tamsi mandal
-
నెలకు లక్ష జీతం.. సాఫ్ట్వేర్ వదిలి ‘సాగు’లోకి..
తాంసి (ఆదిలాబాద్ జిల్లా): నెలకు రూ.లక్ష జీతం తీసుకుంటున్న ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి వ్యవసాయంపై మక్కువతో ఉద్యోగం మానేశాడు. తన భూమిలో విభిన్న పంటలను సాగుచేస్తూ నలుగురు కూలీలకు ఉపాధి కల్పిస్తున్నాడు. జిల్లా కేంద్రానికి చెందిన కోదే అన్వేశ్ ఎంటెక్ వరకు చదివాడు. 2016 నుంచి హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరాడు. వెబ్ డెవలప్మెంట్లో భాగంగా 2016 నుంచి 2019 వరకు పని చేశాడు. నెలకు రూ.లక్ష జీతం వస్తున్నా సంతృప్తి చెందలేదు. ఉద్యోగం వదులుకొని తనకు నచ్చిన వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. నాలుగేళ్లుగా తాంసి మండలం సావర్గాం గ్రామశివారులోని ఎనిమిదెకరాల సొంత భూమిలో వివిధ పంటలను సాగు చేస్తూ లాభాలను గడిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. మొదటగా నష్టాలు చవిచూసి.. హైదరాబాద్ నుంచి వచ్చిన అన్వేశ్ మొదటి సంవత్సరం పత్తి, జొన్న సాగు చేశాడు. పత్తి, జొన్న సాగుతో కూలీల కొరత, కష్టం ఎక్కువగా ఉండడంతో నష్టాలను చవిచూశాడు. ఏ మాత్రం కుంగిపోకుండా ఇతర పంటలను సాగుచేసి లాభాలను పొందాలని నిర్ణయించుకున్నాడు. ఏ పంటలను సాగుచేస్తే మేలని వ్యవసాయశాఖ అధికారుల సూచనలు తీసుకున్నాడు. స్నేహితుల సలహాలు తీసుకొని పంటలను సాగుచేస్తున్నాడు. అధికారుల సూచనలు పాటించి.. 2019లో హార్టికల్చర్ అధికారి శ్రీనివాస్‌రెడ్డి సలహాతో ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి నుంచి థైవాన్ జామ మొక్కలను తెప్పించాడు. రూ.2.50 లక్షల వరకు ఖర్చుచేసి నాలుగెకరాల్లో ఎకరాకు వెయ్యి చొప్పున నాటించాడు. మొక్కలను హైడెన్సిటీ విధానంతో ఆరు అడుగులకు ఒక్కటి చొ ప్పున ఉండేలా చూశాడు. రసాయన మందులు లే కుండా సేంద్రియ పద్ధతిలో సాగు చేశాడు. దీంతో మొక్కలను నాటిన 18 నెలలకే కాత ప్రారంభమైంది. సేంద్రియంగా పెంచిన జామపండ్లను పంటచేను పక్కనే ఉన్న రోడ్డు పక్కన షెడ్డు వేసి రూ.50కి కిలో చొప్పున విక్రయిస్తున్నాడు. పెద్దఎత్తున దిగుబడి వచ్చినప్పుడు బయటి మార్కెట్‌కు కూడా తరలిస్తున్నాడు. జామ ద్వారా మొదటి సంవత్సరం రూ.రూ.2.50 లక్షల ఆదాయం వచ్చింది. ఈ సంవత్సరం కాత ఎక్కువగా ఉండగా రూ.3 లక్షల వరకు వస్తుందని అన్వేశ్ చెబుతున్నాడు. షెడ్లు వేసి కోళ్లు పెంచుతూ.. జామతోటతో అంతరసాగు విధానంలో వివిధ పంటలు వేశాడు. దీనికి తోడు పంటచేనులో ప్రత్యేక షెడ్లు వేసి రెండేళ్లుగా నాటు, కడక్‌నాథ్, గిరిరాజా కోళ్లు, బాతులను పెంచుతున్నాడు. వాటిని విక్రయిస్తూ అదనపు లాభాలను గడిస్తున్నాడు. వచ్చే సంవత్సరం నుంచి బ్రాయిలర్ కోళ్ల పెంపకం చేపట్టనున్నట్లు అన్వేశ్ తెలిపాడు. ఇప్పటినుంచే షెడ్ల నిర్మాణం కూడా చేపడుతున్నాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం కన్నా ఇక్కడే తృప్తిగా, ప్రశాంతంగా ఉన్నట్లు చెబుతున్నాడు. వ్యవసాయంలోనే సంతృప్తి నేను ఎంటెక్ పూర్తిచేశా ను. మూడేళ్లపాటు హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యో గం చేశాను. జీతం సరిప డా వచ్చినా ఉద్యోగంపై ఆసక్తి లేక మానేశాను. మాకున్న భూమిలో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్న. నాన్న శ్రీనివాస్ సాయంతో మూడేళ్ల క్రితం వ్యవసాయం ప్రారంభించాను. ప్రస్తుతం వి విధ పంటలతోపాటు జామ సాగు చేపట్టా ను. అలాగే వివిధ రకాల కోళ్ల పెంపకం చేప ట్టి అదనపు ఆదాయాన్ని పొందుతున్న. రోజూ పంటచేనులో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. నాతోపాటు నిత్యం నలుగురు కూలీలకు పని కల్పించడం సంతృప్తినిస్తోంది. – కోదే అన్వేశ్, యువరైతు -
ఆ ఊర్లో ఏదో జరుగుతుంది.. వరుస మరణాలతో ఆందోళన
తాంసి(బోథ్): వరుస మరణాలతో ఆ గిరిజనం మనసు కీడు శంకిస్తోంది. గ్రామానికి ఏదో కీడు జరిగిందని.. మరణాలకు అదే కారణమని భయం వెంటాడుతోంది. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం గిరిగాం గ్రామ పంచాయతీ పరిధి బేతాళ్‌గూడ గ్రామం నుంచి ఒక్కో కుటుంబం ఇళ్లను ఖాళీ చేసి వెళ్తోంది. ఇక్కడ 20 గృహాలు, 60 మంది జనాభా ఉంటుంది. కొన్ని నెలలుగా వీరు అనారోగ్యానికి గురై మృత్యువాత పడుతున్నారు. మృతులంతా పురుషులే. రెండేళ్లలో 12 మంది మరణించినట్లు సమాచారం. జూన్‌లో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మృతిచెందగా అదే కుటుంబంలో మూడు నెలల కిందట ఒకరు, ఆరు నెలల కిందట మరొకరు అనారోగ్యంతో చనిపోయారు. గ్రామానికి ఏదో కీడు జరిగిందని గ్రామస్తుల్లో భయం మొదలైంది. గ్రామంలో ఉంటే తామూ చనిపోతామని ఊరు వదిలి వెళ్లారు. బేతాళ్‌గూడకు రెండు కిలోమీటర్ల దూరంలోని అంబుగాం గ్రామ పాఠశాల సమీపంలో తొమ్మిది కుటుంబాలు తాత్కాలిక షెడ్లు వేసుకున్నాయి. వామన్‌నగర్ గ్రామంలో మరో ఐదు కుటుంబాలు షెడ్లు వేసుకుని నివాసం ఉంటున్నాయి. అంతుచిక్కని మరణాలు.. గిరిజనులు ఎలా మృతిచెందారో అంతుచిక్కడం లేదు. మరణానికి కారణం అనారోగ్యమా..? సీజనల్ వ్యాధులా..? దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలా..? అనేది ఎవరికీ తెలియడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు గిరిజనులకు సరైన అవగాహన కలి్పంచడం లేదు. మరణాలకు కారణాలు తెలుసుకుని గ్రామస్తులకు అవగాహన కలి్పస్తే ప్రజలు తిరిగి వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. -
జోరుగా దేశీదారు
మహారాష్ట్ర నుంచి అక్రమ రవాణా గ్రామాల్లో విచ్చలవిడిగా విక్రయాలు పట్టించుకోని ఎక్సైజ్‌శాఖ అధికారులు తలమడుగు (తాంసి) : తాంసి మండలంలో దేశీదారు (మహారాష్ట్ర మద్యం) వ్యాపారం జోరుగా సాగుతోంది. సరిహద్దునే మహారాష్ట్ర ఉండడంతో అక్కడి మద్యం ఇక్కడ ఏరులై పారుతోంది. రోడ్డు మార్గంలోనే కాకుండా, కాలినడకన, ఎండ్లబండ్లు, రైళ్ల ద్వారా తాంసికి రవాణా అవుతోంది. మండలంలోని సరిహద్దు గ్రామాలు కరంజి, గుబిడి, అంతర్గావ్, అర్లి, గోముత్రి, భీంపూర్కు దేశీదారు వస్తోంది. ఇక్కడి నుంచి ఇతర గ్రామాలకు సరఫరా అవుతోంది. మండలంలోని 23 గ్రామపంచాయతీల్లో ఐదు, ఆరు గ్రామాలు మినహా అన్ని పంచాయతీల్లో ఈ దందా నడుస్తున్నా ఎకై ్సజ్‌శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో సారా వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా కొనసాగుతోంది. సరఫరా ఇలా.. రోడ్డు గుండా వీలు లేకపోతే కొండ సమీపంలోని పొలాల్లో డంప్ చేసి గ్రామాలకు తరలిస్తున్నారు. మన మద్యం అధిక రేట్లు ఉండడం..దేశీదారు తక్కువ ధరతోపాటు కిక్ ఎక్కువ ఉండడంతో మద్యం ప్రియులు దేశీదారుకు దాసోహం అవుతున్నారు. వ్యాపారులు వారి అలుసును ఆసరాగా చేసుకొని ఈ దందాను ఎంచుకున్నారు. దీన్ని నియంత్రించాల్సిన ఎకై ్సజ్ అధికారులు మాముళ్ల మత్తులో పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కానీ గ్రామాల్లో స్థానిక పోలీస్ ఎసై ్స దాడులు చేసి ఇటీవల దేశీదారు పట్టుకున్నారు. వాహనాల తనిఖీల్లో కూడా ఈ మద్యం లభించగా కేసులు నమోదు చేశారు. చెక్‌పోస్ట్ లేకనే.. మండల సరిహద్దులో ఎలాంటి చెక్‌పోస్ట్ లేకపోవడం వ్యాపారులకు అడ్డూఅదుపు లేకుండాపోయింది. అడిగే వారు లేక దర్జాగా దేశీదారు తెచ్చి విక్రయిస్తున్నారు. ఇది తాగి యువకులు జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఇప్పటికైనా ఎకై ్సజ్ శాఖ అధికారులు నిద్రమత్తు వీడి ఈ దందాను అరికట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు. కేసులు నమోదు చేస్తున్నాం మండలంలో అన్ని గ్రామాల్లో తిరుగుతూ దేశీదారు విక్రయించిన వారిపై చర్యలు తీసుకుంటున్నాం. మూడు నెలల్లో ఐదు సార్లు దేశీదారు విక్రయించిన వారిని పట్టుకొని కేసు నమోదు చేశాం. ఆటోను కూడా స్వాధీనం చేసుకున్నాం. దేశీదారు విక్రయిస్తున్నట్లు మాదష్టికి వస్తే తప్పక చర్యలు తీసుకుంటాం. – రాములు, ఎక్సైజ్ ఎస్సై తాంసి