
గత రెండు రోజుల నుంచి తమిళ యంగ్ హీరో శ్రీ గురించి రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే సినిమాలు చేస్తున్నప్పుడు అందంగా కనిపించిన ఈ కుర్రాడు.. ఇప్పుడు ఎముకల గూడులా తయారయ్యాడు. జుత్తుకు రంగేసుకుని అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు.
లోకేశ్ కనగరాజ్ తొలి మూవీ 'మానగరం'లో ఓ హీరోగా నటించిన శ్రీ.. అంతకు ముందు అంటే 2012 నుంచే ఇండస్ట్రీలో ఉన్నాడు. కాకపోతే చివరగా 'ఇరుగుపట్రు' అనే చిత్రంలో నటించాడు. అయితే ఈ సినిమా నిర్మాతలు శ్రీకి రెమ్యునరేషన్ ఇవ్వకుండా మోసం చేశారని, దీంతో కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఢిల్లీ పారిపోయాడని అంటున్నారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 12 సినిమాలు.. అవేంటంటే?)
ఇన్ స్టాలో యాక్టివ్ గానే ఉన్న శ్రీ.. ఎప్పటికప్పుడు తన ఫొటోలని పోస్ట్ చేస్తూనే ఉన్నాడు. కానీ ఇతడిని చూసిన తమిళ ప్రేక్షకులు షాకవుతున్నారు. ఎందుకంటే అంత దారుణ పరిస్థితుల్లో కనిపిస్తున్నారు. తాజాగా ఇతడి గురించి తమిళ ప్రముఖ నిర్మాత ఎస్ఆర్ ప్రభు ట్వీట్ చేశారు.
'శ్రీ ఆరోగ్యం కోసం మేం ఆందోళన పడుతున్నాయి. అతడి కుటుంబ సభ్యులతో పాటు మేం కూడా చాలారోజుల నుంచి అతడిని సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ విషయం చుట్టూ చాలా ఊహాగానాలు ఏర్పడటం దురదృష్టకరం. శ్రీని మళ్లీ మామూలు మనిషిని చేయడమే మా తొలి ప్రాధాన్యం. సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఊహాగానాలని నమ్మొద్దు' అని నిర్మాత ఎస్ఆర్ ప్రభు రాసుకొచ్చారు.
(ఇదీ చదవండి: మోస్ట్ వైలెంట్‍గా 'హిట్-3' ట్రైలర్)
