‘ఫ్లైయాష్‘ రవాణాలో భారీ కుంభకోణం
మంత్రి పొన్నం ఖాతాలోకి రోజూ రూ.50 లక్షలు
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రామగుండం ఎన్‌టీపీసీ విద్యు త్ కేంద్రం నుంచి ఫ్లైయాష్ (బూడిద) తరలింపులో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భారీ కుంభకోణానికి పాల్పడ్డారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. కరీంనగర్‌లో రేవంత్, పొన్నం ట్యాక్స్ అమలవుతున్నట్లు తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు కేపీ.వివేకానంద, డాక్టర్ సంజయ్‌తో కలిసి తెలంగాణభవన్‌లో కౌశిక్‌రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడారు. 32 టన్నుల బూడిద తరలించాల్సిన లారీలో 72 టన్నులు తరలిస్తున్నారని, వే బిల్లుల్లో ఎన్ని టన్నులు తరలిస్తున్నారనే విషయం పేర్కొనడం లేదని చెప్పారు.
బూడిద అక్రమరవాణా ద్వారా మంత్రి పొన్నం రోజూ రూ.50 లక్షలు సంపాదిస్తుండగా, ఆయన అన్న కుమారుడు అనూప్ ఈ వసూ ళ్లు చేస్తున్నారన్నారు. ఓవర్‌లోడ్‌తో వెళుతున్న 13 లారీలను ఇటీవల తాను స్వయంగా పట్టుకొని అధికారులకు అప్పగించినా, రెండు లారీ లు సీజ్ చేసి చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీలను తాను పట్టుకోవడంతో రూటు మార్చి హుస్నా బాద్ మీదుగా దందా కొనసాగిస్తున్నారని కౌశిక్‌రెడ్డి చెప్పారు. ఇకపై ఏ మార్గంలో ఫ్లైయాష్ తరలించినా బీఆర్‌ఎస్ కార్యకర్తలు పట్టుకుంటారని హెచ్చరించారు. ఓవర్‌లోడ్‌తో వెళుతు న్న ఫ్లైయాష్ లారీల కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇటీవల ఇంజనీరింగ్ విద్యార్థి అఖిల్ మరణించాడన్నారు.
ఎన్‌టీపీసీ వివరాలు దాచిపెడుతోంది
ఫ్లైయాష్ అక్రమ రవాణా జరుగుతున్నా, ఎన్‌టీపీసీ అధికారులు వివరాలు దాచిపెడుతూ చోద్యం చూ స్తున్నారని కౌశిక్‌రెడ్డి అన్నారు. అధికారుల తీరుపై ఢిల్లీలో ఆ సంస్థ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తా మని చెప్పారు. ఓవర్‌లోడ్ దందాపై బీఆర్‌ఎస్ కేడ ర్ ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతుందన్నారు. తప్పు లు చేస్తున్న అధికారుల వివరాలు రెడ్‌బుక్‌లో నమో దు చేసి అధికారంలోకి వచి్చన తర్వాత చర్యలు తప్పవని హెచ్చరించారు. హరీశ్‌రావుపై ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ అనవసర విమర్శలు చేస్తున్నారని, ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తే హరీశ్‌రావుతోపాటు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చే స్తారని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment