సాలూరు: విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని చిన్నబజారు జంక్షన్ వద్ద అక్రమంగా తరలిస్తున్న 35 బస్తాల ఉల్లి, 5 బస్తాల వెల్లుల్లిని పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి బిల్లులు లేకపోవటంతో పట్టుకున్న ఉల్లిపాయలను, వెల్లుల్లి పాయలను స్థానిక తహశీల్దార్‌కు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.