ప్రజలు మాంసాహారం తీసుకోవడాన్ని బాగా ఇష్టపడుతున్నారు. ప్రజల డిమాండ్‌కి తగినట్లుగా స్థానికంగా మాంసం లభించకపొవడంతో ఆ వ్యాపారం చేసే వారు.. అక్రమ పద్ధతుల ద్వారా మాంసం సేకరిస్తున్నారు. ఇలా సేకరించిన మాంసాన్ని స్టార్ హోటల్స్, రెస్టారెంట్లతో పాటు మాంసం ప్రియులకు వివిధ రకాల జంతువుల పేర్లు చెప్పి విక్రయిస్తూ రూ.లక్షలు సంపాధిస్తున్నారు. గతంలో అడవి పందులు, జింకలను కొసి విక్రయించే వ్యాపారులు డిమాండ్ పెరగడంతో భారీ జంతువులపై కన్నెశారు.
మునుగోడు : భారీ జంతువుల్లో ఒకటైన ఒంటెని కొస్తే అధిక మొత్తంలో మాంసం వస్తుందని వ్యాపారులు భావించారు. ఎడారి ప్రాంతాలైయినా హర్యానా, గుజరాత్, రాజాస్థాన్ ప్రాంతాల నుంచి వయస్సు మీదపడిన ఒంటెలను కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకొచ్చి మాంసంగా మార్చుతున్నారు. ఒంటెలను అక్కడ నుంచి ఇక్కడికి ఎవరు రవాణా చేస్తున్నారు. ఎంతకు విక్రయిస్తున్నారు.. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఉన్నా అవి ఎలా హైదరాబాద్‌కి వస్తున్నాయనే సందేహలు వ్యక్తమవుతున్నాయి. ఊకొండిలో ఒంటెలను కొస్తూ పట్టుబడిన దుండగులు సైతం ఆ ప్రాంతాలకు వెళ్లకుండానే హైదరాబాద్ నుంచి ఫోన్‌లలో బేరాలు చేసుకుని.. డబ్బు ఆన్‌లెన్ ద్వారా వారి ఖాతాల్లో జమచేసి ఒంటెలు తీసుకుంటున్నట్లు సమచారం. కానీ ఈ దందా ఎప్పటి నుంచి సాగుతోంది.. అలా అమ్మేవాళ్లు ఎవరు.. అనే విషయాలను పోలీసులు రాబట్టలేక పోయారు. పోలీసులు లోతుగా విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
మాంసం విక్రయించేదెక్కడో?
ఒక ఒంటెను కోస్తే 350 నుంచి 400ల కేజీల మాంసం వస్తుంది. ఇక్కడ ఒకేసారి 25 నుంచి 30కిపైగా ఒంటెలను కోస్తుండడంతో దాదాపు 10 నుంచి 15 టన్నుల మాంసం ఉత్పత్తి అవుతుంది. ఈ మాంసాని ఎక్కడా విక్రయిస్తారు. ఎంతకు విక్రయిస్తారనేది ఇప్పటికీ తేలలేదు. హైదరాబాద్‌లో అమ్ముతున్నట్లు నిందితులు చెబుతున్నా అందులో నిజం లేదనిపిస్తోంది. హైదరాబాద్‌లో ఒకే రోజు 10 టన్నుల మాంసాని విక్రయించడం చాలా కష్టం. ఆ మాంసం మొత్తం ఇతర రాష్ట్ర, దేశాలకు సరఫరా చేస్తున్నారనే.. ఆరోపణలు అనేకం ఉన్నాయి. మాంసాన్ని ఎక్కడకు సరఫరా చేస్తున్నారు.. ఎలా చేస్తున్నారనే విషయంపై విచారిస్తే.. వ్యాపారంలో ఉన్న బడా బాబుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఒంటెల సరఫరా, మాంసం విక్రయంపై నిఘా పెడితే దందా గుట్టు రట్టు అయ్యే అవకాశాలు ఉన్నాయి.
25మంది రిమాండ్
మునుగోడు: నల్లగొండ జిల్లా మునుగోడు మండలం ఊకొండిలో ఒంటెల వధ కేసులో 25మందిని స్థానిక పోలీసులు శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. చండూరు సీఐ రమేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరబాద్‌కు చెందినా మహ్మ ద్ ఖాజ కురేష్, అబ్జల్ కురేష్‌లు..పశుమాంసం వ్యాపారులు. ప్రస్తుతం ఒంటె మాంసానికి బాగా డిమాండ్ ఉండటంతో వాటిని అప్పుడప్పుడు కొస్తూ ఉండేవారు. ఇటీవల హైదరాబాద్‌లో ఒంటెల మాంసం విక్రయాలపై పోలీసులు దాడులు చేయడంతో..సదరు వ్యాపారులు మునుగోడుకు చెందిన మాంసం వ్యాపారి ఖయ్యూంతో పరిచయం ఏర్పర్చుకున్నారు. ఒంటెలను కోసేందుకు నిర్మానుష్యమైన వ్యవసాయ భూమి కావాలని అడగగా, ఊకొండి గ్రామానికి చెందినా మాజీ సర్పంచ్ నిమ్మ ల స్వామిని సంప్రదించాడు. అతను తన భూమిని నెలకు రూ.2500 చొప్పున లీజుకు ఇచ్చాడు. దీంతో వ్యాపారులు బుధవారం రాత్రి 28 ఒంటెలని తీసుకొని ఊకొండికి వచ్చారు. వాటిని కోసేందుకు 19 మంది కూలీలను వెంటతెచ్చుకున్నారు. ఒంటెలను కోస్తుండగా గ్రామస్తుల సమాచారంతో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. నిందితులను పోలీసులు విచారించి శుక్రవారం కోర్టులో హాజరుపర్చారు.
Comments
Please login to add a commentAdd a comment