illegal transport
-
పెన్నా నదిలో ‘వసూళ్ల గేటు’
ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మండలం రామాపురం గ్రామానికి చెందిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి అనుచరుడు గుర్రప్ప అలియాస్ గురివిరెడ్డి ఏకంగా పెన్నా నదిలో అనధికార గేటు పెట్టి డబ్బు వసూలు చేస్తున్నారు. ఒంటెద్దు బండికి రూ.150, రెండు ఎడ్ల బండ్లకు రూ.300, ట్రాక్టర్‌కు రూ.1,000 నుంచి రూ.1,200 చెల్లిస్తే కానీ పెన్నా నదిలోకి అనుమతించడం లేదు. ఇందుకోసం ప్రత్యేకంగా పెన్నా నదిలో గేటు ఏర్పాటు చేశారు. గ్రామ పరిధిలోని కొందరు వ్యక్తులు పెన్నా నదిలోని ఇసుకకు మీకు ఎందుకు గేటు చార్జీలు చెల్లించాలని సోమవారం వాగ్వాదానికి దిగడంతో ఈ పంచాయితీ రూరల్ పోలీస్ స్టేషన్‌కు చేరింది. అయినా ఫలితం లేకపోయింది. గేటు దగ్గర వసూళ్లు యథాతథంగా కొనసాగుతున్నాయి.అక్రమ రవాణాకు అడ్డారామాపురం గ్రామం ఇసుక అక్రమ రవాణాకు అడ్డాగా మారింది. పెన్నా నది ఒడ్డునే గ్రామం ఉండటంతో ఇసుక అక్రమ రవాణా కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ఇక్కడ నుంచి ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు. మండల పరిధిలోని పెన్నా నది పరీవాహక గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. -
కరీంనగర్లో పొన్నం ట్యాక్స్
సాక్షి, హైదరాబాద్: రామగుండం ఎన్టీపీసీ విద్యు త్ కేంద్రం నుంచి ఫ్లైయాష్ (బూడిద) తరలింపులో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భారీ కుంభకోణానికి పాల్పడ్డారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. కరీంనగర్లో రేవంత్, పొన్నం ట్యాక్స్ అమలవుతున్నట్లు తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు కేపీ.వివేకానంద, డాక్టర్ సంజయ్‌తో కలిసి తెలంగాణభవన్‌లో కౌశిక్‌రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడారు. 32 టన్నుల బూడిద తరలించాల్సిన లారీలో 72 టన్నులు తరలిస్తున్నారని, వే బిల్లుల్లో ఎన్ని టన్నులు తరలిస్తున్నారనే విషయం పేర్కొనడం లేదని చెప్పారు.బూడిద అక్రమరవాణా ద్వారా మంత్రి పొన్నం రోజూ రూ.50 లక్షలు సంపాదిస్తుండగా, ఆయన అన్న కుమారుడు అనూప్ ఈ వసూ ళ్లు చేస్తున్నారన్నారు. ఓవర్‌లోడ్‌తో వెళుతున్న 13 లారీలను ఇటీవల తాను స్వయంగా పట్టుకొని అధికారులకు అప్పగించినా, రెండు లారీ లు సీజ్ చేసి చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీలను తాను పట్టుకోవడంతో రూటు మార్చి హుస్నా బాద్ మీదుగా దందా కొనసాగిస్తున్నారని కౌశిక్‌రెడ్డి చెప్పారు. ఇకపై ఏ మార్గంలో ఫ్లైయాష్ తరలించినా బీఆర్ఎస్ కార్యకర్తలు పట్టుకుంటారని హెచ్చరించారు. ఓవర్‌లోడ్‌తో వెళుతు న్న ఫ్లైయాష్ లారీల కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇటీవల ఇంజనీరింగ్ విద్యార్థి అఖిల్ మరణించాడన్నారు. ఎన్టీపీసీ వివరాలు దాచిపెడుతోంది ఫ్లైయాష్ అక్రమ రవాణా జరుగుతున్నా, ఎన్టీపీసీ అధికారులు వివరాలు దాచిపెడుతూ చోద్యం చూ స్తున్నారని కౌశిక్‌రెడ్డి అన్నారు. అధికారుల తీరుపై ఢిల్లీలో ఆ సంస్థ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తా మని చెప్పారు. ఓవర్‌లోడ్ దందాపై బీఆర్ఎస్ కేడ ర్ ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతుందన్నారు. తప్పు లు చేస్తున్న అధికారుల వివరాలు రెడ్‌బుక్‌లో నమో దు చేసి అధికారంలోకి వచి్చన తర్వాత చర్యలు తప్పవని హెచ్చరించారు. హరీశ్‌రావుపై ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ అనవసర విమర్శలు చేస్తున్నారని, ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తే హరీశ్‌రావుతోపాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చే స్తారని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అన్నారు. -
పోలీసులుగా మీకు ఆత్మగౌరవం లేదా? హోంమంత్రి తీవ్ర వ్యాఖ్యలు
Karnataka Home Minister Araga Jnanendra Slams Cops: కర్ణాటక హోంమంత్రి అరగా జ్ఞానేంద్ర పోలీసులపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. పశువుల అక్రమ రవాణాదారుల నుంచి లంచాలు తీసుకుంటారని పోలీసులుపై మండిపడ్డారు. కొంతమంది పోలీసులు లంచాలు తినే కుక్కల్లా బతుకుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ఓ పోలీసు ఉన్నతాధికారితో ఫోన్లో మాట్లాడిన వీడియో రికార్డింగ్ వైరల్‌గా మారింది. అయితే పుశువుల అక్రమ రవాణాదారుల నుంచి లంచాలు తీసుకొని కొంతమంది పోలీసులు వారిని వదిలేస్తున్నారని, విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఆత్మగౌరవం ఉండదా? అని ప్రశ్నించారు. వధించడం కోసం పశువులను రవాణా చేయడం కర్ణాటక ప్రభుత్తం నిషేధించిన విషయం తెలిసిందే. తాను పోలీసులందరినీ విమర్శించడం లేదని, డబ్బు కోసం పశువుల అక్రమ రవాణాదారులతో కుమ్మక్కైన పోలీసులను మాత్రమే విమర్శిస్తున్నానని తెలిపారు. -
బూడిదకు భారీగా వసూళ్లు
సాక్షి, పాల్వంచ: కేటీపీఎస్ నుంచి వెలువడే బూడిద (యాష్) తరలింపులో వసూళ్ల దందా సాగుతోంది. అధికారుల అండదండలతో కొందరు ప్రైవేటు వ్యక్తులు భారీగా డబ్బు దండుకుంటున్నారు. బూడిదను తరలించాలంటే చేయి తడపనిదే బండి కదలని పరిస్థితి నెలకొంది. ఈ బూడిదను ఉచితంగా అందించాల్సి ఉండగా.. పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకుంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డబ్బు ముట్టజెపితే వెంటనే లోడ్ చేయడం, లేదంటే వెయిటింగ్ పేరుతో ఇబ్బందులకు గురి చేయడం ఇక్కడ పరిపాటిగా మారింది. అధికారులు తమ చేతికి మట్టి అంటకుండా ప్రైవేట్ వ్యక్తులతో ఈ దందాను ‘మూడు పువ్వులు ఆరు కాయలు’ అన్న చందంగా విస్తరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్) ఓఅండ్ఎం, 5, 6, 7 దశల్లో విద్యుత్ ఉత్పత్తి చేసే క్రమంలో బొగ్గును మండించడం ద్వారా నిత్యం బూడిద విడుదల అవుతుంది. దీన్ని పుల్లాయిగూడెం, సురారం తదితర ప్రాంతాల్లో ఉన్న యాష్ పాండ్లకు పంపిస్తుంటారు. సిమెంట్ ఫ్యాక్టరీలకు, ఇతర అవసరాలకు మెట్రిక్ టన్నుకు రూ.50 చొప్పున ముందే డీడీ రూపంలో చెల్లిస్తే బూడిదను అందిస్తారు. అయితే సిమెంట్ ఫ్యాక్టరీల నుంచి వచ్చే ట్యాంకర్లకు బూడిద అందించే క్రమంలో చేతివాటం ప్రదర్శిస్తుండడం ఇక్కడ ‘మూమూలు’గా మారింది. ఇక ఉచితంగా అందించే వారినుంచి అయితే వేల రూపాయలు దండుకుంటున్నారు. డబ్బు ఇవ్వని వారిని ముప్పుతిప్పలు పెడుతున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి రోజూ వందల సంఖ్యలో ట్యాంకర్లు, టిప్పర్లు, లారీలు వస్తుంటాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో స్థానికంగా కొందరు ప్రైవేట్ వ్యక్తులు జోక్యం చేసుకుని భారీ ఎత్తున అక్రమాలకు తెరలేపుతున్నారు. రవాణా చేసే క్రమంలో లారీలపై కనీసం పట్టాలు కూడా కట్టుకోకుండా వెళుతున్నారని పలువురు వాపోతున్నారు. లబోదిబోమంటున్న బ్రిక్ వ్యాపారులు... యాష్ పాండ్ల నుంచి బూడిదను తీసుకెళ్లేందుకు కొందరు జెన్కో యాజమాన్యం నుంచి అనుమతి తీసుకుని లారీల ద్వారా తరలిస్తుంటారు. అంతేగాక సైలోల నుంచి కూడా తీసుకెళుతుంటారు. ఈ క్రమంలో ఒక్కో లారీకి కనీసం రూ.1000 నుంచి రూ.2000 వరకు వసూలు చేస్తుంటారు. ఇలా అక్రమంగా వేలాది రూపాయలు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. ఉన్నత స్థాయి అధికారికి బండికి రూ.500 ఇవ్వాలని, కింది స్థాయిలో మామూళ్లు యథావిధిగా ఉంటాయని చెపుతూ వేల రూపాయలు వసూలు చేస్తున్నారని పలువురు బ్రిక్స్ ఇండస్ట్రీ నిర్వాహకులు వాపోతున్నారు. ఈ వ్యాపారులే కాకుండా భద్రాద్రి కొత్తగూడెంతో పాటు ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, వరంగల్, గుడివాడ తదితర ప్రాంతాల నుంచి రోజుకు 400 పైగా వాహనాల్లో బూడిద తరలిస్తున్నారంటే ఈ దందా ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ప్రైవేట్ వ్యక్తులకు గాకుండా నేరుగా బ్రిక్స్ కంపెనీలు, సిమెంట్ ఫ్యాక్టరీల వారికే బూడిద చేరేలా చర్యలు తీసుకోవాలని, పైవేట్ దందాపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. మా దృష్టికి తీసుకొస్తే చర్య తీసుకుంటాం డబ్బులు వసూలు చేస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. డబ్బు తీసుకుని బూడిదను అందించకూడదు. అలా ఇబ్బంది పడిన వ్యక్తులు ఎవరైనా నేరుగా మాకు ఫిర్యాదు చేస్తే తప్పక చర్య తీసుకుంటాం. – రవీందర్, ఇన్చార్జ్ సీఈ -
పొదలకూరులో అక్రమంగా తరలిస్తున్న నగదు స్వాధీనం
-
ఇసుక అక్రమ రవాణాపై దాడులు
ప్రొద్దుటూరు క్రైం : ఇసుక అక్రమ రవాణాను అరికట్టడానికి ప్రొద్దుటూరు డీఎస్పీ శ్రీనివాసరావు రంగంలోకి దిగారు. స్వయంగా డీఎస్పీ దాడులు నిర్వహించారు. డీఎస్పీ ఎప్పుడు బయటికి వెళ్లినా గన్‌మెన్ ఉంటారు. ప్రభుత్వం కేటాయించిన వాహనంలోనే ఆయన ఎక్కడికైనా వెళ్తారు. అయితే ప్రొద్దుటూరు డీఎస్పీ మాత్రం మంకీ క్యాప్ ధరించి, బైక్‌పై వెళ్లారు. వివరాల్లోకి వెళితే.. శనివారం వేకువజామున పెన్నా నది నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని సమాచారం రావడంతో డీఎస్పీ శ్రీనివాసరావు దాడులు నిర్వహించారు. మంకీ క్యాప్ ధరించి బైక్‌లో పెన్నా నదికి వెళ్లే రహదారి వద్దకు వెళ్లారు. పెన్నా నదిలో కొన్ని ట్రాక్టర్లకు ఇసుకను నింపుకుంటూ ఉండగా పోలీసుల రాకను గమనించడానికి కొందరు ఫైలెట్లు బైపాస్ రోడ్డులో నిల్చున్నారు. డీఎస్పీ నేరుగా వారి వద్దకు వెళ్లి బైక్ ఆపారు. అయితే మంకీ క్యాప్ పెట్టుకొని ఉండడంతో వారు డీఎస్పీని గుర్తు పట్టలేదు. అక్కడే 15 నిమిషాల పాటు నిల్చొని ఉండి డీఎస్పీ వారి సంభాషణలు విన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ ఇసుక అక్రమ రవాణాలో పోలీసుల పాత్ర ఏమైనా ఉందేమోనని ఆరా తీశారు. తర్వాత మంకీ క్యాప్‌ను తొలగించి అక్కడున్న ఫైలెట్లను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. డీఎస్పీని చూసి ట్రాక్టర్ల డ్రైవర్లు పరారయ్యారు. అయితే ఒక ఇసుక ట్రాక్టర్ డ్రైవర్‌ను పట్టుకొని స్టేషన్‌కు తరలించారు. కఠిన చర్యలు పెన్నా నది నుంచి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. రోజూ ఇసుక రవాణా చేస్తున్న వారిని గుర్తించి బైండోవర్ చేయాలని వన్‌టౌన్ సీఐ రామలింగరాజును ఆదేశించారు. డీఎస్పీ స్వయంగా దాడులకు పూనుకోవడంతో ఇసుకాసురుల్లో వణుకు పుడుతోంది. ఇసుక రవాణా జరుగుతుంటే ఏం చేస్తున్నారని పలువురు పోలీసు అధికారులు, సిబ్బందిని వన్‌టౌన్‌కు పిలిపించి డీఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇకపై ఇలా జరిగితే ఉపేక్షించేది లేదని హెచ్చరించినట్లు సమాచారం. -
అటు కలప.. ఇటు ఇసుక
ఇందల్వాయి : మండలంలో వాగులు, ఆడవులు పు ష్కలంగా ఉన్నా రెవెన్యూ, ఫారెస్టు అధికారుల పర్యవేక్షణ, సమన్వయ లోపం వల్ల క్రమేపీ అవి చీకటి దందా చేస్తున్న అక్రమార్కుల చేతుల్లో పడి వాటి సహజ స్వరూపాన్ని కోల్పోతున్నాయి. ఇసు క, కలప అక్రమ రవాణదారులపై నామమాత్రపు దాడులు చేస్తున్నా అధికారులు వారికి చట్టరీత్యా సరైన శిక్షలు వేయించడంలో విఫలమవుతుడటం తో వారు మళ్లి పాత దందానే కొనసాగిస్తున్నారు. అధిక దనార్జనే లక్ష్యంగా అడవుల్ని నరుకుతు, వా గుల్ని తవ్వుతూ ఇసుక, కలపను అక్రమంగా రవా ణ చేస్తూ ప్రకృతి స్వరూపాన్నే మార్చుతూ రైతు లకు, సామాన్య ప్రజలకు పరోక్షంగా తీవ్ర నష్టం కలిగిస్తున్నారు. వ్యక్తిగత మరుగు దొడ్ల నిర్మా ణాలు, సీసీ రోడ్లు అని అభివృద్ధి పనుల పేరుతో అనుమతులు తీసుకొని నల్లవెల్లి, గౌరారం, మల్లా పూర్, లోలం, లింగాపూర్, సిర్నాపల్లి వాగుల్లోంచి అనధికారంగా రాత్రి వేళల్లో ఇష్టరాజ్యంగా ఇసుక ను తరలించి అధిక ధరలకు అమ్ముకుంటున్నారని, అడవుల్లోని విలువైన కలప కూడా కింది స్థాయి అటవీ శాఖ అధికారుల కనుసన్నల్లోనే రాత్రి వేళల్లో అక్రమరవాణ జరుగుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. వాగుల్లోకి, ఆడవుల్లోకి ట్రాక్టర్లు వెళ్లకుండా అధికారులు నామ మాత్రపు కందకాలు తవ్వుతున్నా వాటిని పూడ్చేసి మరీ అక్రమార్కులు తమ దందాను కొనసాగిస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. అక్రమార్కుల ధనదాహానికి అడవులు తరిగిపోయి వన్యప్రాణలు జనావాసాల్లోకి వచ్చి ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి. ఈ దుండగుల వికృత చేష్టలకు సరిపడా వర్షాలు పడట్లేదని, వాగుల్లో ఇసుక లేకపోవడంవల్ల భూగర్భ జలాలు పెరగడంలేదని, అడవుల్లో ఆశ్రయం లేక వన్యప్రాణులు గ్రామాల్లోకి, పంట పొలాల్లోకి వచ్చి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని ప్రజలు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ప్రకృతిని నాశనం చేసి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న చీకటి దందాకోరులపై రెవెన్యు,ఫారెస్టు, పోలీసు అధికారులు సమన్వయంతో మూకుమ్మడి దాడు లు చేసి వారికి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని, విలువైన ప్రకృతి సంపదలకు రక్షణ కల్పించి ప్రకృతి సమతుల్యతను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. -
ద్వారకా తిరుమల గవర్నమెంట్ హాస్టల్లో అరాచకం
-
నిబంధనలకు విరుద్ధంగా వెదురు రవాణా
శృంగవరపుకోట రూరల్ : మండలంలోని బొడ్డవర పంచాయతీ శివారు గాదెల్లోవ గిరిజన ప్రాంతం నుంచి నిబంధనలకు విరుద్ధంగా వెదురు రవాణా జరుగుతోంది. గాదెల్లోవ ప్రాంతం నుంచి వెదురు మోపులు రవాణా చేసేందుకు సిద్ధంగా ఉంచిన విషయమై బుధవారం ఉదయం విలేకరులకు సమాచారం అందింది. దీంతో విలేకరులు ఆ ప్రాంతానికి వెళ్లే సరికి భారీ సంఖ్యలో వెదురు మోపులు రవాణాకు సిద్ధంగా ఉన్నాయి. అయితే వెదురు మోపులు ఉంచిన స్థలంలోను, చుట్టు పక్కల మనుషుల జాడ మాత్రం లేదు. వెదురు మోపుల రవాణా విషయమై బొడ్డవర వద్ద పలువురిని ప్రశ్నించగా ఎప్పటికప్పుడు గాదెల్లోవ, దబ్బగుంట, తదితర ప్రాంతాల నుంచి వెదురుతో పాటు ఇతర కలప కూడా పెద్ద ఎత్తున రవాణా జరుగుతోందని స్పష్టం చేశారు. అలాగే కాశీపట్నం, తదితర ఏజెన్సీ ప్రాంతాల నుంచి బొగ్గు మూటలు కూడా క్రమం తప్పకుండా సైకిళ్లపై అక్రమంగా తరలుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా సంబంధిత అటవీశాఖ సిబ్బంది, అధికారులు మాత్రం పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారంటూ పలువురు విమర్శిస్తున్నారు. వెదురు మోపుల అక్రమ రవాణా విషయమై విజయనగరం రేంజ్ అటవీశాఖ గార్డు బ్రహ్మాజీ వద్ద ప్రస్తావించగా, గాదెల్లోవ ప్రాంతం విశాఖ జిల్లా అనంతగిరి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికైనా గిరిజన ప్రాంతాల నుంచి జరుగుతున్న వెదురు, కలప, బొగ్గుల రవాణాపై అధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. -
తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత..!
రేగోడ్(మెదక్): నల్ల మట్టి కాసుల వర్షం కురిపిస్తోంది.. తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత అన్నట్టుగా పరిస్థితి తయారైంది. అక్రమార్కులు చెరువును కొల్లగొడుతూ నల్లమట్టిని జిల్లా దాటిస్తున్నా పట్టించుకునే అధికారులు కరువయ్యారు. ఈ తతంగం సోమవారం వెలుగుచూసింది. మండలంలోని కొత్వాన్‌పల్లి చెరువు మరమ్మతు కోసం రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకంలో సుమారు రూ. 46 లక్షలు మంజూరు చేసింది. పూడిక తీతలో భాగంగా చెరువులో మట్టిని తీస్తున్నారు. నిబంధనల ప్రకారం ఏ గ్రామంలోని చెరువు మట్టిని ఆ ఊరి రైతులే తీసుకెళ్లాలి. ఇతర వ్యక్తులు ఎవరూ మట్టిని తీసుకోకూడదు. కానీ ఇక్కడ ఏకంగా మెదక్ జిల్లా కొత్వాన్‌పల్లి చెరువు నుంచి సంగారెడ్డి జిల్లా రుద్రారం గ్రామ శివారులోకి టిప్పర్లలో నల్లమట్టిని యథేచ్ఛగా తరలిస్తున్నా అడిగేనాథడు లేకుండా పోయారు. నల్లమట్టికి డిమాండ్ ఉండటంతో ఇదే అదనుగా భావించిన కొందరికి వరంగా మారింది. టిప్పర్లను లీజ్‌కు తీసుకుని వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది. నల్ల మట్టి మాయలో పడిన కొందరు చెరువును తోడేస్తున్నారు. నల్లమట్టిని తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. చెరువును తవ్వేస్తున్నా.. అధికారులది ప్రేక్షక పాత్రా..? లేక వారికి తెలియకుండానే దందా జరుగుతోందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. నల్లమట్టిని ఏకంగా జిల్లానే దాట వేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఈ తతంగంపై విచారణ జరిపించాలని పలువురు పేర్కొంటున్నారు. -
ఖజానాకు గండి
దేశంలోనే ప్రసిద్ధి చెందిన తాండూరు నాపరాతి అక్రమంగా తరలిపోతోంది. నిత్యం వందకు పైగా లారీలు రాయల్టీ లేకుండా.. రాయల్‌గా సరిహద్దులు దాటుతున్నాయి. చెక్‌పోస్టుల వద్ద నిఘా కరువైంది. దీంతో సర్కారీ ఆదాయానికిగండి పడుతోంది. ఈ తంతు చానాళ్లుగా జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. తాండూరు : తాండూరు నియోజకవర్గంలోని తాండూరు, బషీరాబాద్ మండలాల్లో వేలాది ఎకరాలలో నాపరాతి నిక్షేపాలున్నాయి. తాండూరు మండలంలోని ఓగిపూర్, మల్కాపూర్, కొటబాసుపల్లి, కరన్‌కోట్, సిరిగిరిపేట్లో, బషీరాబాద్ మండలంలోని ఎక్మాయి, కొర్విచెడ్, నవల్గ, క్యాద్గిరా, జీవన్గిలో ఈ సహజ సంపద విరివిగా లభిస్తోంది. ఆయా గ్రామాల్లోని గనుల నుంచి వెలికితీçస్తున్న నాపరాతిని ఇతర ప్రాంతాలకు తరలిస్తారు. తాండూరు నుంచి నిత్యం సూమారు 400 లారీల వరకు నాపరాయి రవాణా అవుతోంది. తెలంగాణలోని జిల్లాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఒడిశా, ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. అయితే ప్రతీరోజు వందలాది లారీల్లో నాపరాయి రవాణా జరుగుతున్నా కొన్నింటి నుంచి మాత్రమే రాయల్టీ రూపంలో ప్రభుత్వానికి ఫీజు అందుతోంది. మిగతా వాహనాలు ఎలాంటి ఫీజులు లేకుండానే యథేచ్ఛగా తరలివెళ్తున్నాయి. రాయల్టీ లేకుండా రవాణా సాగిస్తున్న వ్యాపారులు, ట్రాన్స్పోర్ట్ నిర్వాహకులు అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు. ప్రతిరోజు 50 నుంచి 70 లారీల వరకు రాయల్టీ లేకుండా రవాణా.. నాపరాతి తరలింపు పర్యవేక్షణ కోసం భూగర్భ వనరుల శాఖ ఆధ్వర్యంలో తాండూరు మండలం గౌతాపూర్, యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్ సర్కిల్‌ళ్ల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. అయితే సంబంధిత సిబ్బంది ఇక్కడ విధులు నిర్వహించడం లేదు. చెక్‌పోస్టుల నిర్వహణ బాధ్యతలను హోంగార్డులే చూసుకుంటున్నారు. మైనింగ్ మాఫియా పెద్దల హస్తంలో ఉండటంతో అందినకాడికి దండుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వ ఖజనాకు గండి.. తాండూరు ప్రాంతంలో ఖనిజ సంపద తరలింపులో భారీ ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి. నాపరాతి రవాణాతో ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాల్సిన అధికారులు మామూళ్లకు అలవాటు పడి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వ్యాపారులు, ట్రాన్స్పోర్ట్ అధికారులు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. -
రేషన్‌బియ్యం పట్టివేత
గద్వాల క్రైం: ఇది నా ఇలాఖా.. ఇక్కడి ప్రాంతాల్లో పేదల రేషన్ బియ్యానికి నేనే పెద్ద డేగను..! నా కళ్లు గప్పి నా ప్రాంతంలోని రేషన్ బియ్యం విక్రయాలు చేసి తీసుకువెళ్తావా.. అంటూ గద్వాలకు చెందిన ఓ ముఠా సభ్యులు ఆక్రోశం..? ఎక్కడైతే ఏంటి.. కారుచౌకగా బియ్యం దొరుకుతాయంటే ఎవరి ప్రాంతంలోనైనా గుట్టుగా కొని సొమ్ము చేసుకుంటాం అంటూ.. కేటీదొడ్డి మండలానికి చెందిన మరో ముఠా సభ్యుల ఎదురుదాడి..!? ఇలా రెండు ముఠా సభ్యులు గద్వాల ప్రాంతంలో రేషన్ బియ్యం కొనేందుకు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేటీదొడ్డికి చెందిన ముఠా సభ్యులు గద్వాల నుంచి రేషన్ బియ్యం తరలిస్తున్నారనే సమాచారం తెలుసుకుని.. గద్వాలకు చెందిన ముఠా సభ్యులు వారిపై దాడి చేసి బియ్యం తరలిస్తున్న ఆటోను ధ్వంసం చేశారు. ప్రాణభయంతో కేకలు వేయగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పట్టణ పోలీసులు అక్కడికి చేరుకోగా.. దాడి చేసిన ముఠా సభ్యులు పారిపోయారు. బియ్యం తరలిస్తున్న గూడ్స్ ఆటో, ఇద్దరు వ్యక్తులను పట్టణ పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ సంఘటన బుధువారం తెల్లవారుజామున మండలంలోని చేనుగోనిపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. దారి కాచి దాడి.. కాలూరుతిమ్మన్దొడ్డి మండల కేంద్రానికి చెందిన రాము, నరేష్‌లు గూడ్స్ ఆటోలో సుమారు 40 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని చెనుగోనిపల్లి గ్రామం నుంచి బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో గుట్టుగా తరలిస్తున్నారు. అయితే విషయం తెలుసుకున్న మరో ముఠా సభ్యులు దారి కాచి ఆటోను పట్టుకున్నారు. ఆటోలోని బియ్యం ఎక్కడికి తరలిస్తున్నారు..? ఎవరు పంపిచారంటూ ఆటోపై దాడి చేశారు. అంతటితో ఆగక ఇద్దరిపై దాడి చేశారు. దెబ్బలకు తాళలేక వారు కేకలు వేయగా గమనించిన స్థానికులు పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకోవడంతో ముఠా సభ్యులు అక్కడి నుంచి తప్పించుకున్నారు. దీంతో ఆటోను, ఇద్దరు వ్యక్తులను పట్టణ పోలీసుస్టేషన్‌కు తరలించారు. కొనుగోళ్లపై పోటాపోటీ.. గద్వాలలో రేషన్ బియ్యం కొనుగోళ్లు చేసేందుకు అక్రమార్కుల మధ్య పోటీ నువ్వా.. నేనా అన్నట్లుగా సాగుతుంది. ప్రభుత్వం సబ్సిడీ రూపంలో నిరుపేదలకు చౌకధర దుకాణాల ద్వారా కిలో రూపాయికి అందజేస్తుంది. అయితే బయటి మార్కెట్లో సుమారు రూ.20 ధర పలుకుతుంది. అయితే రేషన్ బియ్యం లబ్ధిదారుల నుంచి రూ.10–15 వెచ్చించి వివిధ వ్యక్తులు కొనుగోలు చేస్తున్నారు. అయితే రేషన్ బియ్యం అక్రమంగా కర్ణాటకకు తరలించి అక్కడి ప్రైవేట్ మిల్లుల్లో రీసైక్లింగ్ చేసి సన్నబియ్యంగా మారుస్తారు. ఇలా చేసిన బియ్యాన్ని వ్యాపారులతో కుమ్మక్కై బయటి మార్కెట్లో కిలో రూ.30–35లకు అమాయక ప్రజలకు విక్రయిస్తారు. లాభసాటి వ్యాపారం కావడంతో జిల్లాకేంద్రంలో రేషన్ బియ్యం కొనుగోలు చేసేందుకు పలు ముఠా సభ్యులు పోటీ పడుతున్నారు. వనపర్తి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల నుంచే కాక ఇతర జిల్లాల నుంచి గద్వాల, డ్యాం, ఆత్మకూర్ మీదుగా కర్ణాటకలోని రాయిచూర్‌కు నిత్యం రేషన్ బియ్యం తరలిస్తున్నారు. కేసు నమోదు.. ఈ విషయమై గద్వాల పట్టణ పోలీస్‌స్టేషన్ ఎస్ఐ శ్రీనివాస్ స్పందిస్తూ అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు సిబ్బందికి సమాచారం రావడంతో దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. అయితే బియ్యం తరలిస్తున్న వారిపై దాడి చేసిన విషయమై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. రెండు క్వింటాళ్ల నల్లబెల్లం.. మన్ననూర్ (అచ్చంపేట): అమ్రాబాద్ మండలం దోమలపెంట గ్రామ అటవీశాఖ చెక్‌పోస్టు వద్ద రెండు క్వింటాళ్ల నల్లబెల్లం, 40 కిలోల పటికి పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని దోర్నాల నుంచి ఇండిగో కారులో నల్లబెల్లం అక్రమంగా తరలిస్తున్నారని దోమలపెంట పోలీసులకు సమాచారం అందడంతో నిఘా ఉంచారు. ఈ క్రమంలో అచ్చంపేట పట్టణ సమీప గ్రామాలకు చెందిన రమేష్, భరత్‌లు బెల్లంతో అక్కడికి వచ్చారు. కారుతోపాటు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు సిద్ధిఖ్, ప్రేమ్‌కుమార్, ఉపసర్పంచ్ ప్రసాద్ సంబంధిత అచ్చంపేట ఎక్సైజ్ అధికారులు శంకరయ్య, రమేష్, ఆంజనేయులుకు సమాచారం అందించి నిందితుల నుంచి అక్రమ బెల్లంను వారికి అప్పగించారు. బెల్లం ఎక్కడి నుంచి సరఫరా అవుతున్న విషయాలను దర్యాప్తు చేసి కేసు నమోదు చేస్తామన్నారు. -
ఒంటెలు సరఫరా చేస్తుందెవరు..?
ప్రజలు మాంసాహారం తీసుకోవడాన్ని బాగా ఇష్టపడుతున్నారు. ప్రజల డిమాండ్‌కి తగినట్లుగా స్థానికంగా మాంసం లభించకపొవడంతో ఆ వ్యాపారం చేసే వారు.. అక్రమ పద్ధతుల ద్వారా మాంసం సేకరిస్తున్నారు. ఇలా సేకరించిన మాంసాన్ని స్టార్ హోటల్స్, రెస్టారెంట్లతో పాటు మాంసం ప్రియులకు వివిధ రకాల జంతువుల పేర్లు చెప్పి విక్రయిస్తూ రూ.లక్షలు సంపాధిస్తున్నారు. గతంలో అడవి పందులు, జింకలను కొసి విక్రయించే వ్యాపారులు డిమాండ్ పెరగడంతో భారీ జంతువులపై కన్నెశారు. మునుగోడు : భారీ జంతువుల్లో ఒకటైన ఒంటెని కొస్తే అధిక మొత్తంలో మాంసం వస్తుందని వ్యాపారులు భావించారు. ఎడారి ప్రాంతాలైయినా హర్యానా, గుజరాత్, రాజాస్థాన్ ప్రాంతాల నుంచి వయస్సు మీదపడిన ఒంటెలను కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకొచ్చి మాంసంగా మార్చుతున్నారు. ఒంటెలను అక్కడ నుంచి ఇక్కడికి ఎవరు రవాణా చేస్తున్నారు. ఎంతకు విక్రయిస్తున్నారు.. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఉన్నా అవి ఎలా హైదరాబాద్‌కి వస్తున్నాయనే సందేహలు వ్యక్తమవుతున్నాయి. ఊకొండిలో ఒంటెలను కొస్తూ పట్టుబడిన దుండగులు సైతం ఆ ప్రాంతాలకు వెళ్లకుండానే హైదరాబాద్ నుంచి ఫోన్లలో బేరాలు చేసుకుని.. డబ్బు ఆన్లెన్ ద్వారా వారి ఖాతాల్లో జమచేసి ఒంటెలు తీసుకుంటున్నట్లు సమచారం. కానీ ఈ దందా ఎప్పటి నుంచి సాగుతోంది.. అలా అమ్మేవాళ్లు ఎవరు.. అనే విషయాలను పోలీసులు రాబట్టలేక పోయారు. పోలీసులు లోతుగా విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. మాంసం విక్రయించేదెక్కడో? ఒక ఒంటెను కోస్తే 350 నుంచి 400ల కేజీల మాంసం వస్తుంది. ఇక్కడ ఒకేసారి 25 నుంచి 30కిపైగా ఒంటెలను కోస్తుండడంతో దాదాపు 10 నుంచి 15 టన్నుల మాంసం ఉత్పత్తి అవుతుంది. ఈ మాంసాని ఎక్కడా విక్రయిస్తారు. ఎంతకు విక్రయిస్తారనేది ఇప్పటికీ తేలలేదు. హైదరాబాద్‌లో అమ్ముతున్నట్లు నిందితులు చెబుతున్నా అందులో నిజం లేదనిపిస్తోంది. హైదరాబాద్‌లో ఒకే రోజు 10 టన్నుల మాంసాని విక్రయించడం చాలా కష్టం. ఆ మాంసం మొత్తం ఇతర రాష్ట్ర, దేశాలకు సరఫరా చేస్తున్నారనే.. ఆరోపణలు అనేకం ఉన్నాయి. మాంసాన్ని ఎక్కడకు సరఫరా చేస్తున్నారు.. ఎలా చేస్తున్నారనే విషయంపై విచారిస్తే.. వ్యాపారంలో ఉన్న బడా బాబుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఒంటెల సరఫరా, మాంసం విక్రయంపై నిఘా పెడితే దందా గుట్టు రట్టు అయ్యే అవకాశాలు ఉన్నాయి. 25మంది రిమాండ్ మునుగోడు: నల్లగొండ జిల్లా మునుగోడు మండలం ఊకొండిలో ఒంటెల వధ కేసులో 25మందిని స్థానిక పోలీసులు శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. చండూరు సీఐ రమేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరబాద్‌కు చెందినా మహ్మ ద్ ఖాజ కురేష్, అబ్జల్ కురేష్లు..పశుమాంసం వ్యాపారులు. ప్రస్తుతం ఒంటె మాంసానికి బాగా డిమాండ్ ఉండటంతో వాటిని అప్పుడప్పుడు కొస్తూ ఉండేవారు. ఇటీవల హైదరాబాద్‌లో ఒంటెల మాంసం విక్రయాలపై పోలీసులు దాడులు చేయడంతో..సదరు వ్యాపారులు మునుగోడుకు చెందిన మాంసం వ్యాపారి ఖయ్యూంతో పరిచయం ఏర్పర్చుకున్నారు. ఒంటెలను కోసేందుకు నిర్మానుష్యమైన వ్యవసాయ భూమి కావాలని అడగగా, ఊకొండి గ్రామానికి చెందినా మాజీ సర్పంచ్ నిమ్మ ల స్వామిని సంప్రదించాడు. అతను తన భూమిని నెలకు రూ.2500 చొప్పున లీజుకు ఇచ్చాడు. దీంతో వ్యాపారులు బుధవారం రాత్రి 28 ఒంటెలని తీసుకొని ఊకొండికి వచ్చారు. వాటిని కోసేందుకు 19 మంది కూలీలను వెంటతెచ్చుకున్నారు. ఒంటెలను కోస్తుండగా గ్రామస్తుల సమాచారంతో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. నిందితులను పోలీసులు విచారించి శుక్రవారం కోర్టులో హాజరుపర్చారు. -
తాడిపత్రిలో చెలరేగిపోతున్న గ్రానైట్ మాఫియా
తాడిపత్రి: నిజాయతీ అధికారికి బదిలీ సన్మానం చేసిన తాడిపత్రి మాఫియా.. అడ్డూఅదుపు లేకుండా గ్రానైట్ అక్రమ రవాణాకు పాల్పడుతోంది. ఈ ప్రాంతంలో ఎక్కడా క్వారీలు లేకపోయినా.. వ్యాపారం కోట్లలో సాగుతుండటం గమనార్హం. ప్రకాశం జిల్లా చీమకుర్తి, కర్నూలు జిల్లా ఆదోని, డోన్, కదిరి, కనికిగి, చిత్తూరు తదితర ప్రాంతాల్లోని క్వారీల నుంచి ఇక్కడికి గ్రానైట్ గుండ్లు సరఫరా అవుతున్నాయి. ఒక లోడు గ్రానైట్ బోల్టర్లు క్వారీ నుంచి ఫ్యాక్టరీకి చేరాలంటే రూ.60వేల నుంచి రూ.70వేల రాయల్టీ చెల్లించాల్సి ఉంది. ఇక్కడే దందా మొదలవుతోంది. లగాన్ బృందం రంగంలోకి దిగి అధికారుల చేతులు తడుపుతూ పని కానిచ్చేస్తోంది. మైనింగ్ లీజుదారులు ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించాలి. సేల్‌ట్యాక్స్ 12శాతం చెల్లించి ఒక్కో గుండు కొలతను బట్టి రాయల్టీ మీటరుకు రూ.3వేలు చొప్పున చెల్లించాలి. కానీ కొన్ని క్వారీల్లో నాసిరకం గుండ్లు ఉండడం వల్ల మంచి గుండ్లకు, నాసిరకం గుండ్లకు ఒకటే రాయల్టీ ధర నిర్ణయించడంతో క్వారీ లీజుదారులు, ప్యాక్టరీ యజమానులతో కుమ్మక్కై క్యూబిక్ మీటరు రూ.60వేల నుంచి రూ.70వేల విలువ చేసే ఖనిజానికి.. మీటరు రూ.7వేల విలువ చేసే ఖనిజానికి ప్రభుత్వం తేడా లేకుండా ఒకే ధరను నిర్ణయించింది. దీంతో తాడిపత్రి లాంటి ప్రాంతాలకు నాసిరకం గుండ్లను తరలించడంతో ఈ సమస్య ఉత్పన్నమౌతోంది. జీఎస్టీలో కూడా ట్యాక్స్ బిల్లు వేసేటప్పుడు అధిక ధర కలిగిన ఖనిజానికి తక్కువ ధర కలిగిన ఖనిజానికి విలువలో తేడా లేకుండా బిల్లు వేస్తున్నారు. దీంతో ఒంగోలు లాంటి పారిశ్రామిక ప్రాంతంతో పోల్చుకుంటే ఇక్కడ తేడా భారీగా ఉంటోంది. మామూళ్ల కోసం మాయాజాలం గ్రానైట్ రాయి ఐదువేల అడుగులు ఉంటే ఫ్యాక్టరీ యజమానులు 2,500 అడుగులకు మాత్రమే బిల్లు తయారు చేస్తారు. చెక్‌పోస్టు వద్ద అక్కడున్న అధికారుకులకు మామూళ్లు ముట్టజెప్పి సీలు వేయించుకుంటారు. దీంతో ఇతర ప్రాంతాల్లో అధికారులు వాహనాన్ని ఆపినప్పుడు బిల్లు చెక్ చేసినట్లు ఉండటంతో అంతోఇంతో తీసుకుని వదిలేస్తున్నారు. ఇలా ప్రభుత్వ ఆదాయానికి యథేచ్ఛగా గండి పడుతోంది. నిజాయతీగా పనిచేసే అధికారులకు బెదిరింపులు తాడిపత్రిలో మైనింగ్ మాఫియాకు అడ్డూఅదుపులేకుండా పోతున్న తరుణంలో గతంలో గుత్తి మైనింగ్ విజిలెన్స్ విభాగంలో అసిస్టెంట్ జియాలజిస్ట్‌గా ఉన్న ప్రతాపరెడ్డి మైనింగ్ మాఫియాపై కొరడా ఝళిపించారు. కేవలం లక్షల్లో ఉన్న ఆదాయన్ని కోట్ల రూపాయలకు చేర్చారు. ఇక తమ ఆటలు సాగవన్న ఆ మాఫీయా తాడిపత్రికి చెందిన ఓ ముఖ్యనేత సహకారం కోరారు. వచ్చే ఆదాయంలో వాటా ఇచ్చేందుకు ఒప్పందం కుదరడంతో ఏజి ప్రతాప్‌రెడ్డిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి అవినీతి మకిలి అంటించారు. ఆ శాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టి ఆయనకు క్లీన్చిట్ ఇచ్చారు. దీంతో సదరు ముఖ్య నేత మైనింగ్ శాఖ మంత్రి వద్ద పంచాయితీ పెట్టి మరీ ఆయనను బదిలీ చేయించారు. ఆ తర్వాత మాఫియా యథేచ్ఛగా తమ దందా సాగిస్తోంది. లగాన్ అంటే.. ఎలాంటి అనుమతులు లేకుండా క్వారీల నుంచి గుండ్లను తీసుకుని ఫ్యాక్టరీకి సరఫరా చేసి యజమానుల వద్ద రూ.10వేల నుంచి రూ.15వేలు చొప్పున వసూలు చేసే ఈ తతంగాన్ని లగాన్గా పిలుస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్య నేత అనుచరుల కనుసన్నల్లో ఈ వ్యవహారం సాగుతోంది. 20 మంది సభ్యులు ఈ లగాన్ గ్యాంగ్‌లో ఉంటారు. క్వారీ నుంచి ఫ్యాక్టరీకి గుండ్లు చేరే వరకు మార్గమధ్యంలో ఎవరూ అడ్డుకోకుండా చూసుకోవడం వీరి బాధ్యత. అక్రమ రవాణాను క్వారీల వద్దే అడ్డుకుంటాం తాడిపత్రి ప్రాంతంలో గ్రానైట్ క్వారీలు ఎక్కడా లేవు. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడి గుండ్లు వస్తాయి. క్వారీల వద్ద గుండ్ల రవాణాను అడ్డుకుంటున్నాం. ఈ విషయమై క్వారీ యజమానులతో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఇప్పటికే అక్రమంగా గుండ్లను తరలించే లారీలను సీజ్ చేసి లక్షల్లో జరిమానా విధించాం. ఇక ముందు కూడా దాడులను ముమ్మరం చేస్తాం. – వెంకటేశ్వరరెడ్డి, మైనింగ్ ఏడీ -
పెన్నా గర్భశోకం
►పామిడిలో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా ►పోలీసుల అండతో రెచ్చిపోతున్న ఇసుకాసురులు ►గుంతలమయమైన పెన్నాతీరం ►కన్నెత్తి చూడని రెవెన్యూ, మైనింగ్ అధికారులు అక్రమార్కులు పెన్నానదిని తోడేస్తున్నారు. అనుమతులు లేకండానే ఇసుకను అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పామిడిలో ఈ ఇసుకదందా తీవ్రం కావడంతో ఈ ప్రాంతంలోని పెన్నాతీరం గుంతలమయమై కనిపిస్తోంది. ఆక్రమణలు కూడా ఎక్కువ కావడంతో నది కుంచించుకుపోతోంది. ఇంత జరుగుతున్నా ఇటు మైనింగ్ అధికారులు గానీ, ఇటు పోలీసులు గాని కన్నెత్తి చూడడం లేదు. - పామిడి: మూడు దశాబ్దాల క్రితం పెన్నానదిలో ఎక్కడ చూసినా ఇసుక దిబ్బలు కనిపించేవి. అప్పట్లో 15 అడుగుల లోతులోనే నీరు పుష్కలంగా లభించేది. రాను రాను అక్రమ ఇసుక రవాణా ఊపందుకోవడంతో ఇసుక తిన్నెలు కనుమరుగయ్యాయి. ప్రస్తుతం పామిడిలో 150 అడుగుల్లో కూడా నీరు లభ్యంకాని పరిస్థితి. దీంతో పట్టణంలో ఎన్నడూలేని విధంగా నీటిఎద్దడి తీవ్రతరమైంది. మరోవైపు పామిడి సమీపంలో పెన్నానదిలో ఆక్రమణలు ఎక్కువ కావడంతో మైదానాన్ని తలపిస్తోంది. కొందరు ఏకంగా నదిలోనే తోటలు సాగు చేస్తున్నారు. రోజుకు రూ.4 లక్షలు విలువ గల ఇసుక తరలింపు గతంలో శింగనమల మండలంలో ఉల్లికల్లు, పెద్దవడుగూరు మండలంలో ఈరన్నపల్లి గ్రామాల వద్ద ఇసుకరీచ్‌లు ఉండేవి. గతంలో అక్కడి నుంచి మాత్రమే ఇనుక తరలించేలా నిబంధనలు ఉండేవి. ఏడాది క్రితం ఇసుక రీచ్‌లు ఎత్తివేశారు. దీంతో అధికారపార్టీ నేతలు ఇసుక అక్రమ రవాణా దందాకు పామిడిని కేంద్రంగా చేసుకున్నారు. పామిడి సమీపంలోని పెన్నానది నుంచి రోజుకు రూ.4 లక్షలు విలువ చేసే ఇసుకను అక్రమంగా రవాణ చేస్తూ కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. ట్రాక్టర్లు, ట్రిప్పర్లు, లారీల్లో రోజుకు వంద ట్రిప్పులు చొప్పున ఇసుకను బెంగుళూరు, అనంతపురం, గుంతకల్లు, ఉరవకొండ, వజ్రకరూరు ప్రాంతాలకు తరలిస్తున్నారు. ముఖ్య పట్టణాల్లో అపార్ట్మెంట్ల నిర్మాణానికి, గుంతకల్లు పరిధిలోని రైల్వే డబ్లింగ్ పనులకు ఈ అక్రమ ఇసుకను తరలిస్తున్నారు. ప్రాంతాన్ని బట్టి ధర గుంతకల్లు, వజ్రకరూరు ప్రాంతాలకు ఒక ట్రాక్టర్ ధర రూ.3 వేలు పలుకుతోంది. అదే అనంతపురానికి అయితే రూ.4 వేలు. ట్రిప్పర్ ఇసుక అయితే రూ.18 వేలు పలుకుతోంది. బెంగుళూరు వంటి ముఖ్య పట్టణాలకు టెన్‌వీలర్ లారీ ఇసుక రూ.1.30 లక్షలు పలుకుతుండడంతో ఇసుకాసురుల అక్రమార్జన మూడు పువ్వులు... ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ఈక్రమంలోనే అక్రమ రవాణాను అఽడ్డు రాకుండా పోలీసులకు మామూళ్లు సమర్పిస్తున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. అయితే జిల్లా ఎస్పీగా అశోక్‌కుమార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పోలీసులు అడపా...దడపా...దాడులు నిర్వహిస్తున్నా...పూర్తి స్థాయిలో అడ్డుకోలేకపోతున్నారు. ఈ అక్రమ ఇసుక రవాణాను అరికట్టకపోతే పెన్నాతీరం మైదానంలా మారిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మైదానంగా మారింది నదిలోని ఇసుక యథేచ్ఛగా తరలించడంతో దిన్నెలు కరిగిపోయాయి. నది మైదాన ప్రాంతంగా మారింది. ఇసుక అక్రమ రవాణాతో భూగర్భజలాలు అడుగంటాయి. దీంతో పట్టణంలో నీటిఎద్దడి నెలకొంది. –ఎస్ రఘునాథ్ దత్తు, పామిడి. కంపచెట్లమయం పెన్నానదిలో కంపచెట్లు దట్టంగా పెరిగాయి. ఆక్రమణలు, తోటలు, అక్రమ కట్టడాలతో నది కుచించుకుపోతోంది. దీంతో భవిష్యత్‌లో నది మాయమయ్యే పరిస్థితి నెలకొంది. –ఎం రంగనాయకులు, పామిడి కొండాపురం. అక్రమ రవాణను అడ్డుకుంటాం పెన్నానది నుంచి ఇసుక అక్రమ రవాణాను అరికట్టి సహజసంపదను కాపాడతాం. ఇసుకను రవాణా చేసే వారెవరైనా, ఎంతటివారైనా ఉపేక్షించేది లేదు. పోలీసులకు మామూళ్లు అందుతున్నాయన్న మాటల్లో వాస్తవం లేదు. ఒకటిన్నర నెల వ్యవధిలో 13 ట్రాక్టర్లు, 2 ట్రిప్పర్లు సీజ్ చేసి, రూ.3.15 లక్షల జరిమానా వసూలు చేశాం. పోలీసుల పనితీరుకు ఇదే నిదర్శనం. - రవిశంకర్‌రెడ్డి, ఎస్ఐ, పామిడి -
అనుచితం
- ‘ఉచిత ఇసుక’ ముసుగులో యథేచ్ఛగా దందా - ట్రాక్టర్లు, ట్రిప్పర్లతో కర్ణాటకకు అక్రమ రవాణా - ఇసుకాసురుల్లో అధికార పార్టీ నేతలే అధికం - చోద్యం చూస్తున్న పోలీస్, రెవెన్యూ (సాక్షిప్రతినిధి, అనంతపురం) ఇసుక వ్యాపారం అధికార పార్టీ నేతలకు లాభసాటిగా మారింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో ఇసుక దందా ఏ స్థాయిలో సాగుతోందో, తద్వారా ఆ పార్టీ నేతలు అనతి కాలంలోనే ఏ మేరకు ఆర్జించారో అందరికీ తెలిసిన సత్యమే. డ్వాక్రా మహిళల పేరుతో ఇసుకరీచ్‌ల్లో పెత్తనం చేసి రూ.కోట్లు దండుకున్నారు. ‘ఇసుక మాఫియా’ వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు రావడంతో విధిలేని పరిస్థితుల్లో రీచ్‌లను రద్దు చేసింది. తర్వాత ఇసుకను ఉచితంగానే తీసుకెళ్లొచ్చని ఆదేశాలిచ్చింది. అయినప్పటికీ దందా ఆగలేదు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో ఇసుక పాలసీని రూపొందించినప్పుడు జిల్లాలోని శింగనమల మండలం ఉల్లికల్లు, తాడిమర్రి మండలం చిన్నచిగుల్లరేవు, పెద్దపప్పూరు మండలం చిన్న ఎక్కలూరు రీచ్‌లకు అనుమతి ఇచ్చింది. ఇవి ఏర్పాటైన మూన్నెళ్లలోనే ప్రభుత్వానికి రూ.2.57 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే.. ఇదే కాలంలో జిల్లాలోని ఐదుగురు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ ప్రభుత్వానికి వచ్చిన దానికంటే ఐదు రెట్ల అధిక ఆదాయాన్ని పొందారు. ఒక్కో ప్రజాప్రతినిధి రోజూ రూ.10 లక్షల ఆదాయమే లక్ష్యంగా తవ్వకాలు సాగించారు. ఎలాంటి పెట్టుబడి లేకుండా హాయిగా ఇంటికి చేరే సొమ్ము కావడంతో దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేపట్టారు. ఇది శ్రుతిమించిపోవడంతో ఎట్టకేలకు ప్రభుత్వం రీచ్‌లను రద్దు చేసింది. 12 రీచ్‌లలో మాత్రమే అనుమతి ఉచితం అమలు చేసిన తర్వాత జిల్లాలో 12 రీచ్‌లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రామగిరి మండలం పేరూరులో ఒకటి, కంబదూరు మండలంలో 4, బ్రహ్మసముద్రం మండలంలో 4, ముదిగుబ్బ మండలం పెద్దచిగుళ్లరేవు, కళ్యాణదుర్గం, కణేకల్లు మండలాల్లోని తమ్మసముద్రం, రాచేమర్రి రీచ్‌లకు అనుమతులు మంజూరు చేసింది. ఇక్కడి నుంచి ఎవరైనా ఇంటి అవసరాలకు ఇసుక తీసుకెళ్లవచ్చు. ఒక్కో ఇంటి వద్ద 4–5 ట్రాక్టర్ల ఇసుక నిల్వ చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ నిల్వ ఉంటే అధికారులు తనిఖీ చేసి కేసు నమోదు చేస్తారు. భారీ అపార్ట్మెంట్లు, ఇతర కట్టడాలకు ఇసుక అవసరమైతే తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. అనుమతించిన రీచ్‌లలో మాత్రమే తవ్వాలి. కానీ జిల్లాలోని అనుమతి లేని ఉల్లికల్లు, చిన్న ఎక్కలూరు, చిన్న చిగుల్లరేవుతో పాటు దాదాపు ఇసుక లభించే అన్ని ప్రాంతాల్లోనూ తవ్వకాలు సాగిస్తున్నారు. అయినా రెవెన్యూ, మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదు. 3.88 లక్షల క్యూబిక్ మీటర్ల తవ్వకానికి అనుమతి 12 రీచ్‌లలో 3,88,847 క్యూబిక్ మీటర్ల మేర ఇసుక తవ్వుకునేందుకు అనుమతిచ్చారు. ఈ ఏడాది జనవరి 28న భూగర్భ గనులశాఖ అధికారులు రీచ్‌లలో తనిఖీలు నిర్వహించారు. వారి లెక్క ప్రకారం అప్పటి వరకూ 42,500 క్యూబిక్ మీటర్ల మేర మాత్రమే తవ్వారు. అయితే.. అధికారులు నిర్ధేశించిన ప్రాంతాల్లోనే కాకుండా నదిలో ఇసుక లభ్యత ఎక్కడ ఉంటే అక్కడ తవ్వకాలు సాగించారు. దీన్ని అధికారులు పరిగణనలోకి తీసుకోలేదు. భారీ ఆదాయం.. రీచ్‌ల నుంచి దగ్గర్లోని పట్టణ ప్రాంతాలతో పాటు ఇతర జిల్లాలకూ ఇసుక తరలిస్తున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరుతో పాటు ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు జిల్లా నుంచి భారీగా ఇసుక తరలిపోతోంది. అక్కడ టిప్పర్ ఇసుక రూ.50వేలకు విక్రయిస్తున్నారు. భారీ వాహనాలైతే లోడు రూ.లక్ష వరకూ అమ్ముతున్నారు. ఈ లెక్కన రోజుకు పది లారీల ఇసుక తరలిస్తే చాలు అక్రమార్కుల పంట పండినట్లే! ఇసుక వ్యాపారుల్లో అధికార పార్టీ నేతలే అధికంగా ఉండటంతో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీనికితోడు అధికారులు, పోలీసులను కూడా వారు ‘మంచి’గా చూసుకుంటున్నారు. దీంతో దందా అడ్డూ అదుపు లేకుండా సాగిపోతోంది. -
ప్యాంటుకు ప్రత్యేక పాకెట్స్!
బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు ఏర్పాటు విమానాశ్రయంలో 952 గ్రాముల బంగారం స్వాధీనం సాక్షి, హైదరాబాద్: దుబాయ్ నుంచి బంగారాన్ని అక్రమ రవాణా చేయడానికి నిర్ణయించుకున్న వ్యక్తి తెలివిగా వ్యవహరిం చాడు. తన ప్యాంటుకు ప్రత్యేకంగా జేబులు ఏర్పాటు చేయించుకున్నాడు. వాటిలో 952 గ్రాముల బంగారాన్ని బిస్కెట్ల రూపంలో సర్ది తీసుకువచ్చాడు. సమాచారం అందుకున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ), కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ దాడి చేసి పట్టుకున్నాయి. దుబాయ్ నుంచి ఎమిరేట్స్ విమానంలో వచ్చిన స్మగ్లర్ గురువారం మధ్యాహ్నం 2 గంటలకు శంషాబాద్ విమానాశ్రయంలో దిగాడు. ఇతడిని అదుపులోకి తీసుకున్న అధికారులు తనిఖీ చేసి ప్యాంటు లోపలి భాగంలో ఏర్పాటు చేసుకున్న రహస్య జేబులు గుర్తించారు. వాటిలో ఉన్న 952 గ్రాముల బరువున్న 9 బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. దీని రూ.27.9 లక్షలుగా నిర్ధారించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. -
మాయాజాలం
- రాయల్టీ ఒక ఖనిజానికి రవాణా మరొకటి.. - షిటైట్ స్థానంలో వైట్సేల్ తరలింపు - ఏడాదిగా సాగుతున్న దందా - ప్రభుత్వాదాయానికి భారీగా గండి తాడిపత్రి : వ్యాపారులు రాయల్టీ మాయాజాలానికి పాల్పడుతున్నారు. ఒక ఖనిజానికి రాయల్టీ చెల్లిస్తూ మరొక దాన్ని తరలిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి భారీగా గండి పడుతోంది. ఏడాదిగా ఈ దందా సాగుతున్నా..అడ్డుకట్ట వేయడంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, గనుల శాఖ అధికారులు విఫలమవుతున్నారు. తాడిపత్రి ప్రాంతంలో పలు ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి గ్రానైట్, నల్లబండలు, డోలమైట్, షిటైట్, వైట్సేల్ తదితర ఖనిజాలను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ముఖ్యంగా షిటైట్ ఖనిజానికి దేశవ్యాప్తంగానూ, విదేశాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. పేపర్, సబ్బులు, పేస్టులు, మందుల తయారీలో ఈ ఖనిజాన్ని అధికంగా ఉపయోగిస్తుంటారు. తాడిపత్రి ప్రాంతంలో లభ్యమవుతున్న షిటైట్.. చైనాకు కూడా ఎగుమతి అవుతోంది. ప్రభుత్వానికి టన్ను షిటైట్పై రూ.500 రాయల్టీతో పాటు రూ.150 చొప్పున డిస్ట్రిక్ట్ మైనింగ్ ఫండ్ (డీఎంఎఫ్) చెల్లించాలి. ఇదే తరహాలో ఉండే వైట్‌షేల్ ఖనిజానికి టన్నుపై రాయల్టీ రూ.60 మాత్రమే. దీంతో వ్యాపారులు వైట్షేల్కు ఉపయోగించే రాయల్టీలతో షిటైట్ను రవాణా చేస్తున్నారు. ఒకప్పుడు పూర్తిగా ‘జీరో’ బిజినెస్ జరిగేది. అయితే.. వాటికి బిల్లులు తప్పకుండా ఉండాలని, ఆన్లైన్లో రసీదులు కావాలని సరుకులను దిగుమతి చేసుకునే పెద్ద పరిశ్రమలు నిబంధన పెడుతుండడంతో వ్యాపారులు అక్రమ మార్గాలను అనుసరిస్తున్నారు. ఆలస్యంగా గుర్తించిన అధికారులు ఏడాదిగా రాయల్టీల దందా సాగుతున్నా..అధికారులు మాత్రం ఆలస్యంగా గుర్తించారు. వైట్‌షేల్ ఖనిజ లభ్యత తక్కువగా ఉన్నా..రాయల్టీలు మాత్రం పెద్దఎత్తున తీసుకుంటుండటంతో వారికి అనుమానం వచ్చింది. రెండు నెలల క్రితం యాడికి మండలం రాయలచెరువు, పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడు, కొండుపల్లి గ్రామాల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గనుల్లో ఖనిజ లభ్యత, రవాణా, పౌడర్ పరిశ్రమల్లో ఉన్న ఖనిజం మధ్య భారీ వ్యత్యాసాన్ని గుర్తించారు. ఏకంగా 22 మందికి నోటీసులు జారీ చేశారు. రికార్డులు సమర్పించాలని, రాయల్టీల వివరాలను చూపాలని ఆదేశించారు. ఇప్పటి వరకు ఎనిమిది మంది మాత్రమే రికార్డులు చూపించారు. అలాగే జనవరి నుంచి ఇప్పటివరకు రాయల్టీ ఒకటి, ఖనిజం మరొకటి కల్గిన పది ట్రాక్టర్లను సీజ్ చేశారు. ఒక్కో దానిపై రూ.25వేల జరిమానా విధించారు. ఇలా అక్రమంగా నెలకు దాదాపు రూ.కోటి విలువైన ఖనిజం తరలిపోతున్నట్లు తెలుస్తోంది. అధికారులు మాత్రం అప్పుడప్పుడు దాడులు చేస్తున్నారు. అక్రమ రాయల్టీలు వినియోగిస్తున్న వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. ఇందులో అధికార పార్టీకి చెందిన నాయకులు ఉండటంతో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. అక్రమాలు వాస్తవమే–వెంటేశ్వరరెడ్డి, గనుల శాఖ సహాయ సంచాలకులు, తాడిపత్రి రాయల్టీల మాయాజాలం మా దృష్టికి రావడంతో తనిఖీలు చేశాం. 10 వాహనాలను సీజ్ చేసి పోలీసులకు అప్పగించాం. జరిమానా కూడా విధించాం. అక్రమంగా రవాణా చేస్తున్న వారికి నోటీసులు జారీచేసి.. ఉన్నతాధికారులకు నివేదిక పంపించాం. నెల ఖనిజం జారీ చేసిన రాయల్టీలు నవంబర్ డోలమైట్ 28,675 నవంబర్ షిటైట్ 1,700 నవంబర్ వైట్‌షేల్ 3,300 డిసెంబర్ డోలమైట్ 39,350 డిసెంబర్ షిటైట్ 719 డిసెంబర్ వైట్‌షేల్ 4,450 జనవరి డోలమైట్ 19,440 జనవరి షిటైట్ 1,209 జనవరి వైట్ షేల్ 2,000 -
ఇసుక అక్రమ రవాణాపై హైకోర్టు సీరియస్
హైదరాబాద్: కర్నూలు జిల్లాలోని హంద్రీనీవా నది పరీవాహక ప్రాంతంలో అక్రమంగా ఇసుక రవాణాపై హైకోర్టులో విచారణ జరిగింది. అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారికి లక్ష రూపాయల జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష విధించాలని ఆదేశించింది. అక్రమంగా ఇసుక తరలింపుపై గతంలో జిల్లా కలెక్టర్‌కు, ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోక పోవడంతో సురేందర్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేయగా దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ ధాఖలు చేసింది. అక్రమంగా ఇసుక తరలిస్తున్న 320 ట్రాక్టర్లను సీజ్ చేశామని, సీజ్ చేసిన ఇసుకను కర్నూలు 2వ టౌన్ పోలీస్ స్టేషన్లో ఉంచామని ప్రభుత్వం తెలిపింది. మరి దీనిపై ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టలేదని హైకోర్టు ప్రశ్నించింది. అడ్డగోలుగా ఇసుకను తరలిస్తున్న వారికి జీవో నెంబర్ 42 ప్రకారం రూ. లక్ష జరిమానా ఎందుకు వేయలేదని ఎస్పీ, కలెక్టర్ల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో, ఇకపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో భూగర్భ గనుల శాఖాధికారి కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. కేసు తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. -
పక్కా దగా..
ముఠాలుగా ఏర్పడి ధనార్జనే ధ్యేయంగా దందా నిలువరించని సాంకేతిక పరిజ్ఞానం పౌర సరఫరాల శాఖలో వేళ్లూనుకున్న అక్రమాలు తూతూమంత్రంగా తనిఖీలు పేదలకు పూర్తిస్థాయిలో అందని బియ్యం బినామీ పేర్లతో రేషన్ బియ్యం పక్కదారి పేదల బియ్యం పక్కదారిపడుతోంది. రూపాయికి కిలోబియ్యం పథకం కొందరికి కాసులు కురిపిస్తోంది. పక్కా ప్రణాళికతో సాగుతోన్న ఈ గోల్మాల్ దందాతో రూ.కోట్లు వెనకేసుకుంటున్నారు. జిల్లాలో డీలర్ల పేరుతో సాగుతున్న ఈ బినామీల దందా వెనుక పెద్దల హస్తాలున్నట్లు తెలుస్తోంది. సరుకులు దారి మళ్లిస్తున్న ఈ వ్యవహారంపై తనిఖీలు తూతూమంత్రంగా నిర్వహిస్తూ తమవంతు సహకరిస్తున్నారు కొందరు అధికారులు. పౌర సరఫరాల శాఖలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం అమలుచేస్తున్న జియో ఫెన్సింగ్ సాంకేతిక పరిజ్ఞానం కూడా ఈ దగాను ఏమాత్రం నిలువరించలేకపోతోంది. మహబూబ్‌నగర్ న్యూటౌన్ : వ్యవస్థలో ఉన్న లోటుపాట్లను కొందరు తమకు అనుకూలంగా మార్చుకొని పేదల బియ్యాన్ని నొక్కేసి సొమ్ము చేసుకుంటున్నారు. పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ శాఖలతో పాటు జియోఫెన్సింగ్ యాప్ కూడా పనిచేస్తున్నప్పటికీ పరిస్థితిలో మాత్రం మార్పు రావడంలేదు. దొడ్డిదారిన బియ్యం తరలిపోతున్నా అక్రమాలను కట్టడి చేయడానికి అధికారులు సాహసించడం లేదు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్న దళారులు రెచ్చిపోయి బియ్యాన్ని దారి మళ్లిస్తున్నారు. ప్రతినెల చౌకధర దుకాణాల ద్వారా పేదలకు చేరాల్సిన బియ్యాన్ని దళారులు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నా అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. అక్రమాలను అరికట్టాల్సిన అధికారులు అవినీతి మత్తులో జోగుతున్నారనే ఆరోపణలున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 3,66,813 రేషన్ కార్డులున్నాయి. అందులో 3,39,393 ఆహార భద్రత కార్డులు, 27,164 అంత్యోదయ కార్డులు, 256 అన్నపూర్ణ కార్డులున్నాయి. ఆహార భద్రత కింద కుటుంబంలో ఎంతమంది సభ్యులున్నా సీలింగ్ విధించకుండా ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ 6కిలోల చొప్పున బియ్యం సరఫరా చేస్తుంది. ప్రతినెల 8222 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా అవుతోంది. జిల్లాకేంద్రం మహబూబ్‌నగర్ పట్టణంలోనే మొత్తం 86 రేషన్ డీలర్ షాపులు ఉన్నాయి. ఒకరిద్దరి చేతుల్లోనే దాదాపు 37డీలర్ షాపులు నడుస్తున్నట్లు సమాచారం. గత నాలుగేళ్లుగా కొత్త డీలర్ల నియామకాలు లేకపోవడంతో కొంతమందికి ఇన్ చార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఇన్ చార్జ్ లుగా వ్యవహరిస్తున్న కొందరు డీలర్లు ఇదే అదనుగా భావించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ బియ్యం అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. జియో ఫెన్సింగ్యాప్ ఉఫ్... పౌర సరఫరాల శాఖలో బియ్యం సరఫరా, పంపిణీకి ప్రభుత్వం ప్రత్యేకంగా అమలు చేస్తున్న జియోఫెన్సింగ్ యాప్ ఆశించిన ఫలితాన్నివ్వడం లేదు. బియ్యాన్ని సరఫరా చేసే లారీలకు జియో మ్యాపింగ్ చేశారు. డీలర్లు, గోదాం అధికారులు, పౌర సరఫరాల అధికారుల ఫోన్ నెంబర్లకు ఈ జియో ఫెన్సింగ్ యాప్‌ను అనుసంధానించారు. గోదాం నుంచి బియ్యం లారీ బయలుదేరి స్టేజ్–2 అధికారి పర్యవేక్షణలో ఎంఎల్ఎస్ పాయింట్‌కు చేరుతుంది. లారీ బయలుదేరడం, ఎంఎల్ఎస్ పాయింట్‌కు చేరడం వంటి ప్రక్రియ జియోఫెన్సింగ్ యాప్‌లో నమోదవుతుంది. ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి చౌకధర దుకాణాలకు చేరిన వెంటనే సంబందింత డీలర్ సంతకం చేసి బియ్యాన్ని స్టాక్ చేసుకుంటారు. ఈ ప్రక్రియ మొత్తం సంబందిత యాప్ సర్వర్‌లో నమోదు చేస్తారు. దీంతో స్టాక్ వచ్చినట్లు లబ్ధిదారులకు, అధికారులకు సమాచారం వెళ్తుంది. అలా లారీ బయలుదేనప్పటి నుంచి ఎక్కడెక్కడ వెళ్లిందనేది తెలుస్తుంది. ఇంతమంచి వ్యవస్థ ఉన్నా కేవలం యాప్‌ను సక్రమంగా వినియోగించకపోవడం వల్లే బియ్యం అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ధనార్జనే లక్ష్యంగా.. రూపాయికి కిలో బియ్యం అందజేసి పేదవారి కడుపు నింపాలనే ప్రభుత్వ ఆశయానికి అక్రమార్కులు తూట్లు పొడుస్తున్నారు. అక్రమార్జనకు అలవాటు పడిన కొందరు బినామీ డీలర్లు రూ.12నుంచి రూ.14ల వరకు బియ్యాన్ని దళారులకు విక్రయిస్తున్నారు. జిల్లాలో కొందరు వ్యక్తులు ఇదే పనిగా తిరుగుతున్నారు. కొనుగోలు చేసిన రేషన్ ను పక్కాప్లాన్ తో ప్యారా బాయిల్డ్ రైస్‌మిల్లులకు చేరుస్తున్నారు. రాత్రికిరాత్రే బియ్యాన్ని సన్నబియ్యంగా మార్చి బహిరంగ మార్కెట్‌కు తరలిస్తున్నారు. ప్రభుత్వానికే తిరిగి రూ.30 చొప్పున విక్రయిస్తున్నారని తెలుస్తోంది. ముఠాగా ఏర్పడి రూ.కోట్ల దందా.. పేదల బియ్యాన్ని మార్కెట్లోకి తెచ్చేందుకు జిల్లాలో పెద్ద ముఠానే పనిచేస్తోంది. దీనంతటికీ కల్వకుర్తిలోని ఓ బియ్యం మిల్లు వ్యాపారి ఏజెంటుగా వ్యవహరిస్తున్నారు. మహబూబ్‌నగర్, అలంపూర్, గద్వాల, జడ్చర్లలో కొందరు బడావ్యక్తుల ద్వారా ఈ అక్రమ వాపారాన్ని సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారానికి అడ్డు చెప్పకుండా జిల్లాస్థాయిలో కొందరు అధికారులకు ప్రతినెలా కొంత మొత్తాన్ని ముట్టజెప్పి మేనేజ్ చేస్తున్నట్లు సమాచారం. కఠిన చర్యలు తీసుకుంటాం పేదలకు ఆహార భద్రత కింద అందజేస్తున్న బియ్యాన్ని అక్రమంగా దారి మళ్లిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. డీలర్ షాపులపై డిసెంబర్ నుంచి పర్యవేక్షణ పెంచుతాం. పౌర సరఫరాల శాఖ విభజన ఇంకా పూర్తికాలేదు. ఉమ్మడి జిల్లా కేటాయింపులే ఉన్నాయి. ఈనెలాఖరులోగా విభజన పూర్తవుతుంది. చిన్న జిల్లాలో మా టీంతో రేషన్ షాపులపై నిరంతర పర్యవేక్షణ పెంచుతాం. డీలర్లు అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటాం. బినామీ దందాను ఎట్టి పరిస్థితుల్లో సహించబోం. - శారదా ప్రియదర్శిని, డీఎస్ఓ -
ఇసుక మాఫియా ఇష్టారాజ్యం
జోరుగా అక్రమ రవాణా పట్టుకుంది గోరంత.. వదిలేసింది కొండంత తొమ్మిది నెలల్లో 20 కేసులు మామూళ్ల మత్తులో అధికారులు మెదక్ రూరల్: అక్రమార్కులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ఈ అక్రమ రవాణా అధికారుల కనుసన్నల్లోనే జరుగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మామూళ్ల మత్తులో పడిన అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్షలు వెల్లువెత్తుతున్నాయి. మెదక్ మండల పరిధిలోని అవుసులపల్లి, మల్కాపూర్ తండా, బూర్గుపల్లి, రాజ్పేట్, గాజిరెడ్డిపల్లి, సర్దన, ముత్తాయిపల్లి, ర్యాలమడుగు, బొల్లారం, రాయిన్‌పల్లి, హవేలిఘనపూర్, కూచన్‌పల్లి తదితర గ్రామాల్లో రాత్రింబవళ్లు తేడాలేకుండా ఇసుక రవాణా జరుగుతోంది. నిత్యం పదుల సంఖ్యలో ట్రాక్టర్లు, టిప్పర్లలో అక్రమంగా ఇసుకను తరలిస్తూ అక్రమార్కులు లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. రెవెన్యూ అధికారులకు స్థానికులు çసమాచారం ఇచ్చినా వారు మాత్రం తమ విధులు నిర్వహించకుండా మామూళ్లకు ఆశపడి పట్టుకున్న ఇసుక ట్రాక్టర్లను సైతం వదిలేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తొమ్మిది నెలల్లో మండలంలోని ఆయా గ్రామాల్లో పోలీసుల దృష్టికి వచ్చిన కేసులు కేవలం 20 మాత్రమే. మంజీరా పరివాహక ప్రాంతం నుండి వందల సంఖ్యల్లో ఇసుక ట్రిప్పులు తరలిస్తున్నా అధికారులు మాత్రం గోరంత పట్టుకుని..కొండంత వదిలేస్తున్నారు. అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు ప్రవేశపెట్టిన వాల్టా చట్టాన్ని అతిక్రమిస్తున్న అక్రమార్కులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులే వారికి వత్తాసు పలుకుతుండడంతో అధికారుల తీరుపై ఆయా గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వారిపై కొరడా ఝుళిపించి వాల్టా చట్టాన్ని కాపాడాలని పలువురు కోరుతున్నారు. -
గ్రానైట్ అక్రమాలను అరికట్టాలి
వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా మంకమ్మతోట : జిల్లాలో అనుమతులు లేకుండా, అక్రమంగా గ్రానైట్ తవ్వకాలు చేపట్టడాన్ని అరికట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అక్కెనపల్లి కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రానైట్ అక్రమ క్వారీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కుమార్ మాట్లాడుతూ.. జిల్లాలో అనుమతులు లేకుండా గ్రానైట్ తవ్వకాలు చేపడుతుంటే రెవెన్యూ, మైనింగ్ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఖనిజ సంపదను దోపిడిచేస్తూ భూమిపై జీవరాశులకు నిలువలేకుండా చేస్తున్నా మాఫియాను అడ్డుకోవాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా క్వారీల్లో బ్లాస్టింగ్ చేపట్టడం వల్ల శబ్ద, వాయు కాలుష్యంతో ప్రజల ప్రాణాలకు సైతం ముప్పు ఉందన్నారు. జిల్లాలో 613 గ్రానైట్ క్వారీలకు అనుమతి ఉంటే 800 వరకు క్వారీలు నడుస్తున్నాయన్నాని తెలిపారు. గ్రానైట్ అక్రమ తరలింపును అడ్డుకునేందుకు చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలన్నారు. మైన్స్ ఎండీ కార్యాలయాన్ని కలెక్టరేట్ సముదాయంలోకి మార్చాలన్నారు. పదేళ్లుగా సాగుతున్న గ్రానైట్ అక్రమ దందాపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు డాక్టర్ కె.నగేష్, సెగ్గెం రాజేష్, సొల్లు అజయ్‌వర్మ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు వరాల శ్రీనివాస్, గాలి ప్రశాంత్‌బాబు, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి మోకెనపెల్లి రాజమ్మ, సంయుక్త కార్యదర్శి గడ్డం జలజరెడ్డి, జిల్లా అధ్యక్షురాలు బోగె పద్మ, పార్టీ జిల్లా అధికార ప్రతినిధులు దేవరనేణి వేణుమాధవ్‌రావు, వినుకొండ రామకృష్ణరెడ్డి, మందరాజేష్, నాయకులు సిరి రవి, జక్కుల యాదగిరి, సాన రాజన్న, దుబ్బాక సంపత్, గండి శ్యామ్, కంది వెంకటరమణారెడ్డి, బండమీది అంజయ్య, పావురాల కనుకయ్య, చొక్కాల రాము, గంటుక సంపత్ పాల్గొన్నారు. -
ఇసుక దొంగలు
హైటెక్ యంత్రాలతో యథేచ్ఛగా దోపిడీ నది మొత్తం గుంతలమయం తాత్కాలిక సచివాలయం పేరుతో అక్రమ రవాణా రోజూ వేలాది వాహనాల్లో తరలింపు సాక్షి, అమరావతి : కృష్ణా నదిలో దొంగలు పడ్డారు. బంగారం.. నగదు.. వస్తువులు దొంగలించే వారు కాదు. నదీమతల్లి గర్భంలో ఇసుకను దోచేస్తున్నారు. హైటెక్ యంత్రాల సాయంతో నది పొడవునా ఇసుక విచ్చలవిడిగా తోడేస్తున్నారు. టిప్పర్లు, లారీలు, ట్రాక్టర్లతో ఇతర ప్రాంతాలకు చేరవేస్తున్నారు. అక్కడి నుంచి చెన్నై, కర్నాటక, హైదరాబాద్‌కు తరలించి రూ.కోట్లు జేబులు నింపుకుంటున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో సాగుతున్న ఈ భారీ దోపిడీ తాత్కాలిక సచివాలయ నిర్మాణం పేరుతో జరుగుతుండటం గమనార్హం. ఈ దోపిడీ వెనక కృష్ణా, గుంటూరు జిల్లాల మంత్రి, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీ స్థాయి నాయకులు అనేక మంది ఉన్నారు. ఏ రాష్ట్రాల్లో దొరకని ఇసుక సంపద కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో నిక్షిప్తమై ఉంది. విలువైన ఈ ప్రకృతి సంపదపై అధికారపార్టీ నేతల కన్నుపడింది. తుళ్లూరు మండలం వెలగపూడిలో సచివాలయ నిర్మాణ పనులు వీరి దోపిడీకి రాచమార్గమైంది. ‘తాత్కాలికం’ మాటతో ఇసుక దోపిడీకి తెరతీశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసానికి కూతవేటు దూరంలో ఉండవల్లి, వెంకటపాలెం, లింగాయపాలెం, తాళ్లాయపాలెం, రాయపూడి, బోరుపాళెం, అమరావతి, మల్లాది, అచ్చంపేట ఇసుక రీచ్‌లు ఉన్నాయి. వీటిలో నాలుగు రీచ్‌ల నుంచి మాత్రమే ఇసుకను తీసుకెళ్లేందుకు అనుమతులు ఉన్నాయి. హైటెక్ యంత్రాలతో తోడివేత.. ఇసుక తోడేందుకు అక్రమార్కులు హైటెక్ యంత్రాలను దించారు. ఉండవల్లి సమీప నదిలో నుంచి హైటెక్ యంత్రాలు (డ్రెజ్జింగ్) సాయంతో ఇసుకను తోడుతున్నారు. నదిలో అనేక చోట్ల యంత్రాలు వినియోగిస్తున్నారు. మరి కొన్నిచోట్ల భారీ జేసీబీలు, క్రేన్లు ఉపయోగిస్తున్నారు. లింగాయపాలెం పరిధిలో రెండు మూడు రీచ్‌లు ఉన్నాయి. వీటిలో ఒక చోట, తాళ్లాయపాలెం, బోరుపాలెం రీచ్‌లో డ్రెజ్జింగ్ మిషన్లతో ఇసుక తోడుతున్నారు. డ్రెజ్జింగ్ మిషన్ పడవపై ఏర్పాటు చేస్తారు. ఆ పడవ నది మధ్యలోకి తీసుకెళ్తారు. నదిలో పైపును విడిచిపెట్టి డ్రెజ్జింగ్ మిషన్‌ను స్టార్ట్ చేస్తారు. విద్యుత్ మోటార్ ద్వారా నీరు ఎలా వెలుపలకి వస్తాయో.. అలా ఇసుక డ్రెజ్జింగ్ మిషన్ ద్వారా వెలుపలకు వస్తోంది. ఆ ఇసుకను క్రేన్, జేసీబీలతో పెద్ద పెద్ద గుట్టలుగా పోస్తున్నారు. ఒక డ్రెజ్జింగ్ మిషన్ ద్వారా రోజుకు 120 క్యూబిక్ మీటర్ల ఇసుక తోడుతోంది. నదీ తీరంలో ఐదు డ్రెజ్జింగ్ మిషన్ల ద్వారా ఇసుకను తోడుతున్నారు. క్రేన్, జేసీబీలు లెక్కలేనన్ని నదిలో నుంచి ఇసుక తోడుతున్నాయి. రోజూ వేలాది వాహనాలలో రవాణా.. సచివాలయ నిర్మాణానికి 50 నుంచి 75 టిప్పర్లతో ఇసుక తరలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మిగిలిన లారీలు, ట్రాక్టర్ల ద్వారా తరలించే ఇసుక తమకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. లింగాయపాలెం ఇసుక రీచ్ వద్ద రోజుకు వెయ్యి లారీల ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. లింగాయపాలెం మరో రీచ్ వద్ద రోజుకు 500 ట్రాక్టర్ల ఇసుక తరలి వెళ్తోంది. బోరుపాలెం రీచ్ నుంచి రోజుకు 1800 లారీల ఇసుక తరలిపోతోంది. ఇంకా వెంకటంపాలెం, అమరావతి, మల్లాది తదితర రీచ్‌ల నుంచి మరో వెయ్యి లారీలు. ఇలా రోజుకు సుమారు పది వేల క్యూబిక్ మీటర్ల ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ఒక లారీ ఇసుక రూ.ఆరు వేల నుంచి రూ.పది వేల చొప్పున విక్రయిస్తున్నారు. ట్రాక్టర్ ఇసుక రూ.1500 నుంచి రూ.రెండు వేల వరకు పలుకుతోంది. కృష్ణా నదిలోని ఇసుకను గుంటూరుకు చేరవేసి అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు లారీ డ్రైవర్ ఒకరు వెల్లడించారు. ఇసుక ఇష్టానుసారంగా తోడేయటంతో నది గర్భంలో పెద్ద లోయ ఏర్పడుతోంది. అమరావతి సమీపంలోని కృష్ణానదిలో ఇసుక అక్రమ రవాణాతో ఏర్పడ్డ లోయలో పడే మంగళవారం ఐదుగురు యువకులు మృతి చెందడం గమనార్హం. -
తమ్మిలేరు ఇసుకపై రగులుతున్న సెగ
లోపూడి(ముసునూరు): ఇటీవల ప్రభుత్వం ఉచిత ఇసుక తోలకాలపై ఆంక్షలు సడలిం చింది. తమ్మిలేరు ఇసుక యధేచ్ఛగా తరలిపోతోంది. రెండు నెలల క్రితం మండలంలోనూ, సమీప మండలాల్లోని మరుగుదొడ్లు, గృహ అవసరాలకు గ్రామ సెక్రటరీల ద్వారా టోకెన్లు ఇచ్చి ఇసుక రవాణా చేయడానికి రెవెన్యూ, పోలీస్ వర్గాలు అనుమతులు ఇచ్చాయి. మరుగుదొడ్లు, గృహ అవసరాలకు కాకుండా వ్యాపారాల నిమిత్తం ట్రాక్టర్ల యజమానులు నూజి వీడు, చాట్రాయి మండలంలోని కొన్ని ప్రాంతాలు విస్సన్నపేట మండలాలకు అధిక ధరలకు తరలిస్తున్నారు. మండలంలోని తమ్మిలేరు పరివాహక ప్రాంత రైతులు ఇసుక తరలి పోవడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వలసపల్లి, గుళ్లపూడి, బలివే రేవుల నుంచి ఇసుక తరలించకుండా రైతులు నిలిపివేస్తున్నారు. అటువైపు అవకాశం లేకపోవడంతో అక్రమార్కులు లోపూడి రేవు నుంచి కొద్దిరోజులుగా వందల సంఖ్యలో ఇసుక తరలిస్తున్నారు. తమ్మిలేరులో చలమతీస్తే మంచినీరు దొరకని పరిస్థితి ఏర్పడిందని, పరివాహక ప్రాంతంలోని బోర్లు అడుగంటిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం గ్రామస్తులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఇసుక తోలకాలను అడ్డుకోవాలని నిర్ణయించారు. ఇసుక ట్రాక్టర్లను నిలపడానికి తమ్మిలేరు దారిలో వ్యక్తిని నియమించారు. రోజువారి ఇసుక తవ్వకాలను నిర్వహిస్తున్న ట్రాక్టర్ యజ మానులు అడ్డుకున్నవారిని తిట్టడంతో వివాదం చెలరేగింది. ట్రాక్టర్ల యజమానులు తమను కులం పేరుతో దూషిస్తున్నారని, ఇసుక తోలడంతో ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. సమస్యను అధికారులు పరిష్కరించాలని ప్రజలు కోరు తున్నారు. -
కొనసాగుతున్న అక్రమ రవాణా
చిలమత్తూరు : అధికార పార్టీ నేతల అండదండలతో మండలంలో బియ్యం అక్రమంగా రవాణా అవుతున్నాయి. ఒత్తిళ్ల కారణంగా అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. గత మంగళవారం కొyì కొండ సమీపం నుంచి కర్ణాటకలోని కోలార్‌కు వెళ్తున్న రెండు లారీలను వాణిజ్య పన్నుల శాఖ స్పెషల్ ఏసీటీఓ బేబీనందా పట్టుకుని, అందులోని 33 టన్నుల బస్తాల బియ్యాన్ని సీజ్ చేసి పోలీస్‌స్టేçÙన్కు తరలించారు. కాగా లారీలను ఓపెన్ చేయకుండా ఎలాంటి ఉత్తర్వులు లేకుండా తూతూ మంత్రంగా రూ.2లక్షల వరకు అపరాధ రుసుం చెల్లించి వదిలేసినట్లు అధికారులు తెలిపారు. కాగా రెండు రోజుల నుంచి ఇదే రీతిలో కొత్తచెరువు ప్రాంతానికి చెందిన అధికార పార్టీ నేతల లారీలు వెళ్తున్నా అధికారుల్లో ఏమాత్రం చలనం లేదు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతోనే.. బియ్యం లారీలు పట్టుకున్నప్పటి నుంచి అధికార పార్టీ నాయకులు ఒత్తిళ్లు ఎక్కువయ్యాయని విలేకరుల సమావేశంలో స్పెషల్ ఏసీటీఓ స్వయంగా వెల్లడించారు. దీని ఆధారంగా చూస్తే అపరాధ రుసుం తూతూమంత్రంగా చెల్లిస్తేనే వదిలేసినట్లు తెలుస్తోంది.