లోలం, మల్లాపూర్ అడవుల్లో ఇసుక గోతులు
ఇందల్వాయి : మండలంలో వాగులు, ఆడవులు పు ష్కలంగా ఉన్నా రెవెన్యూ, ఫారెస్టు అధికారుల పర్యవేక్షణ, సమన్వయ లోపం వల్ల క్రమేపీ అవి చీకటి దందా చేస్తున్న అక్రమార్కుల చేతుల్లో పడి వాటి సహజ స్వరూపాన్ని కోల్పోతున్నాయి. ఇసు క, కలప అక్రమ రవాణదారులపై నామమాత్రపు దాడులు చేస్తున్నా అధికారులు వారికి చట్టరీత్యా సరైన శిక్షలు వేయించడంలో విఫలమవుతుడటం తో వారు మళ్లి పాత దందానే కొనసాగిస్తున్నారు.
అధిక దనార్జనే లక్ష్యంగా అడవుల్ని నరుకుతు, వా గుల్ని తవ్వుతూ ఇసుక, కలపను అక్రమంగా రవా ణ చేస్తూ ప్రకృతి స్వరూపాన్నే మార్చుతూ రైతు లకు, సామాన్య ప్రజలకు పరోక్షంగా తీవ్ర నష్టం కలిగిస్తున్నారు. వ్యక్తిగత మరుగు దొడ్ల నిర్మా ణాలు, సీసీ రోడ్లు అని అభివృద్ధి పనుల పేరుతో అనుమతులు తీసుకొని నల్లవెల్లి, గౌరారం, మల్లా పూర్, లోలం, లింగాపూర్, సిర్నాపల్లి వాగుల్లోంచి అనధికారంగా రాత్రి వేళల్లో ఇష్టరాజ్యంగా ఇసుక ను తరలించి అధిక ధరలకు అమ్ముకుంటున్నారని, అడవుల్లోని విలువైన కలప కూడా కింది స్థాయి అటవీ శాఖ అధికారుల కనుసన్నల్లోనే రాత్రి వేళల్లో అక్రమరవాణ జరుగుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు.
వాగుల్లోకి, ఆడవుల్లోకి ట్రాక్టర్లు వెళ్లకుండా అధికారులు నామ మాత్రపు కందకాలు తవ్వుతున్నా వాటిని పూడ్చేసి మరీ అక్రమార్కులు తమ దందాను కొనసాగిస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. అక్రమార్కుల ధనదాహానికి అడవులు తరిగిపోయి వన్యప్రాణలు జనావాసాల్లోకి వచ్చి ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి. ఈ దుండగుల వికృత చేష్టలకు సరిపడా వర్షాలు పడట్లేదని, వాగుల్లో ఇసుక లేకపోవడంవల్ల భూగర్భ జలాలు పెరగడంలేదని, అడవుల్లో ఆశ్రయం లేక వన్యప్రాణులు గ్రామాల్లోకి, పంట పొలాల్లోకి వచ్చి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని ప్రజలు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇకనైనా ప్రకృతిని నాశనం చేసి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న చీకటి దందాకోరులపై రెవెన్యు,ఫారెస్టు, పోలీసు అధికారులు సమన్వయంతో మూకుమ్మడి దాడు లు చేసి వారికి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని, విలువైన ప్రకృతి సంపదలకు రక్షణ కల్పించి ప్రకృతి సమతుల్యతను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment