
తమిళంతో పాటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న నటుడు ఆర్య.ఆయన కథానాయకుడిగా నటిస్తున్న 33వ చిత్రం సోమవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ది షో పీపుల్, థింగ్స్ స్టూడియోస్ సంస్థలు నిర్మిస్తున్న చిత్రం ఇది.
నాయిగళ్ జాగ్రత్తై, మిరుదన్, టిక్ టిక్ టిక్, రెడీ వంటి సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నటి సిమ్రాన్, ఐశ్వర్య లక్ష్మి, త్యాగరాజన్, కావ్య శెట్టి, హరీష్ ఉత్తమన్, గోకుల్, భరత్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దీనికి డి.ఇమాన్ సంగీతాన్ని, యువ ఛాయాగ్రహణాన్ని అందిస్తున్నారు.
చదవండి: ‘లైగర్’ పాటలో విజయ్ డ్యాన్స్ ఇరగదీస్తున్నాడు: చార్మీ
Comments
Please login to add a commentAdd a comment