ప్రముఖ నటుడికి కోర్టు నోటీసులు | Court Notices To Tamil Actor Arya | Sakshi
Sakshi News home page

నటుడు ఆర్యకు కోర్టు నోటీసులు 

Published Sun, Sep 20 2020 6:30 AM | Last Updated on Sun, Sep 20 2020 6:30 AM

Court Notices To Tamil Actor Arya - Sakshi

తమిళ సినిమా: నటుడు ఆర్యకు అంబా సముద్రం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఏమిటి ఎలాంటి వివాదాల్లో చిక్కుకోని ఆర్యకు కోర్టు నోటీసులు ఇవ్వడం ఏమిటని ఆశ్చర్యంగా ఉందా? నటీనటులు వివాదాలు చిక్కుకుపోయినా వారు నటించిన చిత్రాలు వివాదాంశం కావచ్చు కదా! అదేవిధంగా 9 ఏళ్ల క్రితం ఆర్య నటించిన అవన్‌ ఇవన్‌ చిత్రం ఆయన్ని ఇప్పుడు కోర్టుకు లాగుతోంది. బాల దర్శకత్వంలో విశాల్, ఆర్య కలిసి నటించిన చిత్రం అవన్‌ ఇవన్‌. ఈ చిత్రంలో సింగంపట్టి జమీన్‌ను అవమానపరిచే సన్నివేశాలు చోటుచేసుకున్నాయంటూ నెల్లై జిల్లా, అంబాసముద్రం కోర్టులో అప్పట్లో పిటిషన్‌ దాఖలైంది. ఆ పిటిషన్‌ శుక్రవారం కోర్టులో విచారణకు వచ్చింది. ఆర్య ఈ నెల 28న హాజరు కావాల్సిందిగా అంబాసముద్రం కోర్టు ఆయనకు నోటీసులు జారీ చేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement