
ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట
విజయనగరం కంటోన్మెంట్ : జిల్లాలో ఇసుక అక్రమ రవాణా నిరోధించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎంఎం నాయక్ అధికారులను ఆదే శించారు. బుధవారం ‘ ఇసుక గోతుల్లో నిఘా పాతర’ అన్న శీర్షికన ‘సాక్షి’లో వచ్చిన కథనానికి ఆయన స్పందించారు. ఈ మేరకు తన కార్యాల యంలో జరిగిన జిల్లా అధికారుల సమీ క్ష సమావేశంలో కలెక్టర్ ప్రత్యేకంగా ఇసుక అక్రమ రవాణా గురించి మాట్లాడారు. అన్ని రీచ్‌లకూ గ్రామైక్య సంఘాలను రిజిస్ట్రేషన్ చేయించాలన్నారు. వా రి ద్వారానే అమ్మకాలు జరపాలని, మీ సేవలో జమ అయిన మొత్తాలను సం బంధిత సంఘాలకు చెల్లించాలని ఆదేశించారు. దీని వల్ల ఇసుక అక్రమ రవాణాను నివారించవచ్చునన్నారు. ము ఖ్యంగా కోటగండ్రేడు ఇసుక రీచ్‌కు మ రిన్ని వాహనాలు రిజిస్ట్రేషన్‌తో పాటు డ్రైవర్ల సంఖ్యను పెంచాలని చెప్పారు. రాత్రి పూట గస్తీ పెంచడానికి సెక్యూరి టీ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ సమవేశంలో జేసీ రామారావు, ఏఎస్పీ రమణ, డీఆర్‌డీఏ పీడీ పెద్ది రాజు, ఏపీడీ సుధాకర్, పాల్గొన్నారు. వ్యవసాయ శాఖలో ఖాళీ పోస్టులకు
దరఖాస్తుల ఆహ్వానం
వ్యవసాయ శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో బహుళ ప్రయోజన విస్తరణాధికారుల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్న ట్టు కలెక్టర్ నాయక్ తెలిపారు. దరఖా స్తు ఫారాలు విజయనగరం. ఎన్‌ఐసీ. ఇన్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నిర్ణీత ప్రొఫార్మాలో భర్తీ చేసిన దరఖాస్తులను వచ్చే నెల 5వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా వ్యవసాయ సంయుక్త సంచాలకులు, సెలక్షన్ కమిటీ మెంబర్ సెక్రటరీ, కలెక్టరేట్ విజ యనగరం-535003 అన్న చిరునామా కు పోస్టల్ ద్వారా గాని, నేరుగా గాని పంపాన్నారు. 2014-15 సంవత్సరానికి రూల్ ఆఫ్ రిజర్వేషన్ పద్ధతి ప్రకా రం 92 పోస్టులకు నియామకాలు జరుపుతామని, నెలకు రూ. 8 వేలు గౌరవ వేతనం ఇస్తామని చెప్పారు. ఈ ఉద్యోగాలకు అభ్యర్థుల వయస్సు 2014 జూ లై 1కి 18 నుంచి 40 ఏళ్లు లోపు ఉండాలని, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు వయస్సు సడ లింపు ఉంటుందన్నారు. ఏజీ, ఉద్యాన, మెట్ట వ్యవసాయంలో బీఎస్సీ అర్హత ఉన్న వారికి తొలి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.
వ్యవసాయ పాలిటెక్నిక్ డిప్లమాదారులు, ఎన్‌జీ రంగా విశ్వవిద్యాలయం గుర్తింపు పొం దిన సీడ్ టెక్నాలజీ, డి ప్లమా/ప్లాంట్ ప్రొటెక్షన్/ఆల్కానిక్ పార్మింగ్‌లలో అర్హ త ఉన్న వారికి రెండో ప్రాధాన్యత, వృక్ష శాస్త్రంలో సైన్స్ పట్ట భద్రులకు మూడో ప్రాధాన్యత ఇస్తామన్నారు. అభ్యర్థుల ఎంపిక తొలిప్రాధాన్యంలో వచ్చిన దరఖాస్తు దారులను కమిటీ ఎంపిక చేస్తుం దని, తగినంత మంది అభ్యర్థులు లేకపోతే రెండో ప్రాధాన్యతలోని అభ్యర్థులను తీసుకుంటారన్నారు. అప్పటికీ ఖా ళీలు భర్తీ కాకపోతే మూడో ప్రాధాన్యతలోని అభ్యర్థులను పరిగణనలోకి తీసుకుంటారని చెప్పారు. ఎంపికలో ప్రతిభ కు 80 శాతం మార్కులు, మౌఖిక పరీ క్షకు 20 శాతం మార్కులు ఉంటాయన్నారు. అభ్యర్థులు తహశీల్దార్ జారీ చేసిన నివాస ధ్రువీకరణపత్రం, 4 నుం చి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫి కేట్స్ దరఖాస్తుకు జత పరచాలన్నారు.