు రోధన చూపరులను కలిచివేసింది. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
'స్వలింగ సంపర్కం'పై అమీర్ ఖాన్ కు నోటీసులు
చండీగఢ్: సత్యమేవ జయతే టీవీ కార్యక్రమం ద్వారా బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ స్వలింగ సంపర్కాన్ని ప్రోత్సహించారంటూ దాఖలైన పిటిషన్ మేరకు చండీగఢ్‌లోని ఓ కోర్టు అతడికి నోటీసులు జారీ చేసింది. దీనిపై డిసెంబర్ 19లోపు స్పందన తెలియజేయాలని అమీర్‌ఖాన్‌ను శుక్రవారం ఆదేశించింది. అమీర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సత్యమేవ జయతే కార్యక్రమం ఇటీవల ఎంతో ప్రాచుర్యం పొందిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో స్వలింగ సంపర్కంపై అమీర్ ఖాన్ చర్చించిన నేపథ్యంలో దాఖలైన పిటీషన్ పై కోర్టు అతనికి నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘించేలా ఉందని మహిళా న్యాయవాది మణిదీప్ కౌర్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అమీర్‌ఖాన్ ప్రవర్తనను కోర్టు ధిక్కారంగా ఉందని ఆమె పిటీషన్ లో పేర్కొన్నారు. అక్టోబర్ 19న ఓ ప్రైవేట్ టీవీ చానల్లో ప్రసారమైన సత్యమేవ జయతే కార్యక్రమంలో... నపుంసకులు, స్వలింగ సంపర్కుల జీవన విధానం, వారి హక్కులపై చర్చ జరిగిందని కౌర్ కోర్టుకు వివరించారు.