S. Thanu
-
కబాలి నిర్మాతను అరెస్టు చేయండి: కోర్టు
తమిళనాడు: కబాలి చిత్ర నిర్మాత, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు కలైపులి ఎస్.థానును అరెస్ట్ చేయాలంటూ నాగర్‌కోవిల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల్లోకెళ్లితే నాగర్‌కోవిల్‌కు చెందిన క్యూ థియేటర్ యజమాని డేవిడ్నాగర్కోవిల్ కోర్టులో థానుపై పిటిషన్ దాఖలు చేశారు. అందులో ఆయన పేర్కొంటూ నిర్మాత థాను తనకు చెల్లించాల్సిన రెండు లక్షలు రూపాయలను తిరిగి ఇవ్వడం లేదంటూ పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను నాగర్ కోర్టు 2013 లోనే విచారించి వెంటనే థాను డేవిడ్‌కు ఇవ్వవలసిన డబ్బును తిరిగి చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయినా థాను ఇప్పటి వరకూ డేవిడ్‌కు ఆ డబ్బు చెల్లించకపోవడంతో ఆయన మరోసారి కోర్టును ఆశ్రయించారు. థానుకు డబ్బు వసతి ఉండి కూడా తనకు రావలసిన డబ్బు తిరిగి చెల్లించకుండా దాటవేత దోరణిని అవలంభిస్తున్నారని కోర్టుకు విన్నవించుకున్నారు. దాంతో నాగర్‌కోవిల్ కోర్టు ఈ నెల 28వ తేదీలోగా నిర్మాత థానును అరెస్ట్ చేయాలని మంగళవారం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. -
ఏమీ తెలియని వాళ్ళు చిత్రాలు తీస్తున్నారు
ఇప్పుడు సినిమా గురించి తెలియని వాళ్ళు కూడా చిత్రాలు తీస్తున్నారని సీనియర్ దర్శకుడు ఎస్ఏ.చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. తమిళం, తెలుగు, హిందీ అంటూ పలు భాషలలో పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ఈయన తాజాగా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం నయాప్పుడై. ఆయనతోపాటు గీత రచయిత పా.విజయ్ ముఖ్యపాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని వీ.క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్నారు. నవ దర్శకుడు విజయ్‌కిరణ్ పరిచయం అవుతున్నా ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల చెన్నైలో జరిగింది. చిత్ర ఆడియోను నటుడు ఆర్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిత్ర ప్రధాన పాత్రదారుడు ఎస్ఏ. చంద్రశేఖర్ మాట్లాడుతూ తనకు శ్రమించిడం తప్ప మరేమీ తెలియదన్నారు. ఎవరైనా మనల్ని ఇష్టపడితే వారు మనల్ని వదలిపోరన్నారు. తాను ఐదు ఏళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు గుర్తు చేశారు. నిజంగా ప్రేమించిన వాళ్లు మనల్ని వదిలిపోలేరని అన్నారు. అలాంటిది ఇప్పుడు స్వచ్ఛమైన ప్రేమ కనిపించడం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తన భార్య తరువాత తాను అంతగా ప్రేమించేది సినిమానేనని అన్నారు. ప్రేమకు ఎప్పుడూ ప్రత్యేక శక్తి ఉంటుందన్నారు. అందుకే ఇక సినిమా వద్దు అని నిర్ణయించుకున్నా తనను అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయని చెప్పారు. ఇకపోతే ఇప్పుడు సినిమా గురించి తెలియకుండానే, కథ లేకుండానే చిత్రాలు చేస్తున్నారనీ ఈ తరం వారికి చురకలు వేశారు.తన వయసు 73 ఏళ్లు అనీ,ఈ నయాప్పుడై 17 ఏళ్ల యువకుడు దర్శకత్వం వహిస్తున్నారనీ పేర్కొన్నారు. తొలి రోజునే ఆయన దర్శకత్వం తీరు సంతృప్తి అనిపించక పోవ డంతో రెండు రోజులు చేసి మానేద్దాం అనుకున్నాననీ, చిత్రాన్ని నిలిపివేయమని నిర్మాత థానుకు చెప్పాననీ అన్నారు. ఆయన తనకు నచ్చజెప్పడంతో కాదనలేకపోయానన్నారు. అలాంటిది నాలుగు రోజల చిత్రీకరణను ఎడిట్ చేసి చూపించగా ఆశ్చర్యపోయానని అన్నారు. ఆ తరువాత దర్శకుడు కూర్చోమంటే కూర్చున్నా, నిలబడమంటే నిలబడ్డానని తెలిపారు.ఈ తరం దర్శకుల వద్ద తమలాంటి వారు నేర్చుకోవలసింది చాలా ఉందని ఎస్ఏ.చంద్రశేఖర్ అన్నారు. -
ముగ్గురు హీరోల వారసులతో సినిమాలు
తమిళంలో అగ్ర నిర్మాత కలైపులి. ఎస్.థాను. తెలుగులో వెంకటేశ్‌తో ‘ఘర్షణ’, విక్రమ్‌తో ‘మల్లన్న’ సినిమాలు తీసిన థాను ప్రస్తుతం తమిళంలో మూడు సంచలన చిత్రాలు నిర్మిస్తున్నారు. ఈ మూడూ కూడా ముగ్గురు ప్రముఖ కథానాయకుల వారసులవి కావడం విశేషం. సీనియర్ హీరో ప్రభు తనయుడు విక్రమ్ ప్రభు హీరోగా ‘అరిమానంబి’ పేరుతో ఓ చిత్రం తయారవుతోంది. ఇందులో ప్రియా ఆనంద్ కథానాయిక. జేడీ చక్రవర్తి ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. మురుగదాస్ శిష్యుడు ఆనంద్ ఈ సినిమా ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నారు. అలాగే మరో చిత్రం ‘కనిదన్’లో ఒకప్పటి హీరో మురళి కొడుకు అధర్వ హీరో. కేథరిన్ కథానాయిక. దీనికి మురుగదాస్ మరో శిష్యుడు సంతోష్ దర్శకుడు. ఈ రెండు చిత్రాల ద్వారా ప్రముఖ డ్రమ్మర్ శివమణి సంగీత దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఇక థాను నిర్మిస్తోన్న మూడో చిత్రం ‘ఇంద్రజిత్’. ఇందులో కార్తీక్ కొడుకు గౌతమ్ కార్తీక్ హీరో. థాను తనయుడు కళాప్రభు దర్శకుడు.