Shri
-
యంగ్ హీరోకి దారుణమైన పరిస్థితి.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
గత రెండు రోజుల నుంచి తమిళ యంగ్ హీరో శ్రీ గురించి రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే సినిమాలు చేస్తున్నప్పుడు అందంగా కనిపించిన ఈ కుర్రాడు.. ఇప్పుడు ఎముకల గూడులా తయారయ్యాడు. జుత్తుకు రంగేసుకుని అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. లోకేశ్ కనగరాజ్ తొలి మూవీ 'మానగరం'లో ఓ హీరోగా నటించిన శ్రీ.. అంతకు ముందు అంటే 2012 నుంచే ఇండస్ట్రీలో ఉన్నాడు. కాకపోతే చివరగా 'ఇరుగుపట్రు' అనే చిత్రంలో నటించాడు. అయితే ఈ సినిమా నిర్మాతలు శ్రీకి రెమ్యునరేషన్ ఇవ్వకుండా మోసం చేశారని, దీంతో కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఢిల్లీ పారిపోయాడని అంటున్నారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 12 సినిమాలు.. అవేంటంటే?)ఇన్ స్టాలో యాక్టివ్ గానే ఉన్న శ్రీ.. ఎప్పటికప్పుడు తన ఫొటోలని పోస్ట్ చేస్తూనే ఉన్నాడు. కానీ ఇతడిని చూసిన తమిళ ప్రేక్షకులు షాకవుతున్నారు. ఎందుకంటే అంత దారుణ పరిస్థితుల్లో కనిపిస్తున్నారు. తాజాగా ఇతడి గురించి తమిళ ప్రముఖ నిర్మాత ఎస్ఆర్ ప్రభు ట్వీట్ చేశారు.'శ్రీ ఆరోగ్యం కోసం మేం ఆందోళన పడుతున్నాయి. అతడి కుటుంబ సభ్యులతో పాటు మేం కూడా చాలారోజుల నుంచి అతడిని సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ విషయం చుట్టూ చాలా ఊహాగానాలు ఏర్పడటం దురదృష్టకరం. శ్రీని మళ్లీ మామూలు మనిషిని చేయడమే మా తొలి ప్రాధాన్యం. సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఊహాగానాలని నమ్మొద్దు' అని నిర్మాత ఎస్ఆర్ ప్రభు రాసుకొచ్చారు.(ఇదీ చదవండి: మోస్ట్ వైలెంట్గా 'హిట్-3' ట్రైలర్) -
సహజ యోగం.. సమతుల్య జీవనం..!
మానవుల ఆధ్యాత్మిక ప్రయాణంలో స్త్రీ పాత్ర అత్యంత కీలకమైనది. పురుషులు నిత్యజీవితంలో తమ చుట్టూ ఉండే స్త్రీలను గౌరవించడం ద్వారా తమ సూక్ష్మ శరీరం లోపల శక్తి కేంద్రాలను లేదా షట్చక్రాలను చైతన్యవంతం చేసుకోవచ్చు. తల్లిని గౌరవించినప్పుడు అతని లోపల శ్రీ గణేశుని సుగుణాలు స్థిరపడడం వలన మూలాధార చక్రము చైతన్య వంతం అవుతుంది. అలానే తల్లితో ఉండే అనుబంధం చక్కగా ఉన్నప్పుడు ఎడమవైపు హృదయ చక్రం చైతన్యవంతం అవుతుంది. తన సోదరీమణులను గౌరవించినప్పుడు, ఎడమవైపు విశుద్ధి చక్రం చైతన్య వంతం అవుతుంది. తన భార్యను గౌరవించినప్పుడు ఆమె తన ఇంటికి గృహ లక్ష్మి కాబట్టి ఎడమవైపు నాభీ చక్రం చైతన్య వంతం అవుతుంది. అలానే భార్యతో అతని సంబంధం చక్కగా ఉన్నప్పుడు ఎడమవైపు హృదయ చక్రం చైతన్యవంతం అవుతుంది. పరస్త్రీలను తల్లి వలె లేదా సోదరి వలె గౌరవించినప్పుడు ఆజ్ఞా చక్రం చైతన్యవంతం అవుతుంది. కాబట్టి పురుషులు తమ ఆధ్యాత్మిక ఉన్నతి కోసం స్త్రీలను గౌరవించవలసిన ఆవశ్యకతను తెలుసుకొని తదనుగుణంగా నడుచుకోవాలి.ఎప్పుడైతే ఒక స్త్రీ తన సంపూర్ణ శక్తులను ధరించి ఉపయోగిస్తుందో అప్పుడు ఆమె చాలా శక్తివంతమై భీకరంగా ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడూ వాదిస్తూ, కొట్లాడుతూ, విమర్శిస్తూ, చౌకబారుగా ప్రవర్తిస్తుందో, అప్పుడు ఆమె శక్తులన్నీ వృధా అయిపోతాయి. ఆమె కావాలనుకుంటే పురుషులకంటే ఎక్కువగా పని చేయగలదు. అయితే మొట్టమొదటగా ఆమె ఎంతో నమ్రతతోను, అణకువతోనూ, హుందాతనంతోను, చక్కటి అవగాహనతోను, వాత్సల్యపూరితంగా ఉండి తనలోగల శక్తులను గౌరవించుకుంటూ, శాంతిని నెలకొల్పటం నేర్చుకోవాలి. ఒక కవచం వలే రక్షణను కల్పించటం స్త్రీ యొక్క బాధ్యత. కవచం కత్తి యొక్క పనిని చేయలేదు. అలానే కత్తి కవచం చేసే పనిని చేయలేదు. అయితే ఆ రెండింటిలో ఏది గొప్ప? కవచమే గొప్ప. ఎందుచేతనంటే అది కత్తి యొక్క దెబ్బను తట్టుకోవాలి కాబట్టి. కత్తి విరుగుతుందేమో కానీ, కవచం మాత్రం విరగదు. అలా స్త్రీలు వారి శక్తులను గుర్తించి అందులో స్థిరపడాలి. నమ్రత అనేది ఆ శక్తికి ఒక గొప్ప ఇరుసు లాంటిది. ఎంతో నమ్రతా భావంతో, విధేయతతో ఆ శక్తులను తమ లోనికి గ్రహించుకుని వారు అందులో స్థిరపడాలి. మనం రోజూ పేపర్లో కానీ టీవిలో కానీ సోషల్ మీడియాలో కానీ ఎన్నోహింసాత్మక, అనైతిక కార్యక్రమాలను చూస్తున్నాము. వాటి ప్రభావం చిన్న పిల్లల మీద, స్త్రీల మీద పడి సమాజం నాశనమవుతోంది. సహజయోగ మార్గాన్ని సరైన రీతిలో అర్థం చేసుకొని ఆచరించడం ద్వారా మహిళలు అటువంటి సమాజంలో పరివర్తన తీసుకు రాగలరు.ప్రపంచ వ్యాప్తంగా సహజ యోగా ధ్యాన సాధన చేస్తున్న మహిళలు అందరూ శ్రీ మాతాజీ నిర్మలా దేవి అనుసరించిన, ప్రబోధించిన స్త్రీ ధర్మాలను ఆచరిస్తూ ఉత్తమ కుటుంబ సభ్యులుగా తమ తమ దైనందిన జీవితంలో ప్రశాంతమైన, సమతుల్య జీవనం గడుపుతున్నారు.– డా. పి. రాకేష్ శ్రీ మాతాజీ నిర్మలాదేవి ప్రవచనాల ఆధారంగా (చదవండి: కాశీ కంటే పురాతన క్షేత్రం: 'వృద్ధాచల క్షేత్రం'..!) -
AP: పీఎంశ్రీ పాఠశాలలుగా 662 స్కూళ్లు.. కేంద్ర విద్యాశాఖ ఆమోదం
సాక్షి, అమరావతి: ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎంశ్రీ పాఠశాలల) పథకం అమలుకు రాష్ట్రంలోని 662 ప్రభుత్వ పాఠశాలలు ఎంపికయ్యాయి. ఆ స్కూళ్ల జాబితాకు కేంద్ర విద్యాశాఖ మంగళవారం ఆమోదముద్ర వేసింది. సమానత (ఈక్విటీ), అందుబాటు (యాక్సెస్), నాణ్యత (క్వాలిటీ), ఇన్క్లూజన్తో సహా అన్నిస్థాయిల్లో విద్యార్థులు సంపూర్ణమైన అభివృద్ధి సాధించేందుకు ఈ స్కూళ్లు తోడ్పాటునందించనున్నాయి. ఈ పథకాన్ని కేంద్రప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్ 7న ఆమోదించింది. దేశవ్యాప్తంగా 14,500 స్కూళ్లను అభివృద్ధి చేసేందుకు కొన్ని మార్గదర్శకాలను నిర్దేశిస్తూ వాటి ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని అన్ని రాష్ట్రాల పాఠశాలలకు అవకాశమిచ్చింది. కేంద్రప్రభుత్వం ఏర్పాటుచేసిన ఆన్లైన్ చాలెంజ్ పోర్టల్ ద్వారా స్కూళ్లు స్వయంగా వీటికి దరఖాస్తు చేసుకున్నాయి. ఈ దరఖాస్తులను మూడుదశల్లో పరిశీలించి తుది ఎంపికను ఖరారు చేశారు. నిర్దేశిత బెంచ్మార్క్ ఆధారంగా పాఠశాలలను కేంద్రం గుర్తించింది. కేంద్ర విద్యాశాఖ నిబంధనల ప్రకారం అర్బన్ స్కూళ్లు 70 శాతానికిపైగా, గ్రామీణ ప్రాంత స్కూళ్లు 60 శాతానికిపైగా స్కోరు సాధించగలిగితేనే పీఎంశ్రీ పథకానికి అర్హమైనవిగా గుర్తించారు. పాఠశాలలను కేంద్ర విద్యాశాఖ బృందాలు భౌతికంగా కూడా సందర్శించి నిర్దేశిత ప్రమాణాలతో ఉన్నాయో లేదో పరిశీలించిన తరువాతే ఎంపిక చేశారు. మన రాష్ట్రం నుంచి అందిన దరఖాస్తుల్లో మొత్తం 662 స్కూళ్లను పీఎంశ్రీ పథకానికి ఎంపిక చేశారు. వీటిలో 33 ప్రాథమిక పాఠశాలలుండగా 629 సెకండరీ, సీనియర్ సెకండరీ స్కూళ్లు ఉన్నాయి. విద్యార్థులకు గుణాత్మక విద్యే లక్ష్యం ల్యాబ్లు వంటి ఆధునిక మౌలిక సదుపాయాలతో కూడిన పాఠశాలల్లో చేసే బోధనాభ్యసనాల ద్వారా విద్యార్థులకు గుణాత్మక విద్య అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఐదేళ్లు అమలులో ఉండే పీఎంశ్రీ స్కూళ్ల పథకాన్ని ప్రారంభించింది. నూతన విద్యావిధానం సిద్ధాంతాలను అనుసరించి పాఠశాల విద్యను బలోపేతం చేయడం ఈ పథకం ప్రధానోద్దేశం. స్మార్ట్ క్లాస్ రూములు, లైబ్రరీలు, క్రీడా సదుపాయాలను ఈ స్కూళ్లలో ఏర్పాటుచేయనున్నారు. పాత పాఠశాలలను ఆధునిక మౌలిక సదుపాయాలు, పరికరాలతో అప్గ్రేడ్ చేయడం ద్వారా మోడల్ పాఠశాలలుగా తీర్చిదిద్దాలన్నది కూడా ఈ పథకం మరో లక్ష్యం. దాదాపు 14,500 పాఠశాలలను ఈ రీతిలో అభివృద్ధి చేయనున్నారు. ఈ పాఠశాలలను దశలవారీగా స్మార్ట్ తరగతులతో తీర్చిదిద్దనున్నారు. ఈ పథకం కింద ప్రయోగశాలలు, స్మార్ట్ క్లాస్రూములు, గ్రంథాలయాలు, క్రీడా సదుపాయాలు, ఆర్ట్ రూములు కల్పిస్తారు. చదవండి: ఏపీ వాసులకు అలర్ట్: ఆ ప్రాంతాల్లో తీవ్ర వడగాడ్పులు వీటిద్వారా నూతన విద్యావిధానంలో నిర్దేశించుకున్న ప్రమాణాలకు అనుగుణంగా పాఠశాల విద్యను బలోపేతం చేయనున్నారు. విద్యార్థులు గుణాత్మక విద్యతో నిర్దేశిత సామర్థ్యాలను పెంపొందించుకోగలుగుతారు. చదువులను భారంగా కాకుండా ఇష్టంగా కొనసాగిస్తారు. కేంద్రం నిధులు అందించే ఈ పాఠశాలలన్నీ నూతన విద్యావిధానాన్ని అనుసరించి కొనసాగుతాయి. మొత్తం నిధుల్లో కేంద్ర ప్రభుత్వం 60 శాతం ఇస్తే మిగతా నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని కేంద్ర విద్యాశాఖ పేర్కొంది. ఎంపికైన స్కూళ్ల జాబితాను కేంద్రం ఏర్పాటుచేసిన పోర్టల్లో ఉంచడంతోపాటు ఆయా రాష్ట్రాల విద్యాశాఖ కార్యాలయాలకు పంపింది. -
సవాల్లాంటి పాత్ర
నోయల్, ఎస్తేర్, శ్రీ, అర్జున్ మీనన్ ప్రధాన పాత్రల్లో సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో ఓ నూతన చిత్రం తెరకెక్కుతోంది. క్రాంతి వడ్లమూడి దర్శకత్వంలో లావోస్ మోషన్ పిక్చర్స్ పతాకంపై కృష్ణమోహన్, నరేన్, శ్రీరామ్ కందుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. హీరో శ్రీ బర్త్ డేని షెడ్యూల్ చివరి రోజున యూనిట్ సభ్యులు నిర్వహించారు. ‘‘త్వరలో రెండో షెడ్యూల్ ప్రారంభిస్తాం’’ అని నిర్మాతలు అన్నారు. ‘‘ క్రాంతి నా కోసం ఈ చిత్రంలో సవాల్ అనిపించే పాత్ర డిజైన్ చేశారు. ఈ పాత్రలో నన్ను కొత్తగా ఆవిష్కరిస్తు న్నారు’’ అని శ్రీ చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: చేతన్ మధురాంతకం, సంగీతం: గీతా పూనిక్. -
శ్రీమతి కంటే శ్రీ బెటర్: పీసీ
'పద్మశ్రీ' ప్రియాంకా చోప్రా.. నన్ను నేను ఇలా చెప్పుకోవటానికి కాస్త సిగ్గనిపిస్తుంది.. కానీ గర్వంగా ఉంటుంది. ఎందుకంటే.. పారితోషికం, పాపులారిటీల కంటే ప్రభుత్వం ఇచ్చే అవార్డులనే గౌరవంగా భావిస్తారు మా ఫ్యామిలీ మెంబర్స్' అంటూ సంతోషం వ్యక్తంచేస్తోంది పీసీ. అవార్డు తీసుకుని నాలుగు రోజులవుతోన్నా ఇంకా ఆ హడావిడి నుంచి బయటికిరాని ఈ జార్ఖండ్ ముద్దుగుమ్మ.. షూటింగ్స్ అన్నింటికి కామాపెట్టి, అవార్డును ఎంజాయ్ చేస్తోంది. 'మా నాన్నతోపాటు కుటుంబంలో చాలా మంది ఆర్మీలో పనిచేశారు. అందుకే ప్రభుత్వ పురస్కారాలను గొప్పగాఫీలవుతాం'అని చెబుతోంది. ఇప్పటికే 33 ఏళ్లు నిండిన పీసీని పెళ్లి గురించి అడిగితే.. .. 'ఇప్పుడు నేను పద్మశ్రీ ప్రియాంక చోప్రా. శ్రీమతి ప్రియాంక కంటే 'శ్రీ' ప్రియాంకే ఎంతో బెటర్ అని నా ఉద్దేశం' అంటూ తెలివిగా సమాధానం చెప్పింది. 'క్వాంటికో'లో తన సహచరులకు 'పద్మశ్రీ' అంటే ఏంటో తెలియదని, వాళ్లకు దాని విలువ తెలియజెప్పేప్రయత్నం చేస్తానని అంటోంది. నాలుగురోజుల కిందట రాష్ట్రపతి నుంచి 'పద్మశ్రీ' అవార్డు అందుకున్న ప్రియాంక.. తన చీరకు గుచ్చిన మెడల్ ను సాయంత్రందాకా తీయకపోవటానికి కారణమేమిటా? అని అడిగినవాళ్లకు ఇంటర్వ్యూల ద్వారా బదులిస్తోంది.