జోరుగా దేశీదారు | illegal wine sale in tamsi mandal | Sakshi
Sakshi News home page

జోరుగా దేశీదారు

Published Mon, Aug 1 2016 8:58 PM | Last Updated on Mon, Sep 4 2017 7:22 AM

జోరుగా దేశీదారు

జోరుగా దేశీదారు

  •  మహారాష్ట్ర నుంచి అక్రమ రవాణా 
  •  గ్రామాల్లో విచ్చలవిడిగా విక్రయాలు 
  •  పట్టించుకోని ఎక్సైజ్‌శాఖ అధికారులు
  • తలమడుగు (తాంసి) : తాంసి మండలంలో దేశీదారు (మహారాష్ట్ర మద్యం) వ్యాపారం జోరుగా సాగుతోంది. సరిహద్దునే మహారాష్ట్ర ఉండడంతో అక్కడి మద్యం ఇక్కడ ఏరులై పారుతోంది. రోడ్డు మార్గంలోనే కాకుండా, కాలినడకన, ఎండ్లబండ్లు, రైళ్ల ద్వారా తాంసికి రవాణా అవుతోంది. మండలంలోని సరిహద్దు గ్రామాలు కరంజి, గుబిడి, అంతర్‌గావ్, అర్లి, గోముత్రి, భీంపూర్‌కు దేశీదారు వస్తోంది. ఇక్కడి నుంచి ఇతర గ్రామాలకు సరఫరా అవుతోంది. మండలంలోని 23 గ్రామపంచాయతీల్లో ఐదు, ఆరు గ్రామాలు మినహా అన్ని పంచాయతీల్లో ఈ దందా నడుస్తున్నా ఎకై ్సజ్‌శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో సారా వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా కొనసాగుతోంది. 
    సరఫరా ఇలా..
    రోడ్డు గుండా వీలు లేకపోతే కొండ సమీపంలోని పొలాల్లో డంప్‌ చేసి గ్రామాలకు తరలిస్తున్నారు. మన మద్యం అధిక రేట్లు ఉండడం..దేశీదారు తక్కువ ధరతోపాటు కిక్‌ ఎక్కువ ఉండడంతో మద్యం ప్రియులు దేశీదారుకు దాసోహం అవుతున్నారు. వ్యాపారులు వారి అలుసును ఆసరాగా చేసుకొని ఈ దందాను ఎంచుకున్నారు. దీన్ని నియంత్రించాల్సిన ఎకై ్సజ్‌ అధికారులు మాముళ్ల మత్తులో పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కానీ గ్రామాల్లో స్థానిక పోలీస్‌ ఎసై ్స దాడులు చేసి ఇటీవల దేశీదారు పట్టుకున్నారు. వాహనాల తనిఖీల్లో కూడా ఈ మద్యం లభించగా కేసులు నమోదు చేశారు. 
    చెక్‌పోస్ట్‌ లేకనే..
    మండల సరిహద్దులో ఎలాంటి చెక్‌పోస్ట్‌ లేకపోవడం వ్యాపారులకు అడ్డూఅదుపు లేకుండాపోయింది. అడిగే వారు లేక దర్జాగా దేశీదారు తెచ్చి విక్రయిస్తున్నారు. ఇది తాగి యువకులు జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఇప్పటికైనా ఎకై ్సజ్‌ శాఖ అధికారులు నిద్రమత్తు వీడి ఈ దందాను అరికట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.
    కేసులు నమోదు చేస్తున్నాం
    మండలంలో అన్ని గ్రామాల్లో తిరుగుతూ దేశీదారు విక్రయించిన వారిపై చర్యలు తీసుకుంటున్నాం. మూడు నెలల్లో ఐదు సార్లు దేశీదారు విక్రయించిన వారిని పట్టుకొని కేసు నమోదు చేశాం. ఆటోను కూడా స్వాధీనం చేసుకున్నాం. దేశీదారు విక్రయిస్తున్నట్లు మాదష్టికి వస్తే తప్పక చర్యలు తీసుకుంటాం.
     – రాములు, ఎక్సైజ్‌ ఎస్సై  తాంసి
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement