మహబూబాబాద్ : కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైల్లో అక్రమంగా తరలిస్తున్న 129 కేజీల గంజాయిని రైల్వే పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన శుక్రవారం వరంగల్ జిల్లా మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే... కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైల్లో విశాఖ నుంచి ముంబైకి గంజాయిని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం అందడంతో రైల్వే పోలీసులు రైలు మహబూబాబాద్ స్టేషన్లో ఆగగానే తనిఖీలు నిర్వహించారు. నిందితులు మొత్తం 129 కేజీల గంజాయిని 8 భాగాలుగా విభజించి వేరు వేరు సంచుల్లో ఉంచి రవాణా చేస్తున్నారు. రైల్వే పోలీసులు 129 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని, అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.