ముగ్గురు హీరోల వారసులతో సినిమాలు | Tamil producer S. Thanu produce top heros sons films | Sakshi
Sakshi News home page

ముగ్గురు హీరోల వారసులతో సినిమాలు

Published Fri, Feb 7 2014 3:23 AM | Last Updated on Sat, Sep 2 2017 3:24 AM

ముగ్గురు హీరోల వారసులతో సినిమాలు

ముగ్గురు హీరోల వారసులతో సినిమాలు

తమిళంలో అగ్ర నిర్మాత కలైపులి. ఎస్.థాను. తెలుగులో వెంకటేశ్‌తో ‘ఘర్షణ’, విక్రమ్‌తో ‘మల్లన్న’ సినిమాలు తీసిన థాను ప్రస్తుతం తమిళంలో మూడు సంచలన చిత్రాలు నిర్మిస్తున్నారు. ఈ మూడూ కూడా ముగ్గురు ప్రముఖ కథానాయకుల వారసులవి కావడం విశేషం. సీనియర్ హీరో ప్రభు తనయుడు విక్రమ్ ప్రభు హీరోగా ‘అరిమానంబి’ పేరుతో ఓ చిత్రం తయారవుతోంది. ఇందులో ప్రియా ఆనంద్ కథానాయిక. జేడీ చక్రవర్తి ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. 
 
 మురుగదాస్ శిష్యుడు ఆనంద్ ఈ సినిమా ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నారు. అలాగే మరో చిత్రం ‘కనిదన్’లో ఒకప్పటి హీరో మురళి కొడుకు అధర్వ హీరో. కేథరిన్ కథానాయిక. దీనికి మురుగదాస్ మరో శిష్యుడు సంతోష్ దర్శకుడు. ఈ రెండు చిత్రాల ద్వారా ప్రముఖ డ్రమ్మర్ శివమణి సంగీత దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఇక థాను నిర్మిస్తోన్న మూడో చిత్రం ‘ఇంద్రజిత్’. ఇందులో కార్తీక్ కొడుకు గౌతమ్ కార్తీక్ హీరో. థాను తనయుడు కళాప్రభు దర్శకుడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement