
సాక్షి,మేడ్చల్: కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో బాంబ్ ఉందని కాల్ చేసిన ఆకతాయిని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఫేక్ కాల్ చేసింది గండిమైసమ్మ బహదూర్ పల్లికి చెందిన తోర్రి కార్తిక్ (19) గా పోలీసులు గుర్తించారు. ఆకతాయిని అదుపులోకి తీసుకుని విచారించగా.. బాంబ్ ఉందని కాల్ చేస్తే పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో చూద్దామని కాల్ చేసినట్లు తెలిపాడు. కాగా రైల్వే, లోకల్ పోలిసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి నిందితుడిని పట్టుకున్నారు.
కాగా బుధవారం కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కాల్ రావడంతో అప్రమత్తమైన రైల్వే పోలీసులు చర్లపల్లి రైల్వేస్టేషన్‌లో ట్రైన్‌ను నిలిపివేశారు. బాంబ్ స్క్వాడ్ విస్తృత తనిఖీలు అనంతరం ఫేక్ కాల్‌గా రైల్వే పోలీసులు తేల్చారు. చివరికి కాల్ చేసిన ఆకతాయిని అదుపులోకి తీసుకున్నారు. కోణార్క్ ఎక్స్‌ప్రెస్ భువనేశ్వర్ నుంచి ముంబైకు వెళ్తోంది.
Comments
Please login to add a commentAdd a comment