రేషన్ బియ్యం అక్రమ రవాణా యదేచ్ఛగా కొనసాగుతోంది.
ప్రకాశం: రేషన్ బియ్యం అక్రమ రవాణా యదేచ్ఛగా కొనసాగుతోంది. అక్రమంగా రేషన్ బియ్యం, కిరోసిన్ వంటి నిత్యావసర వస్తువులను తరలిస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలోని మర్రిపూడి మండలం కాకర్లలో రేషన్ బియ్యం అక్రమ రవాణా శనివారం వెలుగులోకి వచ్చింది. అక్రమంగా తరలిస్తున్న 35 బస్తాల రేషన్ బియ్యంతో పాటు 200 లీటర్ల కిరోసిన్ను గ్రామస్తులు పట్టుకున్నట్టు సమాచారం.