![Arya Is Overwhelmed As Kamal Haasan Praises Sarpatta - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/8/arya.jpg.webp?itok=0NpSc0YG)
చెన్నై: సార్పట్ట పరంపరై చిత్ర యూనిట్‌ను నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ అభినందించారు. నటుడు ఆర్య కథానాయకుడిగా పా.రంజిత్ తెరకెక్కించిన చిత్రం సార్పట్ట పరంపరై. ఇటీవల అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ఆదరణ పొందుతోంది. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. కాగా ఈ చిత్ర యూని ట్‌ను శనివారం కమలహాసన్ కలిసి ప్రత్యేకంగా అభినందించారు. ఈ చిత్రాన్ని తాను చూశానన్నారు. ఈ చిత్రం చూస్తున్నప్పుడు గత కాలాన్ని ప్రత్యక్షంగా చూస్తున్న భావన జరిగిందన్నారు. దర్శకుడు పా.రంజిత్ పనితీరును ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment