kerosine
-
భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త
చింతకొమ్మదిన్నె: క్షణికావేశంలో ఓ వ్యక్తి తన భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించిన సంఘటన కడప నగర సమీపంలోని అంగడివీధిలో చోటు చేసుకుంది. కడప రూరల్ సీఐ వెంకటశివారెడ్డి కథనం మేరకు కడప నగర సమీపంలోని అంగడివీధిలో నివాసముంటున్న ఆలుమూరి శ్రీనివాసులు, ఆలుమూరి కమాల్బీలకు 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. శనివారం ఉదయం భార్యాభర్తల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో క్షణికావేశానికి గురైన భర్త భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన కమాల్బీని చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించినట్లు సీఐ వివరించారు. -
భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త
చింతకొమ్మదిన్నె: క్షణికావేశంలో ఓ వ్యక్తి తన భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించిన సంఘటన కడప నగర సమీపంలోని అంగడివీధిలో చోటు చేసుకుంది. కడప రూరల్ సీఐ వెంకటశివారెడ్డి కథనం మేరకు కడప నగర సమీపంలోని అంగడివీధిలో నివాసముంటున్న ఆలుమూరి శ్రీనివాసులు, ఆలుమూరి కమాల్బీలకు 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. శనివారం ఉదయం భార్యాభర్తల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో క్షణికావేశానికి గురైన భర్త భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన కమాల్బీని చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించినట్లు సీఐ వివరించారు. -
'బతికుండగానే నిప్పంటించే యత్నం'
రాజుల: గుజరాత్ లో దళితులపై దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమను గదిలో బంధించిన గోరక్షక దళ సభ్యులు బతికుండగానే నిప్పంటించి చంపడానికి ప్రయత్నించినట్లు పట్టణానికి చెందిన ఏడుగురు దళితులు ఆరోపించారు. దాదాపు 30 మంది గో రక్షక దళ సభ్యులు తమపై ఐరన్ రాడ్లు, బేస్ బాల్ బ్యాట్లు, కత్తులతో ఈ ఏడాది మే 22న దాడి చేసినట్లు తెలిపారు. తమ కులానికి చెందిన మిగలిన వారు పోలీసులకు సమాచారం అందించడంతో ప్రాణాలతో బయటపడగలిగినట్లు చెప్పారు. బాధితుల్లో ఒకడైన రవి జఖాడ తెలిపిన వివరాల ప్రకారం.. నలుగురు గో రక్షక దళ సభ్యులు తమ కాళ్లు, చేతులను గట్టిగా కదలకుండా పట్టుకున్నారని, మిగిలిన వారందరూ బ్యాట్లు, రాడ్లతో పాశవికంగా గాయపరిచినట్లు తెలిపాడు. బాధితుల్లో ఎవరైనా మారు మాట్లాడివుంటే తమను చావగొట్టే వాళ్లని, అక్కడికి కోపం చల్లారని కొందరు కిరోసిన్ తీసుకొని రమ్మని తమతో పాటు ఉన్న సభ్యులకు చెపినట్లు వివరించాడు. వీరందరిని గదిలో పడేసి తగులబెడదాం అని సభ్యులు మాట్లాడినట్లు తెలిపాడు. దళ సభ్యుల్లో ఇద్దరు కిరోసిన్ ను తీసుకురావడానికి వెళ్లినట్టు తాను చూశానని రవి వెల్లడించాడు. ఇంతలో అక్కడికి వచ్చిన తన తండ్రి తమ కులం వారితో కలిసి పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపాడు. తామంతా జీవితంపై ఆశలు వదిలేసుకుంటున్న సమయంలో పోలీసులు వచ్చి తమను రక్షించినట్లు చెప్పాడు. కాగా, గో రక్షక దళ సభ్యుల దాడిలో రవి కుడి చెయ్యి విరిగింది. అతనికి తగిలిన దెబ్బల కారణంగా రెండు నెలల వరకూ పూర్తిగా నడిచే అవకాశం కనిపించడం లేదు. బాధితుల్లో మరొక వ్యక్తి దిలీప్ బబారియా దాడితో ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ఇప్పటికీ అర్ధరాత్రి నిద్రలోంచి లేచి తనను చంపొద్దని పెద్దగా కేకలు వేస్తున్నానని చెప్పాడు. తమ కులానికి చెందిన వారు పోలీసులకు సమాచారం అందించడంతో బతికిపోయామని తెలిపాడు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
కోడిపందేలు వద్దన్నందుకు.. కడతేర్చారు
తాడేపల్లిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పట్టింపాలెంలో ఓ వివాహితపై భర్త, అత్తలు కలసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్ర కాలిన గాయాలతో ఆమె మృతి చెందింది. పోలీసుల కథనం మేరకు... పట్టింపాలెం గ్రామానికి చెందిన సత్యవాణి (24)కి ఐదేళ్ల బాబు, ఎనిమిది నెలల పాప ఉన్నారు. భర్త తరచూ కోడిపందేలు ఆడుతూ ఉండడంతో ఈ విషయమై వారిద్దరి మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి సమయంలోనూ గొడవ జరిగింది. దీంతో భర్త, అత్తలు సత్యవాణిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో ఆమె తీవ్ర కాలిన గాయాలతో మృతి చెందింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
