భద్రాచలం సమీపంలోని నందిగామ వద్ద భారీ ఎత్తున అక్రమంగా తరలిస్తోన్న కలపను అటవీశాఖ అధికారులు బుధవారం తెల్లవారుజామున పట్టుకున్నారు. అందుకు సంబంధించిన వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. వారిపై కేసు నమోదు చేశారు. అలాగే వాహనాన్ని కూడా స్టేషన్కు తరలించి సీజ్ చేశారు. పట్టుబడిన కలప విలువ బహిరంగ మార్కెట్లో రూ.2 లక్షల వరకు ఉంటుందని పోలీసులు వివరించారు.