కబాలి నిర్మాతను అరెస్టు చేయండి: కోర్టు
తమిళనాడు: కబాలి చిత్ర నిర్మాత, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు కలైపులి ఎస్.థానును అరెస్ట్ చేయాలంటూ నాగర్‌కోవిల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల్లోకెళ్లితే నాగర్‌కోవిల్‌కు చెందిన క్యూ థియేటర్ యజమాని డేవిడ్‌నాగర్‌కోవిల్ కోర్టులో థానుపై పిటిషన్ దాఖలు చేశారు. అందులో ఆయన పేర్కొంటూ నిర్మాత థాను తనకు చెల్లించాల్సిన రెండు లక్షలు రూపాయలను తిరిగి ఇవ్వడం లేదంటూ పేర్కొన్నారు.
ఈ పిటిషన్ ను నాగర్ కోర్టు 2013 లోనే విచారించి వెంటనే థాను డేవిడ్‌కు ఇవ్వవలసిన డబ్బును తిరిగి చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయినా థాను ఇప్పటి వరకూ డేవిడ్‌కు ఆ డబ్బు చెల్లించకపోవడంతో ఆయన మరోసారి కోర్టును ఆశ్రయించారు. థానుకు డబ్బు వసతి ఉండి కూడా తనకు రావలసిన డబ్బు తిరిగి చెల్లించకుండా దాటవేత దోరణిని అవలంభిస్తున్నారని కోర్టుకు విన్నవించుకున్నారు. దాంతో నాగర్‌కోవిల్ కోర్టు ఈ నెల 28వ తేదీలోగా నిర్మాత థానును అరెస్ట్ చేయాలని మంగళవారం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.