గుంతకల్లులో దుండగడి వీరంగం
అనంతపురం: అనంతపురం జిల్లాలోని గుంతకల్లులో ఆదివారం ఓ దుండగుడు వీరంగం సృష్టంచాడు. రెండు ఇళ్లపై కిరోసిన్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. గమనించిన స్థానికులు అప్రమత్తమై మంటలను ఆర్పడంతో ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్న మహిళ
విజయనగర్‌కాలనీ : భార్యా భర్తల గొడవలో మనస్థాపం చెందిన ఓ ఇల్లాలు వంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన ఆసీఫ్‌నగర్ పోలీస్ స్టేసన్ పరిదిలో ఆదివారం సాయంత్రం జరిగింది. వివరాలు... గుడిమల్కాపూర్ పి.ఇంద్రారెడ్డి పూల మార్కెట్ పక్కన ఉన్న గుడిసెల్లో ఏసు, భార్య సుగుణ (25)తో కలిసి గత కొంత కాలంగా నివాసం ఉంటున్నారు. కాగా ఏసు దినసరి కూలీగా పని చేస్తుండగా సుగుణ ఇళ్లలో పని చేస్తుంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాగా తరుచు గొడవపడే భర్తతో వేగలేక మనస్థాపం చెందిన సుగుణ ఆదివారం రాత్రి ఎవరు లేని సమయంలో వంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. బాధకు తాళలేక సుగుణ కేకలు వేయడంతో స్థానికులు వచ్చి మంటలను ఆర్పారు. 108కు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ విషయమై ఆసీఫ్‌నగర్ పోలీస్ ఇన్స్పెక్టర్ పి.వెంకటేశ్వర్లును సాక్షి ప్రశ్నించిగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. -
హైదరాబాద్‌లో నకిలీ ఆయిల్ దందా!
-
వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్యాయత్నం
నాచారం (హైదరాబాద్): భర్త వేధింపులకు తాళలేక వివాహిత ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఆదివారం నాచారం పోలీస్‌స్టేషన్ పరిదిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాచారం ఎర్రకుంటకు చెందిన అక్తర్‌హుస్సేన్ గత కొంత కాలంగా మద్యం సేవించి తన భార్య మున్సూరబేగంను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. భర్త వేధింపులకు తాలలేక మున్సూరబేగం ఆదివారం మద్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యయత్నం చేసింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం గాందీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు బాధితురాలి బంధువులు నాచారం పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
కోర్టు ఆవరణలో మహిళ ఆత్మహత్యాయత్నం
కైకలూరు(కృష్ణా జిల్లా): కోర్టు ఆవరణలో ఓ మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన ఘటన కృష్ణాజిల్లా కైకలూరులో సోమవారం కలకలం సృష్టించింది. జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో ఉండగానే మొదటి గేటు సమీపంలో మహిళ ఆత్మహత్య చేసుకొనేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. భర్తకు సంబంధించిన ఆస్తిని అత్త విక్రయించడానికి ప్రయత్నించడంతో ఆమె ఈ చర్యకు పాల్పడింది. పోలీసుల కథనం మేరకు.. కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం వణుదుర్రు గ్రామానికి చెందిన నాగలక్ష్మికి కలిదిండి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన మారగాని నాగేశ్వరరావుతో 1999లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. భర్త మద్యానికి బానిసై తనను వేధిస్తున్నాడంటూ 2011లో భర్త, అత్త వెంకటలక్ష్మిపై కైకలూరు కోర్టులో బాధిత మహిళ కేసు వేసింది. అనంతరం ఆమె కూలి పనులు చేసుకుంటూ తల్లి ఇంట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో భర్తకు చెందిన ఆస్తిని అత్త విక్రయించేందుకు ప్రయత్నిస్తుండడంతో పాటు భర్త తరఫు న్యాయవాది రాజీకి రావాలంటూ ఆమెను వేధిస్తున్నారు. తన పిల్లలకు అన్యాయం జరుగుతుందన్న భయంతోనే నాగలక్ష్మి ఆత్మహత్యకు యత్నించింది. -
35 బస్తాల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
ప్రకాశం: రేషన్ బియ్యం అక్రమ రవాణా యదేచ్ఛగా కొనసాగుతోంది. అక్రమంగా రేషన్ బియ్యం, కిరోసిన్ వంటి నిత్యావసర వస్తువులను తరలిస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలోని మర్రిపూడి మండలం కాకర్లలో రేషన్ బియ్యం అక్రమ రవాణా శనివారం వెలుగులోకి వచ్చింది. అక్రమంగా తరలిస్తున్న 35 బస్తాల రేషన్ బియ్యంతో పాటు 200 లీటర్ల కిరోసిన్‌ను గ్రామస్తులు పట్టుకున్నట్టు సమాచారం.